క్రికెట్ వరల్డ్ కప్-2023 తాజ్ మహల్ దగ్గర... ఏంటీ కథ?

తాజ్ మహల్ వద్ద ఉంచిన ప్రపంచకప్ చిత్రాన్ని ఐసీసీ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ప్రపంచకప్‌ పోటీలకు ఇంకా 50 రోజులే ఉంది అంటూ దానికి వ్యాఖ్యను జోడించింది.

లైవ్ కవరేజీ

  1. 'భారత్ అంగుళం భూమిని కూడా కోల్పోలేదు, ప్రధాని మోదీ చెప్పింది నిజమే" – బీబీసీ ఇంటర్య్వూలో ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే

  2. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఎందుకు జరిగింది, అక్కడ దశాబ్దాలపాటు పని చేసినవారు ఏం చెబుతున్నారు?

  3. విశాఖ స్టీల్ ప్లాంట్‌: మరుగుతున్న ఉక్కు చిమ్మడంతో 8 మంది మృతి

  4. మానవ్ సుతార్: ఆడిన తొలి టెస్ట్‌, మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్.. ‘రాజస్థాన్ జడేజా’ అని ఎందుకంటున్నారు?

  5. మాంసం తినే పరాన్నజీవి స్క్రూవర్మ్‌ వ్యాప్తి అరికట్టేందుకు ఈగలు, కుక్కలను ఉపయోగిస్తున్న అమెరికా

  6. ఫిలిప్పీన్స్‌: 32 మంది మృతికి కారణమైన భూకంప తీవ్రత... 9 ఫోటోలలో

  7. ‘నువ్వు అబద్ధాలకోరువైనా అయ్యుండాలి, లేదా నీది మూర్ఖత్వమైనా అయ్యుండాలి’- అంటూ లేచి వెళ్లిపోయిన ట్రంప్

  8. బ్రహ్మోస్: ఈ మిసైల్‌ను కొనడానికి వియత్నాం, ఇండోనేషియా ఎందుకు ఆసక్తి చూపుతున్నాయి?

  9. ‘దేవాన్ష్‌’ పుష్కర ఘాట్‌పై జరుగుతున్న చర్చ ఏంటి, అసలేం జరిగింది?

  10. రజత్ పాటీదార్‌కు టీమిండియాలో చోటు దొరకలేదు ఎందుకు? భారత టీ 20 క్రికెట్ జట్టు ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎందుకు?

  11. తృణమూల్‌లో తిరుగుబాటు: పార్టీ ముక్కలు కాకుండా మమత వ్యూహాలేంటి?

  12. దిల్లీ అగ్ని ప్రమాదం: వైద్యం కోసం విదేశీయులు ఇండియాకు ఎందుకు వస్తున్నారు?

  13. భారత ‘రాకెట్ ఉమన్’ ధరించిన చీర అమెరికా మ్యూజియంలో...

  14. యూనిఫాంలో ఉన్న ఆర్మీ కెప్టెన్ సైనిక హెలికాప్టర్ ముందు కాబోయే భార్యకు ప్రపోజ్ చేయడంపై సోషల్ మీడియాలో ఏం చర్చ జరుగుతోంది?

  15. చమురు సంస్థలు లాభాలు ప్రకటిస్తున్నా, పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

  16. ఆసియా కప్ హాకీ: భారత అండర్-18 పురుషుల జట్టుకు స్వర్ణం.. మహిళల జట్టుకు కాంస్యం

    భారత పురుషుల హాకీ జట్టు, స్వర్ణ పతకం, మహిళల హాకీ జట్టు కాంస్యం

    జపాన్‌లో జరిగిన అండర్-18 ఆసియా కప్ 2026లో భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకం సాధించగా, మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

    మహిళల జట్టు దక్షిణ కొరియాను 3-0 తేడాతో ఓడించగా, పురుషుల జట్టు 4-1తో జపాన్‌పై విజయం సాధించింది.

    భారత జట్ల ప్రదర్శనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

    "కాంస్య పతకం గెలుచుకున్న భారత మహిళా అండర్-18 హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. టోర్నమెంట్ అంతటా జట్టు అద్భుతమైన ప్రతిభను కనబరిచింది" అని మోదీ ఎక్స్ పోస్టులో తెలిపారు.

    అలాగే స్వర్ణ పతకం సాధించిన పురుషుల జట్టుకు కూడా ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు.

  17. మీమ్‌ టు మూవ్‌మెంట్: జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు.. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏం జరిగింది?

  18. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద రికార్డు

    నార్వే చెస్, ప్రజ్ఞానంద
    ఫొటో క్యాప్షన్, ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించాడు. (ఫైల్ ఫోటో)

    భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్ సాధించాడు.

    టోర్నమెంట్ చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కైమర్‌పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. మొత్తం 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో నార్వే చెస్ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

    ఈ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించాడు.

    చివరి నాలుగు రోజుల్లో అలీరెజా ఫిరౌజ్జా, కార్ల్‌సన్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్‌లపై విజయాలు సాధించి టైటిల్ కైవసం చేసుకున్నాడు.

    ప్రజ్ఞానందకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తదితరులు అభినందనలు తెలిపారు.

  19. భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ: సూర్యకుమార్‌కు దక్కని చోటు, కెప్టెన్‌గా శ్రేయస్

    వైభవ్ సూర్యవంశీ
    ఫొటో క్యాప్షన్, వైభవ్ సూర్యవంశీ

    15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఏషియన్ గేమ్స్ 2026 కోసం శనివారం బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఈ యువ ఆటగాడికి తొలిసారిగా చోటు దక్కింది.

    సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియా సమావేశంలో ఈ జట్లను ప్రకటించారు. ఈ ఎంపికలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించగా, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అలాగే, తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. మరోవైపు హార్దిక్ పాండ్యాకూ జట్టులో చోటు దక్కలేదు.

    ఏషియన్ గేమ్స్ కోసం భారత జట్టు: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ.

    ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల కోసం భారత జట్టు: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ సిరాజ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.

  20. కాక్రోచ్ జనతా పార్టీ: అభిజిత్ దీప్కే, మోదీ ప్రభుత్వం గురించి ఏమన్నారు?

    దిల్లీలో ఆందోళనలు చేస్తోన్న కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు

    కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, దిల్లీలోని జంతర్ మంతర్‌లో జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్నారు.

    ఆయన అమెరికా నుంచి శనివారం ఉదయం దిల్లీ చేరుకున్నారు.

    ‘సోషల్ మీడియాలో ఓ పేజీ నడపడం వల్ల ఏం వస్తుందని గత ఐదారు రోజులుగా చాలామంది నన్ను అడిగారు.

    అలా అడిగిన వారికి ఈ కెమెరా తిప్పి చూపించండి. ఎంతమంది కాక్రోచ్‌లు ఈరోజు తమ ఇళ్ల నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొనడానికి వచ్చారో వారికి చూపించండి.

    గత 10-12 ఏళ్లుగా వీళ్లంతా మనల్ని హిందూ-ముస్లిం రాజకీయాలకే పరిమితం చేశారు. ఆ రాజకీయాల వల్ల ఎవరికి ఏం ప్రయోజనం జరిగింది? హిందూ-ముస్లిం రాజకీయాలతో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా?’ అని వేదికపై నుంచి అభిజిత్ దీప్కే అన్నారు.

    కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ చేస్తోంది. ఈ ఆందోళన ప్రదర్శనలను ప్రేమపూర్వకంగా, శాంతియుతంగా చేపట్టాలంటూ మద్దతుదారులకు సీజేపీ పిలుపునిచ్చింది.

    సీజేపీ