ఎంఎం కీరవాణి: పద్మశ్రీ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు

ఆస్కార్ అవార్డు విజేత అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బుధవారం దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. అర్నబ్ తుపాను తీవ్రతను చూపే 11 ఫోటోలు

  2. ’24 గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ, తెలంగాణ సాయం కోరాం ’ బీబీసీతో ఏపీ విద్యుత్‌శాఖా మంత్రి గొట్టిపాటి

    ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌శాఖ మంత్రి  గొట్టిపాటి రవి కుమార్
    ఫొటో క్యాప్షన్, వర్షాలు తగ్గిన 24 గంటల్లోనే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్

    అర్నబ్ తుపాను ప్రభావం తగ్గిన 24 గంటల్లోనే అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని ఏపీ విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బీబీసీకి ఫోన్ ద్వారా తెలిపారు.

    తుపాను ప్రభావం ప్రస్తుతానికి ఏపీసీపీడీసీఎల్‌పై ఎక్కువ ప్రభావం చూపుతున్నందున తెలంగాణ సాయం కోరినట్టు మంత్రి తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన సామాగ్రి, మానవ వనరులు అందించాలని తెలంగాణ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో మాట్లాడామన్నారు. అవసరమైతే ఆ శాఖ మంత్రితో కూడా చర్చిస్తామని గొట్టిపాటి పేర్కొన్నారు.

    ఇలాంటి సమయంలో పొరుగుల రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని ముందుకు సాగడం తమ విధానంలో భాగమని మంత్రి తెలిపారు. గతంలో తమిళనాడు సహాయం తీసుకున్నామని, ఇప్పుడు తెలంగాణ హెల్ప్ కోరామని వివరించారు.

    ముందు జాగ్రత్తగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు 15000లకుపైగా విద్యుత్ స్తంభాలు, ఇతర సామాగ్రిని తరలించామని మంత్రి తెలిపారు. తుపాను ప్రభావం శ్రీకాకుళం జిల్లా మొదలు కొని, కృష్ణా జిల్లా వరకు ఉంటుందన్నారు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గకపోవడంతో పనులకు ఆటంకం కలుగుతోందని చెప్పారు. అయినా సరే విశాఖలో విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని, ఇప్పుడు అక్కడి సిబ్బందిని, సామాగ్రిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని అన్నారు.

    దాదాపు నాలుగు వందల వరకు ఫీడర్స్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు మంత్రి వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగి సరఫరాకు అంతరాయం ఏర్పడితే మరికొన్ని చోట్ల ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులే సప్లై నిలిపివేశారని పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖ పట్టిన వెంటనే గంటల వ్యవధిలోనే పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని, అంత వరకు ప్రజలు విద్యుత్ తీగలు పట్టుకోవడం, స్తంభాలను తాకడం చేయవద్దని సూచించారు.

  3. ‘మధ్యాహ్నానికి గాలుల వేగం తగ్గే అవకాశం’ : ఏపీ వాతావరణ శాఖ

    అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరందాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు.
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరందాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు.

    అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరం దాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు. ఏఎన్ఐతో మాట్లాడిన ఆమె తుపాను తీరం దాటే సమయంలో 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.

    "ప్రస్తుతం ఈ తుపాను తీవ్రతను గమనిస్తే, కోనసీమ, కాకినాడ పరిసర ప్రాంతాలతోపాటు ఇతర తీరప్రాంత జిల్లాల్లో గాలి వేగం గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం తుపాను దాదాపు ఒకే చోట నిలిచి ఉంది. ఒకటి రెండు గంటల్లో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఈ తుపాను తీరాన్ని దాటుతుందని అంచనా. ఆ తర్వాత దీని తీవ్రత తగ్గి, 'తీవ్ర తుపాను'గా మారుతుంది. మధ్యాహ్నానికి ఇది మరింత బలహీనపడి కేవలం 'తుపాను'గా మారే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో ఇది 'అత్యంత తీవ్ర తుపాను' స్థితిలో ఉంటుంది. కొన్ని గంటల తర్వాత గాలి వేగం గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. మధ్యాహ్నానికి గాలి వేగం మరింత తగ్గి, గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లకు చేరుకుంటుందని అంచనా" అని నాగరత్నం తెలిపారు.

  4. అర్నబ్ తుపాను: ఇవాళ, రేపు, ఎల్లుండి పలు రైళ్లు రద్దు

    అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే

    అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే దీనికి సంబంధించిన తాజా వివరాలతో ఒక ప్రకటన విడుదల చేసింది.

    దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం ఇవాళ రేపు రద్దు అయిన రైళ్ల వివరాలు ఇవే

    ఇవాళ రద్దు అయిన రైళ్లు (28 అక్టోబర్)

    • 12727 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 12739 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 17206 కాకినాడ పోర్టు- సాయినగర్ షిర్డీ
    • 12737 కాకినాడ పోర్టు – లింగంపల్లి
    • 20707 సికింద్రాబాద్- విశాఖపట్నం
    • 20708 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 20833 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 12787 నర్సాపురం- నాగర్‌సోల్
    • 17255 నర్సాపురం- లింగంపల్లి
    • 20834 సికింద్రాబాద్- విశాఖపట్నం

    రేపు రద్దు అయిన రైళ్లు(29 అక్టోబర్)

    • 12703 హౌరా- సికింద్రాబాద్ ట్రైన్
    • 17015 భువనేశ్వర్ – సికింద్రాబాద్
    • 22881 పుణె- భువనేశ్వర్
    • 17205 సాయినగర్ షిర్డీ- కాకినాడ పోర్ట్

    శుక్రవారం రద్దు అయిన రైళ్లు(30 అక్టోబర్)

    • 20809 సంబల్‌పూర్- హెచ్ఎస్ నాందేడ్
    • రీ షెడ్యూల్ అయిన రైళ్లు(బయల్దేరాల్సిన సమయానికి కంటే మూడు గంటలు ఆలస్యంగా నడుస్తాయి)
    • 12805 విశాఖపట్నం- లింగంపల్లి
    • 17221 కాకినాడ పోర్టు – ఎల్టీటీ ముంబై
    • 12806 లింగంపల్లి- విశాఖపట్నం
    • 18046 చర్లపల్లి- షాలీమర్
    • 18519 విశాఖపట్నం- ముంబై ఎల్టీటీ (నిన్న బయల్దేరాల్సిన రైలు ఇవాళ ఉదయం నాలుగు గంటలకు రీ షెడ్యూల్ చేశారు)
  5. ఇజ్రాయెల్ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి, నెతన్యాహు ఏమన్నారు?

  6. అర్నబ్ విధ్వంసం: నేలకొరిగిన చెట్లు, కూలిన వేలాది విద్యుత్ స్తంభాలు

    అర్నబ్ తుపాను, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, కాకినాడ, చంద్రబాబు నాయుడు.
    ఫొటో క్యాప్షన్, కూలిన విద్యుత్ స్తంభాలు, నేలకొరిగిన చెట్లు, రెండు రోజుల పాటు తుపాను ప్రభావం, సీఎంకి వివరించిన అధికారులు

    అర్నబ్ తుపానుకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఆర్టీజీఎస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరో రెండు రోజుపాటు దీని ప్రభావం ఉంటుందని తెలిపారు.

    ఇవాళ ఉదయం 6 గంటల తర్వాత తుపాను తీరం దాటుతోందని వేకువజామున అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.

    తుపాన్ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయని, కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ నిలిపేశామన్నారు.

    పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాలని... తీవ్రత తగ్గాక విద్యుత్ పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

    చెరువులు, కాల్వలు పొంగి పొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జిల్లాల వారీగా తాము చేపడుతున్న సహయక చర్యలను కలెక్టర్లు వివరించారు.

    కోనసీమ జిల్లాలో సుమారు 6వేల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

  7. అర్నబ్: కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు - ఐఎండీ హెచ్చరిక

  8. భారత్ విడిచి వెళ్లాలంటూ ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసుపై బాంబే హైకోర్టు తాజా స్పందనేంటి?

    ముంబైలోని ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) అక్టోబర్ 14న  ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను ఇమ్రాన్ ఖాన్ జారీ చేసింది.
    ఫొటో క్యాప్షన్, నటుడు ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)

    ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.

    ఆ నోటీసులో ఇమ్రాన్ ఖాన్ అక్టోబర్ 28వ తేదీలోగా భారత్ విడిచి వెళ్లాలని పేర్కొన్నారు.

    కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ), తదుపరి విచారణ జరిగే వరకు ఇమ్రాన్ ఖాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టుకు మౌఖికంగా హామీ ఇచ్చారు.

    తదుపరి విచారణ వరకు ఈ కేసులో తదుపరి చర్యలను కూడా కోర్టు నిలిపివేసింది.

    ముంబైలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) అక్టోబర్ 14న జారీ చేసిన ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందున ఈ నోటీసు జారీ చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ పేర్కొంది.

  9. ‘నాలాంటి ఆరోగ్య సమస్య వస్తే జనం దాని గురించి మాట్లాడటానికి సిగ్గు పడతారు’

  10. చీర కట్టుకుని చెప్పులు లేకుండా పరుగెత్తిన కవితా దేవి ‘హోంగార్డ్’ కల ఎందుకు నెరవేరలేదు?

  11. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్.. ‘న్యూస్‌రూమ్‌లు మూతపడతాయి’ అని న్యాయవాది ఆందోళన

    డేటా రక్షణ చట్టంలోని కొన్ని నిబంధనలు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయంటూ 21 మీడియా సంస్థల తరఫున డీఎన్‌పీఏ పిటిషన్.. నిబంధనలతో న్యూస్‌రూమ్‌లు మూతపడతాయన్న న్యాయవాది మాధవి దివాన్.

    డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్‌పీఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మంగళవారం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం-2023లోని కొన్ని నిబంధనలను పిటిషనర్లు సవాలు చేశారు.

    డీఎన్‌పీఏలో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది హిందూ, ఇండియా టుడే, టైమ్స్ గ్రూప్, జీ, ఎన్‌డీటీవీ, నెట్‌వర్క్ 18 సహా 21 ప్రముఖ వార్తా సంస్థల డిజిటల్ విభాగాలు ఉన్నాయి. ఈ చట్టంలోని నిబంధనలు పత్రికా స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అసోసియేషన్ పేర్కొంది.

    న్యాయపరమైన అంశాలను పరిశీలించే వెబ్‌సైట్ లైవ్‌ లా ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలైన ఈ పిటిషన్‌లో డీపీడీపీ చట్టంలోని సెక్షన్లు 7, 17(2), 18, 19, 27, 29, 36, 37, 44(3)లను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు.

    అలాగే డీపీడీపీ నిబంధనలు-2025లోని రూల్స్ 16, 17, 23లను కూడా సవాలు చేశారు.

    ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం ముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది మాధవి దివాన్ ఈ వాదనలు వినిపించారు.

    “ఈ నిబంధనల వల్ల న్యూస్‌రూమ్‌లు మూతపడతాయి” అని ఆమె అన్నారు.

    “డేటాకు సంబంధించిన వ్యక్తి అనుమతి ఇస్తేనే వార్తలను ప్రచురించాల్సిన పరిస్థితి వస్తే, వార్త అనేదే అంతమైపోతుంది. వార్తలు ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి. ఈ నిబంధనల వల్ల న్యూస్‌రూమ్‌లు మూతపడతాయి. ప్రతిదానికీ అనుమతి, ఆమోదం అడగాల్సి వస్తే ఇక వార్తలు ఎలా ప్రచురించగలం?” అని మాధవి దివాన్ ప్రశ్నించారు.

  12. అర్నబ్ తుపాను ప్రభావంతో రద్దైన రైళ్లు ఇవే- దక్షిణమధ్య రైల్వే అధికారిక ప్రకటన

    అర్నబ్, విశాఖ, దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్,
    ఫొటో క్యాప్షన్, రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేసిన దక్షిణ మధ్యరైల్వే

    అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతల గుండా రాకపోకలు సాగించే రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

    పశ్చిమ- మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావం రవాణా రంగం తీవ్రంగా ఉంది. ఇప్పటికే విమానాల సర్వీసులపై ఎఫెక్ట్ పడుతుందని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలని ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు సూచించింది.

    ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే కూడా ఒక ప్రకటన చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగేంచే పలు రైళ్లను రద్దు చేసింది.

    ఇవాళ రద్దు అయిన రైళ్లు ఇవే

    • 12704 సికింద్రబాద్- హౌడా
    • 17016 సికింద్రాబాద్- భువనేశ్వర్ న్యూ
    • 12728 హైదరాబాద్- విశాఖపట్నం
    • 12862 మహబూబ్‌నగర్- విశాఖపట్నం
    • 12740 సికింద్రాబాద్- విశాఖపట్నం
    • 12776 లింగంపల్లి- కాకినాడ టౌన్
    • 17256 లింగంపల్లి- నర్సాపూర్
    • 12738 లింగంపల్లి- కాకినాడ పోర్ట్
    • 20810 హెఎస్ నాందేడ్- సంబల్‌పూర్
    • 07037 చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్

    రేపు(28/10/2026) రద్దు అయిన రైళ్లు ఇవే

    • 07038 శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి
    • నాగర్‌సోల్- నర్సాపూర్ మధ్య నడిచే 12788 ట్రైన్‌ను చర్లపల్లి నర్సాపూర్ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు.
  13. ‘అర్నబ్’ తుపానుకు ఆ పేరు ఎలా వచ్చింది? అసలు తుపానులకు పేర్లు ఎలా పెడతారు?

  14. అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

    అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

    పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన ‘అర్నబ్’ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్టు ఆంధ్రప్రదేశ్రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఫోన్ నెంబర్లను విడుదల చేసింది.

    ఈ తుపాను ప్రభావంతో విశాఖ, శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటించారు.

    అర్నబ్ తుపాన్ వేళ ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నెంబర్లను విడుదల చేశారు.

    అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నంబర్లు 112 , 1070 , 1800 425 0101 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తుపాన్ స‌మ‌స్యలకు వేగవంతమైన పరిష్కారం పొందవచ్చని ప్రఖర్ జైన్ తెలిపారు.

    • శ్రీకాకుళం- 08942240557
    • విజయనగరం- 8922236947
    • పార్వతీపురం మన్యం- 08963450347
    • అల్లూరి సీతారామరాజు- 8935293448
    • విశాఖపట్నం- 0891-2590102 / 0891-2590100
    • అనకాపల్లి- 08924-222888 / 08924-226599 / 08924-225999
    • కాకినాడ-0884-2356801 / 9849903879
    • కోనసీమ-8856293104
    • తూర్పు గోదావరి-8832944455
    • పశ్చిమ గోదావరి-08816-299181
    • ఏలూరు-18002331077 / 9494041419
    • పోలవరం-18004254225
    • తిరుపతి-0877 2236007
    • మార్కాపురం-9248702500
    • కృష్ణా-08672 252399
    • ఎన్టీఆర్- 9154970454
    • గుంటూరు- 0863-2234014
    • బాపట్ల- 08643-220226
    • ప్రకాశం- 08592 295600 / 18004250277
    • నెల్లూరు- 7995576699
  15. రైళ్ల రద్దు, విద్యాసంస్థలకు సెలవులు, నిత్యావసరాలు రెడీ చేసుకుంటున్న ప్రజలు.. అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతోందంటే

  16. ‘జైలులో అనారోగ్యం నటించారు.. సిబ్బందిపై దాడి చేసి 17 మంది పారిపోయారు’

  17. ‘జ్ఞానేశ్ కుమార్ ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు, ఫామ్-6లో ఎలాంటి మార్పులు చేయలేదు’.. సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చిన ఎలక్షన్ కమిషన్

  18. ఎల్ నినో ‘అత్యంత తీవ్రరూపం’ దాల్చబోతోందా? ఇది ఎప్పటివరకు కొనసాగొచ్చు? ‘ఇన్‌కాయిస్’ ఏం చెప్పింది?

  19. ఆంధ్రప్రదేశ్ స్థానిక పోరులో ‘నామినేషన్ల’ రగడ: ప్రజాస్వామ్యమా లేక బలప్రదర్శనా?

  20. ఆంధ్రప్రదేశ్: అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు

    హుద్‌హుద్ తుపాను సమయంలో కూలిన చెట్లు(ఫైల్ ఫోటో)
    ఫొటో క్యాప్షన్, హుద్‌హుద్ తుపాను సమయంలో కూలిన చెట్లు(ఫైల్ ఫోటో)

    ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు విడుదల చేసింది.

    బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు.

    శ్రీకాకుళం, మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, పోలవరం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీసత్యసాయి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.