దీపావళి వరకు యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు: NPCI ప్రకటన
పండుగలను దృష్టిలో ఉంచుకుని యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలును వాయిదా వేయాలని.. దీన్ని దీపావళి తర్వాత అమలుచేయాలని యూపీఐ, సేవల స్టీరింగ్ కమిటీ మంగళవారం నిర్ణయించింది.
ఎండీఆర్ అమలు తేదీని ప్రత్యేకంగా ప్రకటిస్తామని కమిటీ తెలిపింది.
వినియోగదారులకు యూపీఐ సేవలను పూర్తిగా ఉచితంగా కొనసాగిస్తూనే, వ్యాపార లావాదేవీలకు సవరించిన యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. ఈ విధానం 2026 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.