మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

ఒడిశా: కాల్పులకు గురైన ఆరోగ్య శాఖ మంత్రి నవ్ కిశోర్ దాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

దాడి జరిగిన వెంటనే నవ్ కిశోర్ దాస్‌ను హుటాహుటిన విమానంలో భువనేశ్వర్‌కు తరలించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఆస్పత్రిలో వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

లైవ్ కవరేజీ

  1. మేం పోటీకి భయపడం: ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ప్రకటన

    స్టార్ లింక్ వ్యవహారంలో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆ సంస్థ, తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని పేర్కొంది.

    భారతదేశంలో స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఇటీవల ఆరోపించారు.

    పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీని "ప్రధాన మంత్రి అంబానీ" అని సంబోధించిన మస్క్, భారత్‌లో స్టార్‌లింక్‌కు నిష్పాక్షికంగా పోటీపడే అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించారు.

    రిలయన్స్ ప్రకటనలో, "ప్రతి భారతీయ కంపెనీలాగే రిలయన్స్ కూడా దేశీయ విదేశీ పెట్టుబడులతో పాటు సరికొత్త ఆలోచనలకు స్వాగతం పలికే దేశంలో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ప్రజల జీవితాలను మెరుగుపరిచే పనులను ఆహ్వానిస్తుంది"

    స్టార్‌లింక్‌తో సహా ఉపగ్రహ సమాచార రంగంలో పోటీని స్వాగతిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. జియోతో సహా ప్రతి కంపెనీ భారత ప్రజలకు సేవలు అందించాలని, దేశ చట్టాలు, విధానాలను పాటించాలని ఆ ప్రకటనలో పేర్కొంది.

  2. నిర్బంధానికి, అరెస్ట్‌కు తేడా ఏమిటి? వీటి విషయంలో పౌరులకు ఎలాంటి హక్కులు ఉంటాయి?

  3. భారత్, చైనాలను ఏకతాటిపైకి తేవాలని నేపాల్ ఎందుకు కోరుకుంటోంది?

  4. క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ: పెళ్లి చుట్టూ తిరిగిన డ్రామా మెప్పించిందా?

  5. దేశం విడిచి వెళ్లాలని నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు

    ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 28 నాటికి భారత్‌ను విడిచి పెట్టాలని అందులో సూచించింది.

    ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొని విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు ఉన్నాయి.

    అక్టోబర్ 10న ఆగస్టు రివల్యూషన్ గ్రౌండ్స్‌లో జరిగిన నిరసనల్లో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న ఆయన్ని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు.

    ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని, నిరసనల్లో పాల్గొని విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించారని బీజేపీ నేత కృతి సౌమ్య ఆరోపించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    "విదేశీయుల చట్టాన్ని ఖాన్ ఉల్లంఘించారని గామ్దేవీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత ఆ ఫిర్యాదును ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు పంపించాం" అని పోలీసులు తెలిపారు.

    ఖాన్‌ను అమెరికా పౌరుడిగా గుర్తించి, ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంలోని 7, 29 సెక్షన్లు ఉల్లంఘించినట్టు నోటిసుల్లో పేర్కొన్నారు. దీని ఆధారంగానే నిర్దేశించిన గడువులోపు దేశం విడిచి వెళ్లాలని సూచించినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి వివరించారు.

  6. అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని ఖండించిన రాహుల్ గాంధీ

    అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఖండించారు.

    బాధితుల గొంతును ఈ ప్రభుత్వం నొక్కేస్తోందని, ప్రశ్నించేవారిని తప్పిస్తోందని ఆయన ఆరోపించారు.

    "ఉదయం 4 గంటలు, ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అంకితా భండారీ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. వారు చేసిన తప్పు ఏంటి?, ఇండియా గేట్ వద్ద ఎలాంటి హాంగామా లేకుండా, బాధతో నిశ్శబ్ధంగా కూర్చొని, సీబీఐ విచారణ పూర్తి అయ్యే వరకు దుష్యంత్ గౌతమ్‌ను గవర్నర్‌గా నియమించొద్దని కోరారు" అని ఎక్స్‌లో రాహుల్ గాంధీ పోస్టు చేశారు.

    "నేను, ప్రియాంక నిన్న వారిని కలిశాం. సీబీఐ దర్యాప్తు ఫలితాలు రాకముందే హడావుడిగా నియమాకాలు పూర్తి చేశారు. ప్రశ్నించిన తల్లిదండ్రులను చీకటిలో అదుపులోకి తీసుకున్నారు. బాధితుల గొంతును అణిచివేయడం, ప్రశ్నించే వారిని పక్కన పెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.

    "న్యాయం కోసం జరుగుతున్న పోరాటాన్ని ఎవరూ అణచివేయలేరు, ఆపలేరు. అంకితా భండారీ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు మద్దతు ఇస్తుంది" అని తెలిపారు.

    ఇండియా గేట్ దగ్గర నిరసన చేస్తున్న అంకితా భండారీ తల్లిదండ్రులతోపాటు పలువురిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    కొంత సమయం వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఉదయం ఐదు గంటలకు విడుదల చేసినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

  7. టీవీకే ఎమ్మెల్యే పల్లవి: ‘‘చంటి పిల్లాడిని సభలు సమావేశాలకు తిప్పుతూ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు’’ అంటూ ఆమెపై విమర్శలేంటి?

  8. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌‌కు భయపడాలా? బహిష్టు సమస్యల నుంచి సంతానలేమి వరకు.. దీనివల్ల కలిగే పరిణామాలు ఏంటి?

  9. ఈసీఐకు సుప్రీం కోర్టు నోటీసులు

    భారత ఎన్నికల సంఘం సహా పలువురికి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసిందని ఏఐఎన్ వార్తాసంస్థ పేర్కొంది. లోక్‌సభ‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీసహా పలు ప్రతిపక్షాలు వేసిన పిటిషన్ విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

    ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీకి కోర్టు సూచించింది. ఈసీ సర్‌ను నిర్వహిస్తున్న తీరును సవాలు చేస్తూ 13 పిటిషన్లు దాఖలు కాగా వారి ఒక పిటిషనర్ వైఖరిపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

    “పిటిషన్ దాఖలు చేసిన ఒక పిటిషనర్ ప్రవర్తన గురించి వచ్చే విచారణలో అడగాలనుకుంటున్నాం” అని రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకుల పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

    లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర 'ఇండియా' బ్లాక్ నాయకులతో కలిసి, భారత ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా అక్టోబర్ 12న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్‌కు సంబంధించి భారత ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలను సవాలు చేస్తూ ఈ పిటిషన్లు వేశారు.

  10. ప్రధాని మోదీ ముందున్న 10 సవాళ్లు ఏంటి?

  11. ‘‘5 నెలల్లోనే బియ్యం బస్తా రూ.700 పెరిగింది’’ - తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

  12. ఇంద్రకీలాద్రి: అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో రాష్ట్రపతికి ఘన స్వాగతం

    విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతి ఇంద్రకీలాద్రికి చేరుకున్న సందర్భంగా ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.

    విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రపతికి వేద మంత్రోచ్ఛారణల నడుమ వేద ఆశీర్వచనం అందజేశారు.

    అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కనకదుర్గ అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి చిత్రపటాన్ని అందించి గౌరవపూర్వకంగా సత్కరించారు.

  13. భర్తను హత్య చేసి బ్లూ డ్రమ్‌లో దాచిన మహిళకు, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష

  14. జనసేనలో చేరిన వంగవీటి రాధ

    టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి వంగవీటి రాధను పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.

    పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన వంగవీటి రాధాకృష్ణను పవన్ కల్యాణ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.

    అనంతరం వంగవీటి రాధ తన అనుచరులను పవన్ కల్యాణ్‌కు పరిచయం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు వెళ్దామని పవన్ వారితో అన్నారు.

  15. ‘‘మహిళలపై లైంగిక వేధింపులను బయటపెడుతున్నా, అందుకే నన్ను చంపాలని చూస్తున్నారు.. ’’

  16. వద్దన్నా కుప్పలు తెప్పలుగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పార్సిళ్లు, తట్టుకోలేక విదేశాలకు వెళ్లిపోయిన ఇన్‌ఫ్లూయెన్సర్

  17. జాతీయ జెండా ఎగురవేసినవారిని జైల్లో పెట్టడం పిరికితనం -రాహుల్

    జంతర్ మంతర్‌లో జాతీయ జెండా ఎగరేయడం నేరం కాదు, కానీ ఆ పనిచేసిన కొందరిని జైల్లో పెట్టడం పిరికితనమే అన్నారు లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ.

    సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి పంపడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్‌ ఖాతాలో స్పందించారు.

    “జంతర్ మంతర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి శాంతియుతంగా నిరసన తెలపడం నేరం కాదు. యువకులను జైల్లో వేయడం పిరికితనం” అని రాహుల్ గాంధీ విమర్శించారు.

    "విద్యార్థులు, యువతరం, జర్నలిస్టులు, ‘ఇండియా’ బ్లాక్ పార్టీల బ్యానర్లు వేర్వేరు కావచ్చు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. ఒకే విషయం గురించి నిరసనలు జరుగుతున్నాయి. పౌరులు తమ రాజ్యాంగబద్ధమైన హక్కులను కోరుతున్నారు. జంతర్ మంతర్ దేశ ప్రజలది. దాన్ని తిరిగి సాధించుకుంటాం’’ అని రాహుల్ స్పష్టం చేశారు.

    ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో విమర్శించారు.

    "త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి, భారత్ మాతాకి జై అని నినాదాలు చేసిన సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను మీరు జైలుకు పంపించారు. యువతతో పెట్టుకోవద్దు మోదీజీ, త్వరలోనే మీ నియంతృత్వానికి ముగింపు పలుకుతారు" అని సంజయ్ సింగ్ రాసుకొచ్చారు.

    మంగళవారం జంతర్ మంతర్‌లోకి అక్రమంగా చొరబడ్డారని సీజేపీ నాయకులపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

  18. పాకిస్తాన్‌: ఇమ్రాన్ ఖాన్ కంచుకోటలో ఎమర్జెన్సీ, ప్రభుత్వం తప్పు చేస్తోందంటున్న నిపుణులు

  19. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్‌కు 5 రోజుల కస్టడీ

    జంతర్ మంతర్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలపై సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను మందిర్ మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం వారిని 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

    అంతకు ముందు సీజేపీ నేతల అరెస్టుపై కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన న్యాయ వ్యవహారాల చీఫ్ రత్న సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    "న్యాయవాదులను కలిసేందుకు కూడా వారిని అనుమతించలేదు. తెల్లవారుజామున 3 గంటలకు ఒక ప్రైవేట్ వాహనంలో వారిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారి మనోధైర్యం ఏమాత్రం తగ్గలేదు." అని పేర్కొన్నారు.

    "అనుమతి లేకుండా ప్రవేశించడం, బాండ్ షరతులు ఉల్లంఘించడం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు సీజేపీ నేతలపై మోపారు" అని రత్న సింగ్ 'ఎక్స్'లో పోస్ట్‌ చేశారు.

  20. నీటిలో మునిగిపోయిన ఈ గ్రామానికి కోహినూరు వజ్రానికి లింకేంటి, జనం ఇంకా అక్కడ ఎందుకు తవ్వుతున్నారు?