ఆసియా కప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

ఫైనల్‌ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతోంది, దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.

లైవ్ కవరేజీ

  1. క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ: పెళ్లి చుట్టూ తిరిగిన డ్రామా మెప్పించిందా?

  2. ‘‘నేను మాట్లాడేవన్నీ నా ఫోన్ రహస్యంగా వింటోందా? అందుకే ఆ యాడ్స్ వస్తున్నాయా?’’ అని మనకు ఎందుకు అనిపిస్తుంది?

  3. దేశం విడిచి వెళ్లాలని నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు

    జ్ఞానేశ్ కుమార్‌, ఇమ్రాన్ ఖాన్‌
    ఫొటో క్యాప్షన్, జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు దేశం విడిచి వెళ్లాలని నోటీసులు

    ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 28 నాటికి భారత్‌ను విడిచి పెట్టాలని అందులో సూచించింది.

    ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొని విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు ఉన్నాయి.

    అక్టోబర్ 10న ఆగస్టు రివల్యూషన్ గ్రౌండ్స్‌లో జరిగిన నిరసనల్లో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న ఆయన్ని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు.

    ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని, నిరసనల్లో పాల్గొని విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించారని బీజేపీ నేత కృతి సౌమ్య ఆరోపించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    "విదేశీయుల చట్టాన్ని ఖాన్ ఉల్లంఘించారని గామ్దేవీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత ఆ ఫిర్యాదును ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు పంపించాం" అని పోలీసులు తెలిపారు.

    ఖాన్‌ను అమెరికా పౌరుడిగా గుర్తించి, ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంలోని 7, 29 సెక్షన్లు ఉల్లంఘించినట్టు నోటిసుల్లో పేర్కొన్నారు. దీని ఆధారంగానే నిర్దేశించిన గడువులోపు దేశం విడిచి వెళ్లాలని సూచించినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి వివరించారు.

  4. అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని ఖండించిన రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ, అంకితా భండారీ, దిల్లీ
    ఫొటో క్యాప్షన్, అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని ఖండించిన రాహుల్ గాంధీ

    అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఖండించారు.

    బాధితుల గొంతును ఈ ప్రభుత్వం నొక్కేస్తోందని, ప్రశ్నించేవారిని తప్పిస్తోందని ఆయన ఆరోపించారు.

    "ఉదయం 4 గంటలు, ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అంకితా భండారీ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. వారు చేసిన తప్పు ఏంటి?, ఇండియా గేట్ వద్ద ఎలాంటి హాంగామా లేకుండా, బాధతో నిశ్శబ్ధంగా కూర్చొని, సీబీఐ విచారణ పూర్తి అయ్యే వరకు దుష్యంత్ గౌతమ్‌ను గవర్నర్‌గా నియమించొద్దని కోరారు" అని ఎక్స్‌లో రాహుల్ గాంధీ పోస్టు చేశారు.

    "నేను, ప్రియాంక నిన్న వారిని కలిశాం. సీబీఐ దర్యాప్తు ఫలితాలు రాకముందే హడావుడిగా నియమాకాలు పూర్తి చేశారు. ప్రశ్నించిన తల్లిదండ్రులను చీకటిలో అదుపులోకి తీసుకున్నారు. బాధితుల గొంతును అణిచివేయడం, ప్రశ్నించే వారిని పక్కన పెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.

    "న్యాయం కోసం జరుగుతున్న పోరాటాన్ని ఎవరూ అణచివేయలేరు, ఆపలేరు. అంకితా భండారీ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు మద్దతు ఇస్తుంది" అని తెలిపారు.

    ఇండియా గేట్ దగ్గర నిరసన చేస్తున్న అంకితా భండారీ తల్లిదండ్రులతోపాటు పలువురిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    కొంత సమయం వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఉదయం ఐదు గంటలకు విడుదల చేసినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

  5. టీవీకే ఎమ్మెల్యే పల్లవి: ‘‘చంటి పిల్లాడిని సభలు సమావేశాలకు తిప్పుతూ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు’’ అంటూ ఆమెపై విమర్శలేంటి?

  6. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌‌కు భయపడాలా? బహిష్టు సమస్యల నుంచి సంతానలేమి వరకు.. దీనివల్ల కలిగే పరిణామాలు ఏంటి?

  7. ప్రధాని మోదీ ముందున్న 10 సవాళ్లు ఏంటి?

  8. ‘‘5 నెలల్లోనే బియ్యం బస్తా రూ.700 పెరిగింది’’ - తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

  9. ‘బౌలింగ్ వ్యూహాలే దెబ్బతీశాయి’ - శ్రేయస్ అయ్యర్

    Team India, Shreyas Iyer, West Indies, Bengaluru, Hyderabad
    ఫొటో క్యాప్షన్, “బౌలింగ్ వ్యూహాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాం” వెస్టిండీస్‌తో నాల్గో టీ20 మ్యాచ్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ వివరణ

    ఇండియా -విండీస్ మధ్యన హైదరాబాద్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. 24 పరుగుల తేడాతో వెస్టీండిస్ గెలిచింది. దీంతో ఐదు మ్యాచుల ఈ సిరీస్ 2-2తో సమమైంది. ఇక ఫలితం తేలేది ఐదో మ్యాచ్‌లోనే. ఈ మ్యాచ్ ఈనెల 17వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

    హైదరాబాద్‌లో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ బౌలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలింగ్ వ్యూహాన్ని సరిగా అమలు చేయడంలో విఫలమయ్యామని అంగీకరించాడు.

    టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. కెప్టెన్ షై హోప్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 50 బంతుల్లోనే 102 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు.

    భారత్ 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 19.3 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. టీమిండియాలో 23 బంతుల్లో 56 పరుగులు చేసిన సంజూ శామ్‌సన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత తిలక్ వర్మ 43 , నితీష్ రెడ్డి 41 పరుగులు చేశారు. కీమో పాల్ ఐదు వికెట్లు తీసుకున్నాడు.

    రన్ ఛేజ్‌లో బ్యాట్స్‌మెన్ పోరాటాన్ని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించాడు. కానీ మ్యాచ్ మధ్యలో బౌలింగ్ ప్రణాళికలను మార్చడంలో తాము విఫలమయ్యామని చెప్పాడు.

    విండీస్ బౌలర్లును శ్రేయస్ ప్రశంసించాడు. “వారు ఫీల్డ్‌ను చాలా తెలివిగా వాడుకున్నారు. ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్‌పై అదనపు బౌన్స్ కూడా లభించింది. పరిస్థితులను విండీస్ బౌలర్లు బాగా అర్థం చేసుకొన్నారు. మధ్య ఓవర్లలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు” అన్నారు.

  10. ఇంద్రకీలాద్రి: అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో రాష్ట్రపతికి ఘన స్వాగతం

    విజయవాడ, ఇంద్రకీలాద్రి, రాష్ట్రపతి
    ఫొటో క్యాప్షన్, ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

    విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతి ఇంద్రకీలాద్రికి చేరుకున్న సందర్భంగా ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.

    విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రపతికి వేద మంత్రోచ్ఛారణల నడుమ వేద ఆశీర్వచనం అందజేశారు.

    అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కనకదుర్గ అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి చిత్రపటాన్ని అందించి గౌరవపూర్వకంగా సత్కరించారు.

  11. భర్తను హత్య చేసి బ్లూ డ్రమ్‌లో దాచిన మహిళకు, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష

  12. సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్ నియామకంపై నిరసనకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ, దుష్యంత్ గౌతమ్ సిక్కిం కొత్త గవర్నర్‌గా నియమిస్తున్నట్టు ఈ నెల 12నరాష్ట్రపతి భవన్ పత్రికాప్రకటన జారీచేసింది.

    రాహుల్ గాంధీ, ధర్నా, అంకిత్ భండారీ
    ఫొటో క్యాప్షన్, అంకిత్ భండారీ తల్లిదండ్రులను కలిసిన రాహుల్ గాంధీ

    సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఇండియా గేట్ దగ్గర నిరసన తెలుపుతున్న అంకితా భండారీ తల్లిదండ్రులను కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పరామర్శించారు.

    లైంగిక వేధింపుల బాధితుల తరఫున పోరాడే సామాజిక కార్యకర్త యోగితా భయానా కూడా వారితో ఉన్నారు.

    "మేమింకా ఇండియా గేట్ దగ్గరే ఉన్నాం. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు దుష్యంత్ కుమార్ గౌతమ్ నియామకాన్ని తక్షణమే నిలిపివేయాలని అంకితా భండారీ కుటుంబం డిమాండ్ చేస్తోంది" అని యోగితా భయానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

    దుష్యంత్ కుమార్‌ను జైలులో పెట్టాలని అంకితా భండారీ తండ్రి వీరేంద్ర సింగ్ భండారీ డిమాండ్ చేశారు.

    దుష్యంత్ గౌతమ్ సిక్కిం కొత్త గవర్నర్‌గా నియమిస్తున్నట్టు ఈ నెల 12నరాష్ట్రపతి భవన్ పత్రికాప్రకటన జారీచేసింది.

    పౌరీ గఢ్వాల్ జిల్లాలోని గంగా-భోగ్‌పూర్ ప్రాంతంలో ఉన్న వనంతర టూరిస్ట్ రిసార్ట్‌లో అంకితా భండారీ రిసెప్షనిస్ట్‌గా పనిచేసేవారు. 2022లో ఆమెపై లైంగిక దాడి చేసి, ఆమెను హత్య చేసినట్టు ఆరోపణలొచ్చాయి.

    ఈ కేసులో తన పేరు వెలుగులోకి వచ్చిన తర్వాత అప్పటి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాఖండ్ రాష్ట్ర ఇన్‌చార్జ్ దుష్యంత్ కుమార్ గౌతమ్ తనపై ఆరోపణలను ఖండిస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ దాఖలయింది.

    హరిద్వార్‌లోని జ్వాలాపూర్ మాజీ ఎమ్మెల్యే సురేశ్ రాథోర్, నటి ఊర్మిళ సనావర్‌ కొందరు గుర్తుతెలియని వ్యక్తులతో కలిసి తనపై పక్కా ప్రణాళికతో నేరపూరిత కుట్ర పన్నారని దెహ్రాడూన్‌లోని దలన్‌వాలా పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదులో దుష్యంత్ గౌతమ్ ఆరోపించారు.

    అంకితా భండారీ హత్య కేసు దర్యాప్తు, చార్జిషీట్, కోర్టు విచారణ ప్రక్రియలన్నింటిలో తన పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదని కూడా దుష్యంత్ గౌతమ్ చెప్పారు.

    ఫిర్యాదులో కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన ఆరోపణలు చేశారు.

  13. జనసేనలో చేరిన వంగవీటి రాధ

    వంగవీటి రాధాకృష్ణ
    ఫొటో క్యాప్షన్, జనసేనలో చేరిన వంగవీటి రాధ

    టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి వంగవీటి రాధను పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.

    పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన వంగవీటి రాధాకృష్ణను పవన్ కల్యాణ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.

    అనంతరం వంగవీటి రాధ తన అనుచరులను పవన్ కల్యాణ్‌కు పరిచయం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు వెళ్దామని పవన్ వారితో అన్నారు.

  14. వద్దన్నా కుప్పలు తెప్పలుగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పార్సిళ్లు, తట్టుకోలేక విదేశాలకు వెళ్లిపోయిన ఇన్‌ఫ్లూయెన్సర్

  15. జాతీయ జెండా ఎగురవేసినవారిని జైల్లో పెట్టడం పిరికితనం -రాహుల్

    రాహుల్ గాంధీ, సీజేపీ, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, దిల్లీ పోలీసులు
    ఫొటో క్యాప్షన్, సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ అరెస్టుపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

    జంతర్ మంతర్‌లో జాతీయ జెండా ఎగరేయడం నేరం కాదు, కానీ ఆ పనిచేసిన కొందరిని జైల్లో పెట్టడం పిరికితనమే అన్నారు లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ.

    సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి పంపడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్‌ ఖాతాలో స్పందించారు.

    “జంతర్ మంతర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి శాంతియుతంగా నిరసన తెలపడం నేరం కాదు. యువకులను జైల్లో వేయడం పిరికితనం” అని రాహుల్ గాంధీ విమర్శించారు.

    "విద్యార్థులు, యువతరం, జర్నలిస్టులు, ‘ఇండియా’ బ్లాక్ పార్టీల బ్యానర్లు వేర్వేరు కావచ్చు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. ఒకే విషయం గురించి నిరసనలు జరుగుతున్నాయి. పౌరులు తమ రాజ్యాంగబద్ధమైన హక్కులను కోరుతున్నారు. జంతర్ మంతర్ దేశ ప్రజలది. దాన్ని తిరిగి సాధించుకుంటాం’’ అని రాహుల్ స్పష్టం చేశారు.

    ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో విమర్శించారు.

    "త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి, భారత్ మాతాకి జై అని నినాదాలు చేసిన సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను మీరు జైలుకు పంపించారు. యువతతో పెట్టుకోవద్దు మోదీజీ, త్వరలోనే మీ నియంతృత్వానికి ముగింపు పలుకుతారు" అని సంజయ్ సింగ్ రాసుకొచ్చారు.

    మంగళవారం జంతర్ మంతర్‌లోకి అక్రమంగా చొరబడ్డారని సీజేపీ నాయకులపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

  16. మనం మాట్లాడుకోవడం తగ్గిస్తున్నామా? దారి తెలియకపోతే అడగడం కూడా మానేశామా?

  17. పాకిస్తాన్‌: ఇమ్రాన్ ఖాన్ కంచుకోటలో ఎమర్జెన్సీ, ప్రభుత్వం తప్పు చేస్తోందంటున్న నిపుణులు

  18. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్‌కు 5 రోజుల కస్టడీ

    దిల్లీ, జంతర్ మంతర్
    ఫొటో క్యాప్షన్, సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా

    జంతర్ మంతర్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలపై సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను మందిర్ మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం వారిని 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

    అంతకు ముందు సీజేపీ నేతల అరెస్టుపై కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన న్యాయ వ్యవహారాల చీఫ్ రత్న సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    "న్యాయవాదులను కలిసేందుకు కూడా వారిని అనుమతించలేదు. తెల్లవారుజామున 3 గంటలకు ఒక ప్రైవేట్ వాహనంలో వారిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారి మనోధైర్యం ఏమాత్రం తగ్గలేదు." అని పేర్కొన్నారు.

    "అనుమతి లేకుండా ప్రవేశించడం, బాండ్ షరతులు ఉల్లంఘించడం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు సీజేపీ నేతలపై మోపారు" అని రత్న సింగ్ 'ఎక్స్'లో పోస్ట్‌ చేశారు.

  19. నీటిలో మునిగిపోయిన ఈ గ్రామానికి కోహినూరు వజ్రానికి లింకేంటి, జనం ఇంకా అక్కడ ఎందుకు తవ్వుతున్నారు?

  20. గుడ్ మార్నింగ్, బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం,

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేశ్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.