మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గింపు

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం తగ్గించింది. 2021-22 సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.1 శాతంగా ఆమోదించింది. గత నాలుగు దశాబ్దాలలో ఇదే కనిష్టం.

లైవ్ కవరేజీ

  1. పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ

  2. కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?

  3. హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

  4. ‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్

  5. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. ఫోటోల్లో

  6. వందల కోట్ల రూపాయల విలువైన బ్రా ధరించిన కైలీ జెన్నర్‌పై జరుగుతున్న చర్చ ఏంటి?

  7. దసరా: మీకు పాలపిట్ట కనిపించిందా?

  8. సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన

  9. ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు భారీ ఊరట, అమెరికాలో వ్యతిరేకత పెరగనుందా?

  10. ప్రేమ్ వత్సా: 8 డాలర్లతో కెనడా వెళ్లిన ఈ హైదరాబాద్ వ్యక్తి 52వేల కోట్లకు ఐడీబీఐ బ్యాంకును ఎలా కొన్నారు?

  11. తెలంగాణ: కాలేజీలో లైటింగ్ స్టాండ్ కూలి విద్యార్థిని మృతి,12మందికి గాయాలు

    తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ కాలేజీలో దాండియా కార్యక్రమం సందర్భంగా ఏర్పాటుచేసిన లైటింగ్ స్టాండ్ కూలిపోవడంతో ఓ విద్యార్థిని మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

    “సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య నాకు ఫోన్ వచ్చింది. ఎంవీఎస్ఆర్ కాలేజీలో దాండియా కార్యక్రమం జరుగుతోంది. బలమైన గాలులు వీచాయి. లైటింగ్, అలంకరణ కోసం ఏర్పాటు చేసిన స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది. మీ బిడ్డ తలపై స్తంభం నేరుగా పడిందని నా స్నేహితుడు అశోక్ ఫోన్ చేసి చెప్పాడు. గాయం చిన్నదేనని, వెళ్లి చూడాలని చెప్పాడు. అయితే ఆస్పత్రి సిబ్బందిని అడిగితే.. ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే మృతి చెందినట్లు తెలిపారు. సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని, నిర్లక్ష్యం జరిగిందని కొందరు చెబుతున్నారు” అని మృతురాలి బంధువు సురేశ్ ఏఎన్ఐతో చెప్పారు.

    “సంగమం కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. నిన్న సాంకేతిక, ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. విద్యార్థుల ఆసక్తి, అభ్యర్థన మేరకు ముగింపు కార్యక్రమంగా దాండియా ఏర్పాటు చేశాం. విద్యార్థినులు నృత్యం చేస్తున్న ప్రాంతంలో స్టాండ్ పడటంతో ఈఈఈ విభాగానికి చెందిన సోనీ నారాయణ దాస్ అనే విద్యార్థినిని కోల్పోయాం. సుమారు తొమ్మిది మంది విద్యార్థులను ఆస్పత్రిలో చేర్చాం. యాజమాన్యం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు అన్ని విధాలా అండగా ఉంటాం” అని కాలేజీ డైరెక్టర్ ప్రసన్న కుమార్ ఏఎన్ఐతో చెప్పారు.

    ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

  12. మార్కో రూబియో భారత పర్యటనలో దిల్లీ ఎందుకు లేదు, జై శంకర్ ఆయనను కలవడానికి ముంబయి వెళ్లడంపై విమర్శలు ఏంటి?

  13. కోల్‌కతా: దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి

  14. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రానికి ఒంటరిగా ఆడ తాబేలు సుదీర్ఘ యాత్ర.. చివరికి ఆ ఆలివ్ రిడ్లే ఏమైంది?

  15. గరివిడి లక్ష్మి: వెండితెరపై బుర్రకథ ఎలా ఉంది?

  16. రష్యాపై అమెరికా ఆంక్షలను అడ్డుకున్న ట్రంప్

    యుక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న రష్యాను శిక్షించడానికి అమెరికా కాంగ్రెస్ ఇటీవల ఆమోదించిన రష్యా ఆంక్షల చట్టంలోని పలు ఆంక్షలను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన అధ్యక్ష అధికారంతో అడ్డుకున్నారు.

    ఈ ఆంక్షలలో కొన్నింటిని నిలిపివేయడం అమెరికా జాతీయ ప్రయోజాల దృష్ట్యా అవసరమమని శుక్రవారం రాత్రి జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ పేర్కొన్నారు.

    ఈ ఆంక్షల బిల్లుపై ట్రంప్ సెప్టెంబర్‌లోనే సంతకం చేయడంతో అది చట్టంగా మారి ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా శుక్రవారం రాత్రి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.

    నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నిక కంటే ముందే అమెరికాలో ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా రష్యా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. ఈ నవంబర్ ఎన్నికలే కాంగ్రెస్‌పై ఏ పార్టీ నియంత్రణ కలిగి ఉంటుందో నిర్ణయిస్తాయి.

    ట్రంప్ తాజా నిర్ణయాన్ని అటు రిపబ్లికన్లు, ఇటు డెమెక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

    ఈ ఆంక్షల చట్టానికి దివంగత రిపబ్లికన్ సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు పెట్టారు, ఆయన జూలై 11న మరణించడానికి ముందు అమెరికాలో యుక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు.

    ఈ చట్టం ప్రధానంగా రష్యా ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. అలాగే రష్యా నుంచి చమురు, గ్యాస్‌లను ఎక్కువగా కొనుగోలు చేసే మొదటి ఐదు దేశాలపై ముఖ్యంగా చైనా భారత్‌లపై 100 శాతం వరకు సుంకాలను విధించే విస్తృత అధికారాలను ట్రంప్‌కు కల్పించింది.

    అదనంగా, ఈ చట్టంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలతో పాటు ప్రస్తుత ఆంక్షల నుండి తప్పించుకోవడానికి రష్యా ఉపయోగిస్తున్న రహస్య నౌకాదళంపై కూడా ఆంక్షలు ఉన్నాయి.

    అమెరికాకు చెందిన 20 మంది ప్రజాప్రతినిధుల ఉమ్మడి బృందం అక్టోబర్ 18 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టాన్ని గౌరవించాలని కోరుతూ గురువారం ట్రంప్‌కు ఒక లేఖ రాసింది.

  17. గుండెలో బ్లాకేజీ ఉన్నవారందరికీ యాంజియోప్లాస్టీ అవసరమా? - 8 ప్రశ్నలు -జవాబులు

  18. ‘ఎన్నికల సంఘంలో పరిణామాలపై సైబర్ ఫోరెన్సిక్ విచారణ జరపాలి’ - సుప్రీం కోర్టులో ఖమ్మం వాసి పిటిషన్

  19. అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించండి: మోదీకి ఖర్గే లేఖ

    నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

    "2026 ఆగస్టు 13న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాయిదా పడ్డాయి. 64 రోజులు గడిచినా, పార్లమెంటు ఉభయ సభలను ఇంకా అధికారికంగా నిరవధిక వాయిదా వేయలేదు. ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు" అని ఖర్గే ఆ లేఖలో రాశారు.

    "నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయమని కోరుతూ ఏప్రిల్ 11, 2026న మీకు నేను లేఖ రాసిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ మీరు అలా చేయలేదు"

    ‘‘ఆ తర్వాత 2026 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి ఆలస్యంగా ఆ బిల్లులను బహిరంగంగా అందుబాటులోకి తెచ్చి ఏప్రిల్ 16వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ఏప్రిల్ 17వ తేదీన లోక్‌సభలో అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేకపోయింది. దీంతో ఆ బిల్లు భారీ తేడాతో వీగిపోయింది.

    ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న నా అభ్యర్థనను పునరుద్ఘాటిస్తూ జూలై 16, ఆగస్టు 27తేదీల్లో మీకు మళ్ళీ లేఖ రాశాను. ఇప్పుడు నాలుగోసారి ఇదే విజ్ఞప్తి చేస్తున్నా" అని ఖర్గే ఆ లేఖలో రాశారు.

  20. ర‌ణ‌బాలి రివ్యూ: పెళ్లయిన తర్వాత రష్మికతో తొలి చిత్రం.. విజయ్ దేవరకొండ పంట పండిందా?