కోవిడ్: 24 గంటల్లో 10 వేలకు పైగా కొత్త కేసులు

భారత్‌లో గత 24 గంటల్లో 10,542 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 63,562.

లైవ్ కవరేజీ

  1. నకిలీ పోస్టల్ స్టాంపులతో అమెరికాకు రూ.100 కోట్ల నష్టం కలిగించిన పాక్ పౌరుడి అరెస్ట్

    అమెరికా, పాకిస్తాన్,
    ఫొటో క్యాప్షన్, నకిలీ పోస్టేజ్ స్టాంపులతో అమెరికాకు వంద కోట్లకుపైగా నష్టం కలిగించిన పాకిస్తానీ అరెస్టు

    నకిలీ పోస్టల్ స్టాంపులను విక్రయించే వ్యాపారాన్ని నడుపుతున్నాడనే ఆరోపణలపై పాకిస్తాన్ సైబర్ క్రైమ్ ఏజెన్సీ ఒక వ్యక్తిని అరెస్టు చేసింది.

    ఈయన చేసిన మోసం కారణంగానే యూఎస్ పోస్టల్ సర్వీస్‌కు 126 మిలియన్ (119 కోట్ల రూపాయలు) డాలర్ల నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి.

    నిందితుడిని 33 ఏళ్ల ఫహీమ్ అక్రమ్‌గా గుర్తించారు. ఈయన ఒక నకిలీ వెబ్‌సైట్ ద్వారా యూఎస్ వినియోగదారులకు నకిలీ పోస్టల్ స్టాంపులు, షిప్పింగ్ లేబుల్‌లను విక్రయించినట్లు అభియోగాలు ఉన్నాయి.

    యూఎస్ ప్రాసిక్యూటర్ల ప్రకారం, ఫహీమ్ అక్రమ్ 2023 నుంచి లేబుల్స్‌బ్యాంక్‌ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. ఈ వెబ్‌సైట్ ద్వారా నకిలీ యూఎస్ పోస్టల్ స్టాంపులు, షిప్పింగ్ లేబుళ్లను విక్రయించారనే ఆరోపణలతో అధికారులు ఆ వెబ్‌సైట్‌ను మూసివేశారు.

    ఫ్లోరిడాలోని ఒక ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ గత నెలలో అక్రమ్‌పై అభియోగాలు మోపింది. ఆయన గత కొన్నేళ్లుగా వేల మంది అమెరికన్ వినియోగదారులకు 5 మిలియన్లకు పైగా నకిలీ షిప్పింగ్ లేబుళ్లను విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    ఈ నెల ప్రారంభంలో, యూఎస్ పోస్టల్ సర్వీస్ ఆయనను పట్టుకోవడానికి తగిన సమాచారం ఇచ్చినవారికి 100,000 డాలర్ల వరకు బహుమతిని ప్రకటించింది.

  2. రోటీ, రైస్ తింటూ బరువు తగ్గొచ్చా? 9 ప్రశ్నలు - జవాబులు

  3. కావ్యా మారన్, అనిరుధ్ పెళ్లితో బంధువులు కానున్న రజినీ,స్టాలిన్

  4. ‘పిల్లలను ఉపవాసంతో చనిపోయేలా చేస్తే వారు జీసస్‌ను కలుసుకుంటారు’ 191హత్యలలో దోషిగా తేలిన మత గురువు ఇలా ఎందుకు బోధించారు?

  5. గరివిడి లక్ష్మి: ‘మూణ్నాలుగు జిల్లాలకు తెలిసిన నన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు’

  6. పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ

  7. కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?

  8. హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

  9. ఫ్రాన్స్‌లోని పరిస్థితికి వలసదారులే కారణమని ట్రంప్ ఆరోపణ

    ఫ్రాన్స్, డోనల్డ్ ట్రంప్, అమెరికా, పారిస్, యూరప్,
    ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లోని పరిస్థితికి వలసదారులే కారణమని ట్రంప్ ఆరోపించారు

    ఫ్రాన్స్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలకు వలసదారులు, జిహాదీలు, కమ్యూనిస్టులే కారణమని ట్రంప్ ఆరోపించారు.

    కాన్సాస్‌లోని విచిటాలో జరిగిన ఒక ప్రచార సభలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న ఘర్షణల గురించి ప్రస్తావించారు. రాబోయే మధ్యంతర ఎన్నికల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అమెరికాలో అలాంటి పరిస్థితులు రాకుండా నివారించాలని మద్దతుదారులకు సూచించారు.

    ఐరోపా వామపక్ష నాయకులు "పాశ్చాత్య విలువలను దెబ్బతీసే" వలస విధానాలను అనుసరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఐరోపాలో జరిగిన తప్పులు జరగొద్దని అన్నారు.

    "పశ్చిమ దేశాలతో ఏమాత్రం సంబంధం లేని మూడో ప్రపంచ దేశాల వలసదారులను ప్రపంచ వామపక్షం ఐరోపాకు తీసుకువస్తోంది. వారు ఫ్రాన్స్‌లోని ప్రతి విషయాన్నీ ద్వేషిస్తారు. వారు ఆ దేశాన్ని నాశనం చేస్తున్నారు. మన దేశానికి అలా జరగనివ్వం," అని ట్రంప్ అన్నారు.

    విలేకరులతో మాట్లాడుతూ, దేశ సరిహద్దులను మూసివేయడం గురించి తాను ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఇప్పటికే హెచ్చరించినట్లు ట్రంప్ చెప్పారు.

    "ఫ్రాన్స్‌లో జరుగుతున్నది పాఠశాలల వల్లనో లేదా మరే ఇతర కారణం వల్లనో కాదు. అది వలసల వల్లే," అని ట్రంప్ అన్నారు.

  10. ‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్

  11. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. ఫోటోల్లో

  12. ‘‘నన్ను బలవంతంగా టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లాడు, నేను కళ్లు మూసుకుని అక్కడ లేననుకున్నా’’

  13. దసరా: మీకు పాలపిట్ట కనిపించిందా?

  14. అమిలీయా ఇయర్‌హార్ట్: 90 ఏళ్ల కిందట ప్రపంచాన్ని చుట్టిరావాలని బయల్దేరిన ఈ మహిళ ఎలా అదృశ్యమయ్యారు, ఈ మిస్టరీని ఛేదిస్తారా?

  15. కొలంబస్ కన్నా ముందే అమెరికాను చేరుకున్న వైకింగ్స్ ఎవరు?

  16. పారా ఆసియా క్రీడలు: ఒకే ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం

    పారా ఆసియా క్రీడలు
    ఫొటో క్యాప్షన్, అవని లేఖరా(ఎడమ), మోనా అగర్వాల్(కుడి)(ఫైల్ ఫోటో)

    జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత షూటర్ మోనా అగర్వాల్ స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని లేఖరా రజత పతకం సాధించింది.

    ఆర్2 మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లోని ఎస్‌హెచ్1 విభాగంలో ఇద్దరూ ఈ ఘనతను సాధించారు. ఫైనల్‌లో ఇద్దరు షూటర్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

    మోనా 250.0 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని 249.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

    దక్షిణ కొరియాకు చెందిన యున్రి లీ 227.9 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

    ఈ ఘనత సాధించినందుకు ఇద్దరు భారత షూటర్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అభినందించింది.

  17. సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన

  18. అద్దెకు గర్బా పార్టనర్: ‘నుదుటిపై ముద్దు’, ‘ఆఫ్టర్ పార్టీ’ ఆఫర్ల వెనుక అసలు నిజమేంటి?

  19. క్యాన్సర్, ఎర్లీ మెనోపాజ్‌ను ఎదుర్కొని.. 23 ఏళ్ల నాటి అండాశయ కణజాలంతో ఈమె ఎలా తల్లయ్యారు

  20. ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు భారీ ఊరట, అమెరికాలో వ్యతిరేకత పెరగనుందా?