మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

అక్రమాస్తుల కేసులో జగన్‌కు, సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు

ఈ కేసులో విచారణలో ఆలస్యానికి కారణాలను తెలియజేస్తూ, విచారణ మరో రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయకూడదో తమ వాదన తెలపాలంటూ సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

లైవ్ కవరేజీ

  1. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రతిపక్షాలు ఏమన్నాయంటే..

    కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు. ఇది యువత నేతృత్వంలో సాగిన ఉద్యమ విజయంగా అభివర్ణించారు.

    ఇది "దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని కోరుతూ వీధుల్లోకి వచ్చిన మన లక్షలాది మంది యువత సాధించిన విజయం" అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

    ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ దీనిని, "దేశ యువత సమైక్య బలంతో సాధించిన ఒక భారీ విజయంగా అభివర్ణించారు. ఆయన ఎక్స్ పోస్టులో "అణచివేతకు భయపడకుండా అన్యాయానికి వ్యతిరేకంగా యువత బలంగా నిలబడి, ప్రభుత్వం నైతిక బాధ్యత వహించేలా చేసిన ఈ పోరాటం. ప్రజాస్వామ్య బలానికి నిదర్శనంగా నిలుస్తుంది" అని రాశారు.

    ఇది "యువత సాధించిన పెద్ద విజయం" అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే, భవిష్యత్తులో పేపర్ లీక్‌లను అరికట్టడానికి, పరీక్షా విధానాలను బలోపేతం చేయడానికి ఈ ఘటన అన్ని రాజకీయ పార్టీలకు ఒక పాఠంగా ఉపయోగపడాలని అభిలషించారు.

    ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిని "ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం"గా అభివర్ణించారు.

  2. ధర్మేంద్ర ప్రధాన్: ఒకప్పుడు పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి.. ఇప్పుడు అదే వ్యవహారంలో రాజీనామా, విద్యార్థి నేత నుంచి కేంద్ర మంత్రి వరకు..

  3. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, 'మనం సాధించాం' అన్న సీజేపీ

  4. సోనమ్ వాంగ్‌చుక్: ‘బాధ, ఆవేదన, కోపంతో ఈ మాటలు మాట్లాడుతున్నా’

  5. 'పుట్టబోయే బిడ్డ ప్రాణాలతో ఉండకూడదనుకున్న తల్లి', కానీ ప్రసవం తర్వాత ఏం జరిగింది?

  6. దిల్లీ నిరసనలు: పెల్లెట్ గన్ అంటే ఏంటి, ఎందుకు వివాదాస్పదంగా మారింది?

  7. 92 ఏళ్ల వయసులోనూ సర్జరీలు చేస్తున్న లేడీ డాక్టర్

  8. సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ వైఖరుల్లో ఈ వ్యత్యాసం ఎందుకు, నడ్డా చేతులమీదుగా దీక్ష విరమణపై వస్తున్న ప్రశ్నలేంటి?

  9. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడాన్ని ఎలా చూడాలి?

  10. సెక్స్ తర్వాత ఎంతసేపటిలో పిల్స్ వేసుకుంటే గర్భం రాదు?

  11. మూవీ రివ్యూ: ఇది ‘లేడీ దేవదాస్’ కథా?

  12. దోమలపై యుద్ధానికి రంగంలోకి సైన్యం, మిలటరీ డ్రోన్లు.. శ్రీలంకలో ఏం జరుగుతోంది?

  13. ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడం మోదీ ప్రభుత్వానికి కష్టతరమా?

  14. జంతర్ మంతర్: వాష్‌రూమ్స్, ఫుడ్, మెడిసిన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నామంటే..

  15. ప్రభుత్వంతో సీజేపీ చర్చలు జరగకపోవడానికి కారణమదేనా?

    కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను గురువారం చర్చలకు ఆహ్వానించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివాసం లేదా కార్యాలయంలో చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

    అయితే, చర్చల వేదికపై సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా అభ్యంతరం వ్యక్తం చేశారు. "చర్చలు తటస్థ ప్రదేశంలో జరగాలి" అని అన్నారు.

    జంతర్ మంతర్ వద్ద ఉన్న మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, "జంతర్ మంతర్‌కు రావడానికి వాళ్లు భయపడుతున్నారు. అందుకే, మీ నివాసం లేదా జంతర్ మంతర్ కాకుండా మరోచోట చర్చలు జరగాలని వారికి సూచించాం" అని ఆయన అన్నారు.

    "కానీ, జితేంద్ర సింగ్ మాత్రం జేపీ నడ్డా నివాసం లేదా ఆయన కార్యాలయంలో చర్చలు జరుపుదామని అంటున్నారు."

    చర్చావేదిక విషయంలో సీజేపీ, ప్రభుత్వానికి మధ్య సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు పట్టుబడుతున్నారు.

  16. ప్రీటర్మ్ డెలివరీ: నెలలు నిండకముందే పుట్టిన పిల్లలకు జీవితాంతం సమస్యలు తప్పవా? అపోహలు - సమాధానాలు

  17. జన నాయకుడు మూవీ రివ్యూ: విజయ్ 'చివరి సినిమా' ఎలా ఉంది?

  18. సీదిరి అప్పలరాజు అరెస్ట్: యాక్సిడెంట్ కేసు నుంచి కొడుకును తప్పించేందుకు ప్రయత్నించారా?

  19. మోదీ కంటే ముందు ప్రధాన మంత్రులు ఎక్కడ నివసించారు? తెలుగుదేశం ఎంపీలు 2013లో అప్పటి ప్రధాని నివాసం సమీపంలో ఎందుకు నిరసన తెలిపారు

  20. ‘యువత సంక్షేమం, భవిష్యత్ కంటే మరేదీ ముఖ్యం కాదు’

    యువత సంక్షేమం, భవిష్యత్ కంటే మరేదీ ముఖ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

    ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి త్వరితగతిన, కఠిన శిక్ష పడేలా చేసేందుకు ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించినట్లు మోదీ చెప్పారు.

    ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, అథారిటీలను ఆదేశించినట్లు తెలిపారు.

    విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు తాము చేపడుతున్న చర్యలలో ఇది కూడా ఒకటని అన్నారు.

    యువత భవిష్యత్‌కు నష్టం చేకూర్చాలని ప్రయత్నించే వారిని ఎట్టిపరిస్థితుల్లో తాము వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ హెచ్చరించారు.