ఆసియా కప్: విరాట్ కోహ్లీ, రాహుల్‌ల సెంచరీల మోత... పాకిస్తాన్ టార్గెట్ 357

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్, ఇండియా మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత్ 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ చివరి బంతిని సిక్సర్ కొట్టి భారత బ్యాటింగ్‌కు చక్కని క్లోజింగ్ ఇచ్చాడు. విరాట్‌తో పాటు రాహుల్ కూడా సెంచరీ చేశాడు.

లైవ్ కవరేజీ

  1. జీఎస్‌ఎల్‌వీ ద్వారా కక్ష్యలోకి చేరిన ఎన్‌వీఎస్‌-03 నావిగేషన్ ఉపగ్రహం

    శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్
    ఫొటో క్యాప్షన్, తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్‌వీఎస్-03 మూడో ఉపగ్రహం.

    శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.

    శుక్రవారం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.ఈ రాకెట్ ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.

    జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18/ఎన్‌వీఎస్-03 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలోనిసతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తలుఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

    తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్‌వీఎస్-03 మూడో ఉపగ్రహం. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్ ద్వారా అందించే నావిగేషన్ సేవలను నిరంతరాయంగా కొనసాగించేందుకు దీన్ని రూపొందించారు.

    దేశానికి స్థానం, నావిగేషన్, సమయ నిర్ధరణ సేవలను స్వతంత్రంగా పొందే అవకాశం కల్పించే వ్యూహాత్మక ఉపగ్రహం ఇదని ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ అన్నారు.

    నావిగేషన్ ఉపగ్రహాలను సాధారణ ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం కూడా వినియోగిస్తారని ఆయన తెలిపారు. రైళ్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడంతో పాటు వాహనాలు, సముద్ర నౌకల కదలికలను పర్యవేక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. 'వన్ నేషన్ వన్ టైమ్' ప్రాజెక్టులోనూ ఈ ఉపగ్రహం కీలక భాగమని వివరించారు.

    'గగన్' వ్యవస్థతో కలిసి నావిగేషన్ సేవలు అందించడం ద్వారా ప్రపంచ నావిగేషన్ వ్యవస్థలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోందని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.

  2. జస్టిస్ కౌల్ రాసిన పుస్తకంలో మాజీ సీజేఐ చంద్రచూడ్‌ గురించి ఏముంది?

  3. మనీషా భన్వాలా: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళ రికార్డు

    మనీషా భన్వాలా
    ఫొటో క్యాప్షన్, ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా మనీషా నిలిచారు.

    ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 59 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా మనీషా భన్వాలా నిలిచారు.

    కజకిస్థాన్ రాజధాని అస్తానాలో శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో అమెరికాకు చెందిన అబిగైల్ నెట్‌ను 8-6 తేడాతో ఓడించారు.

    ఒలింపిక్స్‌లో లేని ఈ వెయిట్ కేటగిరీలో మనీషా తన పోరును ప్రీ క్వార్టర్ ఫైనల్‌తో ప్రారంభించారు. ఈ దశలో కెనడాకు చెందిన లారెన్స్ బ్యూత్రెగార్డ్‌ను విక్టరీ బై ఫాల్ పద్ధతిలో ఓడించారు.

    క్వార్టర్ ఫైనల్‌లో మంగోలియాకు చెందిన బొలోర్తుయా ఖురెల్ఖూను 6-0 తేడాతో ఓడించారు. ఆ తర్వాత సెమీఫైనల్‌లో స్థానిక రెజ్లర్ అల్టిన్ షగయేవాను సాంకేతిక ఆధిక్యంతో ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో హరియాణాకు చెందిన మనీషా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో స్వర్ణ పతకం సాధించారు.

    ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా మనీషా నిలిచారు. అంతకుముందు 2010లో మాస్కోలో జరిగిన పోటీల్లో సుశీల్ కుమార్ 66 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించారు.

    ప్రస్తుత చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో పతకాలు సాధించిన నాలుగో భారత రెజ్లర్ మనీషా. ఆమె కంటే ముందు నీలం సిరోహి (50 కిలోలు), కాజల్ ధోచక్ (76 కిలోలు) రజత పతకాలు సాధించగా, తనూ శర్మ (72 కిలోలు) కాంస్య పతకం గెలుచుకున్నారు.

  4. ‘వన్డేల్లో వారికి చోటు ఇవ్వకపోవడం అన్యాయమే’: యువరాజ్ సింగ్

    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డేల్లో రెగ్యులర్‌గా చోటు కల్పించాలంటున్నారు యువరాజ్ సింగ్
    ఫొటో క్యాప్షన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డేల్లో రెగ్యులర్‌గా చోటు కల్పించాలంటున్నారు యువరాజ్ సింగ్

    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డే జట్టులో రెగ్యులర్ స్థానం ఇవ్వకపోవడం వారి ప్రతిభకు అన్యాయం చేయడమేనని భారత మాజీ ఆల్-రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

    ముంబయిలో ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ , "నిజం చెప్పాలంటే, అభిషేక్ శర్మ వన్డేలు ఆడటం చూడాలని కోరుకుంటున్నా. ఇషాన్ కిషన్, అభిషేక్ వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లను 50 ఓవర్ల క్రికెట్‌లో ఎంపిక చేయకపోతే, ఎక్కడో ఒకచోట మనం వారి ప్రతిభకు న్యాయం చేయడం లేదని అర్థం అని నేను గతంలోనే చెప్పా’’ అన్నారు.

    "మన దగ్గర కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. , వారికి జట్టులో స్థానం సంపాదించడం కష్టమని నాకు తెలుసు. కానీ ఈ ఆటగాళ్లు రాణిస్తున్న తీరు చూస్తుంటే, వారికి త్వరలోనే జట్టులో స్థానం లభిస్తుందని ఆశిస్తున్నా" అన్నారు.

    ఈ ఆటగాళ్లు సాధించినదంతా వారి కఠోర శ్రమతోనే సాధ్యమైందని, ఆ ఘనత వారికే దక్కుతుందని యువరాజ్ అన్నారు.

  5. ‘పిల్లలకు చదువు చెప్పడంలో న్యాయం చేయలేకపోతున్నాం’.. దేశంలో లక్షకుపైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు

  6. అంతర్వేది తీరానికి చేరిన భారీ ఓడకు ఏమైంది? ఒడ్డుకు సమీపంలో ఎలా చిక్కుకుంది? అందులో ఏం ఉంది

  7. ‘పాతికేళ్ల కుర్రాళ్లకూ పక్షవాతం రావొచ్చు’.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

  8. తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్

    తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్ ఇదే.
    ఫొటో క్యాప్షన్, తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్ ఇదే.

    ఇవాళ వర్షం కురిసే జిల్లాలు: సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం,

    రేపు(31 అక్టోబర్ 2026)వర్షం కురిసే జిల్లాలు: సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి,

    ఎల్లుండి(1 నవంబర్ 2026)వర్షం కురిసే జిల్లాలు: తెలంగాణ వ్యాప్తంగా చెదురుమదురు వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది

    సోమవారం(2 నవంబర్ 2026 )వర్షం కురిసే జిల్లాలు: కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల్లో వానలు పడతాయని మిగతా జిల్లాల్లో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

  9. ‘నేను కుప్పకూలే వరకు నాలో ఆ లోపం ఉందనే విషయం తెలియదు’

  10. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో నేషనల్ హైవేపై వరద నీరు.. ఇచ్ఛాపురానికి రెండు వైపులా రాకపోకలకు అంతరాయం

    శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి- ఇచ్చాపురంలో మొదటి అంతస్తుకు చేరిన నీరు
    ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి- ఇచ్చాపురంలో మొదటి అంతస్తుకు చేరిన నీరు

    అర్నబ్ తుపాను తీరం దాటిన తరువాత కూడా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

    దీంతో శ్రీకాకుళంలోని నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదులు ఉప్పొంగాయి.

    ముఖ్యంగా మహేంద్ర తనయ, బాహుదా నదులకు ఎగువన ఒడిశా నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో దిగువ ప్రాంతాలన్నీ నీట మునిగాయి.

    ఒడిశా సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పట్టణం ఇచ్ఛాపురంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

    ఇక్కడి బెల్లుపడలోని పలు ఇళ్లు నీట మునిగాయి. జాతీయ రహదారికి వెళ్లే మార్గం కూడా వరద నీటిలో మునిగిపోయింది.

    పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందంటే.. సుమారు పది ఇళ్లు మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరింది. ప్రాణాలు కాపాడుకునేందుకు బాధితులు ఇళ్ల పైఅంతస్తులు, డాబాలపైకి చేరుకున్నారు.

    వరద ఉద్ధృతి మరింత పెరిగితే ఇళ్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

    మరోవైపు, ఇచ్చాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై కూడా వరద తీవ్రత కనిపిస్తోంది. పలు చోట్ల వరద నీట్లో వాహనాలు చిక్కుకుపోయాయి.

    రైలు మార్గంలోనూ కొంతమేర పట్టాలు వరద నీట్లో మునిగిపోయాయి.

    వరద నీరు ఉప్పొంగడంతో బెల్లుపడలోని పలు ఇళ్లు నీట మునిగాయి
    ఫొటో క్యాప్షన్, వరద నీరు ఉప్పొంగడంతో బెల్లుపడలోని పలు ఇళ్లు నీట మునిగాయి
    ఇచ్చాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై కూడా వరద తీవ్రత కనిపిస్తోంది. వరద నీటిలో రెండు లారీలు చిక్కుకుపోయాయి.
    ఫొటో క్యాప్షన్, ఇచ్చాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై కూడా వరద తీవ్రత కనిపిస్తోంది. వరద నీటిలో రెండు లారీలు చిక్కుకుపోయాయి.
    ఒడిశాలో కురిసిన భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి.
    ఫొటో క్యాప్షన్, ఒడిశాలో కురిసిన భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి.
  11. చంటిబిడ్డను ఎత్తుకొని హాఫ్ మారథాన్‌ పూర్తి చేసిన కశ్మీరీ మహిళ.. ‘సైనికుడి భార్య జీవితం పోరాటమే’ అని ఆమె ఎందుకన్నారు

  12. అంతర్వేదీ తీరానికి కొట్టుకొచ్చిన భారీ షిప్

    అర్నబ్ తుపాను ప్రభావం కొనసాగుతున్న వేళ అంతర్వేది తీరానికి ఒక భారీ షిప్ రావడం చర్చనీయాంశంగా మారింది.

    సాంకేతిక సమస్యల కారణంగానే ఈ ఓడ వచ్చిందని కోస్టుగార్డు అధికారులు చెబుతున్నారు. విశాఖ నుంచి సింగపూర్ బయల్దేరిన ఈ షిప్, తుపాను ధాటికి ఇలా తీరానికి కొట్టుకు వచ్చిందని అంటున్నారు.

    ఇందులో ఉన్న సిబ్బందిని కోస్ట్‌గార్డ్ దళాలు కాపాడాయి.

  13. ‘ప్రతి పెట్టుబడికి నాదీ భరోసా’ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్‌రెడ్డి

    తెలంగాణ‌ రైజింగ్‌లో భాగ‌స్వాములు కావాల‌ని అంత‌ర్జాతీయ‌ పారిశ్రామిక‌వేత్త‌లను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

    హైద‌రాబాద్ భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 స‌న్నాహ‌క కార్య‌క్ర‌మాన్ని దిల్లీలో నిర్వ‌హించారు.

    కార్య‌క్ర‌మానికి కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ముఖ్య‌మంత్రిరేవంత్ రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి అవ‌స‌ర‌మైన విధాన నిర్ణయాలు, ప్రభుత్వ సహకారం అందించేందుకు వ్యక్తిగతంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అంత‌ర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

    పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ‌ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏం కావాలో చెప్పాలని, విధానపరమైన మార్పుల నుంచి అవసరమైన సహకారం వరకు అన్నింటినీ అందించేందుకు వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

    "2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని సాధించేందుకు భారతీయులందరూ కలిసి కృషి చేయాలి. ప్రస్తుతం మనం దసరా, కర్వా చౌత్, దీపావళి వంటి పండుగల సీజన్‌లో ఉన్నాం. ఈ సమ్మిట్ మనకు మరో పండుగ వంటిది. 700 ఏళ్లకు పైగా క్రితమే, కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు సముద్ర వాణిజ్యానికి సంబంధించి 'మోటుపల్లి శాసనం'ను జారీ చేశారు" అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

    ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హామీ
    ఫొటో క్యాప్షన్, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హామీ
  14. వందేళ్లపైబడిన చెట్లు కూడా కూలిపోయాయి

    వీడియో క్యాప్షన్, వందేళ్ల పైబడి వయసున్న చెట్లు అర్నబ్ తుపాను తీవ్రతకు కూలిపోాయాయి.

    అర్నబ్ తుపాను నర్సాపురం పట్టణంపై తీవ్ర ప్రభావం చూపింది.

    చిరంజీవితో పాటు మరికొందరు ప్రముఖులు చదువుకున్న పట్టణంలోని వైఎన్ కాలేజీ తుపాను వల్ల తీవ్రంగా నష్టోయింది.

    వందేళ్లపైబడిన చెట్లు కూడా తుఫాన్ తీవ్రతకు కూకటివేళ్లతో సహా పడిపోయాయి.

  15. ఏమిటీ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి, లక్షణాలేమిటి?

    డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలలో పాదాల తిమ్మిరి, సూదులతో గుచ్చినట్టు మంట ఉంటుంది.
    ఫొటో క్యాప్షన్, డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలలో పాదాల తిమ్మిరి, సూదులతో గుచ్చినట్టు మంట ఉంటుంది.

    మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికీ నరాల సమస్యలు రావు. అయితే వ్యాధి వ్యవధి పెరిగేకొద్దీ, రక్తంలో చక్కెర నియంత్రణ సరిగా లేకపోతే, ఇతర ప్రమాద కారకాలు ఉన్నప్పుడు నరాలు దెబ్బతినే అవకాశం పెరుగుతుంది.

    అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఏడీఏ) 2026 మార్గదర్శకాల ప్రకారం, డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి ఉన్నవారిలో దాదాపు 50 శాతం మందికి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే లక్షణాలు వచ్చే వరకు వేచి ఉండకుండా పరీక్షలు చేయించుకోవడం అవసరం. మరింత కథనం కోసం ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

  16. పాదాలలో తిమ్మిరి, సూదులతో గుచ్చినట్టు మంట.. ఇవి డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి లక్షణాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  17. తుపాన్లు ఎక్కువవుతున్నాయా, లేక వాటి తీవ్రత పెరుగుతోందా? తుపాను, హరికేన్, టైఫూన్ మధ్య తేడా ఏమిటి?

  18. కాకినాడ తీరంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం

    కాకినాడ తీరంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం
    ఫొటో క్యాప్షన్, కాకినాడ తీరంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం

    కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతంలో మత్స్యకారులకు చెందిన బోటు మంగళవారం బోల్తా పడింది.

    ఈ ఘటనలో గల్లంతైన మత్స్యకారులను రెస్క్యూ సిబ్బంది కాపాడి ఒడ్డుకు చేర్చారు.

    తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన ముగ్గురు మత్స్యకారులు వేటకు వెళ్లారని.. వారు వెళ్తున్న బోటు సముద్రంలో బోల్తా పడడంతో వారంతా ఈదుకుంటూ వెళ్లి హోప్ ఐలాండ్‌కు చేరుకున్నారని అధికారులు చెప్పారు.

    దీనికి సంబంధించిన సమాచారం మత్స్యశాఖ, ఆర్టీజిఎస్, విపత్తుల నిర్వహణ సంస్థలకు చేరింది.

    వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది 10 బోట్ల సహాయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. చివరకు ఇవాళ వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

  19. ‘గత 30 ఏళ్లలో ఇంత తీవ్రమైన గాలులు చూడలేదు’.. అర్నబ్ తుపాను తీవ్రతను వివరించిన 88 ఏళ్ల వృద్ధుడు

  20. అండమాన్‌కు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించిన ఐఎండీ

    అండమాన్‌కు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించిన ఐఎండీ
    ఫొటో క్యాప్షన్, అండమాన్‌కు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించిన ఐఎండీ

    దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని ఐఎండీ పేర్కొంది.

    ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది.

    దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ & నికోబార్ దీవులపై ప్రభావం చూపుతుంది. మరో 24 గంటల్లో ఇది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది.

    మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించిన అర్నబ్ తుపాను ఇప్పుడు అల్పపీడనంగా మారింది.

    ఆంధ్రప్రదేశ్, దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల మీదుగా గంటకు 22 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపు కదిలుతోంది.

    గురువారం ఉదయం 5.30 గంటలకు, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా వద్ద కేంద్రీకృతమై ఉంది.

    ఇది జగదల్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)కు పశ్చిమాన సుమారు 20 కిలోమీటర్లు, భవానీపట్నానికి (ఒడిశా) నైరుతి దిశలో 170 కిలోమీటర్లు, టిట్లాగఢ్ (ఒడిశా)కు నైరుతి దిశలో 210 కిలోమీటర్లు, రాయ్‌పూర్‌కు దక్షిణాన 250 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ఇది ఉత్తరం వైపు కదులుతూ సాయంత్రానికి బలహీనపడి స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.