ఆసియా కప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

ఫైనల్‌ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతోంది, దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.

లైవ్ కవరేజీ

  1. ‘జైలులో అనారోగ్యం నటించారు.. సిబ్బందిపై దాడి చేసి 17 మంది పారిపోయారు’

  2. ‘జ్ఞానేశ్ కుమార్ ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు, ఫామ్-6లో ఎలాంటి మార్పులు చేయలేదు’.. సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చిన ఎలక్షన్ కమిషన్

  3. ఎల్ నినో ‘అత్యంత తీవ్రరూపం’ దాల్చబోతోందా? ఇది ఎప్పటివరకు కొనసాగొచ్చు? ‘ఇన్‌కాయిస్’ ఏం చెప్పింది?

  4. ఆంధ్రప్రదేశ్ స్థానిక పోరులో ‘నామినేషన్ల’ రగడ: ప్రజాస్వామ్యమా లేక బలప్రదర్శనా?

  5. ఆంధ్రప్రదేశ్: అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు

    హుద్‌హుద్ తుపాను సమయంలో కూలిన చెట్లు(ఫైల్ ఫోటో)
    ఫొటో క్యాప్షన్, హుద్‌హుద్ తుపాను సమయంలో కూలిన చెట్లు(ఫైల్ ఫోటో)

    ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు విడుదల చేసింది.

    బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు.

    శ్రీకాకుళం, మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, పోలవరం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీసత్యసాయి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

  6. అర్నబ్: తుపాను ఎక్కడుంది? ఎప్పుడు తీరం దాటుతుంది, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?

  7. ఇంజమామ్ ఉల్ హక్: సిక్స్ కొట్టాలని ఉందని సెహ్వాగ్ చెబితే, ఫీల్డర్లను ముందుకు తీసుకొచ్చిన పాకిస్తానీ కెప్టెన్

  8. సౌదీలో చిక్కుకున్న భారతీయ యాత్రికుల పరిస్థితి ఎలా ఉంది?

  9. పార్లమెంట్‌కు సమీపంలో నార్త్ బ్లాక్‌లో కమ్ముకున్న దట్టమైన పొగ– వెల్డింగ్ పనుల కారణంగా చెలరేగిన మంటలు

    నార్త్ బ్లాక్‌, దిల్లీ
    ఫొటో క్యాప్షన్, పార్లమెంట్‌కు సమీపంలో నార్త్ బ్లాక్‌లో కమ్ముకున్న దట్టమైన పొగ

    పార్లమెంట్‌కు సమీపంలో నార్త్‌బ్లాక్‌లో సోమవారం ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్ముకుంది.

    “పార్లమెంట్‌కు వెళ్తున్నప్పుడు, నార్త్‌బ్లాక్ వెనుకాల దట్టమైన పొగను గమనించాను. అక్కడ అగ్ని ప్రమాదం జరిగిం ఉండొచ్చని అనుమానం వచ్చింది. అంతా క్షేమంగా ఉంటారని భావిస్తున్నాను. అత్యవసర సిబ్బంది వేగంగా స్పందించాలని కోరుకుంటున్నాను” అని బీజేపీ ఎంపీ మిలింద్ డియోరా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

    “దిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలోని చిల్లర్ ప్లాంట్‌లో ఉపయోగించే ఫైబర్ ట్యాంక్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో నల్లటి పొగ భారీగా వ్యాపించింది. దీంతో సమీపంలోని ప్రజలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు” అని హిందూ పేర్కొంది.

    నార్త్‌బ్లాక్‌లో వెల్డింగ్ వర్క్ చేస్తుంటే చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. వెల్డింగ్ నుంచి వచ్చిన నిప్పు రవ్వలు సమీపంలోని ట్యాంక్‌కు వ్యాపించి మంటలు చెలరేగి పొగ వ్యాపించింది అని ఏఏఎన్ఎస్ పేర్కొంది.

    ఘటన జరిగిన వెంటనే మంటలను ఆర్పేశారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. ఎవరూ గాయపడినట్టు రిపోర్ట్ కాలేదు.

    సోమవారం 11 గంటలకు అగ్ని ప్రమాదం సమాచారం అందింది. సమాచారం వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి 6 ఆగ్నిమాపక యంత్రాలను పంపి మంటలను అదుపు చేసినట్టు దిల్లీ ఫైర్ డిపార్ట్‌మెంట్ చెప్పింది.

  10. రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

    పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రహదారి, రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

    ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై రాహుల్ గాంధీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన కాన్వాయ్‌లోని వాహనాలే ఒకదానికొకటి ఢీకొన్నాయి.

    అందరూ క్షేమంగా ఉన్నారని పవన్ ఖేరా చెప్పినట్టు బీసీసీ ప్రతినిధి ప్రేరణ తెలిపారు.

    చాలా స్వల్ప ప్రమాదమని, ఎవరికీ ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది.

    రాహుల్ గాంధీ లఖ్‌నవూ నుంచి సుల్తాన్‌పూర్ వెళ్తుండగా హాలియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగిందని ఐఏఎన్‌ఎస్ రిపోర్టు చేసింది.

    ప్రమాదంలో కారు బానెట్ ధ్వంసమైనట్టు వివరించింది.

    ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ రాహుల్ గాంధీ వెంటనే వేరే వాహనంలో సుల్తాన్‌పూర్ వెళ్లినట్టు తెలిపింది. ఎంపీ-ఎంఎల్‌ఏ కోర్టు ముందు హాజరయ్యేందుకు రాహుల్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

  11. న్యూజీలాండ్‌తో జరిగే మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం

    న్యూజీలాండ్‌, ఇషాన్ కిషన్
    ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌తో జరిగే మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం

    తొడ కండరాలు పట్టేయడంతో న్యూజీలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌కి కూడా ఇషాన్ కిషన్ దూరంకానున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

    న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోని తొలి టీ20 మ్యాచ్‌లో కుడి తొడ కండరాలు గాయంతో రెండో టీ20కి దూరమయ్యాడు. ఆయన స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఆడాడు. రెండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్ ఆకట్టుకోలేకపోయాడు.

    ఇషాన్ కిషన్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని బీసీసీఐ తెలిపింది. అతను ఇంకా మ్యాచ్ ఆడే స్థాయికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని వెల్లడించింది. అందుకే అక్టోబర్ 27న వెల్లింగ్‌టన్‌లో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు దూరమవుతున్నట్టు పేర్కొంది. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఇషాన్ కోలుకుంటున్నాడని చెప్పింది. కుమార్ కుశాగ్ర మూడో టీ20 మ్యాచ్‌లో ఆడతాడని వెల్లడించింది.

  12. మోదీని ఉద్దేశించి ఖర్గే చేసిన వ్యాఖ్యలేంటి, క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తుంది?

  13. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్నబ్’ తుపానుగా మారినట్టు ఐఎండీ ప్రకటన

    ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అర్నబ్ తుపాను, ఐఎండీ
    ఫొటో క్యాప్షన్, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్నబ్’ తుపాను మారినట్టు ఐఎండీ ప్రకటన

    తూర్పు-మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘అర్నబ్’ తుపానుగా మారిందని ఐఎండీ ప్రకటించింది.

    ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

    ఈరోజు (అక్టోబర్ 26) ఉదయం 5:30 గంటలకు తుపాను 15.4° ఉత్తర అక్షాంశం, 88.9° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉందని ప్రకటించింది. శ్రీ విజయపురం (అండమాన్ దీవులు)కు వాయువ్య దిశలో 590 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 610 కి.మీ దూరంలో, విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 650 కి.మీ దూరంలో, కాకినాడకు తూర్పు-ఆగ్నేయ దిశలో 730 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి తూర్పు దిశలో 830 కి.మీ దూరంలో, బాపట్లకు తూర్పు దిశలో 910 కి.మీ దూరంలో ఉంది.

    మరింత బలపడనున్న తుపాను

    అర్నబ్ తుపాను పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ అర్ధరాత్రి నాటికి తీవ్ర తుపానుగా, అక్టోబర్ 27 నాటికి అత్యంత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 28 ఉదయం బాపట్ల- విశాఖ మధ్య తీరాన్ని దాటే అవకాశముంది.

    తీరాన్ని దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే ఈదురుగాలుల వేగం 140 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

  14. రెండు రోజులు ప్రయాణాలు వద్దు- తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అధికారుల విజ్ఞప్తి

    ఆంధ్రప్రదేశ్, బాపట్ల, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం
    ఫొటో క్యాప్షన్, తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు.

    తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు మంగళ, బుధవారాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.

    మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాల్లో కట్టి ఉంచుకోవాలన్నారు.

    విశాఖకు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీవ్ర వాయుగుండం రేపు, ఎల్లుండి తీవ్ర తుపానుగా మారుతుందని, సుమారు 125 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని జైన్ హెచ్చరించారు. అందుకే ప్రయాణాలు పెట్టుకొవద్దని సూచించారు.

    సోమవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళ, బుధవారాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, పోలవరం, విశాఖ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

  15. ‘అతి తీవ్ర తుపానుగా మారొచ్చు’.. విశాఖపట్నానికి 820 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండంపై అధికారుల హెచ్చరిక

    ఆంధ్రప్రదేశ్, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం,
    ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌కు 820 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఇవాళ తుపానుగా మారే అవకాశం

    తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం ఇవాళ తుపానుగా, రేపు తీవ్ర తుపానుగా మారబోతోంది.

    ఇది యానాం- బాపట్ల, విశాఖ పట్నానికి మధ్య అక్టోబర్ 28వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

    ప్రస్తుతానికి ఈ తీవ్ర వాయగుండం 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.

    ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం(అక్టోబర్ 25) రాత్రి ప్రకటించిన సమాచారం ప్రకారం.. ప్రకారం తీవ్ర వాయుగుండం విశాఖకు 820 కి.మీ., కాకినాడకు 910 కి.మీ., మచిలీపట్నానికి 1010 కి.మీ.,బాపట్లకు 1080 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

    ఈ తీవ్రవాయుగుండం సోమవారం(అక్టోబర్ 26) ఉదయానికి తుపానుగా, మంగళవారం(అక్టోబర్ 27) ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా,బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

    ఇది తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిరంతరం తుపాను పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని.. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

  16. చిన్నస్వామి స్టేడియం అంటే అందుకే ఇష్టం: ధోని

  17. నవంబర్ 1న జరిగే ర్యాలీకి పదిలక్షలమంది హాజరవుతారు: కాంగ్రెస్

    కాంగ్రెస్, ర్యాలీ, నిరసన, దిల్లీ
    ఫొటో క్యాప్షన్, కేసీ వేణుగోపాల్

    భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం మరోసారి డిమాండ్ చేశారు.

    దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో నవంబర్ 1న ఇండియా కూటమి ర్యాలీ జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు.

    ఈ భారీ ర్యాలీలో 10 లక్షల మంది పాల్గొంటారని ఆయన చెప్పారు.

    "ఎస్ఆర్ఐను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతంగా నిర్వీర్యం చేశారు. ఈ విధానంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. ఈ ర్యాలీ ఏ ఒక్క వ్యక్తి కోసమో లేదా ఏ ప్రత్యేక రాజకీయ పార్టీ కోసమో కాదు. సామాన్య పౌరుల ఓట్లను కాపాడటానికే ఈ ర్యాలీ. పది లక్షల మంది దిల్లీకి తరలివస్తారు’’ అని ఆయన అన్నారు .

    "ఇది సీనియర్ నాయకులందరి బాధ్యత. మనమందరం కలిసికట్టుగా పనిచేసి ఐక్యంగా ముందుకు సాగుదాం" అని చెప్పారు.

    కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉత్తరప్రదేశ్, హరియాణా పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

  18. బ్లూటూత్: ఈ పేరు వెనకున్న1,000 ఏళ్ల చరిత్ర ఏంటి?

  19. కన్నడిగులకు ఉద్దేశపూర్వకంగా ఉద్యోగాలు నిరాకరిస్తే కఠిన చర్యలు: డీకే

    కర్ణాటక సీఎం డీకే శివకుమార్ , బెంగళూరు ఐటీ కంపెనీల్లో కన్నడిగులకు ఉద్యోగాలు
    ఫొటో క్యాప్షన్, స్థానికంగా కన్నడ మాట్లాడేవారిని ఉద్యోగ అవకాశాల్లో పక్కనపెడుతున్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.

    బెంగళూరు ఐటీ కంపెనీల్లో కన్నడిగులకు ఉద్యోగాలను నిరాకరిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడం బాధాకరమని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అన్నారు.

    స్థానికంగా కన్నడం మాట్లాడేవారిని ఉద్యోగ అవకాశాల్లో పక్కనపెడుతున్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.

    ఏదైనా ప్రైవేటు సంస్థ ఉద్దేశపూర్వకంగా కన్నడిగులను పక్కనపెట్టినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.

    కన్నడిగుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, వారి సమస్యలపై స్పందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు.

  20. ప్రపంచ సంక్షోభాలను చూస్తూ ఉండిపోకూడదు: ఐరాసకు జైశంకర్ సూచన

    ఐక్యరాజ్యసమితి ,ఎస్. జైశంకర్
    ఫొటో క్యాప్షన్, ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ కేంద్ర మంత్రి మాట్లాడారు.

    ప్రపంచ సంక్షోభాలను ఐక్యరాజ్యసమితి చూస్తూ ఉండిపోకుండా నాయకత్వ పాత్ర పోషించాలని విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ చెప్పినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

    ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్‌ సమ్మేళన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు.

    ‘‘మనం పరిపూర్ణత లేని ప్రపంచంలో జీవిస్తున్నాం. అయితే, మరింత మెరుగైన ప్రపంచం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనేఉన్నాం. ఐక్యరాజ్యసమితి దానిలోని లోపాలను, పరిమితులను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకుకృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్వామ్యం లేకుండా చేయకూడదు. ప్రపంచ సంక్షోభాలను చూస్తూ ఉండిపోకుండా ఐక్యరాజ్యసమితి నాయకత్వ పాత్ర పోషించాలి” అని జైశంకర్ అన్నారు.