మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

కోవిడ్: 24 గంటల్లో 10 వేలకు పైగా కొత్త కేసులు

భారత్‌లో గత 24 గంటల్లో 10,542 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 63,562.

లైవ్ కవరేజీ

  1. పిత్తాశయంలో రాళ్లు ఎలా వస్తాయి, అవి ఎంత ప్రమాదకరం?

  2. ‘గుండు చేయించుకుంటే రూ. 15 వేలు’, అజ్ఞాత వ్యక్తిని నమ్మి మోసపోయిన మహిళలు

  3. కొండవెలగాడ: నాన్న 2010లో.. కొడుకు 2026లో.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్యం, రజతం

  4. 'నన్ను వాళ్లు చంపినా చంపొచ్చు.. అయినా, బంగ్లాదేశ్ వెళ్లాలనుకుంటున్నాను' అని షేక్ హసీనా ఎందుకు అన్నారు?

  5. ఆరెస్సెస్, అమిత్ షాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ, లోక్‌సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం

  6. ఒక దేశాధ్యక్షుడి భార్య డెడ్ బాడీని పాలకులే దొంగిలించి, 16 ఏళ్ల పాటు రహస్యంగా తిప్పారు...ఏమిటా కథ?

  7. ఎముకలు బలంగా ఉండాలంటే పాలు తాగితే సరిపోతుందా? ఇంకా ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తినాలి?

  8. సింహాచలం గిరి ప్రదక్షిణ, ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో...

  9. అనుమానాస్పద స్థితిలో 14 ఏనుగులు మృతి, విషప్రయోగం జరిగిందా?

  10. 'సినిమాలో సీన్ కోసం షూట్ చేస్తుంటే హెలికాప్టర్ అగ్నిపర్వతం బిలంలో కూలిపోయింది.. కింద లావా, పైన తుపాను..'

  11. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ: ఎన్టీఏలో సంస్కరణలకు రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులు ఏమయ్యాయి?

  12. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపుపై ఐటీ శాఖ ఏమంది?

    ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన ఒక పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ (మెటా) భారతదేశంలో కొద్దిసేపు తొలగించింది. ఈ వ్యవహారాన్ని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ 'తీవ్ర ఆందోళనకరమైన విషయం' అని వ్యాఖ్యానించారు.

    "ప్రధాని అధికారిక హ్యాండిల్ నుంచి ధ్రువీకరించిన కంటెంట్‌ను తొలగించడం తీవ్రమైన విషయం. ఇలా జరిగి ఉండకూడదు" అని ఏఎన్ఐ వార్తాసంస్థతో కృష్ణన్ అన్నారు.

    ఈ విషయంలో మెటా సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పడం మంచి పరిణామమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

    అయినప్పటికీ, "మెటా దీనికి సాంకేతిక లోపాన్ని కారణంగా చూపిస్తోంది, కానీ ఈ వివరణ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై వారి నుంచి మరిన్ని వివరాలు కోరాం. అసలు ఇలాంటి పరిస్థితి ఎలా తలెత్తిందో అర్థం చేసుకోవడానికి సాంకేతిక స్థాయిలో సమావేశం నిర్వహిస్తాం" అన్నారు.

    భారతదేశంలోని ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటోందని ఐటీ కార్యదర్శి తెలిపారు.

    "ఒకసారి ఖాతా వెరిఫై అయిన తర్వాత, అందులో పోస్ట్ చేసిన కంటెంట్ ఇలాంటి స్వల్ప సాంకేతిక లోపాలు లేదా పొరపాట్ల వల్ల తొలగించకుండా చూసుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన సంస్కరణల కోసం ఈ అంశాన్ని మేం నిరంతరం పర్యవేక్షిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

    ప్రధాని మోదీకి చెందిన ఏ పోస్ట్‌ను ఫేస్‌బుక్ తొలగించిందనే విషయమై అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే, జులై 23న పోస్ట్ చేసిన ఒక వీడియోను తొలగించారని, అందులో ప్రధాని మోదీ యువతను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారని వార్తాసంస్థ 'పీటీఐ' రిపోర్ట్ చేసింది

  13. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా: పేపర్ లీకేజీలను అడ్డుకునే ప్రతిపాదిత చట్టంలో ఇంకా ఏముంది?

  14. రంపచోడవరం: 'షైనింగ్ స్టార్' అవార్డు సాధిస్తానంటూ చంద్రబాబుకు మాట ఇచ్చి.. అంతలోనే మృతి, అసలేం జరిగింది?

  15. అరుణాచలం: అడుగు వెడల్పున్న ‘మోక్ష మార్గం’లో చిక్కుకుని మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు

  16. ఎన్నికల్లో పోటీ వయసు 21ఏళ్లకు తగ్గించాలా...రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు కారణమేంటి?

  17. నెతన్యాహును అరెస్టు చేసే అధికారం నాకు లేదు: మమ్దానీ

    ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాటల యుద్ధం లేదా ఆరోపణల పర్వంలో పాల్గొనడంపై తనకు ఆసక్తి లేదని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ అన్నారు.

    నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్టు చేయడానికి సంబంధించిన ప్రశ్నలకు మమ్దానీ స్పందించారు.

    అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యల గురించి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో చర్చించారా అని అడగ్గా, ట్రంప్‌తో జరిగిన తన సంభాషణను బహిరంగంగా వెల్లడించబోనని మమ్దానీ అన్నారు.

    న్యూయార్క్ ప్రజలందరికీ భద్రత కల్పించడమే తన ప్రాధాన్యత అని స్పష్టంచేశారు.

    నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై మమ్దానీ స్పందించలేదు.

    అంతకుముందు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు సెప్టెంబరు చివరిలో తాను న్యూయార్క్ వెళ్తానని నెతన్యాహు చెప్పారు.

    మమ్దానీ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని నెతన్యాహు ఆరోపించారు.

    నెతన్యాహు న్యూయార్క్‌కు వస్తే అరెస్టు చేస్తానని గతంలో జోహ్రాన్ మమ్దానీ హెచ్చరించారు.

    ఆ తర్వాత తన ప్రకటనను ఆయన ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) జారీ చేసిన అరెస్టు వారెంట్ ఆధారంగా నెతన్యాహును అరెస్టు చేయడానికి చట్టపరమైన అధికారం తనకు లేదని ఆయన అంగీకరించారు.

  18. ‘పచ్చని గడ్డి రక్తంతో తడిసి ఎర్రగా మారింది’

  19. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026: ఈశా సింగ్‌కు బంగారు పతకం.. మను భాకర్‌కు కాంస్యం

    ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026 మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత యువ షూటర్ ఈశా సింగ్ బంగారు పతకం సాధించింది. ఇదే పోటీలో, మను భాకర్ కాంస్య పతకం గెలిచింది.

    21 ఏళ్ల ఈశా సింగ్ ఫైనల్ పోరులో 40 హిట్స్ స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన జాంగ్ యుయును వెనక్కి నెట్టి ఆమె గోల్డ్ మెడల్ గెలవగా, చైనా షూటర్ 37 హిట్స్ స్కోరుతో సిల్వర్ మెడల్‌కే పరిమితమైంది.

    కాంస్య పతకం కోసం జరిగిన షూట్-ఆఫ్‌లో మను భాకర్ విజయం సాధించింది. ఆ తర్వాత ఫైనల్లో 28 స్కోరుతో ఆమె మూడో స్థానాన్ని దక్కించుకుంది.

    ఈశా సింగ్‌కు ఈ ఏడాది ఇది రెండో పెద్ద టైటిల్. అంతకుముందు మే నెలలో జరిగిన మ్యూనిచ్ వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లోనూ ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది.

    మరోవైపు, మ్యూనిచ్‌లో నిర్వహించిన అదే పోటీల్లో 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో కూడా ఆమె సిల్వర్ మెడల్ సాధించింది.

  20. నరేంద్ర మోదీ: పరాజయం లేని రాజకీయ జీవితంలో ఇప్పుడు ఎందుకు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు...