రాజా సింగ్‌పై పీడీ యాక్ట్... కోర్టులో హాజరు పరచకుండా నేరుగా జైలుకే తీసుకెళ్లిన పోలీసులు

రాజా సింగ్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు నిమిషాల వ్యవధిలో అరెస్టు పూర్తి చేశారు. ఈసారి ఆయనను పాత కేసులో అరెస్ట్ చేశారు. అది కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సంబంధించినదే. ఆయనను పోలీసులు సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో రిమాండ్ పిటిషన్ వేస్తారు.

లైవ్ కవరేజీ

  1. క్రిస్టా పైక్ : మరణ శిక్ష విఫలం.. కానీ ‘నొప్పిలేని క్షణమే లేదు’

    అమెరికా, మరణశిక్ష, విషపూరిత ఇంజెక్షన్లు
    ఫొటో క్యాప్షన్, క్రిస్టా పైక్

    సెప్టెంబర్‌లో మరణశిక్ష అమలు ప్రయత్నం విఫలమైన తర్వాత అమెరికాకు చెందిన క్రిస్టా పైక్ మొదటిసారి స్పందించారు.

    ఆమె తరఫు లాయర్ల బృందం సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది.

    "ఆ రాత్రి జరిగిన ఘటన తర్వాత నొప్పి లేకుండా ఒక్క క్షణం కూడా గడవలేదు. నా శరీరమంతా నొప్పిగా ఉంది. నా చేతులు, భుజాలు, గొంతు నొప్పిగా ఉన్నాయి. మాట్లాడడానికి ఇప్పటికీ ఇబ్బందిగా ఉంది. ఈ నొప్పి శారీరకమైనది మాత్రమే కాదు. మానసికమైనది కూడా " అని ఆమె చెప్పినట్టు ఈ ప్రకటనలో ఉంది.

    50 ఏళ్ల పైక్ గత నెల చివర్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

    సెప్టెంబర్‌లో పెంటోబార్బిటాల్‌ను రెండు ఇంజెక్షన్లద్వారా ఎక్కించి క్రిస్టా పైక్‌కు మరణశిక్ష అమలు చేయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలమయింది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. అయినప్పటికీ ఆ ప్రక్రియ నుంచి ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.

    పైక్ వయసు ఇప్పుడు 50ఏళ్లు. 18 ఏళ్ల వయస్సులో తన బాయ్‌ఫ్రెండ్‌ టడారిల్ షిప్‌తో కలిసి కొల్లీన్ స్లెమ్మర్‌ అనే యువతిని చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో ఆమె దోషిగా తేలారు. అప్పుడు కొల్లీన్ వయసు 19ఏళ్లు.

  2. ‘వన్డేల్లో వారికి చోటు ఇవ్వకపోవడం అన్యాయమే’: యువరాజ్ సింగ్

    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డేల్లో రెగ్యులర్‌గా చోటు కల్పించాలంటున్నారు యువరాజ్ సింగ్
    ఫొటో క్యాప్షన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డేల్లో రెగ్యులర్‌గా చోటు కల్పించాలంటున్నారు యువరాజ్ సింగ్

    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డే జట్టులో రెగ్యులర్ స్థానం ఇవ్వకపోవడం వారి ప్రతిభకు అన్యాయం చేయడమేనని భారత మాజీ ఆల్-రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

    ముంబయిలో ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ , "నిజం చెప్పాలంటే, అభిషేక్ శర్మ వన్డేలు ఆడటం చూడాలని కోరుకుంటున్నా. ఇషాన్ కిషన్, అభిషేక్ వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లను 50 ఓవర్ల క్రికెట్‌లో ఎంపిక చేయకపోతే, ఎక్కడో ఒకచోట మనం వారి ప్రతిభకు న్యాయం చేయడం లేదని అర్థం అని నేను గతంలోనే చెప్పా’’ అన్నారు.

    "మన దగ్గర కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. , వారికి జట్టులో స్థానం సంపాదించడం కష్టమని నాకు తెలుసు. కానీ ఈ ఆటగాళ్లు రాణిస్తున్న తీరు చూస్తుంటే, వారికి త్వరలోనే జట్టులో స్థానం లభిస్తుందని ఆశిస్తున్నా" అన్నారు.

    ఈ ఆటగాళ్లు సాధించినదంతా వారి కఠోర శ్రమతోనే సాధ్యమైందని, ఆ ఘనత వారికే దక్కుతుందని యువరాజ్ అన్నారు.

  3. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న అరబ్బులు ఎవరు?

  4. #కల్ట్ మూవీ: ముసుగు మనిషి రక్తపాతం థ్రిల్ పంచిందా, విశ్వక్ సేన్ దర్శక ప్రతిభ ఎలా ఉంది?

  5. ‘పిల్లలకు చదువు చెప్పడంలో న్యాయం చేయలేకపోతున్నాం’.. దేశంలో లక్షకుపైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు

  6. ఆదర్శ కుటుంబం- ఏకే 47 మూవీ రివ్యూ: వెంకటేశ్,త్రివిక్రమ్ కాంబో మ్యాజిక్ చేసిందా?

  7. అంతర్వేది తీరానికి చేరిన భారీ ఓడకు ఏమైంది? ఒడ్డుకు సమీపంలో ఎలా చిక్కుకుంది? అందులో ఏం ఉంది

  8. ‘పాతికేళ్ల కుర్రాళ్లకూ పక్షవాతం రావొచ్చు’.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

  9. తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్

    తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్ ఇదే.
    ఫొటో క్యాప్షన్, తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్ ఇదే.

    ఇవాళ వర్షం కురిసే జిల్లాలు: సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం,

    రేపు(31 అక్టోబర్ 2026)వర్షం కురిసే జిల్లాలు: సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి,

    ఎల్లుండి(1 నవంబర్ 2026)వర్షం కురిసే జిల్లాలు: తెలంగాణ వ్యాప్తంగా చెదురుమదురు వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది

    సోమవారం(2 నవంబర్ 2026 )వర్షం కురిసే జిల్లాలు: కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల్లో వానలు పడతాయని మిగతా జిల్లాల్లో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

  10. చంటిబిడ్డను ఎత్తుకొని హాఫ్ మారథాన్‌ పూర్తి చేసిన కశ్మీరీ మహిళ.. ‘సైనికుడి భార్య జీవితం పోరాటమే’ అని ఆమె ఎందుకన్నారు

  11. ‘ప్రతి పెట్టుబడికి నాదీ భరోసా’ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్‌రెడ్డి

    తెలంగాణ‌ రైజింగ్‌లో భాగ‌స్వాములు కావాల‌ని అంత‌ర్జాతీయ‌ పారిశ్రామిక‌వేత్త‌లను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

    హైద‌రాబాద్ భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 స‌న్నాహ‌క కార్య‌క్ర‌మాన్ని దిల్లీలో నిర్వ‌హించారు.

    కార్య‌క్ర‌మానికి కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ముఖ్య‌మంత్రిరేవంత్ రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి అవ‌స‌ర‌మైన విధాన నిర్ణయాలు, ప్రభుత్వ సహకారం అందించేందుకు వ్యక్తిగతంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అంత‌ర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

    పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ‌ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏం కావాలో చెప్పాలని, విధానపరమైన మార్పుల నుంచి అవసరమైన సహకారం వరకు అన్నింటినీ అందించేందుకు వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

    "2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని సాధించేందుకు భారతీయులందరూ కలిసి కృషి చేయాలి. ప్రస్తుతం మనం దసరా, కర్వా చౌత్, దీపావళి వంటి పండుగల సీజన్‌లో ఉన్నాం. ఈ సమ్మిట్ మనకు మరో పండుగ వంటిది. 700 ఏళ్లకు పైగా క్రితమే, కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు సముద్ర వాణిజ్యానికి సంబంధించి 'మోటుపల్లి శాసనం'ను జారీ చేశారు" అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

    ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హామీ
    ఫొటో క్యాప్షన్, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హామీ
  12. అమెరికా నుంచి గ్యాస్ కొనుక్కోవాల్సిన స్థితిలో ఖతార్

    ఖతార్, ఇరాన్, అమెరికా, గ్యాస్
    ఫొటో క్యాప్షన్, హార్ముజ్ జలసంధి(ఫైల్ ఫోటో)

    ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఎగుమతిదారుల్లో ఒకటైన ఖతార్ అమెరికా నుంచి గ్యాస్ కొనుగోలు చేసుకునేందుకు కీలక ఒప్పందం చేసుకుంది.

    ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా ఖతార్‌లో ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది.

    దీంతో అమెరికా నుంచి గ్యాస్‌ దిగుమతి చేసుకునేలా 20 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది.

    అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఉన్న ఒక ప్లాంట్ నుంచి ఏడాదికి 30 లక్షల టన్నుల గ్యాస్‌ దిగుమతికి ఖతార్ ఎనర్జీ ఈ ఒప్పందంపై సంతకాలు చేసింది.

    ఈ ఒప్పందం ప్రకారం 2030 నుంచి గ్యాస్ సరఫరా ప్రారంభమవుతుంది.

    ఈ ఒప్పందం దీర్ఘకాలికంగా ఉండడం చూస్తే హార్ముజ్ జలసంధి విషయంలో కొనసాగుతున్న సంక్షోభం త్వరలో ముగిసే అవకాశం లేదని ఖతార్ భావిస్తున్నట్టు అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.

  13. లాఠీలకు భయపడకండి, మార్చ్‌కు తరలిరండి : రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ, కాంగ్రెస్, ఛలో దిల్లీ
    ఫొటో క్యాప్షన్, పోలీసులకు, లాఠీలకు భయపడొద్దని రాహుల్ గాంధీ చెప్పారు.

    ఇండియా కూటమి నిర్వహించే ‘ఛలో దిల్లీ’ మార్చ్‌లో పాల్గొనాలని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు.

    పోలీసులకు, వారి లాఠీలకు భయపడొద్దని ‘ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో రాహుల్ గాంధీ ప్రజలను కోరారు.

    ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఓట్ల చోరీని అరికట్టడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఈ మార్చ్ నిర్వహిస్తున్నట్టు రాహుల్ గాంధీ చెప్పారు.

    "నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌ల మీద విసిగిపోయినవారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకునేవారంతా ఈ మార్చ్‌లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నా’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

    రాహుల్ గాంధీ పోస్టును కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ట్యాగ్ చేశారు.

    ‘‘తెలంగాణకు రైళ్లు ఇవ్వడం నిరాకరించడం నుంచి దిల్లీ వ్యాపారులను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడంవరకు నవంబర్ ఒకటిన జరిగే మార్చ్‌ను భగ్నం చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావు" అని పవన్ ఖేరా రాశారు.

    .

  14. పాదాలలో తిమ్మిరి, సూదులతో గుచ్చినట్టు మంట.. ఇవి డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి లక్షణాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  15. ప్రపంచ పర్యటనకు క్రూయిజ్‌లో తీసుకెళ్లారు.. చమురు ధరలను భరించలేమంటూ సముద్రంలోనే నిలిపేశారు

  16. జియో: చౌక ఇంటర్నెట్ కాలం ముగియనుందా? మొబైల్ రీచార్జ్‌ ధరలు పెరుగుతాయా

  17. ఇజ్రాయెల్ ఎన్నికలు: నెతన్యాహు కూటమి ముందంజ.. కానీ, ఇంకా దక్కని పూర్తి మెజారిటీ

  18. అర్నబ్ ప్రభావంతో ఒడిశాలోనూ వానలు

    అర్నబ్ ప్రభావంతో ఒడిశాలోనూ వానలు
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ ప్రభావంతో ఒడిశాలోనూ వానలు

    అర్నబ్ తుపాను ప్రభావం ఒడిశాపై కూడా ఉంది. అందుకే అక్కడక్కడ ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

    ఒడిశా రాష్ట్రంలో రాయగడ జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఏఎన్ఐతో మాట్లాడుతూ... గత 24 గంటల వ్యవధిలో రాయగడలో 40 మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు.

    ఇది ఊహించిన దానికంటే చాలా తక్కువని పేర్కొన్నారు.

    ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పెద్దగా ప్రమాదమేమీ లేదని, అయినప్పటికీ, అత్యంత అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు.

    రాయగడలో ఇంకా కొంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

  19. తెలంగాణలోనూ వర్షాలు

    తెలంగాణ, అర్నబ్, ఆంధ్రప్రదేశ్, వాతావరణం
    ఫొటో క్యాప్షన్, తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం

    తెలంగాణలో వాతావరణం పరిశీలిస్తే పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌లోనివాతావరణ శాఖ తెలిపింది.

    భద్రాద్రి గూడెం, ఖమ్మం, సూర్యపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

    ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

    మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.

  20. ‘తుపాను బలహీన పడినా ఇంకా ప్రమాదం ఉంది.. ఫ్లాష్ ఫ్లడ్స్ రావొచ్చు’

    ఆంధ్రప్రదేశ్, అర్నబ్, వాతావరణం
    ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారులు అప్రమత్తం

    తుపాను బలహీనపడినా దాని ప్రభావం ఇంకా ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

    శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

    గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    కురిసిన భారీ వర్షాలతో ప్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

    పొంగిపోర్లే వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.

    సహాయ చర్యల్లో 16 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు తెలిపారు.