రవీంద్ర జడేజా: అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్

ఇండోర్‌తో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ ట్రావిస్‌ హెడ్ అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డును జడేజా సాధించాడు.

లైవ్ కవరేజీ

  1. ప్రధాని మోదీ ముందున్న 10 సవాళ్లు ఏంటి?

  2. ‘‘5 నెలల్లోనే బియ్యం బస్తా రూ.700 పెరిగింది’’ - తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

  3. ‘బౌలింగ్ వ్యూహాలే దెబ్బతీశాయి’ - శ్రేయస్ అయ్యర్

    Team India, Shreyas Iyer, West Indies, Bengaluru, Hyderabad
    ఫొటో క్యాప్షన్, “బౌలింగ్ వ్యూహాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాం” వెస్టిండీస్‌తో నాల్గో టీ20 మ్యాచ్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ వివరణ

    ఇండియా -విండీస్ మధ్యన హైదరాబాద్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. 24 పరుగుల తేడాతో వెస్టీండిస్ గెలిచింది. దీంతో ఐదు మ్యాచుల ఈ సిరీస్ 2-2తో సమమైంది. ఇక ఫలితం తేలేది ఐదో మ్యాచ్‌లోనే. ఈ మ్యాచ్ ఈనెల 17వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

    హైదరాబాద్‌లో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ బౌలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలింగ్ వ్యూహాన్ని సరిగా అమలు చేయడంలో విఫలమయ్యామని అంగీకరించాడు.

    టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. కెప్టెన్ షై హోప్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 50 బంతుల్లోనే 102 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు.

    భారత్ 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 19.3 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. టీమిండియాలో 23 బంతుల్లో 56 పరుగులు చేసిన సంజూ శామ్‌సన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత తిలక్ వర్మ 43 , నితీష్ రెడ్డి 41 పరుగులు చేశారు. కీమో పాల్ ఐదు వికెట్లు తీసుకున్నాడు.

    రన్ ఛేజ్‌లో బ్యాట్స్‌మెన్ పోరాటాన్ని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించాడు. కానీ మ్యాచ్ మధ్యలో బౌలింగ్ ప్రణాళికలను మార్చడంలో తాము విఫలమయ్యామని చెప్పాడు.

    విండీస్ బౌలర్లును శ్రేయస్ ప్రశంసించాడు. “వారు ఫీల్డ్‌ను చాలా తెలివిగా వాడుకున్నారు. ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్‌పై అదనపు బౌన్స్ కూడా లభించింది. పరిస్థితులను విండీస్ బౌలర్లు బాగా అర్థం చేసుకొన్నారు. మధ్య ఓవర్లలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు” అన్నారు.

  4. హార్ముజ్ జలసంధిలో భారతీయులున్న నౌకపై దాడి, మంటల్లో చిక్కుకున్న నౌక

  5. ఇంద్రకీలాద్రి: అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో రాష్ట్రపతికి ఘన స్వాగతం

    విజయవాడ, ఇంద్రకీలాద్రి, రాష్ట్రపతి
    ఫొటో క్యాప్షన్, ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

    విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతి ఇంద్రకీలాద్రికి చేరుకున్న సందర్భంగా ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.

    విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రపతికి వేద మంత్రోచ్ఛారణల నడుమ వేద ఆశీర్వచనం అందజేశారు.

    అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కనకదుర్గ అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి చిత్రపటాన్ని అందించి గౌరవపూర్వకంగా సత్కరించారు.

  6. భర్తను హత్య చేసి బ్లూ డ్రమ్‌లో దాచిన మహిళకు, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష

  7. జనసేనలో చేరిన వంగవీటి రాధ

    వంగవీటి రాధాకృష్ణ
    ఫొటో క్యాప్షన్, జనసేనలో చేరిన వంగవీటి రాధ

    టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి వంగవీటి రాధను పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.

    పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన వంగవీటి రాధాకృష్ణను పవన్ కల్యాణ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.

    అనంతరం వంగవీటి రాధ తన అనుచరులను పవన్ కల్యాణ్‌కు పరిచయం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు వెళ్దామని పవన్ వారితో అన్నారు.

  8. ‘‘మహిళలపై లైంగిక వేధింపులను బయటపెడుతున్నా, అందుకే నన్ను చంపాలని చూస్తున్నారు.. ’’

  9. వద్దన్నా కుప్పలు తెప్పలుగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పార్సిళ్లు, తట్టుకోలేక విదేశాలకు వెళ్లిపోయిన ఇన్‌ఫ్లూయెన్సర్

  10. జాతీయ జెండా ఎగురవేసినవారిని జైల్లో పెట్టడం పిరికితనం -రాహుల్

    రాహుల్ గాంధీ, సీజేపీ, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, దిల్లీ పోలీసులు
    ఫొటో క్యాప్షన్, సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ అరెస్టుపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

    జంతర్ మంతర్‌లో జాతీయ జెండా ఎగరేయడం నేరం కాదు, కానీ ఆ పనిచేసిన కొందరిని జైల్లో పెట్టడం పిరికితనమే అన్నారు లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ.

    సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి పంపడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్‌ ఖాతాలో స్పందించారు.

    “జంతర్ మంతర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి శాంతియుతంగా నిరసన తెలపడం నేరం కాదు. యువకులను జైల్లో వేయడం పిరికితనం” అని రాహుల్ గాంధీ విమర్శించారు.

    "విద్యార్థులు, యువతరం, జర్నలిస్టులు, ‘ఇండియా’ బ్లాక్ పార్టీల బ్యానర్లు వేర్వేరు కావచ్చు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. ఒకే విషయం గురించి నిరసనలు జరుగుతున్నాయి. పౌరులు తమ రాజ్యాంగబద్ధమైన హక్కులను కోరుతున్నారు. జంతర్ మంతర్ దేశ ప్రజలది. దాన్ని తిరిగి సాధించుకుంటాం’’ అని రాహుల్ స్పష్టం చేశారు.

    ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో విమర్శించారు.

    "త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి, భారత్ మాతాకి జై అని నినాదాలు చేసిన సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను మీరు జైలుకు పంపించారు. యువతతో పెట్టుకోవద్దు మోదీజీ, త్వరలోనే మీ నియంతృత్వానికి ముగింపు పలుకుతారు" అని సంజయ్ సింగ్ రాసుకొచ్చారు.

    మంగళవారం జంతర్ మంతర్‌లోకి అక్రమంగా చొరబడ్డారని సీజేపీ నాయకులపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

  11. పాకిస్తాన్‌: ఇమ్రాన్ ఖాన్ కంచుకోటలో ఎమర్జెన్సీ, ప్రభుత్వం తప్పు చేస్తోందంటున్న నిపుణులు

  12. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్‌కు 5 రోజుల కస్టడీ

    దిల్లీ, జంతర్ మంతర్
    ఫొటో క్యాప్షన్, సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా

    జంతర్ మంతర్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలపై సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను మందిర్ మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం వారిని 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

    అంతకు ముందు సీజేపీ నేతల అరెస్టుపై కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన న్యాయ వ్యవహారాల చీఫ్ రత్న సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    "న్యాయవాదులను కలిసేందుకు కూడా వారిని అనుమతించలేదు. తెల్లవారుజామున 3 గంటలకు ఒక ప్రైవేట్ వాహనంలో వారిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారి మనోధైర్యం ఏమాత్రం తగ్గలేదు." అని పేర్కొన్నారు.

    "అనుమతి లేకుండా ప్రవేశించడం, బాండ్ షరతులు ఉల్లంఘించడం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు సీజేపీ నేతలపై మోపారు" అని రత్న సింగ్ 'ఎక్స్'లో పోస్ట్‌ చేశారు.

  13. నీటిలో మునిగిపోయిన ఈ గ్రామానికి కోహినూరు వజ్రానికి లింకేంటి, జనం ఇంకా అక్కడ ఎందుకు తవ్వుతున్నారు?

  14. గుడ్ మార్నింగ్, బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం,

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేశ్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  15. మాజీ సీఎం మమతపై దాడికి యత్నం - పోలీసులు ఏం చెప్పారు?

    పశ్చిమ బెంగాల్,మమతా బెనర్జీ, టీఎంసీ
    ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఒక మహిళా దాడి చేసినట్లు ఆరోపణలు

    పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఒక మహిళా దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

    మమతా బెనర్జీ ఒక పూజను ప్రారంభించడానికి వెళ్తుండగా, కాళీఘాట్‌లోని ఆమె నివాసం సమీపంలో తనిష్ఠా సాహా (38) అనే మహిళ దాడి చేసినట్టు టీఎంసీకి చెందిన డోలా సేన్ ఆరోపించారు.

    టీఎంసీ కార్యకర్తలు ఆ మహిళను పోలీసులకు అప్పగించి, కాళీఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    మమతా బెనర్జీని దూషించి, కత్తితో దాడి చేయడానికి సాహా ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఆ మహిళ మద్యం మత్తులో ఉన్నట్టు కూడా ఆరోపించారు.

    మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ నేతలు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు కూడా అంగీకరించారు. కానీ మహిళ వద్ద ఎలాంటి ఆయుధం లభించలేదని తెలిపారు. ఘటనా స్థలంలో పౌర స్వచ్ఛంద కార్యకర్తలు, టీఎంసీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు వెల్లడించారు.

    అయితే మమతా బెనర్జీకి ఉన్న జెడ్-ప్లస్ భద్రతను ఉల్లంఘించారని ఆ పార్టీ ఆరోపించింది.

    దాడికి యత్నించిన మహిళ పేరును తనిష్ఠ సాహాగా టీఎంసీ పేర్కొంటే, ఆమె పేరును అనూష సాహాగా పోలీసులు తెలిపారు.

    "ఘటనా స్థలంలో ఒక మహిళను అదుపులోకి తీసుకున్నాం. ప్రాథమిక నివేదికల ప్రకారం ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని తెలుస్తోంది. ఆమె ఎందుకు ఎలా చేసిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం" అని కోల్‌కతా పోలీస్ కమిషనర్ అజయ్ నందా వెల్లడించారు.

  16. కాంగ్రెస్‌లో నేహా బోరా వంటి నాయకులు ఎందుకు రాలేకపోతున్నారు?

  17. ‘మేం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను చాలా గౌరవిస్తాం, ఆయన తన బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం’.. రాహుల్ గాంధీ

    "మేము ప్రధాన న్యాయమూర్తిని చాలా గౌరవిస్తాం, ఆయన తన బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం"- రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధి

    ఇండియా కూటమి నేతలతో తేనీటీ విందు అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు వ్యతిరేకంగా తమ నిరసన కొనసాగుతుందని రాహుల్ గాంధీ తెలిపారు.

    “భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, భారత న్యాయవ్యవస్థపై మాకు అపారమైన గౌరవం ఉంది. వారు తమ పాత్రను పోషించాల్సి ఉంది. వారు ఆ పాత్రను పోషిస్తారని ఆశిస్తున్నాం. అయితే, మేం రాజకీయాల్లో ఉన్నవాళ్లం. ఏం జరిగినా రాజకీయంగా మా ప్రతిఘటన కొనసాగుతుంది. ప్రజల నిరసన కూడా కొనసాగుతుంది. అంతిమంగా ఈ నిరసన విజయం సాధిస్తుంది” అని ఆయన అన్నారు.

    కాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

    స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌‌లో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ఎన్నికల కమిషనర్లకు సమాచారం ఇవ్వలేదని, ఈ నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొంటూ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనం నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

  18. చిన్నారుల్లో క్యాన్సర్‌.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

  19. నంబర్ ప్లేటే కదా అనుకోవద్దు.. ఇవన్నీ తెలుసుకోండి

  20. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి, ఇక్కడ సమస్యలపై బహిరంగంగా చర్చ జరుగుతుందన్న మోదీ, బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ

    ప్రధానమంత్రి మోదీ, బ్లూమ్‌బెర్గ్, దిల్లీ
    ఫొటో క్యాప్షన్, బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ

    ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి భారత్‌లో వివిధ అంశాలపై బహిరంగంగా చర్చ జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.

    మంగళవారం దిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు.

    "ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లి. ఈ దేశంలో 100కు పైగా భాషలు ఉన్నాయి. సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, పబ్లిషర్స్ ఉన్నారు. 1,000కి పైగా శాటిలైట్ టీవీ చానెళ్లు ఉన్నాయి. అంతేకాకుండా, సోషల్ మీడియా యుగంలో, దేశంలో 50 కోట్లకుపైగా యూట్యూబ్ వినియోగదారులు ఉన్నారు. 50 కోట్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. వివిధ అంశాలపై బహిరంగ చర్చలు జరుగుతాయి, వివిధ విషయాలపై చర్చిస్తారు. ఇందులో డిజిటల్ పవర్ కీలకం" అని ఆయన అన్నారు.

    భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ కార్యక్రమం అక్టోబర్ 15వ తేదీన ముగుస్తుంది.