అనకాపల్లి పుష్ప: ‘ఔను. కాబోయే భర్త గొంతు కోశా.. ఎందుకంటే..’

కాబోయే భర్త గొంతు కోసిన కేసులో నిందితురాలైన యువతి పుష్పని బుచ్చెయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘‘నిన్న బండిపై నుండి పడ్డామని చెప్పిన పుష్ప ఈరోజు నేరం అంగీకరించింది. కాబోయే భర్త రామునాయుడు గొంతును తానే కోసినట్లు ఒప్పుకుంది’’ అని బుచ్చయ్యపేట పీఎస్ ఎస్ఐ రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. అర్నబ్ తుపాను ప్రభావంతో రద్దైన రైళ్లు ఇవే- దక్షిణమధ్య రైల్వే అధికారిక ప్రకటన

    అర్నబ్, విశాఖ, దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్,
    ఫొటో క్యాప్షన్, రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేసిన దక్షిణ మధ్యరైల్వే

    అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతల గుండా రాకపోకలు సాగించే రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

    పశ్చిమ- మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావం రవాణా రంగం తీవ్రంగా ఉంది. ఇప్పటికే విమానాల సర్వీసులపై ఎఫెక్ట్ పడుతుందని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలని ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు సూచించింది.

    ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే కూడా ఒక ప్రకటన చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగేంచే పలు రైళ్లను రద్దు చేసింది.

    ఇవాళ రద్దు అయిన రైళ్లు ఇవే

    • 12704 సికింద్రబాద్- హౌడా
    • 17016 సికింద్రాబాద్- భువనేశ్వర్ న్యూ
    • 12728 హైదరాబాద్- విశాఖపట్నం
    • 12862 మహబూబ్‌నగర్- విశాఖపట్నం
    • 12740 సికింద్రాబాద్- విశాఖపట్నం
    • 12776 లింగంపల్లి- కాకినాడ టౌన్
    • 17256 లింగంపల్లి- నర్సాపూర్
    • 12738 లింగంపల్లి- కాకినాడ పోర్ట్
    • 20810 హెఎస్ నాందేడ్- సంబల్‌పూర్
    • 07037 చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్

    రేపు(28/10/2026) రద్దు అయిన రైళ్లు ఇవే

    • 07038 శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి
    • నాగర్‌సోల్- నర్సాపూర్ మధ్య నడిచే 12788 ట్రైన్‌ను చర్లపల్లి నర్సాపూర్ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు.
  2. ‘అర్నబ్’ తరువాత రానున్న 10 తుపాన్లు ఇవే..

  3. అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

    అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

    పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన ‘అర్నబ్’ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్టు ఆంధ్రప్రదేశ్రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఫోన్ నెంబర్లను విడుదల చేసింది.

    ఈ తుపాను ప్రభావంతో విశాఖ, శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటించారు.

    అర్నబ్ తుపాన్ వేళ ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నెంబర్లను విడుదల చేశారు.

    అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నంబర్లు 112 , 1070 , 1800 425 0101 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తుపాన్ స‌మ‌స్యలకు వేగవంతమైన పరిష్కారం పొందవచ్చని ప్రఖర్ జైన్ తెలిపారు.

    • శ్రీకాకుళం- 08942240557
    • విజయనగరం- 8922236947
    • పార్వతీపురం మన్యం- 08963450347
    • అల్లూరి సీతారామరాజు- 8935293448
    • విశాఖపట్నం- 0891-2590102 / 0891-2590100
    • అనకాపల్లి- 08924-222888 / 08924-226599 / 08924-225999
    • కాకినాడ-0884-2356801 / 9849903879
    • కోనసీమ-8856293104
    • తూర్పు గోదావరి-8832944455
    • పశ్చిమ గోదావరి-08816-299181
    • ఏలూరు-18002331077 / 9494041419
    • పోలవరం-18004254225
    • తిరుపతి-0877 2236007
    • మార్కాపురం-9248702500
    • కృష్ణా-08672 252399
    • ఎన్టీఆర్- 9154970454
    • గుంటూరు- 0863-2234014
    • బాపట్ల- 08643-220226
    • ప్రకాశం- 08592 295600 / 18004250277
    • నెల్లూరు- 7995576699
  4. రైళ్ల రద్దు, విద్యాసంస్థలకు సెలవులు, నిత్యావసరాలు రెడీ చేసుకుంటున్న ప్రజలు.. అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతోందంటే

  5. ‘జైలులో అనారోగ్యం నటించారు.. సిబ్బందిపై దాడి చేసి 17 మంది పారిపోయారు’

  6. ఎల్ నినో ‘అత్యంత తీవ్రరూపం’ దాల్చబోతోందా? ఇది ఎప్పటివరకు కొనసాగొచ్చు? ‘ఇన్‌కాయిస్’ ఏం చెప్పింది?

  7. ఆంధ్రప్రదేశ్ స్థానిక పోరులో ‘నామినేషన్ల’ రగడ: ప్రజాస్వామ్యమా లేక బలప్రదర్శనా?

  8. ఆంధ్రప్రదేశ్: అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు

    హుద్‌హుద్ తుపాను సమయంలో కూలిన చెట్లు(ఫైల్ ఫోటో)
    ఫొటో క్యాప్షన్, హుద్‌హుద్ తుపాను సమయంలో కూలిన చెట్లు(ఫైల్ ఫోటో)

    ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు విడుదల చేసింది.

    బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు.

    శ్రీకాకుళం, మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, పోలవరం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీసత్యసాయి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

  9. అర్నబ్: తుపాను ఎక్కడుంది? ఎప్పుడు తీరం దాటుతుంది, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?

  10. ‘బ్రెజిల్ ఎప్పటికీ లొంగదు’ అన్న లూలా డ సిల్వా గెలుపు అమెరికాకు ఎలాంటి సందేశం?

  11. ఇంజమామ్ ఉల్ హక్: సిక్స్ కొట్టాలని ఉందని సెహ్వాగ్ చెబితే, ఫీల్డర్లను ముందుకు తీసుకొచ్చిన పాకిస్తానీ కెప్టెన్

  12. సౌదీలో చిక్కుకున్న భారతీయ యాత్రికుల పరిస్థితి ఎలా ఉంది?

  13. పార్లమెంట్‌కు సమీపంలో నార్త్ బ్లాక్‌లో కమ్ముకున్న దట్టమైన పొగ– వెల్డింగ్ పనుల కారణంగా చెలరేగిన మంటలు

    నార్త్ బ్లాక్‌, దిల్లీ
    ఫొటో క్యాప్షన్, పార్లమెంట్‌కు సమీపంలో నార్త్ బ్లాక్‌లో కమ్ముకున్న దట్టమైన పొగ

    పార్లమెంట్‌కు సమీపంలో నార్త్‌బ్లాక్‌లో సోమవారం ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్ముకుంది.

    “పార్లమెంట్‌కు వెళ్తున్నప్పుడు, నార్త్‌బ్లాక్ వెనుకాల దట్టమైన పొగను గమనించాను. అక్కడ అగ్ని ప్రమాదం జరిగిం ఉండొచ్చని అనుమానం వచ్చింది. అంతా క్షేమంగా ఉంటారని భావిస్తున్నాను. అత్యవసర సిబ్బంది వేగంగా స్పందించాలని కోరుకుంటున్నాను” అని బీజేపీ ఎంపీ మిలింద్ డియోరా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

    “దిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలోని చిల్లర్ ప్లాంట్‌లో ఉపయోగించే ఫైబర్ ట్యాంక్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో నల్లటి పొగ భారీగా వ్యాపించింది. దీంతో సమీపంలోని ప్రజలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు” అని హిందూ పేర్కొంది.

    నార్త్‌బ్లాక్‌లో వెల్డింగ్ వర్క్ చేస్తుంటే చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. వెల్డింగ్ నుంచి వచ్చిన నిప్పు రవ్వలు సమీపంలోని ట్యాంక్‌కు వ్యాపించి మంటలు చెలరేగి పొగ వ్యాపించింది అని ఏఏఎన్ఎస్ పేర్కొంది.

    ఘటన జరిగిన వెంటనే మంటలను ఆర్పేశారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. ఎవరూ గాయపడినట్టు రిపోర్ట్ కాలేదు.

    సోమవారం 11 గంటలకు అగ్ని ప్రమాదం సమాచారం అందింది. సమాచారం వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి 6 ఆగ్నిమాపక యంత్రాలను పంపి మంటలను అదుపు చేసినట్టు దిల్లీ ఫైర్ డిపార్ట్‌మెంట్ చెప్పింది.

  14. రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

    పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రహదారి, రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

    ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై రాహుల్ గాంధీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన కాన్వాయ్‌లోని వాహనాలే ఒకదానికొకటి ఢీకొన్నాయి.

    అందరూ క్షేమంగా ఉన్నారని పవన్ ఖేరా చెప్పినట్టు బీసీసీ ప్రతినిధి ప్రేరణ తెలిపారు.

    చాలా స్వల్ప ప్రమాదమని, ఎవరికీ ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది.

    రాహుల్ గాంధీ లఖ్‌నవూ నుంచి సుల్తాన్‌పూర్ వెళ్తుండగా హాలియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగిందని ఐఏఎన్‌ఎస్ రిపోర్టు చేసింది.

    ప్రమాదంలో కారు బానెట్ ధ్వంసమైనట్టు వివరించింది.

    ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ రాహుల్ గాంధీ వెంటనే వేరే వాహనంలో సుల్తాన్‌పూర్ వెళ్లినట్టు తెలిపింది. ఎంపీ-ఎంఎల్‌ఏ కోర్టు ముందు హాజరయ్యేందుకు రాహుల్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

  15. న్యూజీలాండ్‌తో జరిగే మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం

    న్యూజీలాండ్‌, ఇషాన్ కిషన్
    ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌తో జరిగే మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం

    తొడ కండరాలు పట్టేయడంతో న్యూజీలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌కి కూడా ఇషాన్ కిషన్ దూరంకానున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

    న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోని తొలి టీ20 మ్యాచ్‌లో కుడి తొడ కండరాలు గాయంతో రెండో టీ20కి దూరమయ్యాడు. ఆయన స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఆడాడు. రెండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్ ఆకట్టుకోలేకపోయాడు.

    ఇషాన్ కిషన్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని బీసీసీఐ తెలిపింది. అతను ఇంకా మ్యాచ్ ఆడే స్థాయికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని వెల్లడించింది. అందుకే అక్టోబర్ 27న వెల్లింగ్‌టన్‌లో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు దూరమవుతున్నట్టు పేర్కొంది. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఇషాన్ కోలుకుంటున్నాడని చెప్పింది. కుమార్ కుశాగ్ర మూడో టీ20 మ్యాచ్‌లో ఆడతాడని వెల్లడించింది.

  16. మోదీని ఉద్దేశించి ఖర్గే చేసిన వ్యాఖ్యలేంటి, క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తుంది?

  17. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్నబ్’ తుపానుగా మారినట్టు ఐఎండీ ప్రకటన

    ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అర్నబ్ తుపాను, ఐఎండీ
    ఫొటో క్యాప్షన్, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్నబ్’ తుపాను మారినట్టు ఐఎండీ ప్రకటన

    తూర్పు-మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘అర్నబ్’ తుపానుగా మారిందని ఐఎండీ ప్రకటించింది.

    ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

    ఈరోజు (అక్టోబర్ 26) ఉదయం 5:30 గంటలకు తుపాను 15.4° ఉత్తర అక్షాంశం, 88.9° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉందని ప్రకటించింది. శ్రీ విజయపురం (అండమాన్ దీవులు)కు వాయువ్య దిశలో 590 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 610 కి.మీ దూరంలో, విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 650 కి.మీ దూరంలో, కాకినాడకు తూర్పు-ఆగ్నేయ దిశలో 730 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి తూర్పు దిశలో 830 కి.మీ దూరంలో, బాపట్లకు తూర్పు దిశలో 910 కి.మీ దూరంలో ఉంది.

    మరింత బలపడనున్న తుపాను

    అర్నబ్ తుపాను పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ అర్ధరాత్రి నాటికి తీవ్ర తుపానుగా, అక్టోబర్ 27 నాటికి అత్యంత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 28 ఉదయం బాపట్ల- విశాఖ మధ్య తీరాన్ని దాటే అవకాశముంది.

    తీరాన్ని దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే ఈదురుగాలుల వేగం 140 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

  18. రెండు రోజులు ప్రయాణాలు వద్దు- తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అధికారుల విజ్ఞప్తి

    ఆంధ్రప్రదేశ్, బాపట్ల, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం
    ఫొటో క్యాప్షన్, తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు.

    తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు మంగళ, బుధవారాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.

    మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాల్లో కట్టి ఉంచుకోవాలన్నారు.

    విశాఖకు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీవ్ర వాయుగుండం రేపు, ఎల్లుండి తీవ్ర తుపానుగా మారుతుందని, సుమారు 125 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని జైన్ హెచ్చరించారు. అందుకే ప్రయాణాలు పెట్టుకొవద్దని సూచించారు.

    సోమవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళ, బుధవారాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, పోలవరం, విశాఖ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

  19. ‘అతి తీవ్ర తుపానుగా మారొచ్చు’.. విశాఖపట్నానికి 820 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండంపై అధికారుల హెచ్చరిక

    ఆంధ్రప్రదేశ్, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం,
    ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌కు 820 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఇవాళ తుపానుగా మారే అవకాశం

    తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం ఇవాళ తుపానుగా, రేపు తీవ్ర తుపానుగా మారబోతోంది.

    ఇది యానాం- బాపట్ల, విశాఖ పట్నానికి మధ్య అక్టోబర్ 28వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

    ప్రస్తుతానికి ఈ తీవ్ర వాయగుండం 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.

    ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం(అక్టోబర్ 25) రాత్రి ప్రకటించిన సమాచారం ప్రకారం.. ప్రకారం తీవ్ర వాయుగుండం విశాఖకు 820 కి.మీ., కాకినాడకు 910 కి.మీ., మచిలీపట్నానికి 1010 కి.మీ.,బాపట్లకు 1080 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

    ఈ తీవ్రవాయుగుండం సోమవారం(అక్టోబర్ 26) ఉదయానికి తుపానుగా, మంగళవారం(అక్టోబర్ 27) ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా,బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

    ఇది తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిరంతరం తుపాను పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని.. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

  20. ప్రపంచ సంక్షోభాలను చూస్తూ ఉండిపోకూడదు: ఐరాసకు జైశంకర్ సూచన

    ఐక్యరాజ్యసమితి ,ఎస్. జైశంకర్
    ఫొటో క్యాప్షన్, ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ కేంద్ర మంత్రి మాట్లాడారు.

    ప్రపంచ సంక్షోభాలను ఐక్యరాజ్యసమితి చూస్తూ ఉండిపోకుండా నాయకత్వ పాత్ర పోషించాలని విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ చెప్పినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

    ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్‌ సమ్మేళన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు.

    ‘‘మనం పరిపూర్ణత లేని ప్రపంచంలో జీవిస్తున్నాం. అయితే, మరింత మెరుగైన ప్రపంచం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనేఉన్నాం. ఐక్యరాజ్యసమితి దానిలోని లోపాలను, పరిమితులను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకుకృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్వామ్యం లేకుండా చేయకూడదు. ప్రపంచ సంక్షోభాలను చూస్తూ ఉండిపోకుండా ఐక్యరాజ్యసమితి నాయకత్వ పాత్ర పోషించాలి” అని జైశంకర్ అన్నారు.