ఆసియా కప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
ఫైనల్ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతోంది, దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.
లైవ్ కవరేజీ
ఆంధ్రప్రదేశ్: అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, హుద్‌హుద్ తుపాను సమయంలో కూలిన చెట్లు(ఫైల్ ఫోటో)
ఆంధ్రప్రదేశ్‌లో
అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్ల
నిధులు విడుదల చేసింది.
బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల
చేశారు.
శ్రీకాకుళం,
మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, పోలవరం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీసత్యసాయి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు
రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి.
సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
అర్నబ్: తుపాను ఎక్కడుంది? ఎప్పుడు తీరం దాటుతుంది, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇంజమామ్ ఉల్ హక్: సిక్స్ కొట్టాలని ఉందని సెహ్వాగ్ చెబితే, ఫీల్డర్లను ముందుకు తీసుకొచ్చిన పాకిస్తానీ కెప్టెన్
సౌదీలో చిక్కుకున్న భారతీయ యాత్రికుల పరిస్థితి ఎలా ఉంది?
పార్లమెంట్‌కు సమీపంలో నార్త్ బ్లాక్‌లో కమ్ముకున్న దట్టమైన పొగ– వెల్డింగ్ పనుల కారణంగా చెలరేగిన మంటలు
ఫొటో సోర్స్, @milinddeora
ఫొటో క్యాప్షన్, పార్లమెంట్‌కు సమీపంలో నార్త్ బ్లాక్‌లో కమ్ముకున్న దట్టమైన పొగ
పార్లమెంట్‌కు సమీపంలో నార్త్‌బ్లాక్‌లో సోమవారం ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్ముకుంది.
“పార్లమెంట్‌కు వెళ్తున్నప్పుడు,
నార్త్‌బ్లాక్ వెనుకాల దట్టమైన పొగను గమనించాను. అక్కడ అగ్ని ప్రమాదం జరిగిం ఉండొచ్చని
అనుమానం వచ్చింది. అంతా క్షేమంగా ఉంటారని భావిస్తున్నాను. అత్యవసర సిబ్బంది వేగంగా
స్పందించాలని కోరుకుంటున్నాను” అని బీజేపీ ఎంపీ
మిలింద్ డియోరా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.
“దిల్లీలోని
నార్త్‌బ్లాక్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలోని చిల్లర్ ప్లాంట్‌లో
ఉపయోగించే ఫైబర్ ట్యాంక్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో నల్లటి పొగ భారీగా
వ్యాపించింది. దీంతో సమీపంలోని ప్రజలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు” అని హిందూ పేర్కొంది.
నార్త్‌బ్లాక్‌లో
వెల్డింగ్ వర్క్ చేస్తుంటే చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. వెల్డింగ్ నుంచి వచ్చిన
నిప్పు రవ్వలు సమీపంలోని ట్యాంక్‌కు వ్యాపించి మంటలు చెలరేగి పొగ వ్యాపించింది అని
ఏఏఎన్ఎస్
పేర్కొంది.
ఘటన
జరిగిన వెంటనే మంటలను ఆర్పేశారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. ఎవరూ
గాయపడినట్టు రిపోర్ట్ కాలేదు.
సోమవారం
11 గంటలకు అగ్ని ప్రమాదం సమాచారం అందింది.
సమాచారం వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి 6 ఆగ్నిమాపక యంత్రాలను పంపి మంటలను అదుపు చేసినట్టు
దిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ చెప్పింది.
రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం
ఫొటో సోర్స్, Dilip Yadav
ఫొటో క్యాప్షన్, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ రహదారిపై రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ రహదారిపై రాహుల్ గాంధీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.
ఆయన కాన్వాయ్‌లోని వాహనాలే ఒకదానికొకటి ఢీకొన్నాయి.
అందరూ
క్షేమంగా ఉన్నారని పవన్ ఖేరా చెప్పినట్టు బీసీసీ ప్రతినిధి ప్రేరణ తెలిపారు.
చాలా స్వల్ప
ప్రమాదమని, ఎవరికీ ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని న్యూస్ ఏజెన్సీ పీటీఐ
పేర్కొంది.
రాహుల్
గాంధీ లఖ్‌నవూ నుంచి సుల్తాన్పూర్ వెళ్తుండగా హాలియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం
జరిగిందని ఐఏఎన్ఎస్ రిపోర్టు చేసింది.
ప్రమాదంలో కారు బానెట్ ధ్వంసమైనట్టు వివరించింది.
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ రాహుల్ గాంధీ వెంటనే వేరే వాహనంలో సుల్తాన్పూర్
వెళ్లినట్టు తెలిపింది. ఎంపీ-ఎంఎల్ఏ కోర్టు ముందు హాజరయ్యేందుకు రాహుల్ వెళ్తుండగా
ప్రమాదం జరిగింది.
న్యూజీలాండ్‌తో జరిగే మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం
ఫొటో సోర్స్, AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌తో జరిగే మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం
తొడ కండరాలు పట్టేయడంతో న్యూజీలాండ్‌తో
జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌కి కూడా ఇషాన్ కిషన్ దూరంకానున్నట్టు బీసీసీఐ
ప్రకటించింది.
న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోని తొలి టీ20
మ్యాచ్‌లో కుడి తొడ కండరాలు గాయంతో రెండో టీ20కి దూరమయ్యాడు. ఆయన స్థానంలో వైభవ్ సూర్యవంశీ
ఆడాడు. రెండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్ ఆకట్టుకోలేకపోయాడు.
ఇషాన్ కిషన్ ప్రస్తుతం
కోలుకుంటున్నాడని బీసీసీఐ తెలిపింది. అతను ఇంకా మ్యాచ్ ఆడే స్థాయికి పూర్తి ఫిట్నెస్
సాధించలేదని వెల్లడించింది. అందుకే అక్టోబర్ 27న వెల్లింగ్టన్లో జరగనున్న మూడో
టీ20 మ్యాచ్‌కు దూరమవుతున్నట్టు పేర్కొంది. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఇషాన్
కోలుకుంటున్నాడని చెప్పింది. కుమార్ కుశాగ్ర మూడో టీ20 మ్యాచ్‌లో ఆడతాడని
వెల్లడించింది.
మోదీని ఉద్దేశించి ఖర్గే చేసిన వ్యాఖ్యలేంటి, క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తుంది?
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్నబ్’ తుపానుగా మారినట్టు ఐఎండీ ప్రకటన
ఫొటో సోర్స్, @Indiametdept
ఫొటో క్యాప్షన్, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్నబ్’ తుపాను మారినట్టు ఐఎండీ ప్రకటన
తూర్పు-మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని
ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘అర్నబ్’తుపానుగా మారిందని
ఐఎండీ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్,
యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈరోజు (అక్టోబర్ 26) ఉదయం 5:30 గంటలకు
తుపాను 15.4° ఉత్తర అక్షాంశం,
88.9° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉందని ప్రకటించింది. శ్రీ విజయపురం
(అండమాన్ దీవులు)కు వాయువ్య దిశలో 590
కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 610 కి.మీ దూరంలో, విశాఖపట్నానికి
తూర్పు-ఆగ్నేయ దిశలో 650 కి.మీ దూరంలో, కాకినాడకు తూర్పు-ఆగ్నేయ దిశలో 730 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి
తూర్పు దిశలో 830 కి.మీ దూరంలో, బాపట్లకు తూర్పు దిశలో 910 కి.మీ దూరంలో ఉంది.
మరింత బలపడనున్న తుపాను
అర్నబ్ తుపాను పశ్చిమ-వాయువ్య దిశగా
కదులుతూ ఈ అర్ధరాత్రి నాటికి తీవ్ర తుపానుగా, అక్టోబర్ 27 నాటికి అత్యంత తీవ్ర తుపానుగా మారే
అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 28 ఉదయం బాపట్ల- విశాఖ మధ్య తీరాన్ని దాటే
అవకాశముంది.
తీరాన్ని దాటే సమయంలో గంటకు 115
నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే ఈదురుగాలుల
వేగం 140 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
రెండు రోజులు ప్రయాణాలు వద్దు- తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అధికారుల విజ్ఞప్తి
ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
ఫొటో క్యాప్షన్, తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు మంగళ, బుధవారాల్లో ప్రయాణాలు వాయిదా
వేసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాల్లో కట్టి ఉంచుకోవాలన్నారు.
విశాఖకు
దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీవ్ర వాయుగుండం రేపు, ఎల్లుండి తీవ్ర తుపానుగా
మారుతుందని, సుమారు 125 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని జైన్
హెచ్చరించారు. అందుకే ప్రయాణాలు పెట్టుకొవద్దని సూచించారు.
సోమవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళ, బుధవారాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
తెలిపారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ,
కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,
నెల్లూరు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
పేర్కొన్నారు.
బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి,
అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, పోలవరం,
విశాఖ, కాకినాడ, కోనసీమ,
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు,
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,
బాపట్ల, పల్నాడు, మార్కాపురం,
ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
‘అతి తీవ్ర తుపానుగా మారొచ్చు’.. విశాఖపట్నానికి 820 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండంపై అధికారుల హెచ్చరిక
ఫొటో సోర్స్, @Indiametdept
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌కు 820 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఇవాళ తుపానుగా మారే అవకాశం
తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని
తీవ్రవాయుగుండం ఇవాళ తుపానుగా, రేపు తీవ్ర తుపానుగా మారబోతోంది.
ఇది యానాం- బాపట్ల,
విశాఖ పట్నానికి మధ్య అక్టోబర్ 28వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ
ప్రకటించింది.
ప్రస్తుతానికి ఈ తీవ్ర వాయగుండం 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం(అక్టోబర్ 25) రాత్రి
ప్రకటించిన సమాచారం ప్రకారం.. ప్రకారం తీవ్ర వాయుగుండం విశాఖకు 820
కి.మీ., కాకినాడకు 910
కి.మీ., మచిలీపట్నానికి 1010 కి.మీ.,బాపట్లకు 1080
కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఈ తీవ్రవాయుగుండం సోమవారం(అక్టోబర్ 26) ఉదయానికి తుపానుగా, మంగళవారం(అక్టోబర్ 27) ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా,బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నాయని
విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇది తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే
అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిరంతరం తుపాను పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని..
ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
చిన్నస్వామి స్టేడియం అంటే అందుకే ఇష్టం: ధోని
నవంబర్ 1న జరిగే ర్యాలీకి పదిలక్షలమంది హాజరవుతారు: కాంగ్రెస్
ఫొటో సోర్స్, kcvenugopalmp
ఫొటో క్యాప్షన్, కేసీ వేణుగోపాల్
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్
రాజీనామా చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం మరోసారి
డిమాండ్ చేశారు.
దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో నవంబర్ 1న ఇండియా కూటమి
ర్యాలీ జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు,
కార్యకర్తలతో కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు.
ఈ భారీ ర్యాలీలో 10 లక్షల మంది పాల్గొంటారని ఆయన చెప్పారు.
"ఎస్ఆర్ఐను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతంగా
నిర్వీర్యం చేశారు. ఈ విధానంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. ఈ ర్యాలీ ఏ ఒక్క
వ్యక్తి కోసమో లేదా ఏ ప్రత్యేక రాజకీయ పార్టీ కోసమో కాదు. సామాన్య పౌరుల ఓట్లను
కాపాడటానికే ఈ ర్యాలీ. పది లక్షల మంది దిల్లీకి తరలివస్తారు’’ అని ఆయన అన్నారు .
"ఇది సీనియర్ నాయకులందరి బాధ్యత. మనమందరం కలిసికట్టుగా
పనిచేసి ఐక్యంగా ముందుకు సాగుదాం" అని చెప్పారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ
వేణుగోపాల్ దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉత్తరప్రదేశ్, హరియాణా పార్టీ నేతలతో
సమావేశమయ్యారు.
బ్లూటూత్: ఈ పేరు వెనకున్న1,000 ఏళ్ల చరిత్ర ఏంటి?
కన్నడిగులకు ఉద్దేశపూర్వకంగా ఉద్యోగాలు నిరాకరిస్తే కఠిన చర్యలు: డీకే
ఫొటో సోర్స్, Raj K Raj/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, స్థానికంగా కన్నడ మాట్లాడేవారిని ఉద్యోగ అవకాశాల్లో పక్కనపెడుతున్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
బెంగళూరు ఐటీ కంపెనీల్లో కన్నడిగులకు ఉద్యోగాలను నిరాకరిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడం బాధాకరమని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అన్నారు.
స్థానికంగా కన్నడం మాట్లాడేవారిని ఉద్యోగ అవకాశాల్లో పక్కనపెడుతున్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని
ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఏదైనా ప్రైవేటు సంస్థ ఉద్దేశపూర్వకంగా కన్నడిగులను పక్కనపెట్టినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.
కన్నడిగుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ,
వారి సమస్యలపై స్పందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు.
ప్రపంచ సంక్షోభాలను చూస్తూ ఉండిపోకూడదు: ఐరాసకు జైశంకర్ సూచన
ఫొటో సోర్స్, Roy Rochlin/Getty Images for Newsweek
ఫొటో క్యాప్షన్, ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ కేంద్ర మంత్రి మాట్లాడారు.
ప్రపంచ సంక్షోభాలను ఐక్యరాజ్యసమితి చూస్తూ ఉండిపోకుండా నాయకత్వ పాత్ర పోషించాలని విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ చెప్పినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ సమ్మేళన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు.
‘‘మనం పరిపూర్ణత లేని ప్రపంచంలో జీవిస్తున్నాం. అయితే,
మరింత మెరుగైన ప్రపంచం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనేఉన్నాం. ఐక్యరాజ్యసమితి దానిలోని లోపాలను, పరిమితులను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకుకృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్వామ్యం లేకుండా చేయకూడదు.
ప్రపంచ సంక్షోభాలను చూస్తూ ఉండిపోకుండా ఐక్యరాజ్యసమితి నాయకత్వ పాత్ర పోషించాలి” అని జైశంకర్ అన్నారు.
‘మణిపుర్లో శాశ్వత శాంతి స్థాపన కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం’
ఫొటో సోర్స్, X/@@YKhemchandSingh
ఫొటో క్యాప్షన్, రాష్ట్రంలో అధికారికంగా గుర్తించిన 33 షెడ్యూల్డ్ తెగలతో సహా మొత్తం 36 వర్గాల నుండి ఈ కమిటీలో ప్రతినిధులు ఉంటారు.
మణిపుర్లో శాశ్వత శాంతిని నెలకొల్పే
లక్ష్యంతో రాష్ట్రవ్యాప్త కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ తెలిపారు.
రాష్ట్రంలోని అధికారికంగా గుర్తించిన 33 షెడ్యూల్డ్ తెగలతో సహా మొత్తం 36 వర్గాల నుండి ఈ కమిటీలో ప్రతినిధులు ఉంటారని ఆయన అన్నారు.
శనివారం ఇంఫాల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఖేమ్‌చంద్
సింగ్ మాట్లాడుతూ, ప్రధాని
నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో ఈ శాంతి కమిటీ ప్రాధాన్యం గురించి చర్చించినట్లు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించేందుకు ఖేమ్‌చంద్ సింగ్ ఈ
నెల అక్టోబర్ 10న న్యూదిల్లీలో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.
యాదృచ్ఛికంగా, అదే రోజు మణిపుర్లో
భారీ హింస చెలరేగింది. 12 గంటల వ్యవధిలో
కామ్జోంగ్, కాంగ్పోక్పిఉఖ్రుల్
జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో తొమ్మిది మంది మరణించారు.
మే 3, 2023 నుంచి మెయితీ
సమాజానికి, కుకీ తెగకు మధ్య
కొనసాగుతున్న హింస ఈ ఏడాది కొంతమేరకు సద్దుమణిగింది. అయితే, ఫిబ్రవరిలో ఉఖ్రుల్ జిల్లాలో కుకీ, నాగా యువకుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత పరిస్థితి మళ్లీ
తీవ్రరూపం దాల్చింది.
దాదాపు ఎనిమిది నెలల క్రితం ప్రారంభమైన నాగ-కుకీ ఘర్షణలో
ఇప్పటివరకు కనీసం 22 మంది నాగాలు, 31 మంది కుకీలు మరణించారు. మైతేయి, కుకీ, నాగ వర్గాల
మధ్య నెలకొన్న ఈ త్రిముఖ ఉద్రిక్తత రాష్ట్ర ప్రభుత్వానికి సవాళ్లను మరింత తీవ్రతరం
చేసింది.
న్యూజీలాండ్‌తో మ్యాచ్ మధ్యలో తిలక్, నితీశ్ తెలుగులో ఏం మాట్లాడుకున్నారు?
‘తుపాను వస్తోంది ఈ జాగ్రత్తలు తీసుకోండి’ - ఏపీఎస్డీఎంఏ, గరికిపాటి ఉమాకాంత్
ఫొటో సోర్స్, X/Indiametdept
ఫొటో క్యాప్షన్, తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
బంగాళాఖాతంలో
ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారనుందని, బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి సమీపంలో చేరే అవకాశం ఉందని
ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
దీని ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు
జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
వర్షాల అంచనా:
ఆదివారం - 25-10-2026): కృష్ణా, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి
నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మంగళ, బుధవారాలు: చెదురుమదురుగా అత్యంత భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి
అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తుపాను ముప్పు
నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు
జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
అత్యవసర సహాయ నంబర్లు: ప్రజల రక్షణ
కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఏవైనా అత్యవసర సహాయాలు లేదా సమాచారం కోసం 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
విపత్తుల సంస్థ, ఆర్టీజిఎస్,
ఐఎండి పంపే వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు
గమనిస్తుండాలి.
విలువైన పత్రాలు, సర్టిఫికెట్లను
వాటర్ ప్రూఫ్ కవర్లలో భద్రపరుచుకోవాలి.
కనీసం ఒక వారానికి సరిపడా ఆహార పదార్థాలు, తాగునీరు సిద్ధం చేసుకోవాలి.
ఇంటి పైకప్పు, తలుపులు,
కిటికీలు సురక్షితంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి.
తుపాను సమయంలో ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి,
గ్యాస్ కనెక్షన్లను తొలగించాలి.
ఇల్లు సురక్షితంగా లేదని భావిస్తే ముందే పునరావాస
కేంద్రాలకు వెళ్లాలి. కాచి
చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎత్తైన, సురక్షితమైన ప్రాంతాలకు తరలివెళ్లాలి.
మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి
వేటకు వెళ్లకూడదు. పడవలు,
తెప్పలను సురక్షిత ప్రాంతాల్లో బలమైన తాడులతో
గట్టిగా కట్టాలి.
బీజేపీకి రాహుల్ థాంక్స్, ‘ఈ 7రోజులు అదే ఉత్సాహంతో ఉండండి’
ఫొటో సోర్స్, Elke Scholiers/Getty Images
ఫొటో క్యాప్షన్, నవంబర్ 1న ర్యాలీలో పాల్గొనాలని రాహుల్ కోరారు
కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవంబర్ 1న ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సర్‌లో అవకతవకలకు సంబంధించి నవంబర్ 1న దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో ఇండీ కూటమి భారీ ర్యాలీ నిర్వహించనుంది.
ఈ విషయమై రాహుల్ గాంధీ ఆదివారం 'ఎక్స్'లో ఓ పోస్టు చేశారు. "మా ఓట్లను దొంగిలిస్తున్నారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారు. నియమ నిబంధనలను ఉల్లంఘించారు. ప్రశ్నలు అడిగిన వారిపై లాఠీఛార్జ్ చేశారు." అని రాశారు.
విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, వ్యాపారవేత్తలు—ప్రజాస్వామ్యం పట్ల శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ నవంబర్ 1న జరిగే ర్యాలీకి తప్పక రావాలి. ఓటు మీదే. పోరాటం మీదే అని పిలుపునిచ్చారు.
"ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా ప్రచారం చేసి, వీలైనంత ఎక్కువ మందికి చేరేలా చేసినందుకు బీజేపీకి, దాని మిత్రపక్షాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే ఏడు రోజులు కూడా ఇదే ఉత్సాహాన్ని, అంకితభావాన్ని కొనసాగించండి!" అని రాహుల్ రాశారు.
మరోవైపు, నవంబర్ 10 తర్వాత ఈ ర్యాలీని నిర్వహించాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసింది.
రద్దీగా ఉండే దీపావళి షాపింగ్ సీజన్లో ఈ ర్యాలీ వల్ల దిల్లీ వ్యాపారాలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లవచ్చని వాణిజ్య సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.