మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

రాజ్యసభకు ఇళయరాజా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, పీటీ ఉష

ఇళయరాజాతో పాటు ఎస్‌ఎస్ రాజమౌళి వాళ్ల నాన్న వి.విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పీటీ ఉష, సంఘసేవకర్త వీరేంద్ర హెగ్డేలు కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

లైవ్ కవరేజీ

  1. కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?

  2. హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

  3. పంజాబ్‌లో కుటుంబాన్ని తుపాకీతో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్న పోలీస్

    పంజాబ్‌లోని మాన్సాలో పోలీసు కానిస్టేబుల్ కుటుంబంపై కాల్పులు జరిపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

    ఈ కాల్పుల్లో ఒక కుమారుడు చనిపోగా, భార్య, మరో కుమారుడు గాయపడినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

    గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

    ఈ ఘటన ఉదయం 7గంటల ప్రాంతంలో జరిగిందని మాన్సా ఎస్ఎస్సీ చెప్పారు.

    కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు ఆయన పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలిస్తాయని వెల్లడించారు.

    సర్వీస్ తుపాకీతోనే కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు.

    మన్సా డిప్యూటీ కమిషనర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా ఆయన పని చేస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.

    (ఆత్మహత్య అనేది ఒక తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే, భారత ప్రభుత్వానికి చెందిన 'జీవన్ ఆస్థా' (Jeevan Aastha) హెల్ప్‌లైన్ నంబర్ 18002333330 ద్వారా సహాయం పొందవచ్చు. అలాగే, మీ స్నేహితులు, బంధువులతో కూడా మాట్లాడండి.)

  4. ‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్

  5. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. ఫోటోల్లో

  6. ‘‘నన్ను బలవంతంగా టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లాడు, నేను కళ్లు మూసుకుని అక్కడ లేననుకున్నా’’

  7. దసరా: మీకు పాలపిట్ట కనిపించిందా?

  8. ఆస్ట్రేలియా: ఎంపీని కారుతో గుద్ది హత్యాయత్నం

    ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హెయిన్స్‌ను కారు ఢీకొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించారు.

    విక్టోరియాలోని వాంగరట్టాలో తన కార్యాలయం బయట పార్కింగ్‌లో ఉండగా, సోమవారం మధ్యాహ్నం కారు ఢీకొనడంతో హెలెన్ హెయిన్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. అయితే దాడి వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

    హెయిన్స్‌ను ఢీకొట్టడానికి కారు డ్రైవర్ యూ టర్న్ తీసుకు వచ్చినట్టు కనిపిస్తోందని అల్బనీస్ అన్నారు. కారు నడుపుతున్న 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

    హెలెన్ హెయిన్స్ ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో గల ఇండి డివిజన్‌కు చెందిన 65 ఏళ్ల స్వతంత్ర ఎంపీ.

    ఆమె 2019లో తొలిసారిగా ఆస్ట్రేలియన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికయ్యారు. 2022, 2025లలో తిరిగి ఎన్నికయ్యారు.

    రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు ఆమె నర్సుగా, ప్రజారోగ్య పరిశోధకురాలిగా పనిచేశారు.

  9. బంగ్లాదేశ్‌కు చెప్పకుండానే ఆ దేశ జంటకు సౌదీ మరణ శిక్ష అమలు చేసిందా?

  10. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు: ముగ్గురు అరెస్ట్

    ముంబైలో ఆదివారం సాయంత్రం టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఏఎన్‌ఐ రిపోర్టు చేసింది. వీరిని రాజస్థాన్ పోలీసులు పట్టుకున్నారని తెలిపింది.

    బాలీవుడ్ నటుడు టైగర్ ‌ష్రాఫ్ కాల్పుల కేసులో ముగ్గురు నిందితులను రాజస్థాన్‌లోని కోటా పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు హరియాణాకు చెందిన వారు కాగా, ఒకరు బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

    వారంతా రైలులో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నట్టు కోటా ఎస్పీ తేజస్వినీ గౌతమ్ ఏఎన్‌ఐతో చెప్పారు.

  11. 700 మందితో గ్యాంగ్ నడుపుతున్న లారెన్స్ బిష్ణోయీ ఎవరు? టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల తరువాత ఈ గ్యాంగ్ పేరు ఎందుకు వినిపిస్తోంది?

  12. సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన

  13. ఉత్తర కొరియా: 50 మీటర్ల ఈత కొలను, జారుడు బల్లలున్న ఆ విలాస నౌక ఎవరిది?

  14. పంజాబ్‌: ఉపాధి హామీ పథకం కూలీలపైకి దూసుకెళ్లిన కారు-8 మంది మృతి

    పంజాబ్‌లోని సంగ్రూర్‌లో రోడ్డుపై పని చేస్తున్న ఉపాధి హామీ పథకం కూలీలపైకి ఒక కారు దూసుకెళ్లింది. అక్కడ పని చేస్తున్న వారిలో 8 మంది మృతి చెందారు. మరికొందరు కూలీలు గాయపడ్డారు.

    సంగ్రూర్ జిల్లాలోని లెహ్రాగాగా-జఖల్ రోడ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆ రోడ్డుపై పని చేస్తున్న కూలీలను వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టిందని సంగ్రూర్ ఎస్పీ పల్విందర్ సింగ్ చీమా చెప్పారు. మృతి చెందిన 8 మందిలో ఆరుగురు మహిళలు ఉన్నారు.

    ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ దాదాపు 25 మంది వరకు కూలీలు పని చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒక మోటార్ సైకిల్ కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

    ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఆయన కోసం గాలిస్తున్నారు.

  15. ముంబయి: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. పోలీసులు ఏమంటున్నారు?

  16. అద్దెకు గర్బా పార్టనర్: ‘నుదుటిపై ముద్దు’, ‘ఆఫ్టర్ పార్టీ’ ఆఫర్ల వెనుక అసలు నిజమేంటి?

  17. క్యాన్సర్, ఎర్లీ మెనోపాజ్‌ను ఎదుర్కొని.. 23 ఏళ్ల నాటి అండాశయ కణజాలంతో ఈమె ఎలా తల్లయ్యారు

  18. ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు భారీ ఊరట, అమెరికాలో వ్యతిరేకత పెరగనుందా?

  19. ప్రేమ్ వత్సా: 8 డాలర్లతో కెనడా వెళ్లిన ఈ హైదరాబాద్ వ్యక్తి 52వేల కోట్లకు ఐడీబీఐ బ్యాంకును ఎలా కొన్నారు?

  20. మార్కో రూబియో భారత పర్యటనలో దిల్లీ ఎందుకు లేదు, జై శంకర్ ఆయనను కలవడానికి ముంబయి వెళ్లడంపై విమర్శలు ఏంటి?