మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

మాల్దీవులు: ప్రధాని మోదీపై వివాదాస్పద పోస్టులు పెట్టిన ముగ్గురు మంత్రుల సస్పెన్షన్

నరేంద్ర మోదీ లక్షదీవుల సందర్శనపై మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన అనంతరం భారత్‌లో ఆగ్రహం వ్యక్తమవడంతో అక్కడి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

లైవ్ కవరేజీ

  1. ‘ఐ డోంట్‌ కేర్‌.. గెలిస్తే గెలుస్తా, లేదంటే ఓడిపోతా.. ఫైట్ అయితే తప్పదు’.. ఏబీ వెంకటేశ్వరరావు బీబీసీ ఇంటర్వ్యూలో ఇంకా ఏమేం చెప్పారు?

  2. Ind vs Nz: భారత్ టార్గెట్ 226, పది ఓవర్లకు 119/3

    క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పది ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.

    భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి ఐదు ఓవర్లలో 16 రన్ రేట్‌తో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సంజూ శామ్సన్ 33 బంతుల్లో 67 పరుగులు, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యారు. తిలక్ వర్మ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. క్రీజులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఉన్నారు.

    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజీలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అలెన్ 24 బంతుల్లో 45 పరుగులు చేయగా, సీఫర్ట్ 24 పరుగులు సాధించాడు. డారిల్ మిచెల్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

    నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫిలిప్స్, నాలుగో వికెట్‌కు బెవన్ జాకబ్స్‌తో కలిసి 32 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫిలిప్స్ 40 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు.

    జాకబ్స్ 16 బంతుల్లో మూడు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

    ఈ మ్యాచ్‌తో పేసర్ భువనేశ్వర్ కుమార్ 2022 తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.

  3. దసరా పండుగను అక్కడ 76 రోజుల పాటు జరుపుకుంటారు, కానీ రావణ దహనం మాత్రం ఉండదు

  4. స్థానిక సంస్థల ఎన్నికలు: తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

  5. ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలు: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

    సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 19 ప్రాంతాల్లోనే ఆపాలని భావించినా, ఇప్పుడు మొత్తం 100 స్థానాల్లో ఆపేస్తున్నట్లు పేర్కొంది.

    అభ్యర్థుల జాబితా ప్రకటన ఈ నెల 25 వరకు వాయిదా వేయడంపై ఇవాళ నిర్ణయించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీల నివేదికల ఆధారంగా తుది నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

    రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో నామినేషన్లు వేసే అవకాశం తమ పార్టీ అభ్యర్థులకు కల్పించలేదని సుప్రీంకోర్టులో వైసీపీ పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దని ఆదేశించింది. గురువారం ఒక నిర్ణయం ప్రకటించాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

    సుప్రీంకోర్టు ఆదేశాలపై బుధవారం న్యాయనిపుణులతో చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా నోటిఫికేషన్ వచ్చిన 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.

  6. ఏపీ మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల గడువుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  7. '2022లో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా’ : సౌదీ కఠిన చట్టాలు తెలుసుకోకపోతే ప్రమాదమే

  8. గరివిడి లక్ష్మి: ‘మూణ్నాలుగు జిల్లాలకు తెలిసిన నన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు’

  9. పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ

  10. కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?

  11. హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

  12. పంజాబ్‌లో కుటుంబాన్ని తుపాకీతో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్న పోలీస్

    పంజాబ్‌లోని మాన్సాలో పోలీసు కానిస్టేబుల్ కుటుంబంపై కాల్పులు జరిపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

    ఈ కాల్పుల్లో ఒక కుమారుడు చనిపోగా, భార్య, మరో కుమారుడు గాయపడినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

    గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

    ఈ ఘటన ఉదయం 7గంటల ప్రాంతంలో జరిగిందని మాన్సా ఎస్ఎస్సీ చెప్పారు.

    కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు ఆయన పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలిస్తాయని వెల్లడించారు.

    సర్వీస్ తుపాకీతోనే కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు.

    మన్సా డిప్యూటీ కమిషనర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా ఆయన పని చేస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.

    (ఆత్మహత్య అనేది ఒక తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే, భారత ప్రభుత్వానికి చెందిన 'జీవన్ ఆస్థా' (Jeevan Aastha) హెల్ప్‌లైన్ నంబర్ 18002333330 ద్వారా సహాయం పొందవచ్చు. అలాగే, మీ స్నేహితులు, బంధువులతో కూడా మాట్లాడండి.)

  13. ‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్

  14. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. ఫోటోల్లో

  15. ‘‘నన్ను బలవంతంగా టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లాడు, నేను కళ్లు మూసుకుని అక్కడ లేననుకున్నా’’

  16. దసరా: మీకు పాలపిట్ట కనిపించిందా?

  17. అమిలీయా ఇయర్‌హార్ట్: 90 ఏళ్ల కిందట ప్రపంచాన్ని చుట్టిరావాలని బయల్దేరిన ఈ మహిళ ఎలా అదృశ్యమయ్యారు, ఈ మిస్టరీని ఛేదిస్తారా?

  18. ఆస్ట్రేలియా: ఎంపీని కారుతో గుద్ది హత్యాయత్నం

    ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హెయిన్స్‌ను కారు ఢీకొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించారు.

    విక్టోరియాలోని వాంగరట్టాలో తన కార్యాలయం బయట పార్కింగ్‌లో ఉండగా, సోమవారం మధ్యాహ్నం కారు ఢీకొనడంతో హెలెన్ హెయిన్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. అయితే దాడి వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

    హెయిన్స్‌ను ఢీకొట్టడానికి కారు డ్రైవర్ యూ టర్న్ తీసుకు వచ్చినట్టు కనిపిస్తోందని అల్బనీస్ అన్నారు. కారు నడుపుతున్న 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

    హెలెన్ హెయిన్స్ ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో గల ఇండి డివిజన్‌కు చెందిన 65 ఏళ్ల స్వతంత్ర ఎంపీ.

    ఆమె 2019లో తొలిసారిగా ఆస్ట్రేలియన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికయ్యారు. 2022, 2025లలో తిరిగి ఎన్నికయ్యారు.

    రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు ఆమె నర్సుగా, ప్రజారోగ్య పరిశోధకురాలిగా పనిచేశారు.

  19. ఇజ్రాయెల్ నుంచి ఆస్ట్రియా వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు

    ఇజ్రాయెల్ నుంచి ఆస్ట్రియాకు వెళ్తున్న ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని బల్గేరియా రాజధాని సోఫియాకు మళ్లించారు.

    ‘‘ఆదివారం రాత్రి (అక్టోబర్ 18) టెల్ అవీవ్ నుంచి వియన్నాకు ప్రయాణిస్తున్న ఎయిర్‌బస్ ఏ320 విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందన్న సమాచారం అందడంతో విమానాన్ని సోఫియాకు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు’’ అని బల్గేరియా రవాణామంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

    విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్టు బల్గేరియా, ఇజ్రాయెల్ మీడియా సంస్థలు వెల్లడించాయి.

    విమానంలో 51 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి బీబీసీకి తెలిపారు. బాంబు బెదిరింపు సమాచారం అందిన దాదాపు 30నిమిషాల తర్వాత విమానం సోఫియాలో ల్యాండ్ అయింది.

    ‘‘సోఫియాలో విమానం దిగిన తర్వాత అధికారులు భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో అనంతరం ఆ విమానంలోనే ప్రయాణీకులందరినీ ఎక్కించారు. విమానం తర్వాత సురక్షితంగా వియన్నాలో ల్యాండ్ అయింది’’ అని ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

  20. భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా

    అజిత్ అగార్కర్ స్థానంలో ప్రజ్ఞాన్ ఓఝాను చీఫ్ సెలెక్టర్‌గా బీసీసీఐ నియమించింది.

    భారత మాజీ క్రికెటర్ రమేశ్ పొవార్‌ను పురుషుల క్రికెట్ జట్టు కొత్త సెలెక్టర్‌గా నియమించింది.

    అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ), పురుషుల సెలక్షన్ కమిటీ సభ్యుని నియామకం కోసం ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

    దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించి, బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం రమేశ్ పొవార్ పేరును ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్టు తెలిపింది.

    పురుషుల సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ చేసిన సేవలను, ఆయన నిబద్ధతను, కృషిని బీసీసీఐ ప్రశంసించింది.

    2023జూలైలో అగార్కర్‌ చీఫ్ సెలక్టరయ్యాడు.

    అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ప్రాతిపదిక ఆధారంగా ప్రజ్ఞాన్ ఓఝా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉంటాడని బీసీసీఐ తెలిపింది.

    రమేశ్ పొవార్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో భారత్ తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టుతో పాటు ముంబై, గుజరాత్‌ జట్లకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బౌలింగ్ కోచ్‌గా కూడా సేవలందించాడు.