మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

ఖతార్ - దహ్రా గ్లోబల్ కేసు: మరణ శిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గింపుపై కేంద్రం ఏం చెప్పింది?

ఈ ఎనిమిది మందిలో విశాఖపట్నానికి చెందిన పాకాల సుగుణాకర్ ఒకరు. కేసు అప్పీలుపై విచారణకు ఖతార్‌లో భారత రాయబారి, ఇతర అధికారులు హాజరయ్యారు.

లైవ్ కవరేజీ

  1. సీజేపీ ఆందోళనలు: పోలీసులు విమానంలోకి వచ్చి అరెస్టు చేయవచ్చా?

  2. రష్యా-యుక్రెయిన్ మధ్య 'ఎనర్జీ సీజ్ ఫైర్' కుదిరిందన్న డోనల్డ్ ట్రంప్

    రష్యా యుక్రెయిన్‌ల మధ్య “ఇంధన వనరులపై దాడుల విరమణకు అంగీకారం కుదిరిందని ఇది తక్షణమే అమలులోకి వస్తుందని” అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ తెలిపారు.

    దీనిపై రష్యా స్పందించలేదు.

    ట్రంప్ ప్రకటన తనకు “కొత్త వార్త” అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ అన్నట్లు అమెరికా వార్తా వెబ్‌సైట్ ఆక్సియోస్ తెలిపింది.

    అంతకుముందు రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులను “తక్షణమే ఆపాలి” అని అధ్యక్షుడు ట్రంప్ యుక్రెయిన్‌ను హెచ్చరించారు. ట్రంప్- జెలియన్‌స్కీ మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది.

    “రష్యా మా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఆపివేస్తే, మేం రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేయడం ఆపేస్తాం” అని జెలియన్‌స్కీ ఆదివారం చెప్పారు.

  3. ‘స్మైలింగ్ డిప్రెషన్’: మీ చిరునవ్వు వెనుక డిప్రెషన్ కూడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి

  4. ఎవరీ నేహా బోరా? బీజేపీకి మద్దతు ఇచ్చే కుటుంబం నుంచి వచ్చి ఉద్యమాల ముఖచిత్రంగా ఎలా మారారు?

  5. చీర ధరించి 1600 మీటర్ల పరుగు పందాన్ని 9 నిమిషాల్లో పూర్తి చేసిన కవిత..

  6. భారత టెక్ దిగ్గజాలపై అమెరికా చర్యలు: గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర ఆలస్యం తప్పదా?

  7. అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్‌ రాంకా విడుదల

    కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విడుదల చేసినట్లు సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్ ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు.

    శనివారం ఉదయం ముంబయి నుంచి దిల్లీకి వచ్చిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సహ కన్వీనర్ సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రాంకాను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు.

    "అభిజిత్, అశుతోష్, సౌరవ్‌లను ఈరోజు ఉదయం 9 గంటలకు దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు" అని రత్నా సింగ్ తెలిపారు.

    "దిల్లీ పోలీసు అధికారి ఒకరు ఈరోజు ఉదయం నాకు ఈ సమాచారం ఇచ్చారు. సీజేపీ లీగల్ హెడ్ హోదాలో, మా తరఫున హాజరయ్యే ఇతర వకీళ్లతో కలిసి నేను పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో ఉంటాను" అని చెప్పారు.

    అంతకుముందు, సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను ముందస్తు నిర్బంధంలో ఉంచామని, వారిని నేడు దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు దిల్లీ పోలీసులు చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

    మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా ముగ్గురు నాయకుల నిర్బంధంపై స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

    "మోదీ, షా ఎంతలా భయపడ్డారంటే నేడు వారు పిల్లలను అపహరిస్తున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది" అని ఎక్స్‌లో పేర్కొన్నారు

  8. దిల్లీలో నేడూ నిరసనలు కొనసాగుతాయి: నేహా బోరా

    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ దిల్లీలో జరుగుతున్న నిరసనలు ఆదివారం కూడా కొనసాగుతాయని అఖిల భారత విద్యార్థి సంఘం (ఐసా) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ప్రకటించారు.

    సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన నేహా బోరా, శనివారం దిల్లీ హాట్ 'జంతర్-మంతర్'‌గా మారిందని, ఆదివారం వేరే ప్రదేశంలో నిరసన తెలుపుతామని చెప్పారు.

    "సామాన్యులను జైళ్లలో పెడతారా లేక జ్ఞానేశ్ కుమార్‌‌నా అనేది మీరే తేల్చుకోండి. మేం ఆదివారం కూడా వీధుల్లోకి వస్తాం, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఎస్‌ఐఆర్ రద్దు డిమాండ్‌తో నిరసన ప్రదర్శన చేస్తాం" అని అన్నారు.

    మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేత అజింక్య శిందే ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసి ఆదివారం జరగనున్న నిరసన వివరాలు వెల్లడించారు.

    "జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఇళ్లకు తిరిగి వెళ్లం" అని ఆయన పేర్కొన్నారు.

    తాము రేపు ఉదయం 10 గంటలకు మళ్లీ జంతర్-మంతర్ వైపు కవాతు చేస్తామని అజింక్య చెప్పారు. అలాగే భారీ సంఖ్యలో జంతర్-మంతర్‌కు చేరుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

  9. యుక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయమొచ్చింది: డోనల్డ్ ట్రంప్

    యుక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు. రష్యాతో అమెరికా కుదుర్చుకున్న డీజిల్ ఒప్పందంపై జెలియెన్ స్కీ చేసిన విమర్శలకు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    రష్యా నుంచి లక్షల టన్నుల డీజిల్‌ను అమెరికాకు సరఫరా చేసేందుకు కొత్త ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల.. యుక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు మాస్కోకు డబ్బు అందించినట్లవుతుందని జెలియెన్ స్కీ హెచ్చరించారు. ఈ ఒప్పందాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇచ్చే బహుమతిగా జెలియెన్‌ స్కీ అభివర్ణించారు.

    శనివారం వైట్‌హౌస్‌ వెలుపల విలేఖరులతో ట్రంప్‌ మాట్లాడారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులకు జెలియెన్ స్కీ అనుమతులు ఇస్తూ.. ప్రపంచానికి సమస్యలు సృష్టిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు.

    ‘‘ఆయన ఈ పని కచ్చితంగా ఆపేయాలి’’ అన్నారు. ఒప్పందం కుదుర్చుకోగల కొత్త నాయకుడిని యుక్రెయిన్‌ ఎన్నుకోవాలని సూచించారు.

  10. ‘నా కోచ్‌లో మగవాళ్లు మద్యం తాగుతున్నారు’ అంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన అస్సాం యువతి తర్వాతి రోజు శవంగా కనిపించారు..

  11. దిల్లీ : 12 ఫోటోలలో సీజేపీ ఆందోళన

  12. తనిఖీలు,నిర్బంధాలు,ఇంటర్‌నెట్ బంద్, ఎక్కడికక్కడ బారికేడ్లు.. దిల్లీలో ఇప్పటిదాకా ఏం జరిగింది, బీజేపీ ఏమంది?

  13. సీజేపీ ప్రతినిధులను విమానంలోనే ఎలా అదుపులోకి తీసుకున్నారంటే...

  14. రష్యా నుంచి చమురు దిగుమతికి ట్రంప్ నిర్ణయం: అమెరికన్ల ఆశ్చర్యం, జెలియెన్‌స్కీ ఆగ్రహం

  15. ముకేశ్ అంబానీని 'ప్రధానమంత్రి' అంటూ కామెంట్ చేసిన ఎలాన్ మస్క్, వీరి మధ్య వివాదం ఏంటి?

  16. జంతర్ మంతర్‌కు వస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

    దిల్లీలోని జంతర్-మంతర్‌కు వస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్నారు.

    సీజేపీ నిరసనను దృష్టిలో ఉంచుకుని దిల్లీ రైల్వే స్టేషన్లు, హోటళ్లు, ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్న ప్రయాణికులను, హోటళ్లలో బస చేస్తున్నవారిని తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా నిరసనలో పాల్గొనడానికి దిల్లీకి చేరుకుంటున్న వారిపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

    జంతర్-మంతర్ వద్ద తలపెట్టిన నిరసనకు ముందే ఫిరోజ్ షా రోడ్డు, మండి హౌస్‌ల వద్ద రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను మోహరించారు. అలాగే దిల్లీ-నోయిడా సరిహద్దులో కూడా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

    నిరసన పిలుపు నేపథ్యంలో దక్షిణ జిల్లాతో పాటు మొత్తం దిల్లీలో సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేశామని దక్షిణ దిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. అనధికార వ్యక్తులు దిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు తనిఖీల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు.

    డీసీపీ అనంత్ మిట్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిరసన సమయంలో శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల ప్రథమ ప్రాధాన్యం. ఇందుకోసం వివిధ సరిహద్దుల్లో దాదాపు 12 పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జిల్లా అంతటా అనేక చోట్ల పోలీసు పికెట్లను ఏర్పాటుచేశారు.

  17. యూట్యూబర్ ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    సీజేపీ నిరసన నేపథ్యంలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీని పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

    బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా తెలిపిన వివరాల ప్రకారం, ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఆయన సన్నిహితుడు, అలాగే గురుగ్రామ్ పోలీసులు ధ్రువీకరించారు. గురుగ్రామ్ సెక్టార్-56 నుంచి ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన సన్నిహితుడు తెలిపారు. పీటీఐ వార్తా సంస్థ కూడా రాఠీ అరెస్టు గురించి సమాచారం ఇచ్చింది.

    అంతకుముందు, ధ్రువ్ రాఠీ శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో ఒక రీల్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఇండియా గేట్ ఎదురుగా తిరుగుతూ కనిపించారు.

    “నేను దిల్లీకి వచ్చాను. ప్రధానమంత్రి 50కి పైగా మెట్రో స్టేషన్లను మూసివేశారని, అనేక రైళ్లు, బస్సులను రద్దు చేశారని విన్నాను. నిరసన కారణంగా దిల్లీని లాక్‌డౌన్‌లో ఉంచుతున్నారు” అని ఆ వీడియోలో ధ్రువ్ రాఠీ అన్నారు.

    “మోదీజీ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మా నిరసనలో జనసంచారం ఉండదని ఒకవైపు మీ ఐటీ సెల్ చెబుతోంది. ఒకవేళ జనం రాకపోతే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీరు భయపడ్డారని భావిస్తున్నాను. నిజానికి ప్రజలందరూ మేల్కొన్నారు” అన్నారు.

    ఈ నిరసనలో పాల్గొనడానికి జంతర్ మంతర్ చేరుకుంటున్న పలువురు ఆందోళనకారులను కూడా దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    మరోవైపు, ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా ఈరోజు మధ్యాహ్నం ముంబయిలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్‌లో నిరసన ప్రదర్శన ఉండటంతో, సామాజిక కార్యకర్తలు తుషార్ గాంధీ, ఫిరోజ్ మిథిబోర్వాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు 'హం భారత్ కే లోగ్' సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

  18. "రైలు ఎక్కి తనిఖీలు చేశారు, పోలీసుల నిర్బంధాలు చూస్తే భయమేస్తోంది"-తెలుగు రాష్ట్రాల యువకులు ఇంకా ఏం చెప్పారు?

  19. దిల్లీ: జంతర్ మంతర్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత, కఠిన ఆంక్షలు

    కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో జంతర్-మంతర్ అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దిల్లీ పోలీసులు భారీగా భద్రతా బలగాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఆంక్షలను కఠినతరం చేశారు.

    పోలీసు బలగాలు, సెక్యూరిటీ ఫోర్సులు, పోలీసు వ్యాన్‌లు కనిపిస్తున్న కొన్ని ఫోటోలను ఏఎన్‌ఐ వార్తా సంస్థ విడుదల చేసింది.

    సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనకు అనుమతి లభించలేదు. అయినా తాము జంతర్-మంతర్‌కు చేరుకుంటామని సీజేపీ నాయకులు చెబుతున్నారు. చరిత్ర సృష్టిస్తామని పార్టీ సహ కన్వీనర్ అశుతోష్ రాంకా శుక్రవారం రాత్రి పేర్కొన్నారు.

    "ప్రియమైన కాక్రోచ్‌లు.. మనం ఇప్పటివరకు ఎంత దూరం ప్రయాణించామో తలచుకుంటే గర్వంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మనం కచ్చితంగా చరిత్ర సృష్టిస్తాం" అని అశుతోష్ రాంకా ఎక్స్ పోస్టులో తెలిపారు.

    అలాగే, "ఒకటే గుర్తుంచుకోండి - చేతిలో రాజ్యాంగం, గుండెల్లో గాంధీ. ఏం జరిగినా మన చేయి ఎత్తరాదు. భారత్ మాతా కీ జై" అని రాశారు.

    ఆయనతో పాటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, సామాజిక రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్, ఐసా అధ్యక్షురాలు నేహా బోరా, ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ కూడా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

  20. రష్యాతో డీజిల్ దిగుమతికి అమెరికా ఒప్పందం

    ఇంధన ధరలను తగ్గించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్న అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా నుంచి అమెరికాకు డీజిల్‌ దిగుమతి చేసుకునే ఒప్పందాన్ని ప్రకటించారు.

    అమెరికా, ప్రపంచ మార్కెట్ల కోసం 3 లక్షల టన్నుల డీజిల్‌ను తక్షణమే సరఫరా చేయడానికి పుతిన్ అంగీకరించారని, నవంబర్‌లో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత మరో మిలియన్ టన్నులు ఇస్తారని ట్రంప్ తెలిపారు.

    శుక్రవారం నాటి ఈ నిర్ణయంపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పుతిన్‌కు బహుమతి అని, అంతం కావాల్సిన యుద్ధాన్ని పొడిగించే పెట్టుబడిగా అభివర్ణించారు.

    ఈ ఒప్పందంలో భాగంగా రష్యన్ డీజిల్ ఎగుమతులపై ఆంక్షలను అమెరికా ట్రెజరీ ఏప్రిల్ 7 వరకు ఎత్తివేసింది. అయితే, అమెరికా బ్యాంకుల్లో ఉన్న మిగతా రష్యన్ ఆస్తులపై ఆంక్షలు అలాగే ఉన్నాయి.

    యుక్రెయిన్ దాడుల కారణంగా దెబ్బతిన్న రిఫైనరీల పనితీరును బట్టి, త్వరలోనే మరో 3 మిలియన్ టన్నుల రష్యన్ డీజిల్ సరఫరా అవుతుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.