అర్నబ్ తుపాను ప్రభావంతో రద్దైన రైళ్లు ఇవే- దక్షిణమధ్య రైల్వే అధికారిక ప్రకటన

అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతల గుండా రాకపోకలు సాగించే రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
పశ్చిమ- మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావం రవాణా రంగం తీవ్రంగా ఉంది. ఇప్పటికే విమానాల సర్వీసులపై ఎఫెక్ట్ పడుతుందని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలని ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు సూచించింది.
ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే కూడా ఒక ప్రకటన చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగేంచే పలు రైళ్లను రద్దు చేసింది.
ఇవాళ రద్దు అయిన రైళ్లు ఇవే
- 12704 సికింద్రబాద్- హౌడా
- 17016 సికింద్రాబాద్- భువనేశ్వర్ న్యూ
- 12728 హైదరాబాద్- విశాఖపట్నం
- 12862 మహబూబ్‌నగర్- విశాఖపట్నం
- 12740 సికింద్రాబాద్- విశాఖపట్నం
- 12776 లింగంపల్లి- కాకినాడ టౌన్
- 17256 లింగంపల్లి- నర్సాపూర్
- 12738 లింగంపల్లి- కాకినాడ పోర్ట్
- 20810 హెఎస్ నాందేడ్- సంబల్పూర్
- 07037 చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్
రేపు(28/10/2026) రద్దు అయిన రైళ్లు ఇవే
- 07038 శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి
- నాగర్సోల్- నర్సాపూర్ మధ్య నడిచే 12788 ట్రైన్‌ను చర్లపల్లి నర్సాపూర్ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు.










