వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్ రెడ్డిని 25 వరకు అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

తనను అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిలు వ్యాజ్యంపై వరుసగా రెండో రోజు మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది.

లైవ్ కవరేజీ

  1. ‘ఎన్నికల సంఘంలో పరిణామాలపై సైబర్ ఫోరెన్సిక్ విచారణ జరపాలి’ - సుప్రీం కోర్టులో ఖమ్మం వాసి పిటిషన్

  2. కొలీగ్ తినాల్సిన కూరలో నత్తలను చంపే విషం కలిపినట్టు మహిళపై ఆరోపణలు, కేసు నమోదు..

  3. ర‌ణ‌బాలి రివ్యూ: పెళ్లయిన తర్వాత రష్మికతో తొలి చిత్రం.. విజయ్ దేవరకొండ పంట పండిందా?

  4. ఆహారం తినగానే ‘షుగర్ లెవెల్స్’ పెరగడం ప్రమాదకరమా?

  5. మేం పోటీకి భయపడం: ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ప్రకటన

    రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టార్ లింక్
    ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

    స్టార్ లింక్ వ్యవహారంలో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆ సంస్థ, తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని పేర్కొంది.

    భారతదేశంలో స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఇటీవల ఆరోపించారు.

    పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీని "ప్రధాన మంత్రి అంబానీ" అని సంబోధించిన మస్క్, భారత్‌లో స్టార్‌లింక్‌కు నిష్పాక్షికంగా పోటీపడే అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించారు.

    రిలయన్స్ ప్రకటనలో, "ప్రతి భారతీయ కంపెనీలాగే రిలయన్స్ కూడా దేశీయ విదేశీ పెట్టుబడులతో పాటు సరికొత్త ఆలోచనలకు స్వాగతం పలికే దేశంలో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ప్రజల జీవితాలను మెరుగుపరిచే పనులను ఆహ్వానిస్తుంది"

    స్టార్‌లింక్‌తో సహా ఉపగ్రహ సమాచార రంగంలో పోటీని స్వాగతిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. జియోతో సహా ప్రతి కంపెనీ భారత ప్రజలకు సేవలు అందించాలని, దేశ చట్టాలు, విధానాలను పాటించాలని ఆ ప్రకటనలో పేర్కొంది.

  6. భారత్, చైనాలను ఏకతాటిపైకి తేవాలని నేపాల్ ఎందుకు కోరుకుంటోంది?

  7. క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ: పెళ్లి చుట్టూ తిరిగిన డ్రామా మెప్పించిందా?

  8. ‘‘నేను మాట్లాడేవన్నీ నా ఫోన్ రహస్యంగా వింటోందా? అందుకే ఆ యాడ్స్ వస్తున్నాయా?’’ అని మనకు ఎందుకు అనిపిస్తుంది?

  9. టీవీకే ఎమ్మెల్యే పల్లవి: ‘‘చంటి పిల్లాడిని సభలు సమావేశాలకు తిప్పుతూ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు’’ అంటూ ఆమెపై విమర్శలేంటి?

  10. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌‌కు భయపడాలా? బహిష్టు సమస్యల నుంచి సంతానలేమి వరకు.. దీనివల్ల కలిగే పరిణామాలు ఏంటి?

  11. ఈసీఐకు సుప్రీం కోర్టు నోటీసులు

    భారత ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు
    ఫొటో క్యాప్షన్, భారత ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు

    భారత ఎన్నికల సంఘం సహా పలువురికి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసిందని ఏఐఎన్ వార్తాసంస్థ పేర్కొంది. లోక్‌సభ‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీసహా పలు ప్రతిపక్షాలు వేసిన పిటిషన్ విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

    ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీకి కోర్టు సూచించింది. ఈసీ సర్‌ను నిర్వహిస్తున్న తీరును సవాలు చేస్తూ 13 పిటిషన్లు దాఖలు కాగా వారి ఒక పిటిషనర్ వైఖరిపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

    “పిటిషన్ దాఖలు చేసిన ఒక పిటిషనర్ ప్రవర్తన గురించి వచ్చే విచారణలో అడగాలనుకుంటున్నాం” అని రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకుల పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

    లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర 'ఇండియా' బ్లాక్ నాయకులతో కలిసి, భారత ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా అక్టోబర్ 12న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్‌కు సంబంధించి భారత ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలను సవాలు చేస్తూ ఈ పిటిషన్లు వేశారు.

  12. ప్రధాని మోదీ ముందున్న 10 సవాళ్లు ఏంటి?

  13. ‘‘5 నెలల్లోనే బియ్యం బస్తా రూ.700 పెరిగింది’’ - తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

  14. ఇంద్రకీలాద్రి: అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో రాష్ట్రపతికి ఘన స్వాగతం

    విజయవాడ, ఇంద్రకీలాద్రి, రాష్ట్రపతి
    ఫొటో క్యాప్షన్, ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

    విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతి ఇంద్రకీలాద్రికి చేరుకున్న సందర్భంగా ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.

    విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రపతికి వేద మంత్రోచ్ఛారణల నడుమ వేద ఆశీర్వచనం అందజేశారు.

    అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కనకదుర్గ అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి చిత్రపటాన్ని అందించి గౌరవపూర్వకంగా సత్కరించారు.

  15. భర్తను హత్య చేసి బ్లూ డ్రమ్‌లో దాచిన మహిళకు, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష

  16. జనసేనలో చేరిన వంగవీటి రాధ

    వంగవీటి రాధాకృష్ణ
    ఫొటో క్యాప్షన్, జనసేనలో చేరిన వంగవీటి రాధ

    టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి వంగవీటి రాధను పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.

    పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన వంగవీటి రాధాకృష్ణను పవన్ కల్యాణ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.

    అనంతరం వంగవీటి రాధ తన అనుచరులను పవన్ కల్యాణ్‌కు పరిచయం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు వెళ్దామని పవన్ వారితో అన్నారు.

  17. ‘‘మహిళలపై లైంగిక వేధింపులను బయటపెడుతున్నా, అందుకే నన్ను చంపాలని చూస్తున్నారు.. ’’

  18. వద్దన్నా కుప్పలు తెప్పలుగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పార్సిళ్లు, తట్టుకోలేక విదేశాలకు వెళ్లిపోయిన ఇన్‌ఫ్లూయెన్సర్

  19. మనం మాట్లాడుకోవడం తగ్గిస్తున్నామా? దారి తెలియకపోతే అడగడం కూడా మానేశామా?

  20. నీటిలో మునిగిపోయిన ఈ గ్రామానికి కోహినూరు వజ్రానికి లింకేంటి, జనం ఇంకా అక్కడ ఎందుకు తవ్వుతున్నారు?