లైవ్ , 'అర్నబ్' ధాటికి విరిగిపడుతున్న కొండచరియలు.. గంజాం, గజపతి జిల్లాల ప్రజలకు అధికారుల హెచ్చరికలు
అర్నబ్ తుపాను కారణంగా కురిసిన వర్షాలకు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీని వల్ల రహదార్లు దెబ్బతింటున్నాయి. రహదారులపై వాహనాలపై ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
లైవ్ కవరేజీ
అంతర్వేదీ తీరానికి కొట్టుకొచ్చిన భారీ షిప్
అర్నబ్ తుపాను ప్రభావం కొనసాగుతున్న వేళ అంతర్వేది
తీరానికి ఒక భారీ షిప్ రావడం చర్చనీయాంశంగా మారింది.
సాంకేతిక సమస్యల కారణంగానే ఈ ఓడ
వచ్చిందని కోస్టుగార్డు అధికారులు చెబుతున్నారు. విశాఖ నుంచి సింగపూర్ బయల్దేరిన ఈ
షిప్, తుపాను ధాటికి ఇలా తీరానికి కొట్టుకు వచ్చిందని అంటున్నారు.
ఇందులో ఉన్న సిబ్బందిని కోస్ట్‌గార్డ్ దళాలు కాపాడాయి.
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలని
అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026
సన్నాహక కార్యక్రమాన్ని దిల్లీలో నిర్వహించారు.
కార్యక్రమానికి కేంద్ర
వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన విధాన నిర్ణయాలు, ప్రభుత్వ సహకారం
అందించేందుకు వ్యక్తిగతంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో
భాగస్వాములు కావాలని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
పారిశ్రామికవేత్తలు తమ లక్ష్యాలను
చేరుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏం కావాలో చెప్పాలని, విధానపరమైన మార్పుల నుంచి అవసరమైన సహకారం
వరకు అన్నింటినీ అందించేందుకు వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటానని సీఎం రేవంత్
రెడ్డి హామీ ఇచ్చారు.
"2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని సాధించేందుకు భారతీయులందరూ కలిసి కృషి చేయాలి. ప్రస్తుతం
మనం దసరా, కర్వా చౌత్, దీపావళి వంటి పండుగల సీజన్లో ఉన్నాం. ఈ సమ్మిట్ మనకు మరో పండుగ
వంటిది. 700 ఏళ్లకు పైగా క్రితమే,
కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు సముద్ర వాణిజ్యానికి సంబంధించి 'మోటుపల్లి శాసనం'ను జారీ
చేశారు" అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ -2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ
అర్నబ్ తుపాను కారణంగా కురిసిన వర్షాలకు ఒడిశాలోని
పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీని వల్ల రహదార్లు
దెబ్బతింటున్నాయి. రోడ్లపై ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులుసూచిస్తున్నారు.
అర్నబ్ తుపాను కారణంగా కురిసిన భారీ
వర్షాల వల్ల మోహన సమీపంలోని తప్తపాని ఘాట్ వద్ద గజపతి-గంజాం సరిహద్దులో పెద్ద
కొండచరియలు విరిగిపడ్డాయి.
భారీగా మట్టి, బండరాళ్లు జారిపడి
రహదారిని మూసేశాయి. అదే సమయంలో భారీగా ప్రవహిస్తున్న వరద నీరుతో రాకపోకలకు అంతరాయం
కలిగింది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయింది.
మోహన నుంచి బరంపురం వైపు ఓ రోగిని
తీసుకువెళ్తున్న అంబులెన్స్ కూడా వెనుదిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రహదారిపై
కొండచరియలు విరిగిపడటాన్ని, వరద ప్రవాహాన్ని
చూసిన అంబులెన్స్ సిబ్బంది ముందుకెళ్తే ప్రమాదమని గ్రహించి వెనక్కి వెళ్లిపోయారు.
బరంపురం పట్టణాన్ని దక్షిణ ఒడిశాతో కలిపే
కీలకమైన జాతీయ రహదారి 326
తీవ్రంగా దెబ్బతింది.
గజపతి జిల్లాలోని మోహనలో లెడ్బంద్ వద్ద
వరద ప్రవహానికి కొంత భాగం కొట్టుకుపోయింది.
దీనివల్ల కూడా రవాణాకు తీవ్ర ఆటంకం
ఏర్పడింది. అక్కడి నుంచి ముందుకెళ్లే సాహసం చేయలేక కొందరు వెనుదిరిగితే, మరికొందరు
సమీపంలో ఆగిపోయారు.
కొంధమాల్ జిల్లాలో భారీ వర్షాల
కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీనివల్ల కుహబాడ గ్రామం, కళింగ ఘాట్ ప్రాంతాలు
ప్రభావితమయ్యాయి. కళింగ ఘాట్‌లోని దంగాడి కొండలో కొంత భాగం మూడోసారి కూలిపోయింది.
అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇలాంటి ప్రాంతాల మీదుగా వెళ్లే
ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.