ఎంఎం కీరవాణి: పద్మశ్రీ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు

ఆస్కార్ అవార్డు విజేత అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బుధవారం దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి, ఇక్కడ సమస్యలపై బహిరంగంగా చర్చ జరుగుతుందన్న మోదీ, బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ

    ప్రధానమంత్రి మోదీ, బ్లూమ్‌బెర్గ్, దిల్లీ
    ఫొటో క్యాప్షన్, బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ

    ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి భారత్‌లో వివిధ అంశాలపై బహిరంగంగా చర్చ జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.

    మంగళవారం దిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు.

    "ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లి. ఈ దేశంలో 100కు పైగా భాషలు ఉన్నాయి. సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, పబ్లిషర్స్ ఉన్నారు. 1,000కి పైగా శాటిలైట్ టీవీ చానెళ్లు ఉన్నాయి. అంతేకాకుండా, సోషల్ మీడియా యుగంలో, దేశంలో 50 కోట్లకుపైగా యూట్యూబ్ వినియోగదారులు ఉన్నారు. 50 కోట్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. వివిధ అంశాలపై బహిరంగ చర్చలు జరుగుతాయి, వివిధ విషయాలపై చర్చిస్తారు. ఇందులో డిజిటల్ పవర్ కీలకం" అని ఆయన అన్నారు.

    భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ కార్యక్రమం అక్టోబర్ 15వ తేదీన ముగుస్తుంది.

  2. రాజస్థాన్: మాజీ ఎమ్మెల్యేను గ్రామ ప్రజలే కొట్టి చంపారని కేసు, క్రషర్ వివాదంలో రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేను గ్రామస్తులు కొట్టిచంపినట్టు కేసు నమోదు

    రాజస్థాన్, బయానా, బీజేపీ, కాంగ్రెస్,
    ఫొటో క్యాప్షన్, రాజస్థాన్‌లోని బయానా మాజీ ఎమ్మెల్యేను స్థానిక ప్రజలు కొట్టి చంపారని కేసు నమోదైంది.

    రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో బయానా మాజీ ఎమ్మెల్యే అత్తర్ సింగ్ భదానా ఆదివారం నాడు హత్యకు గురయ్యారు.

    "కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, సోమవారం 33 మంది వ్యక్తులపై, మరో 70 నుంచి 80 మందిపై కేసు నమోదు చేశాం" అని భరత్‌పూర్ జిల్లా ఎస్పీ రాజేశ్ మీనా బీబీసీ న్యూస్ హిందీతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు.

    "గత రెండేళ్లుగా వేయిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోండా గ్రామంలో ఉన్న క్రషర్‌కు వెళ్లే దారి విషయంలో గ్రామస్థులకు, క్రషర్ యజమానికి (మరణించిన అత్తర్ సింగ్ భదానా) మధ్య వివాదం నడుస్తోంది. ఆ క్రషర్‌ను గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది" అని రాజేశ్ మీణా తెలిపారు.

    ఈ హత్య జరిగినప్పటి నుంచి గ్రామంలోని చాలా మంది పరారీలో ఉన్నారు, చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. "పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నాం. ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను గ్రామంలో మోహరించాం" అని వేయిర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ధీరేంద్ర బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు.

    మరణించిన అత్తర్ సింగ్ భదానా ఫరీదాబాద్‌లోని పాలి గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన బయానా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో క్రషర్ వద్దకు వెళ్లారు. అప్పుడే పెద్ద సంఖ్యలో గ్రామస్థులు వచ్చి కర్రలతో అత్తర్ సింగ్‌పై దాడి చేశారని చెబుతున్నారు.

  3. బోరుబావిలో 230 అడుగుల లోతుకు వెళ్లి 5 ఏళ్ల చిన్నారిని కాపాడిన 11 ఏళ్ల అబ్బాయి

  4. రాహుల్ తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరం: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శ, ఇంకా కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోలేదు అన్న సింధియా

    రాహుల్ గాంధీపై జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు
    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీపై జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు

    దిల్లీలో రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేతలు చేపట్టిన నిరసన ప్రజాస్వామ్యానికే అవమానమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు.

    " లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచి జిల్లా పంచాయతీలు, సర్పంచుల వంటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు నిరంతరం ఎన్నికలు జరిగే దేశంలో, ఆ వ్యవస్థపైనే అనుమానాలు వ్యక్తం చేయడం లేదా మచ్చ తీసుకురావడానికి ప్రయత్నించడం కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది, కానీ ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగ వ్యవస్థలోని ప్రతి అంశాన్ని తక్కువ చేసి చూపడానికి లేదా అప్రతిష్టపాలు చేయడానికి వెనుకాడటం లేదు. అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధించి రాజ్యాంగాన్ని కాలరాసిన అదే కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తోంది. న్యాయవ్యవస్థ, ప్రధాన న్యాయమూర్తి, భారత సైన్యం, ఎన్నికల సంఘంపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన పార్టీ ఇదే. కాంగ్రెస్ పార్టీ బలహీనపరచడానికి ప్రయత్నించని రాజ్యాంగ సంస్థ అంటూ ఏదీ లేదు" అని ఆయన విమర్శించారు.

  5. బెదిరించినా, భయపెట్టినా వెనక్కి తగ్గబోము: రాహుల్ గాంధీ, సోమవారం ఆందోళనలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు చెప్పిన రాహుల్

    సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించిన "ఇండియా" బ్లాక్ నేతలు
    ఫొటో క్యాప్షన్, సోమవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ఇతర నాయకులు

    రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా సాగుతున్నారని రాహుల్ అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు చెప్పిన రాహుల్, మొన్న యువకులపై దాడి చేసిన వారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

    ప్రధాన మంత్రి మాదిరిగానే వారికి కూడా నిలబడి పోరాడే ధైర్యం లేదన్నారు. కేవలం అధికారం, బలాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే పోరాడుతున్నారని విమర్శించారు./

    అందరూ కలిసి ఒక జట్టుగా పని చేస్తున్నారని, జరుగుతున్నవి వేర్వేరు నిరసనలు కావని, ఇదొక ఉద్యమమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని హరించేవారికి, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేవారికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నిలబడతారని, ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గబోరని పేర్కొన్నారు. భారత ప్రజలు భయపడబోరని ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. కొట్టవచ్చు, బెదిరించవచ్చు, భయపెట్టేందుకు ప్రయత్నించవచ్చు అయినా తగ్గబోమని స్పష్టం చేశారు.

  6. నేడు చంద్రబాబుతో విజయ్ సమావేశం-నదీ జలాలపై చర్చలు, నదుల అనుసంధానంపై నేడు ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రుల భేటీ

    నదీ జలాల పంపిణీ, అనుసంధానంపై నేడు ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రుల భేటీ
    ఫొటో క్యాప్షన్, నేడు చంద్రబాబుతో విజయ్ సమావేశం

    మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2.30 గం.లకు విజయ్ తన క్యాంప్ ఆఫీస్ నుంచి బయల్దేరుతారు. సుమారు 4 గంటల సమయానికి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4.10 గంటలకు విజయవాడ కనక దుర్గ ఆలయాన్ని సందర్శిస్తారు. దర్శనం తర్వాత 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు.

    గోదావరి-కావేరీ నదుల అనుసంధానం, కృష్ణా జలాల విడుదలపై చంద్రబాబుతో చర్చిస్తారు. అనంతరం ఇద్దరూ కలిసి విజయవాడలో జరుగుతున్న ఉత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో విజయవాడ నుంచి తిరిగి తమిళనాడుకు బయల్దేరి వెళ్తారు విజయ్.

  7. అందరినీ వద్దని బెదిరించిన ట్రంప్.. తాను మాత్రం రష్యా నుంచి డీజిల్ కొనే ఒప్పందం ఎందుకు చేసుకున్నారు?

  8. ‘రిగ్గింగ్‌కు పాల్పడి ఎలక్షన్లు గెలిచినవారు ఇప్పుడు ఎన్నికల అక్రమాలంటూ మాట్లాడుతున్నారు’: అనురాగ్ ఠాకుర్

    అనురాగ్ ఠాకుర్
    ఫొటో క్యాప్షన్, అనురాగ్ ఠాకుర్

    రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి నేతల మార్చ్ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

    రాహుల్ అరాచకానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

    “రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అజెండా చాలా స్పష్టంగా ఉంది. అధికారం దక్కకపోతే సమాజంలో అరాచకానికి పాల్పడాలన్నట్లుగా ఉంది. అయితే, కోర్టుల ఎదుట తమ భావాలను వ్యక్తపరిచే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది” అని అనురాగ్ ఠాకుర్ అన్నారు.

    “రాహుల్ గాంధీకి సైతం తన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంది. అయితే రాహుల్, కాంగ్రెస్ తమని తాము చట్టానికి, రాజ్యాంగ వ్యవస్థలకు మించినవారిగా భావిస్తున్నారు” అని అనురాగ్ ఆరోపించారు.

    రాహుల్ గాంధీ, కాంగ్రెస్... రాజ్యాంగాన్ని విచ్ఛన్నం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

    “రిగ్గింగ్‌కు పాల్పడి ఎన్నికల్లో గెలిచినవారు ఇప్పుడు ఎన్నికల అక్రమాలపై మాట్లాడుతున్నారు” అని అనురాగ్ విమర్శించారు.

  9. సీజేపీ నిరసన ప్రదర్శనల రిపోర్టింగ్‌లో జర్నలిస్టులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?

  10. బీజేపీ వ్యతిరేక ఓట్లనే తొలగిస్తున్నారు: రేవంత్ రెడ్డి

    కాంగ్రెస్ తెలంగాణ, రేవంత్ రెడ్డి
    ఫొటో క్యాప్షన్, సోమవారం జరగనున్న ర్యాలీ కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అమలుచేసిన రాష్ట్రాలలోనే ఆ పార్టీ గెలిచిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

    సోమవారం జరగనున్న కాంగ్రెస్ పాదయాత్ర కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    "ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నది ఎవరంటే..దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మైనార్టీలు, యువత. బీజేపీని ఓడించాలనుకున్న ప్రజల ఓటు హక్కును తొలగించడానికి కుట్ర చేశారు. జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కమిషన్ సభ్యులు చెప్పారు. తప్పులు జరుగుతున్నాయని తెలిసినపుడు, ఆ అధికారిని తొలగించడానికి మోదీకి అభ్యంతరం ఏమిటి?, ఆయనకు అండగా ఎందుకు నిలబడుతున్నారు" అని రేవంత్ రెడ్డి అన్నారు.

  11. ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి

    ఒమన్, భారత నౌకలపై డ్రోన్ దాడి
    ఫొటో క్యాప్షన్, ఇద్దరు భారతీయులు గల్లంతైనట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు (ప్రతీకాత్మక చిత్రం).

    ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై ఆదివారం డ్రోన్‌ దాడి జరిగింది. నౌకలో ఉన్న 11 మంది భారతీయ నావికుల్లో తొమ్మిది మందిని రక్షించగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఇద్దరు నావికులు కనిపించకుండా పోయిన విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు.

    "అక్టోబర్ 11న సోహార్ యాంకరేజ్ వద్ద భారతీయ ట్యాంకర్ ఎం.టి. పెట్రో డాల్ఫిన్‌పై డ్రోన్ దాడి జరిగింది. ట్యాంకర్‌పై 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. తొమ్మిది మందిని రక్షించారు, ఇద్దరు గల్లంతయ్యారు" అన్నారు.

    స్థానిక తీర రక్షక దళం గాలింపు, సహాయక చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు.

    గల్లంతైన వారిని గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సహాయక చర్యలకు పూర్తి మద్దతు అందించేందుకు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని సర్బానంద సోనోవాల్‌ పేర్కొన్నారు.

  12. సీజేపీ: బాండ్‌పై సంతకం చేస్తే నిరసనలకు దూరంగా ఉంచగలరా? చట్టం ఏం చెబుతోంది?

  13. మియన్మార్‌లో పెరుగుతున్న బలవంతపు సైనిక నియామకాలు..

  14. విపక్ష ఎంపీలతో భేటీకి సీజేఐ సూర్యకాంత్ నిరాకరణ

    సీజేపీ, ప్రతిపక్షాలు
    ఫొటో క్యాప్షన్, ప్రతిపక్ష పార్టీల ఎంపీలను కలవకపోవడానికి సీజేఐ కొన్ని కారణాలు చెప్పారు (ఫైల్ ఫోటో).

    విపక్ష పార్టీల ఎంపీలతో సమావేశమయ్యేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ నిరాకరించారు. వారిని కలవలేకపోవడానికి కొన్ని కారణాలను సీజేఐ వివరించినప్పటికీ, లేఖ గోప్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని బహిర్గతం చేసేందుకు నిరాకరించారు.

    “విపక్ష నేతల లేఖ నాకు నిన్న అందింది. దానికి నిన్న రాత్రే సమాధానం ఇచ్చాను. కొన్ని కారణాలను వివరిస్తూ వారిని కలవలేనని తెలియజేశాను” అని సీజేఐ సూర్యకాంత్ సోమవారం మీడియాతో చెప్పారు.

    ‘వన్ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌’పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సుప్రీంకోర్టు పర్యటన రద్దు కావడంపై కూడా సీజేఐని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ.. “ఆ విషయంలో కోర్టులో విరుద్ధ ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అందుకే, మేం దీనిపై చర్చించాం. ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలకైనా దూరంగా ఉండాలని నా సీనియర్ న్యాయ సహచరులు, నేను ఒకే అభిప్రాయానికి వచ్చాం” అని తెలిపారు.

    సీజేఐను కలిసేందుకు సమయం కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి లేఖ రాసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం తెలిపారు.

  15. యువత ఆగ్రహం ఎవరి మీద? ఎన్నికల సంఘంపైనా, మోదీ పైనా?

  16. నేహా బోరా గురించి దర్శకుడు దేవా కట్టా ట్వీట్

    దేవా కట్టా, నేహా బోరా
    ఫొటో క్యాప్షన్, దేవా కట్టా

    అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా గురించి టాలీవుడ్ దర్శకుడు దేవా కట్టా 'ఎక్స్' వేదికగా స్పందించారు.

    "ఆమెతో మీరు ఏకీభవించవచ్చు, లేకపోవచ్చు... ఆమె పోరాట స్ఫూర్తితో మీరు మమేకం కావచ్చు, కాకపోవచ్చు... కానీ, మన రాజకీయాలు, రాజకీయ నాయకుల నేరపూరిత, నిరంకుశ పోకడలు సాధారణ విషయంగా మారిపోతుండటంపట్ల ఆమె వ్యక్తం చేస్తున్న ఆక్రోశం, ఆగ్రహాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే... అప్పుడు నిజమైన 'యాంటీ-నేషనల్’ మీరే!!" అంటూ ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

  17. సీజేపీ ఆందోళనలు: పోలీసులు విమానంలోకి వచ్చి అరెస్టు చేయవచ్చా?

  18. దిల్లీలో నిరసనకారులపై దాడులు, హిందుత్వ సంఘాల ప్రస్తావన ఎందుకు వస్తోంది?

  19. రష్యా-యుక్రెయిన్ మధ్య 'ఎనర్జీ సీజ్ ఫైర్' కుదిరిందన్న డోనల్డ్ ట్రంప్

    రష్యా, యుక్రెయిన్, డోనల్డ్ ట్రంప్
    ఫొటో క్యాప్షన్, రష్యా - యుక్రెయిన్ మధ్య ఎనర్జీ సీజ్ ఫైర్ కుదిరిందని డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.

    రష్యా యుక్రెయిన్‌ల మధ్య “ఇంధన వనరులపై దాడుల విరమణకు అంగీకారం కుదిరిందని ఇది తక్షణమే అమలులోకి వస్తుందని” అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ తెలిపారు.

    దీనిపై రష్యా స్పందించలేదు.

    ట్రంప్ ప్రకటన తనకు “కొత్త వార్త” అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ అన్నట్లు అమెరికా వార్తా వెబ్‌సైట్ ఆక్సియోస్ తెలిపింది.

    అంతకుముందు రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులను “తక్షణమే ఆపాలి” అని అధ్యక్షుడు ట్రంప్ యుక్రెయిన్‌ను హెచ్చరించారు. ట్రంప్- జెలియన్‌స్కీ మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది.

    “రష్యా మా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఆపివేస్తే, మేం రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేయడం ఆపేస్తాం” అని జెలియన్‌స్కీ ఆదివారం చెప్పారు.

  20. ‘స్మైలింగ్ డిప్రెషన్’: మీ చిరునవ్వు వెనుక డిప్రెషన్ కూడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి