రాజ్యసభకు ఇళయరాజా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, పీటీ ఉష

ఇళయరాజాతో పాటు ఎస్‌ఎస్ రాజమౌళి వాళ్ల నాన్న వి.విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పీటీ ఉష, సంఘసేవకర్త వీరేంద్ర హెగ్డేలు కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

లైవ్ కవరేజీ

  1. అస్సాంలో భారీ వరదలు, 41కి చేరిన మృతుల సంఖ్య

    అస్సాం వరదలు, సహాయక చర్యలు
    ఫొటో క్యాప్షన్, రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 939 గ్రామాలు వరదల్లో మునిగిపోయాయని అస్సాం ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది.

    అస్సాంలో భారీ వరదల కారణంగా గత 24 గంటల్లో మరో పది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 41కి చేరింది.

    వరదల కారణంగా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో దాదాపు వెయ్యి గ్రామాలు నీట మునిగాయని, 6.53 లక్షల మంది ప్రభావితులయ్యారని అస్సాం ప్రభుత్వ విపత్తు విభాగం ప్రకటించింది.

    రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో సుమారు 25 వేల మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందినట్లు విపత్తు నిర్వహణ శాఖ నివేదిక పేర్కొంది.

    ఎగువ అస్సాంలో వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. శివసాగర్, చరాయిదేవ్, గోలాఘాట్, జోర్హాట్ జిల్లాల్లో వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లింది.

    రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారత సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. మారుమూల ప్రాంతాల్లోని వరద బాధితులను గుర్తించేందుకు సైనిక హెలికాప్టర్లు గగనతల నిఘా నిర్వహిస్తున్నాయి.

    ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వరద పరిస్థితి గురించి వివరించారు.

  2. 92 ఏళ్ల వయసులోనూ సర్జరీలు చేస్తున్న లేడీ డాక్టర్

  3. సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ వైఖరుల్లో ఈ వ్యత్యాసం ఎందుకు, నడ్డా చేతులమీదుగా దీక్ష విరమణపై వస్తున్న ప్రశ్నలేంటి?

  4. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడాన్ని ఎలా చూడాలి?

  5. సెక్స్ తర్వాత ఎంతసేపటిలో పిల్స్ వేసుకుంటే గర్భం రాదు?

  6. మూవీ రివ్యూ: ఇది ‘లేడీ దేవదాస్’ కథా?

  7. దోమలపై యుద్ధానికి రంగంలోకి సైన్యం, మిలటరీ డ్రోన్లు.. శ్రీలంకలో ఏం జరుగుతోంది?

  8. ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడం మోదీ ప్రభుత్వానికి కష్టతరమా?

  9. జంతర్ మంతర్: వాష్‌రూమ్స్, ఫుడ్, మెడిసిన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నామంటే..

  10. ప్రభుత్వంతో సీజేపీ చర్చలు జరగకపోవడానికి కారణమదేనా?

    సీజేపీ, నిరసనలు, చర్చలు

    కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను గురువారం చర్చలకు ఆహ్వానించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివాసం లేదా కార్యాలయంలో చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

    అయితే, చర్చల వేదికపై సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా అభ్యంతరం వ్యక్తం చేశారు. "చర్చలు తటస్థ ప్రదేశంలో జరగాలి" అని అన్నారు.

    జంతర్ మంతర్ వద్ద ఉన్న మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, "జంతర్ మంతర్‌కు రావడానికి వాళ్లు భయపడుతున్నారు. అందుకే, మీ నివాసం లేదా జంతర్ మంతర్ కాకుండా మరోచోట చర్చలు జరగాలని వారికి సూచించాం" అని ఆయన అన్నారు.

    "కానీ, జితేంద్ర సింగ్ మాత్రం జేపీ నడ్డా నివాసం లేదా ఆయన కార్యాలయంలో చర్చలు జరుపుదామని అంటున్నారు."

    చర్చావేదిక విషయంలో సీజేపీ, ప్రభుత్వానికి మధ్య సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు పట్టుబడుతున్నారు.

  11. ప్రీటర్మ్ డెలివరీ: నెలలు నిండకముందే పుట్టిన పిల్లలకు జీవితాంతం సమస్యలు తప్పవా? అపోహలు - సమాధానాలు

  12. ఎన్ఎస్ఏ కింద దిల్లీ పోలీసు కమిషనర్‌కు ఇచ్చిన అధికారం ఏంటి?

    యువత నిరసన, దిల్లీ

    నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ), 1980 కింద ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులను జారీ చేసే అధికారాన్ని దిల్లీ పోలీస్ కమిషనర్‌కు కల్పించారు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.

    ఈ అధికారాన్ని 2026 జూలై 19 నుంచి 2026 అక్టోబర్ 18 వరకు మూడు నెలల కాలానికి మంజూరు చేసినప్పటికీ, ఈ విషయం ఇప్పుడే బహిరంగంగా తెలిసింది.

    దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం జరుగుతున్న నిరసనల దృష్ట్యా దీన్ని అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తున్నారు.

    జూలై 20న జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంట్‌కు మార్చ్ నిర్వహించాలని సీజేపీ పిలుపునిచ్చింది.

    దీని తర్వాత, నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో చాలా మంది గాయపడ్డారు.

    జంతర్ మంతర్ వద్ద సీజేపీ, దాని కార్యకర్తల నిరసన ఇంకా కొనసాగుతోంది.

  13. సీదిరి అప్పలరాజు అరెస్ట్: యాక్సిడెంట్ కేసు నుంచి కొడుకును తప్పించేందుకు ప్రయత్నించారా?

  14. మోదీ కంటే ముందు ప్రధాన మంత్రులు ఎక్కడ నివసించారు? తెలుగుదేశం ఎంపీలు 2013లో అప్పటి ప్రధాని నివాసం సమీపంలో ఎందుకు నిరసన తెలిపారు

  15. దిల్లీలో 16 మెట్రో స్టేషన్ల నుంచి రాకపోకలు బంద్

    Rajiv Chowk Metro station

    దిల్లీలో నిరసనల నేపథ్యంలో గురువారం (23.07.2026) కూడా మెట్రో రైల్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. 16 మెట్రో స్టేషన్లను గురువారం ఉదయం 7.30 నుంచి మూసివేస్తున్నామని, తదుపరి సూచనలు వచ్చేవరకు ఈ స్టేషన్ల నుంచి రాకపోకలకు వీలుండదని ‘దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్’ తన ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది.

    మూసివేసిన స్టేషన్లు ఇవే..

    1) లోక్ కల్యాణ్ మార్గ్

    2) రాజీవ్ చౌక్

    3) పటేల్ చౌక్

    4) రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్

    5) బారాఖంభా రోడ్

    6) సుప్రీంకోర్ట్

    7) సేవా తీర్థ్

    8) జన్‌పథ్

    9) మండీహౌస్

    10) సెంట్రల్ సెక్రటేరియట్

    11) ఐటీఓ

    12) దిల్లీ గేట్

    13) ఇంద్రప్రస్థ

    14) ఖాన్ మార్కెట్

    15) జోర్ బాగ్

    16) శివాజీ స్టేడియం

    అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ప్రయాణికులు ఒక లైన్ నుంచి మరొక లైన్‌కు మారే సౌకర్యం ఎప్పటిలా అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

  16. కాక్రోచ్ ఉద్యమం: బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు అస్త్రంగా మారనుందా?

  17. ప్రభుత్వం తీరు నచ్చక మళ్లీ ‘మత్తు మందు’ సాగు మొదలుపెడుతున్న రైతులు

  18. షార్క్స్: వీటికి మ్యాథ్స్ తెలుసు, మ్యూజిక్ అంటే ఇష్టం – సొరచేపల గురించి మీకు తెలియని తొమ్మిది విషయాలు

  19. కాక్రోచ్ జనతా పార్టీ: ‘‘ కేంద్ర మంత్రి ఇంట్లో చర్చలకు ఆహ్వానించారు. కానీ, మేం తిరస్కరించాం’’

    సౌరవ్ దాస్

    ప్రభుత్వం చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసానికి రావాల్సిందిగా తమకు ఆహ్వానం అందిందనీ, కానీ దాన్ని తిరస్కరించామని కాక్రోచ్ జనతా పార్టీ వెల్లడించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ విషయంలో ఒక ప్రకటన చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. సౌరవ్ దాస్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే...

    ‘‘బుధవారం ఉదయం మా దగ్గరికి పోలీసులు వచ్చారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాతో మాట్లాడలనుకుంటున్నారని మాకు చెప్పారు. ఈ చర్చల కోసం మమ్మల్ని ఆయన ఇంటికి ఆహ్వానించారు. అయితే మేం ఆ అభ్యర్థనను తిరస్కరించాం. మేం ఎవరి ఇంటికి, ఆఫీసుకి వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడ ఒక జనతా దర్బార్‌ను నిర్వహిస్తున్నాం. ఒకవేళ మంత్రులు మాతో చర్చలు జరపాలనుకుంటే వాళ్లే జనం దగ్గరికి రావాలి. చర్చలు జంతర్ మంతర్ దగ్గరే జరగాలి. ఒకవేళ నిరసన స్థలంలో భద్రతా ఆందోళనకరమని ప్రభుత్వం భావిస్తే, జంతర్ మంతర్ సమీపంలో ఏదైనా ఒక తటస్థ వేదిక దగ్గర చర్చలకు కూడా మేము సిద్ధమే. ఈ విషయమై మేము ప్రభుత్వం నుంచి ,స్పందన కోసం ఎదురు చూస్తున్నాం’’ అని అన్నారు.

    తాము ప్రతిపాదించిన డిమాండ్లను అంగీకరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉండాలనీ, ఎటూ తేలని భేటీలకి తమను పిలవడం వల్ల లాభం లేదని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. దిల్లీ వీధుల్లోకి వచ్చిన యువత మోదీ సర్కారుకు సమస్యలు పెంచుతుందా?