ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన కేసు: బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ చెప్పిన సీఎం శివరాజ్ సింగ్

బాధితుడిని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌కు పిలిపించి మాట్లాడారు. అనంతరం ఆయన కాళ్లు కడగడంతో పాటు పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆ యువకుడికి ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. ‘సర్’ వివాదం: హైదరాబాద్‌లో ‘చలో లోక్ భవన్’ నిర్వహించిన ‘ఇండియా’ కూటమి

    చలో లోక్ భవన్
    ఫొటో క్యాప్షన్, ఇండియా కూటమి నిరసన

    ఓట్ల సవరణ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఇచ్చిన ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో లోక్‌భవన్ (రాజ్‌భవన్)’ ర్యాలీ జరిగింది.

    నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

    అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.

    ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కును కాపాడాలనే ప్రధాన డిమాండ్‌తో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. ఈ ర్యాలీలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, తెలంగాణ జన సమితి (టీజేఎస్), ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

    ర్యాలీలో పాల్గొన్న మంత్రులందర్నీ అరెస్టు చేసి పంజాగుట్ట స్టేషన్‌కు , ఇతర నాయకులను వేర్వేరు పోలీసుస్టేషన్లకు తరలించారు.

  2. దిల్లీ: సీమాపురీలో కూలిపోయిన భవనం, నలుగురు మృతి, మరో ఎనిమిది మందికి గాయాలు

    దిల్లీ, బీజేపీ, ఆప్
    ఫొటో క్యాప్షన్, కూలిపోయిన భవనం

    దిల్లీలోని సీమాపురీ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో నలుగురు మరణించారు.

    ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారని డీఎం అజయ్ కుమార్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో చెప్పారు.

    "ఇప్పటివరకు ముగ్గురు మహిళల మృతదేహాలను వెలికితీశారు. దీంతో పాటు చిన్నారిదిగా భావిస్తున్న మరో మృతదేహం కూడా లభ్యమైంది" అని ఆయన తెలిపారు.

    "శిధిలాలు రోడ్డుపై పడిపోవడంతో పాదాచారులెవరైనా వాటి కింద చిక్కుకున్నారో లేదో కచ్చితంగా చెప్పలేం. చాలా జాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నాం. దాదాపు 75 శాతం పనులు పూర్తయ్యాయి, ఇంకా 25 శాతం మిగిలి ఉన్నాయి. సహాయకార్యక్రమాలు పూర్తి కావడానికి ఇంకో నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టొచ్చు" అని ఆయన అన్నారు.

    ‘‘ఇది ఐదారంతస్థుల భవనం. దానిని 25 గజాల స్థలంలో నిర్మితమైంది. ఒకటి లేదా రెండేళ్ల క్రితం కట్టిందని అంచనా వేశారు. ఆ భవనంలో ఒక ముస్లిం కుటుంబం నివసిస్తోంది’’ అని ఆప్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.

  3. నిన్న అద్వానీని కలిసిన ప్రధాని మోదీ

    నరేంద్రమోదీ, ఎల్‌కే అద్వానీ, బీజేపీ
    ఫొటో క్యాప్షన్, అద్వానీ, మోదీ

    ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీతో సమావేశమయ్యారు.

    ఈ సమావేశం నిన్న(అక్టోబర్ 7) జరిగిన్టటు మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

    ‘‘అద్వానీని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నా. దశాబ్దాలుగా అద్వానీ అందించిన ప్రజాసేవ, దేశానికి ఆయన చేసిన కృషి చెరగని ముద్రవేశాయి. దేశ ప్రగతిని బలోపేతం చేయడంలో అద్వానీది కీలకపాత్ర’’ అని మోదీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

  4. జెన్ జెడ్, విపక్షాల ఉద్యమం: భారత్‌లో ప్రతిపక్షాల భాష ఎంత వేగంగా మారిందంటే..

  5. మోనాల్.. అందమైన ఈ పక్షి తన కూత స్థాయిని ఎందుకు పెంచింది?

  6. పంతానికి పోయి 40 ఏళ్ల నుంచి అన్నం తినడమే మానేసిన అవ్వ... మరి ఆమె భోజనం ఏమిటి?

  7. మన్యం పల్లెల్లో మెడికల్ డ్రోన్స్ సేవలు..

  8. సోదరుడి ఆటతో స్ఫూర్తి, అత్యధిక సెంచరీల కీర్తి... భారత మహిళా క్రికెట్ కొత్త కెప్టెన్ స్మృతి మంధాన జీవితంలో కొన్ని ఆసక్తికర సంగతులు

  9. ‘‘స్నైపర్ల దాడులు, బాంబు మోతల మధ్య రోజూ స్కూలుకు వెళతా.. ’’

  10. హైదరాబాద్: కాంగ్రెస్ బీఎల్ఏ ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించారంటూ బీజేపీ బీఎల్ఏ పై కేసు నమోదు

  11. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ‘అన్నీ గుర్తుంచుకుంటాం’ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్ట్

  12. రష్యాలో ప్లేగుపై పరిశోధన చేస్తున్న మహిళ మృతి.. 14వ శతాబ్దంలో యూరప్‌లో సగం జనాభా చనిపోవడానికి కారణమైన ఈ వ్యాధి ఎలా సోకుతుంది?

  13. కెప్టెన్సీ నుంచి వైదొలగిన హర్మన్‌ప్రీత్ కౌర్: ఫాస్ట్ బౌలర్‌ నుంచి కెప్టెన్‌ వరకు ఆమె ప్రయాణం ఎలా సాగిందంటే..

  14. సర్ వివాదం: ఫామ్ 7 దరఖాస్తులు ఎందుకు, దీనిపై వివాదం ఏమిటి, ఫామ్ 6పై సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

  15. భారత్ ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా ఉన్నా స్టాక్ మార్కెట్లు ఎందుకు పతనమవుతున్నాయి - 5 కారణాలు

  16. ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రయాణిస్తుంటే కొంతమందికి వికారం కలగడానికి కారణమేంటి?

  17. చైనా దిగుమతులపై భారత్ ప్రమాదకర స్థాయిలో ఎందుకు ఆధారపడుతోంది?

  18. ‘ఆడుకుంటున్న కొడుకు అనుకోకుండా తండ్రి వృషణాలపై తన్నాడు, వారం రోజులైనా నొప్పి తగ్గలేదు.. చివరకు అదే ఆయన ప్రాణాలనే కాపాడింది’

  19. మదనపల్లి సభలో ఏం జరిగింది? నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని మధ్యలో ఎందుకు ఆపేశారు.. సభకు వచ్చినవారిని చంద్రబాబు ఎందుకు మందలించారు?

  20. చుట్టమల్లే సాంగ్ డీప్‌ఫేక్ వీడియో వెనుక ఎవరున్నారు? నిందితులు దొరికారా