మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

పాకిస్తాన్: కరాచీ పోలీసు ప్రధాన కార్యాలయం మీద దాడిలో ఇద్దరు మృతి

చాలా మంది సాయుధులు పోలీసుల మీద కాల్పులు జరిపారు. పోలీసులు, సాయుధుల మధ్య భారీ స్థాయిలో కాల్పులు జరుగుతున్నాయి. దాడికి దిగిన వారు గ్రెనేడ్లు కూడా విసురుతున్నారు.

లైవ్ కవరేజీ

  1. ఇండియా-ఆస్ట్రేలియా రెండో టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియ జట్టు

    దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమైన ఇండియా-ఆస్ట్రేలియా రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

    నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో నాగపూర్‌లో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది.

  2. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ, అరెస్టుకు అవకాశం

    పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    ఏపీపీ వార్తా సంస్థ చెప్పిన దాని ప్రకారం ఇమ్రాన్ ఖాన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు గురువారం తిరస్కరించింది.

    గతేడాది ఇస్లామాబాద్‌లోని సంగజానీ పోలీస్ స్టేషన్‌లో ఇమ్రాన్ ఖాన్‌పై ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారంటూ ఆయా సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

    ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఉగ్రవాద నిరోధక కోర్టు తిరస్కరించడంతో లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు.

    ఇమ్రాన్‌‌ఖాన్ న్యాయవ్యవస్థను అపహస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని పాకిస్తాన్ హోంమంత్రి రాణా సనావుల్లా ఖాన్ విమర్శించారు.

    ఇమ్రాన్‌ఖాన్‌ను తక్షణమే అరెస్టు చేయాల్సిందిగా కోరతానని కూడా ఆయన అన్నారు.