అనకాపల్లి పుష్ప: ‘ఔను. కాబోయే భర్త గొంతు కోశా.. ఎందుకంటే..’

కాబోయే భర్త గొంతు కోసిన కేసులో నిందితురాలైన యువతి పుష్పని బుచ్చెయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘‘నిన్న బండిపై నుండి పడ్డామని చెప్పిన పుష్ప ఈరోజు నేరం అంగీకరించింది. కాబోయే భర్త రామునాయుడు గొంతును తానే కోసినట్లు ఒప్పుకుంది’’ అని బుచ్చయ్యపేట పీఎస్ ఎస్ఐ రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. సీజేపీ: బాండ్‌పై సంతకం చేస్తే నిరసనలకు దూరంగా ఉంచగలరా? చట్టం ఏం చెబుతోంది?

  2. యువత ఆగ్రహం ఎవరి మీద? ఎన్నికల సంఘంపైనా, మోదీ పైనా?

  3. సీజేపీ ఆందోళనలు: పోలీసులు విమానంలోకి వచ్చి అరెస్టు చేయవచ్చా?

  4. చీర ధరించి 1600 మీటర్ల పరుగు పందాన్ని 9 నిమిషాల్లో పూర్తి చేసిన కవిత..

  5. భారత టెక్ దిగ్గజాలపై అమెరికా చర్యలు: గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర ఆలస్యం తప్పదా?

  6. ‘‘నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడం మీ దేశానికే మచ్చ’’ అంటూ నార్వేపై ట్రంప్ విమర్శలు

  7. యుక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయమొచ్చింది: డోనల్డ్ ట్రంప్

    అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్
    ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

    యుక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు. రష్యాతో అమెరికా కుదుర్చుకున్న డీజిల్ ఒప్పందంపై జెలియెన్ స్కీ చేసిన విమర్శలకు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    రష్యా నుంచి లక్షల టన్నుల డీజిల్‌ను అమెరికాకు సరఫరా చేసేందుకు కొత్త ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల.. యుక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు మాస్కోకు డబ్బు అందించినట్లవుతుందని జెలియెన్ స్కీ హెచ్చరించారు. ఈ ఒప్పందాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇచ్చే బహుమతిగా జెలియెన్‌ స్కీ అభివర్ణించారు.

    శనివారం వైట్‌హౌస్‌ వెలుపల విలేఖరులతో ట్రంప్‌ మాట్లాడారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులకు జెలియెన్ స్కీ అనుమతులు ఇస్తూ.. ప్రపంచానికి సమస్యలు సృష్టిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు.

    ‘‘ఆయన ఈ పని కచ్చితంగా ఆపేయాలి’’ అన్నారు. ఒప్పందం కుదుర్చుకోగల కొత్త నాయకుడిని యుక్రెయిన్‌ ఎన్నుకోవాలని సూచించారు.

  8. ‘నా కోచ్‌లో మగవాళ్లు మద్యం తాగుతున్నారు’ అంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన అస్సాం యువతి తర్వాతి రోజు శవంగా కనిపించారు..

  9. తనిఖీలు,నిర్బంధాలు,ఇంటర్‌నెట్ బంద్, ఎక్కడికక్కడ బారికేడ్లు.. దిల్లీలో ఇప్పటిదాకా ఏం జరిగింది, బీజేపీ ఏమంది?

  10. రష్యా నుంచి చమురు దిగుమతికి ట్రంప్ నిర్ణయం: అమెరికన్ల ఆశ్చర్యం, జెలియెన్‌స్కీ ఆగ్రహం

  11. ముకేశ్ అంబానీని 'ప్రధానమంత్రి' అంటూ కామెంట్ చేసిన ఎలాన్ మస్క్, వీరి మధ్య వివాదం ఏంటి?

  12. "రైలు ఎక్కి తనిఖీలు చేశారు, పోలీసుల నిర్బంధాలు చూస్తే భయమేస్తోంది"-తెలుగు రాష్ట్రాల యువకులు ఇంకా ఏం చెప్పారు?

  13. రష్యాతో డీజిల్ దిగుమతికి అమెరికా ఒప్పందం

    డోనల్డ్ ట్రంప్, అమెరికా, రష్యా, డీజిల్
    ఫొటో క్యాప్షన్, అమెరికా, ప్రపంచ మార్కెట్ల కోసం డీజిల్‌ను తక్షణమే సరఫరా చేయడానికి పుతిన్ అంగీకరించారని ట్రంప్ అన్నారు.

    ఇంధన ధరలను తగ్గించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్న అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా నుంచి అమెరికాకు డీజిల్‌ దిగుమతి చేసుకునే ఒప్పందాన్ని ప్రకటించారు.

    అమెరికా, ప్రపంచ మార్కెట్ల కోసం 3 లక్షల టన్నుల డీజిల్‌ను తక్షణమే సరఫరా చేయడానికి పుతిన్ అంగీకరించారని, నవంబర్‌లో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత మరో మిలియన్ టన్నులు ఇస్తారని ట్రంప్ తెలిపారు.

    శుక్రవారం నాటి ఈ నిర్ణయంపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పుతిన్‌కు బహుమతి అని, అంతం కావాల్సిన యుద్ధాన్ని పొడిగించే పెట్టుబడిగా అభివర్ణించారు.

    ఈ ఒప్పందంలో భాగంగా రష్యన్ డీజిల్ ఎగుమతులపై ఆంక్షలను అమెరికా ట్రెజరీ ఏప్రిల్ 7 వరకు ఎత్తివేసింది. అయితే, అమెరికా బ్యాంకుల్లో ఉన్న మిగతా రష్యన్ ఆస్తులపై ఆంక్షలు అలాగే ఉన్నాయి.

    యుక్రెయిన్ దాడుల కారణంగా దెబ్బతిన్న రిఫైనరీల పనితీరును బట్టి, త్వరలోనే మరో 3 మిలియన్ టన్నుల రష్యన్ డీజిల్ సరఫరా అవుతుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

  14. జంతర్‌ మంతర్ నిరసన: ముందస్తు అరెస్టులు, భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు

  15. ఈయనకు లైవ్‌లో మరణ శిక్ష అమలు చేస్తామని అమెరికా రక్షణ మంత్రి చెప్పారు

  16. గరివిడి లక్ష్మి ఈవిడే.. ‘ఆమె పాటల క్యాసెట్ లేని ఇల్లు ఉండేది కాదు’

  17. ఎలాన్ మస్క్ విషయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా ఉన్నాయా?

  18. బంగారు ఇటుకలు, లగ్జరీ కార్లు, ఖరీదైన వాచీలు: ఓ గూఢచారి ఘరానా మోసం..

  19. ఇన్ఫోసిస్‌తో సహా ఈ టెక్ కంపెనీలపై తీసుకున్న చర్యలను సమర్థించిన జేడీ వాన్స్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి కంపెనీల తొలగింపు

    జేడీ వాన్స్, అమెరికా, ఇండియా, మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని
    ఫొటో క్యాప్షన్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి కంపెనీల తొలగింపును సమర్థించిన జేడీ వాన్స్

    గ్రీన్ కార్డ్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ఎనిమిది టెక్ కంపెనీలను తొలగించడాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించారు.

    కంపెనీలకు చౌకైన విదేశీ కార్మికుల సరఫరాకు విమర్శకులు సహాయం చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

    ఈ నిర్ణయాన్ని డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ ప్రశ్నించిన తర్వాత, వాన్స్ ' సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో విమర్శలు చేశారు. ‘సోషలిజం' అంటే పెద్ద కంపెనీలకు చౌకగా కార్మికుల సరఫరా ఎప్పటికీ ఆగకుండా ఉండేలా చూడటానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడటమే అనిపిస్తోంది."

    మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని అనే ఎనిమిది కంపెనీలను సస్పెండ్ చేయాలన్న నిర్ణయం చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదానికి ఈ ప్రకటన మరింత ఆజ్యం పోసింది.

  20. స్మిత్ మచ్చర్‌కు అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు, స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం

    అమెరికా, భారత్, స్మిత్ మచ్చర్, ఇజ్రాయెల్,
    ఫొటో క్యాప్షన్, భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్నారు (ఫైల్ ఫోటో)

    ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో కో-పైలట్ దాడి చేసినప్పటికీ, ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రదానం చేయనున్నారు.

    భారత పైలట్ కోలుకున్న తర్వాత ఆయన ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం అందజేస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తెలిపారు.

    "ఈ రోజు మనం గౌరవిస్తున్న ఇజ్రాయెల్ వీరులతోపాటు, భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ కూడా త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. కెప్టెన్ మచ్చర్ అపారమైన ధైర్యం, అత్యుత్తమ వృత్తి నైపుణ్యం ఒక పెద్ద విపత్తును నివారించడంలో సహాయపడ్డాయి. ఆయన కోలుకున్న తర్వాత, ఇజ్రాయెల్ ప్రజల తరపున ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయడం నాకు గౌరవంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.

    భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఒమన్‌కు చెందిన కో-పైలట్ దాడి చేయగా, ఆయన ధైర్యంగా ఎదుర్కొని 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడారు.