మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

ఆర్డర్ ఆఫ్ ది నైల్: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం

ప్రధాని నరేంద్రమోదీని 'ఆర్డర్ ఆఫ్ ది నైల్' గౌరవంతో ఈజిప్ట్ ప్రభుత్వం సత్కరించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్-సిసి ఆదివారం మోదీకి ఈ గౌరవాన్ని అందించారు.

లైవ్ కవరేజీ

  1. ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి

    ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై ఆదివారం డ్రోన్‌ దాడి జరిగింది. నౌకలో ఉన్న 11 మంది భారతీయ నావికుల్లో తొమ్మిది మందిని రక్షించగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఇద్దరు నావికులు కనిపించకుండా పోయిన విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు.

    "అక్టోబర్ 11న సోహార్ యాంకరేజ్ వద్ద భారతీయ ట్యాంకర్ ఎం.టి. పెట్రో డాల్ఫిన్‌పై డ్రోన్ దాడి జరిగింది. ట్యాంకర్‌పై 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. తొమ్మిది మందిని రక్షించారు, ఇద్దరు గల్లంతయ్యారు" అన్నారు.

    స్థానిక తీర రక్షక దళం గాలింపు, సహాయక చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు.

    గల్లంతైన వారిని గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సహాయక చర్యలకు పూర్తి మద్దతు అందించేందుకు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని సర్బానంద సోనోవాల్‌ పేర్కొన్నారు.

  2. సీజేపీ: బాండ్‌పై సంతకం చేస్తే నిరసనలకు దూరంగా ఉంచగలరా? చట్టం ఏం చెబుతోంది?

  3. యువత ఆగ్రహం ఎవరి మీద? ఎన్నికల సంఘంపైనా, మోదీ పైనా?

  4. సీజేపీ ఆందోళనలు: పోలీసులు విమానంలోకి వచ్చి అరెస్టు చేయవచ్చా?

  5. జిబూటి తీరంలో పడవ మునగడంతో పిల్లలు సహా 139 మంది మృతి, హఫ్సా ఖలీల్

    జిబూటి తీరంలో పడవ మునిగిపోవడంతో కనీసం 139 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారని, అందులో 15 మంది పిల్లలున్నారని ఐక్యరాజ్యసమితి వలసల విభాగం తెలిపింది. పలువురి ఆచూకీ ఇంకా తెలియడం లేదని తెలిపింది.

    305 మందితో జిబూటి నుంచి యెమెన్‌కు బయల్దేరిన పడవ.. గురువారం రాత్రి ఓబాక్ ఓడరేవు పట్టణం సమీపంలో తిరగబడింది.

    ఈ ఘటనలో సుమారు 82 మందిని రక్షించినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) తెలిపింది.

    ఆఫ్రికా ఖండంలోని హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతం నుంచి ఏటా వేలమంది వలసదారులు ప్రాణాలకు తెగించి ఈ ప్రయాణం సాగిస్తున్నారనీ, భద్రత, ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు చేరుకోవాలనే ఆశతో ప్రమాదకరమైన మార్గంలో వెళ్తున్నారని ఐఓఎం తెలిపింది.

  6. రష్యా-యుక్రెయిన్ మధ్య 'ఎనర్జీ సీజ్ ఫైర్' కుదిరిందన్న డోనల్డ్ ట్రంప్

    రష్యా యుక్రెయిన్‌ల మధ్య “ఇంధన వనరులపై దాడుల విరమణకు అంగీకారం కుదిరిందని ఇది తక్షణమే అమలులోకి వస్తుందని” అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ తెలిపారు.

    దీనిపై రష్యా స్పందించలేదు.

    ట్రంప్ ప్రకటన తనకు “కొత్త వార్త” అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ అన్నట్లు అమెరికా వార్తా వెబ్‌సైట్ ఆక్సియోస్ తెలిపింది.

    అంతకుముందు రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులను “తక్షణమే ఆపాలి” అని అధ్యక్షుడు ట్రంప్ యుక్రెయిన్‌ను హెచ్చరించారు. ట్రంప్- జెలియన్‌స్కీ మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది.

    “రష్యా మా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఆపివేస్తే, మేం రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేయడం ఆపేస్తాం” అని జెలియన్‌స్కీ ఆదివారం చెప్పారు.

  7. ‘స్మైలింగ్ డిప్రెషన్’: మీ చిరునవ్వు వెనుక డిప్రెషన్ కూడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి

  8. ‘పోలీసులు మా ఫోన్లు లాక్కున్నారు, న్యాయవాదితో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు’

    పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు నేరుగా ప్రధాని మోదీపై విమర్శల దాడి చేశారు.

    అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ రత్నా సింగ్ విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు.

    నాయనమ్మ మృతి చెందడంతో అభిజీత్ దీప్కే స్వగ్రామానికి వెళ్లడంతో ఆయన ఈ సమావేశంలో పాల్గొనలేదు.

    “భారతదేశ చరిత్రలోనే నరేంద్ర మోదీ అత్యంత పిరికి ప్రధానమంత్రి” అని అశుతోష్ రాంకా అన్నారు.

    “ఇదే ప్రభుత్వం నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను విమానంలో ఎక్కించి దేశం నుంచి పంపించివేసింది. మమ్మల్ని మాత్రం విమానం నుంచి దించేసింది” అని సౌరవ్ దాస్ ఆరోపించారు.

    “మమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు పోలీసులు మాకెలాంటి నోటీసులు ఇవ్వలేదు. మాఫియా డాన్లలా వచ్చి మమ్మల్ని తీసుకుపోయారు. మా ఫోన్లను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లను మహిళా పోలీసులు తీసుకున్నారు. కానీ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు” అని ఆయన అన్నారు.

    “నన్ను ఆర్‌కే పురంలో అశుతోష్‌ను బల్లభ్‌గఢ్‌కు, అభిజీత్‌ను కూడా ఎక్కడికో తీసుకువెళ్లారు. మమ్మల్ని తీసుకువెళ్తున్నప్పుడు, మా న్యాయవాదితో మాట్లాడటం మా ప్రాథమిక హక్కు అని అడిగా. కానీ నిర్బంధంలో ఉన్నప్పుడు ఎలాంటి హక్కులు ఉండవని మాకు చెప్పారు. నిరసనకారులతో దిల్లీ పోలీసులు ఇంకెంత క్రూరంగా వ్యవహరించారో” అని సౌరవ్ దాస్ అన్నారు.

    “మా ఫోన్‌ను ఏం చేశారోనని మాకు ఆందోళనగా ఉంది. మా ఫోన్‌ను క్లోన్ చేశారని అనుమానంగా ఉంది. రేపు మా ఫోన్‌ను క్లోన్ చేసి సాక్ష్యంగా సమర్పిస్తారు” అని సౌరవ్‌దాస్ అన్నారు.

  9. చీర ధరించి 1600 మీటర్ల పరుగు పందాన్ని 9 నిమిషాల్లో పూర్తి చేసిన కవిత..

  10. భారత టెక్ దిగ్గజాలపై అమెరికా చర్యలు: గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర ఆలస్యం తప్పదా?

  11. ‘‘నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడం మీ దేశానికే మచ్చ’’ అంటూ నార్వేపై ట్రంప్ విమర్శలు

  12. యుక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయమొచ్చింది: డోనల్డ్ ట్రంప్

    యుక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు. రష్యాతో అమెరికా కుదుర్చుకున్న డీజిల్ ఒప్పందంపై జెలియెన్ స్కీ చేసిన విమర్శలకు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    రష్యా నుంచి లక్షల టన్నుల డీజిల్‌ను అమెరికాకు సరఫరా చేసేందుకు కొత్త ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల.. యుక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు మాస్కోకు డబ్బు అందించినట్లవుతుందని జెలియెన్ స్కీ హెచ్చరించారు. ఈ ఒప్పందాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇచ్చే బహుమతిగా జెలియెన్‌ స్కీ అభివర్ణించారు.

    శనివారం వైట్‌హౌస్‌ వెలుపల విలేఖరులతో ట్రంప్‌ మాట్లాడారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులకు జెలియెన్ స్కీ అనుమతులు ఇస్తూ.. ప్రపంచానికి సమస్యలు సృష్టిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు.

    ‘‘ఆయన ఈ పని కచ్చితంగా ఆపేయాలి’’ అన్నారు. ఒప్పందం కుదుర్చుకోగల కొత్త నాయకుడిని యుక్రెయిన్‌ ఎన్నుకోవాలని సూచించారు.

  13. ‘నా కోచ్‌లో మగవాళ్లు మద్యం తాగుతున్నారు’ అంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన అస్సాం యువతి తర్వాతి రోజు శవంగా కనిపించారు..

  14. తనిఖీలు,నిర్బంధాలు,ఇంటర్‌నెట్ బంద్, ఎక్కడికక్కడ బారికేడ్లు.. దిల్లీలో ఇప్పటిదాకా ఏం జరిగింది, బీజేపీ ఏమంది?

  15. రష్యా నుంచి చమురు దిగుమతికి ట్రంప్ నిర్ణయం: అమెరికన్ల ఆశ్చర్యం, జెలియెన్‌స్కీ ఆగ్రహం

  16. ముకేశ్ అంబానీని 'ప్రధానమంత్రి' అంటూ కామెంట్ చేసిన ఎలాన్ మస్క్, వీరి మధ్య వివాదం ఏంటి?

  17. "రైలు ఎక్కి తనిఖీలు చేశారు, పోలీసుల నిర్బంధాలు చూస్తే భయమేస్తోంది"-తెలుగు రాష్ట్రాల యువకులు ఇంకా ఏం చెప్పారు?

  18. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన నేపథ్యంలో 250కి పైగా రైళ్లు రద్దు

    కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన ప్రదర్శన నేపథ్యంలో, న్యూదిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే 250కి పైగా రైళ్లను అధికారులు రద్దు చేశారు.

    పీటీఐ వార్తాసంస్థ కథనం ప్రకారం, అక్టోబర్ 9న మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయా ప్రారంభ స్టేషన్ల నుంచి బయలుదేరాల్సిన ప్యాసింజర్ రైళ్లను రైల్వేబోర్డు ఆదేశాల మేరకు రద్దు చేశారు.

    అంతేకాకుండా, అక్టోబర్ 10న ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూదిల్లీ లేదా హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు చేరుకోవాల్సిన రైళ్లు కూడా రద్దయ్యాయి.

    రైల్వే మాజీ అధికారులు, ప్రయాణికుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ చర్యను తప్పుబట్టాయి.

    "ఇంత భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడం ఆందోళనకారుల ముందు తలవంచడమే" అని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు (ఇంజనీరింగ్) సుబోధ్ జైన్ పేర్కొన్నారు.

    దేశంలోని ఏదైనా ప్రాంతంలో నిరసనలు లేదా ఉద్యమాల కారణంగా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దు కావడం తన అనుభవంలో లేదని ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా పీటీఐతో అన్నారు.

    అకస్మాత్తుగా రైళ్లు రద్దు కావడం వల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

    మరోవైపు, దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) కూడా 57 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మూసివేసింది.

  19. రష్యాతో డీజిల్ దిగుమతికి అమెరికా ఒప్పందం

    ఇంధన ధరలను తగ్గించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్న అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా నుంచి అమెరికాకు డీజిల్‌ దిగుమతి చేసుకునే ఒప్పందాన్ని ప్రకటించారు.

    అమెరికా, ప్రపంచ మార్కెట్ల కోసం 3 లక్షల టన్నుల డీజిల్‌ను తక్షణమే సరఫరా చేయడానికి పుతిన్ అంగీకరించారని, నవంబర్‌లో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత మరో మిలియన్ టన్నులు ఇస్తారని ట్రంప్ తెలిపారు.

    శుక్రవారం నాటి ఈ నిర్ణయంపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పుతిన్‌కు బహుమతి అని, అంతం కావాల్సిన యుద్ధాన్ని పొడిగించే పెట్టుబడిగా అభివర్ణించారు.

    ఈ ఒప్పందంలో భాగంగా రష్యన్ డీజిల్ ఎగుమతులపై ఆంక్షలను అమెరికా ట్రెజరీ ఏప్రిల్ 7 వరకు ఎత్తివేసింది. అయితే, అమెరికా బ్యాంకుల్లో ఉన్న మిగతా రష్యన్ ఆస్తులపై ఆంక్షలు అలాగే ఉన్నాయి.

    యుక్రెయిన్ దాడుల కారణంగా దెబ్బతిన్న రిఫైనరీల పనితీరును బట్టి, త్వరలోనే మరో 3 మిలియన్ టన్నుల రష్యన్ డీజిల్ సరఫరా అవుతుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

  20. జంతర్‌ మంతర్ నిరసన: ముందస్తు అరెస్టులు, భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు