మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

లైవ్ , ‘తుపాను తీరం దాటింది కానీ.. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉంది’

ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అర్నబ్ తుపాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

సారాంశం

  • ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అర్నబ్ తుపాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి.
  • శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
  • తెలంగాణలో వాతావరణం పరిశీలిస్తే పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. ‘తుపాను బలహీన పడినా ఇంకా ప్రమాదం ఉంది.. ఫ్లాష్ ఫ్లడ్స్ రావొచ్చు’

    తుపాను బలహీనపడినా దాని ప్రభావం ఇంకా ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

    శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

    గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    కురిసిన భారీ వర్షాలతో ప్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

    పొంగిపోర్లే వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.

    సహాయ చర్యల్లో 16 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు తెలిపారు.

  2. అర్నబ్: తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశాలో జోరు వానలు

    ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అర్నాబ్ తుపాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. తుపాను కారణంగా జరిగిన విధ్వంసంపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను పూర్తిగా బలహీనపడిందని ఐఎండీ పేర్కొంది.

    గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపు కదిలి తీవ్ర అల్పపీడనంగా మారింది.

    ఇది అక్టోబర్ 28వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఆంధ్రప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఈశాన్య తెలంగాణ ప్రాంతాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.

    ఇది ఇవాళ ఉదయానికి వాయుగుండంగా, సాయంత్రానికి అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

  3. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి