మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్ రెడ్డిని 25 వరకు అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

తనను అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిలు వ్యాజ్యంపై వరుసగా రెండో రోజు మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది.

లైవ్ కవరేజీ

  1. విపక్ష ఎంపీలతో భేటీకి సీజేఐ సూర్యకాంత్ నిరాకరణ

    విపక్ష పార్టీల ఎంపీలతో సమావేశమయ్యేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ నిరాకరించారు. వారిని కలవలేకపోవడానికి కొన్ని కారణాలను సీజేఐ వివరించినప్పటికీ, లేఖ గోప్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని బహిర్గతం చేసేందుకు నిరాకరించారు.

    “విపక్ష నేతల లేఖ నాకు నిన్న అందింది. దానికి నిన్న రాత్రే సమాధానం ఇచ్చాను. కొన్ని కారణాలను వివరిస్తూ వారిని కలవలేనని తెలియజేశాను” అని సీజేఐ సూర్యకాంత్ సోమవారం మీడియాతో చెప్పారు.

    ‘వన్ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌’పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సుప్రీంకోర్టు పర్యటన రద్దు కావడంపై కూడా సీజేఐని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ.. “ఆ విషయంలో కోర్టులో విరుద్ధ ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అందుకే, మేం దీనిపై చర్చించాం. ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలకైనా దూరంగా ఉండాలని నా సీనియర్ న్యాయ సహచరులు, నేను ఒకే అభిప్రాయానికి వచ్చాం” అని తెలిపారు.

    సీజేఐను కలిసేందుకు సమయం కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి లేఖ రాసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం తెలిపారు.

  2. యువత ఆగ్రహం ఎవరి మీద? ఎన్నికల సంఘంపైనా, మోదీ పైనా?

  3. నేహా బోరా గురించి దర్శకుడు దేవా కట్టా ట్వీట్

    అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా గురించి టాలీవుడ్ దర్శకుడు దేవా కట్టా 'ఎక్స్' వేదికగా స్పందించారు.

    "ఆమెతో మీరు ఏకీభవించవచ్చు, లేకపోవచ్చు... ఆమె పోరాట స్ఫూర్తితో మీరు మమేకం కావచ్చు, కాకపోవచ్చు... కానీ, మన రాజకీయాలు, రాజకీయ నాయకుల నేరపూరిత, నిరంకుశ పోకడలు సాధారణ విషయంగా మారిపోతుండటంపట్ల ఆమె వ్యక్తం చేస్తున్న ఆక్రోశం, ఆగ్రహాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే... అప్పుడు నిజమైన 'యాంటీ-నేషనల్’ మీరే!!" అంటూ ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

  4. సీజేపీ ఆందోళనలు: పోలీసులు విమానంలోకి వచ్చి అరెస్టు చేయవచ్చా?

  5. సుప్రీంకోర్టు వరకు పాదయాత్ర : రాహుల్ గాంధీ

    సుప్రీంకోర్టుకు సోమవారం పాదయాత్రగా వెళ్లి ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రం సమర్పించనున్నట్టు విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.

    సుప్రీంకోర్టుకు చేరుకున్న తర్వాత ప్రధాన న్యాయమూర్తిని జస్టిస్ సూర్యకాంత్‌ను కలిసి దేశవ్యాప్త విజ్ఞప్తులతో కూడిన ఒక వినతిప్రతం సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.

    సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సమయం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇప్పటికే సీజేఐకి లేఖలు రాశారు.

    ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలనుకునే యువత, విపక్షాలు , పౌర సమాజం కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా తనతో కలిసి రావాలని రాహుల్ గాంధీ కోరారు.

    ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అజిత్ డోభాల్, మోహన్ భాగవత్‌ భారత ప్రజల గొంతును నొక్కలేరని రాహుల్ అన్నారు.

  6. ‘స్మైలింగ్ డిప్రెషన్’: మీ చిరునవ్వు వెనుక డిప్రెషన్ కూడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి

  7. ఎవరీ నేహా బోరా? బీజేపీకి మద్దతు ఇచ్చే కుటుంబం నుంచి వచ్చి ఉద్యమాల ముఖచిత్రంగా ఎలా మారారు?

  8. దిల్లీ నిరసనలపై ప్రత్యేక విచారణలో సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

  9. చీర ధరించి 1600 మీటర్ల పరుగు పందాన్ని 9 నిమిషాల్లో పూర్తి చేసిన కవిత..

  10. భారత టెక్ దిగ్గజాలపై అమెరికా చర్యలు: గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర ఆలస్యం తప్పదా?

  11. ‘నా కోచ్‌లో మగవాళ్లు మద్యం తాగుతున్నారు’ అంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన అస్సాం యువతి తర్వాతి రోజు శవంగా కనిపించారు..

  12. తనిఖీలు,నిర్బంధాలు,ఇంటర్‌నెట్ బంద్, ఎక్కడికక్కడ బారికేడ్లు.. దిల్లీలో ఇప్పటిదాకా ఏం జరిగింది, బీజేపీ ఏమంది?

  13. ముకేశ్ అంబానీని 'ప్రధానమంత్రి' అంటూ కామెంట్ చేసిన ఎలాన్ మస్క్, వీరి మధ్య వివాదం ఏంటి?

  14. "రైలు ఎక్కి తనిఖీలు చేశారు, పోలీసుల నిర్బంధాలు చూస్తే భయమేస్తోంది"-తెలుగు రాష్ట్రాల యువకులు ఇంకా ఏం చెప్పారు?

  15. జంతర్‌ మంతర్ నిరసన: ముందస్తు అరెస్టులు, భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు

  16. గరివిడి లక్ష్మి ఈవిడే.. ‘ఆమె పాటల క్యాసెట్ లేని ఇల్లు ఉండేది కాదు’

  17. కామ్రేడ్ కళ్యాణ్: లవ్ స్టోరీకి నక్సలిజం టచ్ ఇచ్చి కామెడీ పండించేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందా?

  18. ఎలాన్ మస్క్ విషయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా ఉన్నాయా?

  19. ఇన్ఫోసిస్‌తో సహా ఈ టెక్ కంపెనీలపై తీసుకున్న చర్యలను సమర్థించిన జేడీ వాన్స్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి కంపెనీల తొలగింపు

    గ్రీన్ కార్డ్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ఎనిమిది టెక్ కంపెనీలను తొలగించడాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించారు.

    కంపెనీలకు చౌకైన విదేశీ కార్మికుల సరఫరాకు విమర్శకులు సహాయం చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

    ఈ నిర్ణయాన్ని డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ ప్రశ్నించిన తర్వాత, వాన్స్ ' సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో విమర్శలు చేశారు. ‘సోషలిజం' అంటే పెద్ద కంపెనీలకు చౌకగా కార్మికుల సరఫరా ఎప్పటికీ ఆగకుండా ఉండేలా చూడటానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడటమే అనిపిస్తోంది."

    మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని అనే ఎనిమిది కంపెనీలను సస్పెండ్ చేయాలన్న నిర్ణయం చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదానికి ఈ ప్రకటన మరింత ఆజ్యం పోసింది.

  20. స్మిత్ మచ్చర్‌కు అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు, స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం

    ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో కో-పైలట్ దాడి చేసినప్పటికీ, ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రదానం చేయనున్నారు.

    భారత పైలట్ కోలుకున్న తర్వాత ఆయన ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం అందజేస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తెలిపారు.

    "ఈ రోజు మనం గౌరవిస్తున్న ఇజ్రాయెల్ వీరులతోపాటు, భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ కూడా త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. కెప్టెన్ మచ్చర్ అపారమైన ధైర్యం, అత్యుత్తమ వృత్తి నైపుణ్యం ఒక పెద్ద విపత్తును నివారించడంలో సహాయపడ్డాయి. ఆయన కోలుకున్న తర్వాత, ఇజ్రాయెల్ ప్రజల తరపున ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయడం నాకు గౌరవంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.

    భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఒమన్‌కు చెందిన కో-పైలట్ దాడి చేయగా, ఆయన ధైర్యంగా ఎదుర్కొని 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడారు.