ఖాతాదారుల డబ్బులెక్కడికీ పోలేదు: ఎస్బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సంబంధించిన సమాచారం డార్క్ వెబ్‌లో బయటపడినప్పటికీ వాళ్ల ఖాతాల్లోని డబ్బు, నిధులు సురక్షితంగానే ఉన్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
డార్క్ వెబ్‌లో సమాచారం బయటపడిన ఘటనపై బ్యాంక్ ‘ఎక్స్’లో ఓ ప్రకటన చేసింది. డార్క్ వెబ్‌లో డేటా కనిపించిన ఖాతాదారులందరికీ ఈమెయిల్, వాట్సాప్ ద్వారా సమాచారం తెలియజేసినట్టు పేర్కొంది.
‘‘వాళ్ల ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్, నిధులు మా వద్ద సురక్షితంగానే ఉన్నాయని మరోసారి తెలియజేస్తున్నాం’’ అని బ్యాంక్ తెలిపింది.
ఖాతాదారులు సురక్షితమైన బ్యాంకింగ్ పద్ధతులను పాటించాలని బ్యాంక్ సూచించింది. ఓటీపీ, పిన్, లేదా పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, ఈమెయిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన వేలాది మంది ఖాతాదారుల సమాచారం డార్క్ వెబ్‌లో లీక్ అయినట్టు రెండు రోజుల క్రితం వార్తలొచ్చాయి.
డార్క్ వెబ్‌లో లీక్ అయిన డేటాలో 3,897 మంది ఖాతాదారులకు సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు వివరాలు(పీఐఐ) ఉన్నట్టు బ్యాంక్ వెల్లడించింది. పీఐఐ అంటే ఒక వ్యక్తిని గుర్తించడానికి ఉపయోగపడే వ్యక్తిగత సమాచారం. ఇందులో పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ చిరునామా, ఇంటి చిరునామా ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ సీఐఎఫ్ నంబర్ వంటి వివరాలుంటాయి.