‘ఆస్కార్ అవార్డు ప్రజెంటర్లలో నేనూ ఉన్నా’- ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించిన దీపికా పదుకొణె

డ్వేన్ జాన్సన్, మైఖేల్ జోర్డాన్, రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, గ్లెన్ క్లోజ్, ట్రాయ్ కోట్సర్, జెన్నిఫర్ కానెలీ, సామ్యూల్ జాక్సన్, మెలిసా మెకార్తీ, జో సల్దానా, డానీ యెన్, జొనాథన్ మేజర్స్ కూడా ఈ కార్యక్రమంలో ప్రజెంటర్లుగా వ్యవహరించనున్నారు

లైవ్ కవరేజీ

  1. శ్రీనివాస మంగాపురం రివ్యూ: కృష్ణ మనవడికి పాత కథ కలిసి వచ్చిందా?

  2. డెలులూ - క్లాక్డ్ ఇట్ - వాస్తెగుణహూయా: పార్లమెంటులో ఎంపీలు కూడా ఈ జెన్ జెడ్ భాష ఎందుకు మాట్లాడుతున్నారు?

  3. పిత్తాశయంలో రాళ్లు ఎలా వస్తాయి, అవి ఎంత ప్రమాదకరం?

  4. ‘గుండు చేయించుకుంటే రూ. 15 వేలు’, అజ్ఞాత వ్యక్తిని నమ్మి మోసపోయిన మహిళలు

  5. కొండవెలగాడ: నాన్న 2010లో.. కొడుకు 2026లో.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్యం, రజతం

  6. 'నన్ను వాళ్లు చంపినా చంపొచ్చు.. అయినా, బంగ్లాదేశ్ వెళ్లాలనుకుంటున్నాను' అని షేక్ హసీనా ఎందుకు అన్నారు?

  7. ఆరెస్సెస్, అమిత్ షాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ, లోక్‌సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం

  8. ఒక దేశాధ్యక్షుడి భార్య డెడ్ బాడీని పాలకులే దొంగిలించి, 16 ఏళ్ల పాటు రహస్యంగా తిప్పారు...ఏమిటా కథ?

  9. ఎముకలు బలంగా ఉండాలంటే పాలు తాగితే సరిపోతుందా? ఇంకా ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తినాలి?

  10. కామన్‌వెల్త్ గేమ్స్ అంటే ఏంటి? గ్లాస్గోలో జరుగుతున్న ఈ గేమ్స్ ఎంత ప్రత్యేకం?

  11. సింహాచలం గిరి ప్రదక్షిణ, ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో...

  12. అనుమానాస్పద స్థితిలో 14 ఏనుగులు మృతి, విషప్రయోగం జరిగిందా?

  13. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ: ఎన్టీఏలో సంస్కరణలకు రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులు ఏమయ్యాయి?

  14. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపుపై ఐటీ శాఖ ఏమంది?

    నరేంద్ర మోదీ, వీడియో తొలగింపు, మెటా

    ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన ఒక పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ (మెటా) భారతదేశంలో కొద్దిసేపు తొలగించింది. ఈ వ్యవహారాన్ని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ 'తీవ్ర ఆందోళనకరమైన విషయం' అని వ్యాఖ్యానించారు.

    "ప్రధాని అధికారిక హ్యాండిల్ నుంచి ధ్రువీకరించిన కంటెంట్‌ను తొలగించడం తీవ్రమైన విషయం. ఇలా జరిగి ఉండకూడదు" అని ఏఎన్ఐ వార్తాసంస్థతో కృష్ణన్ అన్నారు.

    ఈ విషయంలో మెటా సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పడం మంచి పరిణామమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

    అయినప్పటికీ, "మెటా దీనికి సాంకేతిక లోపాన్ని కారణంగా చూపిస్తోంది, కానీ ఈ వివరణ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై వారి నుంచి మరిన్ని వివరాలు కోరాం. అసలు ఇలాంటి పరిస్థితి ఎలా తలెత్తిందో అర్థం చేసుకోవడానికి సాంకేతిక స్థాయిలో సమావేశం నిర్వహిస్తాం" అన్నారు.

    భారతదేశంలోని ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటోందని ఐటీ కార్యదర్శి తెలిపారు.

    "ఒకసారి ఖాతా వెరిఫై అయిన తర్వాత, అందులో పోస్ట్ చేసిన కంటెంట్ ఇలాంటి స్వల్ప సాంకేతిక లోపాలు లేదా పొరపాట్ల వల్ల తొలగించకుండా చూసుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన సంస్కరణల కోసం ఈ అంశాన్ని మేం నిరంతరం పర్యవేక్షిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

    ప్రధాని మోదీకి చెందిన ఏ పోస్ట్‌ను ఫేస్‌బుక్ తొలగించిందనే విషయమై అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే, జులై 23న పోస్ట్ చేసిన ఒక వీడియోను తొలగించారని, అందులో ప్రధాని మోదీ యువతను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారని వార్తాసంస్థ 'పీటీఐ' రిపోర్ట్ చేసింది

  15. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా: పేపర్ లీకేజీలను అడ్డుకునే ప్రతిపాదిత చట్టంలో ఇంకా ఏముంది?

  16. రంపచోడవరం: 'షైనింగ్ స్టార్' అవార్డు సాధిస్తానంటూ చంద్రబాబుకు మాట ఇచ్చి.. అంతలోనే మృతి, అసలేం జరిగింది?

  17. జౌహార్ యూనివర్శిటీ భవనాల కూల్చివేతపై తాత్కాలిక స్టే, విద్యార్థులు ఏమంటున్నారు?

  18. అరుణాచలం: అడుగు వెడల్పున్న ‘మోక్ష మార్గం’లో చిక్కుకుని మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు

  19. ఎన్నికల్లో పోటీ వయసు 21ఏళ్లకు తగ్గించాలా...రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు కారణమేంటి?

  20. నెతన్యాహును అరెస్టు చేసే అధికారం నాకు లేదు: మమ్దానీ

    అమెరికా, న్యూయార్క్, ఇజ్రాయెల్, నెతన్యాహు
    ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ మేయర్

    ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాటల యుద్ధం లేదా ఆరోపణల పర్వంలో పాల్గొనడంపై తనకు ఆసక్తి లేదని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ అన్నారు.

    నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్టు చేయడానికి సంబంధించిన ప్రశ్నలకు మమ్దానీ స్పందించారు.

    అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యల గురించి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో చర్చించారా అని అడగ్గా, ట్రంప్‌తో జరిగిన తన సంభాషణను బహిరంగంగా వెల్లడించబోనని మమ్దానీ అన్నారు.

    న్యూయార్క్ ప్రజలందరికీ భద్రత కల్పించడమే తన ప్రాధాన్యత అని స్పష్టంచేశారు.

    నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై మమ్దానీ స్పందించలేదు.

    అంతకుముందు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు సెప్టెంబరు చివరిలో తాను న్యూయార్క్ వెళ్తానని నెతన్యాహు చెప్పారు.

    మమ్దానీ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని నెతన్యాహు ఆరోపించారు.

    నెతన్యాహు న్యూయార్క్‌కు వస్తే అరెస్టు చేస్తానని గతంలో జోహ్రాన్ మమ్దానీ హెచ్చరించారు.

    ఆ తర్వాత తన ప్రకటనను ఆయన ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) జారీ చేసిన అరెస్టు వారెంట్ ఆధారంగా నెతన్యాహును అరెస్టు చేయడానికి చట్టపరమైన అధికారం తనకు లేదని ఆయన అంగీకరించారు.