కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.

లైవ్ కవరేజీ

  1. అమెరికాలో కాల్పులు, ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

    అమెరికాలో కాల్పులు
    ఫొటో క్యాప్షన్, సియాటెల్‌లో కాల్పులు

    అమెరికాలోని సియాటెల్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారని సియాటెల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. రెండేళ్ల చిన్నారి, ముగ్గురు మహిళలు సహా ఐదుగురు గాయపడ్డారని తెలిపింది.

    నగరంలో ప్రముఖ ప్రాంతమయిన స్పేస్ నీడిల్ దగ్గరలో ఉన్న సియాటెల్ సెంటర్‌లో ఈ కాల్పులు జరిగాయి.

    కాల్పుల్లో గాయపడ్డ రెండేళ్ల బాలుణ్ని ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. గాయపడ్డవారిలో 56ఏళ్ల మహిళ ఉన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

    "సియాటెల్ సెంటర్‌లో కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం. దయచేసి ఆ ప్రాంతానికి దూరంగా ఉండండి" అని సియాటెల్ పోలీసులు ‘ఎక్స్’లో తెలిపారు.

    ఘటనాస్థలంలో భారీగా పోలీసులు, అత్యవసర సర్వీసులుకు చెందిన వారిని మోహరించినట్టు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోల్లో కనిపిస్తోంది.

    సియాటెల్ సెంటర్‌లో బైట్ ఆఫ్ సియాటెల్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఏటా జరిగే ఈ కార్యక్రమంలో ఆహార స్టాల్స్, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు ఉంటాయి. దీనికి లక్షలాది మంది హాజరవుతారు.

    అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల సమయంలో వరుసగా పలుమార్లు కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ సియాటెల్ టైమ్స్ తెలిపింది.

    కాల్పుల శబ్దం వినిపించగానే అక్కడి నుంచి పరుగులు తీశామని బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడిన పలువురు ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

    మొదట బాణాసంచా పేలుళ్లేమో అనుకున్నామని ప్రత్యక్ష సాక్షులన్నారు.

    ‘‘అందరూ పరుగులు తీస్తుండంతో మేమూ వారితో పాటు పరుగెత్తాం. అక్కడి నుంచి దూరంగా వెళ్లాలనుకున్నాం. మేం ఎక్కడ ఉన్నామో తెలుసుకోడానికి స్పేస్ నీడిల్ వైపు చూశాను. నిజంగా చాలా భయమేసింది’’ అని ఓ మహిళ చెప్పారు.

    కాల్పుల శబ్దం వినగానే తల్లిదండ్రులు భయపడిపోయారని, పిల్లల చేతులు పట్టుకుని ఎగ్జిట్ గేట్ వైపు పరుగులు తీశారని, అక్కడంతా భయాందోళన నెలకొందని స్థానిక వ్యాపారి చెప్పారు.

  2. దేశం కోసం స్వర్ణం గెలవడం కన్నా ఆనందకరమైనది ఏదీ లేదు: మీరాబాయి చనూ

    కామన్‌వెల్త్ గేమ్స్
    ఫొటో క్యాప్షన్, మీరాబాయి చనూ

    గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చనూ స్వర్ణపతకం గెలుచుకుంది. దేశం కోసం స్వర్ణం సాధించడం కంటే ఆనందకరమైనది మరొకటి లేదని వరుసగా మూడోసారి కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న అనంతరం మీరాబాయి చనూ చెప్పింది.

    "నేను చాలా సంతోషంగా ఉన్నాను. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇది నా మూడో స్వర్ణ పతకం. మొత్తంగా ఇది నా నాలుగో పతకం. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలుచుకోవడంతో నా ప్రయాణం మొదలైంది" అని మీరాబాయి చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.

    జుట్టులోని త్రివర్ణ పతాక రంగుల్లో క్లిప్పు పెట్టుకోవడానికి గల కారణాన్ని మీరాబాయి చెప్పింది.

    "ఈ త్రివర్ణ క్లిప్పులను నేనే స్వయంగా తయారు చేసుకున్నాను. మన జాతీయ పతాకానికి ప్రాతినిధ్యం వహించేలా ఏదైనా ప్రత్యేకంగా ఉండాలనుకున్నా. ఏదైనా తయారు చేయాలని అకస్మాత్తుగా అనిపించింది. అందుకే ఈ సీతాకోకచిలుక ఆకారపు క్లిప్పులను పోటీల ముందురోజు నేనే స్వయంగా తయారు చేసుకున్నాను. త్రివర్ణ పతాకాన్ని నాతో పాటు తీసుకువెళ్లడం నాకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇవాళ నేను చాలా భావోద్వేగానికి లోనై చాలా ఏడ్చాను. అయితే భావోద్వేగాలతో నిండి ఉన్నప్పటికీ ఈ క్షణం నాకు అంతే ఆనందాన్ని కూడా ఇచ్చింది" అని మీరాబాయి తెలిపింది.

  3. కామన్‌వెల్త్ గేమ్స్: వరుసగా మూడోసారి స్వర్ణం గెలిచిన మీరాబాయి చనూ

  4. ఫ్యాటీ లివర్ ఉన్నవారు మద్యం పూర్తిగా మానేయాలా? ఎన్నో ప్రశ్నలు - సమాధానాలు

  5. ‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ

  6. 'పాక్‌ పాలిత కశ్మీర్‌‌‌'లో చెలరేగిన హింసపై ఐక్యరాజ్యసమితి ఆందోళన, భారత్ వాదనేంటి, పాకిస్తాన్ ఏమంటోంది?

  7. సీజేపీ: వీధి పోరాటం నుంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు.. ఎప్పుడెప్పుడు, ఏం జరిగింది?

  8. అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ

    రాహుల్ గాంధీ, అమిత్ షా, నిరసన
    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ

    దిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై బలగాలను ప్రయోగించిన ఘటనకు బాధ్యత ఎవరిదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన ఓ లేఖ రాశారు.

    నిరసన చేస్తున్న ప్రజలను రక్షించడం, చర్చల ద్వారా వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని రాహుల్ గాంధీ అన్నారు.

    "మా విద్యార్థులు నిష్పక్షపాతమైన, జవాబుదారీతనం ఉన్న విద్యా వ్యవస్థను కోరుతున్నారు. వారి మాట వినడానికి బదులుగా , భద్రతా దళాలు వారిపై బలప్రయోగం చేశాయి. ప్రాణాంతక ఆయుధాలు, టియర్ గ్యాస్ ప్రయోగించాయి. వందలాది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మహిళా విద్యార్థులపైనా దాడి చేశారు. వారి ప్రైవేట్ పార్టులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కూడా దాడి చేశారు’’ అని ఆ లేఖలో రాహుల్ గాంధీ రాశారు.

    "ప్రాణాంతకమైన పెల్లెట్ గన్‌లను ఉపయోగించడం అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం. ఒక జర్నలిస్టుతో సహా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని మీడియా, సోషల్ మీడియాలో కథనాలొచ్చాయి. నేను 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచాబ్‌ను కలిశాను.పెల్లెట్ గన్‌తో కాల్చడంతో ఆయనిప్పుప్పుడు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

    లేఖలో రాహుల్ గాంధీ రెండు ప్రశ్నలు అడిగారు.

    " విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో సహా ప్రాణాంతకమైన బలప్రయోగానికి హోం మంత్రిగా మీరు అనుమతిచ్చారా? ఒకవేళ మీరు కాకపోతే ఎవరు అనుమతిచ్చారు?

    సాధారణ దుస్తుల్లో విద్యార్థులను లాఠీలతో కొడుతున్నట్టు కనిపించిన వారు పోలీసులా లేక వాలంటీర్లా? వారిని మోహరించడానికి ఎవరు అధికారం ఇచ్చారు?"

    దేశ భవిష్యత్తు అయిన యువత, విద్యార్థులు ఈ ఘటనపై సమాధానాలు, జవాబుదారీతనం కోరుతున్నారని రాహుల్ గాంధీ లేఖలో రాశారు.

  9. కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది: అభిజీత్ దీప్కే

    దిల్లీ, నిరసన
    ఫొటో క్యాప్షన్, అభిజీత్ దీప్కే

    కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ ఉదయం ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

    "మీ అందరి మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. జంతర్ మంతర్ దగ్గర చివరి వరకు ఉన్నవారికి నిన్న వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పలేకపోయాను. దీనిపై మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా" అని వీడియోలో అభిజీత్ దీప్కే చెప్పారు.

    "మీకు తెలిసినట్టే నాకు టైఫాయిడ్ వచ్చింది. నిన్న నాకు జ్వరం చాలా ఎక్కువ కావడంతో ఇంటికి వచ్చేశాను. 37 రోజుల పాటు జంతర్ మంతర్‌ దగ్గర పోరాటం కొనసాగించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ దేశం కోసం మీరు చేసిన కృషిని నేను అభినందిస్తున్నాను" అని చెప్పారు.

    ఉద్యమాన్ని విమర్శించిన వారికి కూడా అభి.జీత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు.

    ‘‘ 'మీరు సీరియస్‌గా లేరు, ఎలా నిరసన చేయాలో మీకు తెలియదు' అని మమ్మల్ని విమర్శించిన వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు మమ్మల్ని ప్రశ్నించకపోయి ఉంటే లోపాలను సరిదిద్దుకునే అవకాశం మాకు వచ్చేది కాదు" అని వీడియోలో మాట్లాడారు.

    ఇది ఆరంభం మాత్రమేనని,కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

  10. జంతర్ మంతర్ దగ్గర ఇప్పుడు ఎలా ఉందంటే....

    దిల్లీ
    ఫొటో క్యాప్షన్, ఖాళీగా కనిపిస్తున్న జంతర్ మంతర్ ప్రాంతం

    కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాగిన ఆందోళన శనివారం రాత్రి ముగిసింది.

    నిరసనకారులు ఆ ప్రాంతాన్ని ఖాళీచేశారు. పోలీసుల మోహరింపు కొనసాగుతోంది.

    అయితే ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు అక్కడ మోహరించిన పోలీసుల సంఖ్య బాగా తగ్గింది.

  11. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసిన ఐదు కారణాలు ఇవేనా?

  12. సముద్ర గర్భంలో దొరికిన 74 ఏళ్ల కిందటి విమాన ప్రమాద శకలాలు, నేటి సేఫ్టీ నిబంధనలకు ఈ యాక్సిడెంటే కారణమంటారు, ఎందుకంటే..

  13. మనం మళ్లీ కలుస్తాం - ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉద్దేశించి కొత్త విద్యాశాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ వ్యాఖ్యలు

    నిరసనలు, రాజీనామా, దిల్లీ, జంతర్ మంతర్
    ఫొటో క్యాప్షన్, ప్రహ్లాద్ జోషి

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు తనకు అప్పగించడంపై ప్రధాని మోదీకి ప్రహ్లాద్ జోషి ధన్యవాదాలు చెప్పారు.

    ‘‘మోదీ ప్రభుత్వం గత పన్నెండేళ్లలో ఎన్నో చరిత్రత్మక విజయాలు సాధించింది. ప్రధాని మార్గదర్శకత్వంలో నా పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి ప్రయత్నిస్తా’’అని ప్రహ్లాద్ జోషి చెప్పారు.

    ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ప్రస్థానం అనేక దశాబ్దాలనుంచి సాగుతోంది. దేశాభివృద్ధి విషయంలో ఆయన నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తన పదవీకాలంలో ధర్మేంద్ర ప్రధాన్ నూతన విద్యావిధానాన్ని విజయవంతంగా అమలుచేశారు. విద్యారంగంలో వందకు పైగా చిన్నా,పెద్దా సంస్కరణలు ప్రవేశపెట్టారు. జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన పదవి నుంచి వైదొలిగినప్పటికీ, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవను అది మరుగునపడనివ్వదు. దేశ అభివృద్ధి మార్గంలో మనం మళ్లీ కలుస్తాం’’ అని ప్రహ్లాద్ జోషి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

  14. బీజేపీ కార్యకర్తలకు పదవి కన్నా దేశం ముఖ్యం: అమిత్ షా

    ధర్మేంద్ర ప్రధాన్, మోదీ, రాజీనామా
    ఫొటో క్యాప్షన్, అమిత్ షా

    దేశ యువత మనోభావాలను మోదీ ప్రభుత్వం గౌరవిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రశ్నాపత్రాల లీకులను అరికట్టేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని శనివారం రాత్రి అమిత్ షా ‘ఎక్స్’లో రాశారు.

    బీజేపీ కార్యకర్తలకు పదవి కన్నా దేశం, యువత, విద్యార్థులే ముఖ్యమని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దీనికి నిదర్శనమని అమిత్ షా పోస్ట్ చేశారు.

    ప్రశ్నాపత్రాల లీకేజ్‌కు బాధ్యులైనవారికి కఠిన శిక్ష పడేలా ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని అమిత్ షా అన్నారు. ప్రధాని చర్యలు నీట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంపూర్ణ న్యాయం అందిస్తాయని తనకు నమ్మకముందని అమిత్ షా తెలిపారు.

    ‘‘తన పదవీకాలంలో ధర్మేంద్ర ప్రధాన్ జాతీయ విద్యావిధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, మాతృభాషలో పరీక్షలు నిర్వహించడం, పీఎం శ్రీ పాఠశాలల విస్తరణ, డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ-విద్యాసంస్థల సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటి అంశాల్లో కీలక సంస్కరణలు చేపట్టారు. పరీక్షా విధానాన్ని విద్యార్థి కేంద్రీకృతంగా, మరింత సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం’’ అని అమిత్ షా తన పోస్టులో రాశారు.

  15. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: ఇది మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బా లేక ఒక పెద్ద అవకాశమా?

  16. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ బాధ్యతలు

    విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్‌ జోషి
    ఫొటో క్యాప్షన్, ప్రహ్లాద్‌ జోషి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు

    కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి విద్యా శాఖ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.

    కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆ శాఖ బాధ్యతలను జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రపతి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.

    ప్రధాన మంత్రి మోదీ సూచనల మేరకు, విద్యా శాఖ అదనపు బాధ్యతలను ప్రహ్లాద్ జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

    జోషి ప్రస్తుతం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు. ఆయన వద్దే పునరుత్పాదక ఇంధన శాఖ పోర్ట్‌ఫోలియో కూడా ఉంది.

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ముర్ము అధికారికంగా ఆమోదించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

  17. సీజేపీ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించిందా, బాధిత కుటుంబాలకు పరిహారం గురించి ఏం చెప్పారు?

  18. 'మనం అనుకున్నది సాధించాం' - అభిజీత్ దీప్కే

  19. 'డిమాండ్లు సాధించాం, దీక్ష ముగిసింది', నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని సీజేపీ విజ్ఞప్తి

    సీజేపీ, నిరసనలు
    ఫొటో క్యాప్షన్, తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తెలిపింది.

    తమ మిగిలిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తెలిపింది.

    మూడో విడత చర్చల అనంతరం, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో కలిసి సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మీడియా సమావేశంలో మాట్లాడారు.

    "ప్రభుత్వం మన డిమాండ్లు అన్నింటినీ అంగీకరించింది. దీక్ష ముగిసింది, నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి" అని వారు విజ్ఞప్తి చేశారు.

    "ప్రభుత్వం ఇతర డిమాండ్లను కూడా అంగీకరించింది" అని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియా సమావేశంలో తెలిపారు.

    "కేవలం దిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నిరసనల్లో పాల్గొన్నందుకు భవిష్యత్తులో ఏ సీజేపీ కార్యకర్తపైనా చర్యలు తీసుకోబోమని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది" అని ఆయన అన్నారు.

    బాధిత కుటుంబాలకు కోటి పరిహారంపై కూడా అంగీకారం కుదిరిందని, చట్టప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని అశుతోష్ రాంకా తెలిపారు.

    మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం సానుభూతితో పరిశీలించిందని, అంగీకరించిందని అన్నారు.

    "ఈ రోజు మేం సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ప్రస్తుతం నమోదైన కేసులకు సంబంధించి నాలుగు అంశాలతో కూడిన ఒక లిఖితపూర్వక ముసాయిదాను వారు తీసుకువచ్చారు. వాటితో పాటు, మిగిలిన రెండు డిమాండ్లపై కూడా మేం చర్చించాం. ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోకూడదు, పరిహారం అందించాలి, అలాగే వారి ఐదు అంశాల చార్టర్‌ను పరిగణించడం.

    మేమే వారికి ఎఫ్‌ఐఆర్‌ల కాపీలను అందిస్తాం, ఎలాంటి చర్యలు తీసుకోబోం. రెండో విషయానికి వస్తే.. పరిహారంపై ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మాకు కూడా సానుభూతి ఉంది. నిబంధనల ప్రకారం పరిహారం ఉంటుందని, సాధ్యమైనంత గరిష్టంగా వారికి అందిస్తామని మేం చెప్పాం" అని పేర్కొన్నారు.

  20. జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు, 9 ఫోటోల్లో...