ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం.. అర్జెంటీనాపై సౌదీ అరేబియా విజయం

ఫిఫా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న అర్జెంటీనా జట్టును 53వ స్థానంలో ఉన్న సౌదీ అరేబియా జట్టు ఓడించి, సంచలన విజయం నమోదు చేసింది

లైవ్ కవరేజీ

  1. సింహాచలం గిరి ప్రదక్షిణ, ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో...

  2. అనుమానాస్పద స్థితిలో 14 ఏనుగులు మృతి, విషప్రయోగం జరిగిందా?

  3. జపాన్ భూకంపం: షాపింగ్ మాల్‌లో పేలుడు, కూలిన వంతెన, ఎంతటి విధ్వంసం జరిగిందంటే...

  4. 'సినిమాలో సీన్ కోసం షూట్ చేస్తుంటే హెలికాప్టర్ అగ్నిపర్వతం బిలంలో కూలిపోయింది.. కింద లావా, పైన తుపాను..'

  5. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ: ఎన్టీఏలో సంస్కరణలకు రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులు ఏమయ్యాయి?

  6. వరదలో కొట్టుకుపోతున్న కారులోంచి అమాంతం దూకేశారు

  7. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపుపై ఐటీ శాఖ ఏమంది?

    నరేంద్ర మోదీ, వీడియో తొలగింపు, మెటా

    ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన ఒక పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ (మెటా) భారతదేశంలో కొద్దిసేపు తొలగించింది. ఈ వ్యవహారాన్ని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ 'తీవ్ర ఆందోళనకరమైన విషయం' అని వ్యాఖ్యానించారు.

    "ప్రధాని అధికారిక హ్యాండిల్ నుంచి ధ్రువీకరించిన కంటెంట్‌ను తొలగించడం తీవ్రమైన విషయం. ఇలా జరిగి ఉండకూడదు" అని ఏఎన్ఐ వార్తాసంస్థతో కృష్ణన్ అన్నారు.

    ఈ విషయంలో మెటా సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పడం మంచి పరిణామమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

    అయినప్పటికీ, "మెటా దీనికి సాంకేతిక లోపాన్ని కారణంగా చూపిస్తోంది, కానీ ఈ వివరణ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై వారి నుంచి మరిన్ని వివరాలు కోరాం. అసలు ఇలాంటి పరిస్థితి ఎలా తలెత్తిందో అర్థం చేసుకోవడానికి సాంకేతిక స్థాయిలో సమావేశం నిర్వహిస్తాం" అన్నారు.

    భారతదేశంలోని ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటోందని ఐటీ కార్యదర్శి తెలిపారు.

    "ఒకసారి ఖాతా వెరిఫై అయిన తర్వాత, అందులో పోస్ట్ చేసిన కంటెంట్ ఇలాంటి స్వల్ప సాంకేతిక లోపాలు లేదా పొరపాట్ల వల్ల తొలగించకుండా చూసుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన సంస్కరణల కోసం ఈ అంశాన్ని మేం నిరంతరం పర్యవేక్షిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

    ప్రధాని మోదీకి చెందిన ఏ పోస్ట్‌ను ఫేస్‌బుక్ తొలగించిందనే విషయమై అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే, జులై 23న పోస్ట్ చేసిన ఒక వీడియోను తొలగించారని, అందులో ప్రధాని మోదీ యువతను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారని వార్తాసంస్థ 'పీటీఐ' రిపోర్ట్ చేసింది

  8. జపాన్‌లో 7.1 తీవ్రతతో భూకంపం, విధ్వంసాన్ని చూపే 9 ఫోటోలు...

  9. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా: పేపర్ లీకేజీలను అడ్డుకునే ప్రతిపాదిత చట్టంలో ఇంకా ఏముంది?

  10. రంపచోడవరం: 'షైనింగ్ స్టార్' అవార్డు సాధిస్తానంటూ చంద్రబాబుకు మాట ఇచ్చి.. అంతలోనే మృతి, అసలేం జరిగింది?

  11. జౌహార్ యూనివర్శిటీ భవనాల కూల్చివేతపై తాత్కాలిక స్టే, విద్యార్థులు ఏమంటున్నారు?

  12. అరుణాచలం: అడుగు వెడల్పున్న ‘మోక్ష మార్గం’లో చిక్కుకుని మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు

  13. ఎన్నికల్లో పోటీ వయసు 21ఏళ్లకు తగ్గించాలా...రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు కారణమేంటి?

  14. ఒంటెలు కూడా తట్టుకోలేనంత వేడి.. చనిపోతున్న ఎడారి ఓడలు

  15. ఫ్రాన్స్‌లో ఇంకా అదుపులోకి రాని కార్చిచ్చు

    ఫ్రాన్స్, కార్చిచ్చు, యూరప్
    ఫొటో క్యాప్షన్, బోర్డో నగరానికి 15కిలోమీటర్ల దూరానికి కార్చిచ్చు వ్యాపించింది.

    ఫ్రాన్స్‌లో చెలరేగిన కార్చిచ్చు ఇప్పుడు నైరుతి నగరమైన బోర్డోకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ఎలాంటి పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బోర్డో మేయర్ థామస్ కాజెనావ్ చెప్పారు.

    "మరింత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలొస్తే, అందుకు తగ్గట్టుగా భారీ సంఖ్యలో ప్రజలకు తాత్కాలిక వసతి కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని మేయర్ థామస్ కాజెనవే అన్నారు.

    కార్చిచ్చుతో ప్రభావితమైన గిరోండ్ ప్రాంతాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ పరిశీలించారు. దేశం ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని స్థాయిలో కార్చిచ్చు ప్రభావం ఉందని ఆయన చెప్పారు.

    రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్‌లో ఇది అత్యంత ఘోరమైన కార్చిచ్చు అని మేక్రాన్ తెలిపారు.

    కార్చిచ్చు ఫ్రాన్స్‌పై తీవ్ర ప్రబావం చూపింది. నైరుతి ఫ్రాన్స్‌లో 42వేల హెక్టార్లు కాలిపోయాయి.

    గత వారం నుంచి యూరప్‌లోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి.

  16. ‘పచ్చని గడ్డి రక్తంతో తడిసి ఎర్రగా మారింది’

  17. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026: ఈశా సింగ్‌కు బంగారు పతకం.. మను భాకర్‌కు కాంస్యం

    భారత యువ షూటర్ ఈశా సింగ్, ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్
    ఫొటో క్యాప్షన్, భారత యువ షూటర్ ఈశా సింగ్

    ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026 మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత యువ షూటర్ ఈశా సింగ్ బంగారు పతకం సాధించింది. ఇదే పోటీలో, మను భాకర్ కాంస్య పతకం గెలిచింది.

    21 ఏళ్ల ఈశా సింగ్ ఫైనల్ పోరులో 40 హిట్స్ స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన జాంగ్ యుయును వెనక్కి నెట్టి ఆమె గోల్డ్ మెడల్ గెలవగా, చైనా షూటర్ 37 హిట్స్ స్కోరుతో సిల్వర్ మెడల్‌కే పరిమితమైంది.

    కాంస్య పతకం కోసం జరిగిన షూట్-ఆఫ్‌లో మను భాకర్ విజయం సాధించింది. ఆ తర్వాత ఫైనల్లో 28 స్కోరుతో ఆమె మూడో స్థానాన్ని దక్కించుకుంది.

    ఈశా సింగ్‌కు ఈ ఏడాది ఇది రెండో పెద్ద టైటిల్. అంతకుముందు మే నెలలో జరిగిన మ్యూనిచ్ వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లోనూ ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది.

    మరోవైపు, మ్యూనిచ్‌లో నిర్వహించిన అదే పోటీల్లో 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో కూడా ఆమె సిల్వర్ మెడల్ సాధించింది.

  18. నరేంద్ర మోదీ: పరాజయం లేని రాజకీయ జీవితంలో ఇప్పుడు ఎందుకు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు...

  19. జర్నలిస్టుల సమస్యలపై దిల్లీలో తెలంగాణ పాత్రికేయుల ధర్నా

    టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా
    ఫొటో క్యాప్షన్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన "ఛలో పార్లమెంట్" పిలుపులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జర్నలిస్టులు దిల్లీ వెళ్లారు.

    దేశవ్యాప్తంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణకు చెందిన జర్నలిస్టులు సోమవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు.

    తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ఇచ్చిన "ఛలో పార్లమెంట్" పిలుపులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జర్నలిస్టులు దిల్లీ వెళ్లారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ నిరసనను, దిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు మారూఫ్ రజా ప్రారంభించారు.

    ఈ సందర్భంగా మారూఫ్ రజా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జర్నలిస్టులు దిల్లీ వేదికగా ముందుండి పోరాడటాన్ని ఆయన అభినందించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు జర్నలిస్టు ప్రతినిధులు కూడా ఈ ధర్నాకు హాజరై తమ మద్దతు తెలిపారు.జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య స్పష్టం చేశారు.

  20. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తప్పించండి: తెలంగాణ హైకోర్టు, అమరేంద్ర యార్లగడ్డ, బీబీసీ ప్రతినిధి

    ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్, తెలంగాణ హైకోర్టు
    ఫొటో క్యాప్షన్, కోర్టు ధిక్కరణకు పాల్పడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ స్థానం నుంచి రిలీవ్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

    హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సోమవారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

    కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసిందని ది హిందూ రిపోర్టు చేసింది.

    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామంలో జులై 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ కూల్చివేతలు చేపట్టిన స్థలం సర్వే నం.1, 2 పరిధిలోకి వస్తాయని, అది తమ భూమిగా చెబుతూ శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్చన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, జులై 17న కూల్చివేతలు చేపట్టిన ప్రాంతంలో ప్రైవేటు స్థలాలు లేవని హైడ్రా స్పష్టం చేసింది.

    ‘‘ఇప్పటికే రెండు కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగులో ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ 17వ తేదీన హైడ్రా భారీ బలగంతో వచ్చి ప్రహారీ, ఇతర నిర్మాణాలు కూల్చివేసింది’’ అని పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.హరీశ్ కుమార్ తెలంగాణ హైకోర్టుకు తెలిపారు.

    లోతుకుంట గ్రామంలోని 40 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నాయని, 2021లోనే హైకోర్టు తీర్పు చెప్పిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు తీర్పు అమలు కాకపోవడంపై గతంలో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసినట్లుగా వివరించారు. దీనిపై జులై 27న మరోసారి తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు రావడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

    హైడ్రా కమిషనర్‌పై మొత్తం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగులో ఉన్నాయని తెలగాణ హైకోర్టు చెప్పినట్లు ది హిందూ రిపోర్టు చేసింది.

    ఈ నేపథ్యంలో పదేపదే కోర్టు ధిక్కరణకు పాల్పడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ స్థానం నుంచి రిలీవ్ చేసి ఆ స్థాయి అధికారిని వేరొకర్ని నియమించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.