అర్నబ్ ప్రభావంతో ఏపీలో ఏడుగురు మృతి: సీఎం చంద్రబాబు

అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు చనిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

సారాంశం

  • అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు చనిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
  • అతి తీవ్ర తుఫాను 'అర్నబ్‌' బలహీనపడి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో అల్పపీడనంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
  • ఇండియా కూటమి నిర్వహించే 'ఛలో దిల్లీ' మార్చ్‌లో పాల్గొనాలని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. పోలీసులకు, వారి లాఠీలకు భయపడొద్దని 'ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో రాహుల్ గాంధీ ప్రజలను కోరారు.
  • స్పెయిన్ రైలు ప్రమాదంది జరగడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు రైలు డ్రైవర్లకు, రైల్వే కంట్రోల్ సెంటర్‌కు మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో రికార్డులు స్పెయిన్ మీడియాలో వచ్చాయి.
  • స్పెయిన్‌ రైలు ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ రవాణా శాఖ కార్యాలయం ముందు ప్రజలు నిరసన తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. తెలంగాణలోనూ వర్షాలు

    తెలంగాణ, అర్నబ్, ఆంధ్రప్రదేశ్, వాతావరణం
    ఫొటో క్యాప్షన్, తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం

    తెలంగాణలో వాతావరణం పరిశీలిస్తే పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌లోనివాతావరణ శాఖ తెలిపింది.

    భద్రాద్రి గూడెం, ఖమ్మం, సూర్యపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

    ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

    మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.

  2. ‘తుపాను బలహీన పడినా ఇంకా ప్రమాదం ఉంది.. ఫ్లాష్ ఫ్లడ్స్ రావొచ్చు’

    ఆంధ్రప్రదేశ్, అర్నబ్, వాతావరణం
    ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారులు అప్రమత్తం

    తుపాను బలహీనపడినా దాని ప్రభావం ఇంకా ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

    శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

    గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    కురిసిన భారీ వర్షాలతో ప్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

    పొంగిపోర్లే వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.

    సహాయ చర్యల్లో 16 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు తెలిపారు.

  3. అర్నబ్: తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశాలో జోరు వానలు

    కొనసాగుతున్న అర్నబ్ తుపాను ప్రభావం
    ఫొటో క్యాప్షన్, కొనసాగుతున్న అర్నబ్ తుపాను ప్రభావం

    ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అర్నాబ్ తుపాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. తుపాను కారణంగా జరిగిన విధ్వంసంపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను పూర్తిగా బలహీనపడిందని ఐఎండీ పేర్కొంది.

    గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపు కదిలి తీవ్ర అల్పపీడనంగా మారింది.

    ఇది అక్టోబర్ 28వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఆంధ్రప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఈశాన్య తెలంగాణ ప్రాంతాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.

    ఇది ఇవాళ ఉదయానికి వాయుగుండంగా, సాయంత్రానికి అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

  4. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి