దిల్లీ: రామ్‌లీలా మైదాన్ వద్ద నేడు ప్రతిపక్షాల ర్యాలీ.. దిల్లీలో పరిస్థితిని చూపే 9 ఫోటోలు..

రామ్‌లీలా మైదానం, నేడు ప్రతిపక్షాల ర్యాలీ, కాంగ్రెస్
ఫొటో క్యాప్షన్, భద్రతా ఏర్పాట్లలో భాగంగా రామ్‌లీలా మైదానాన్ని 14 జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్ బాధ్యతను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) స్థాయి అధికారికి అప్పగించారు.
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని రామ్‌లీలా మైదానం వద్ద ప్రతిపక్షాలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి.

ఈ నేపథ్యంలో మైదానం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

ఈ ర్యాలీలో పాల్గొనేందుకు పది లక్షల మంది వస్తారని సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ అంచనా వేశారు.

ర్యాలీ నేపథ్యంలో భద్రతా బలగాల మోహరింపు, సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు ఇవి.

రామ్‌లీలా మైదానం, నేడు ప్రతిపక్షాల ర్యాలీ, కాంగ్రెస్
ఫొటో క్యాప్షన్, ర్యాలీ, మార్చ్ సందర్భంగా 4,000 మందికి పైగా పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) కంపెనీలను కూడా మోహరించారు.
రామ్‌లీలా మైదానం, నేడు ప్రతిపక్షాల ర్యాలీ, కాంగ్రెస్
ఫొటో క్యాప్షన్, ఈ ర్యాలీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పు రోజును ఎంచుకున్నారని బీజేపీ ఆరోపించింది. నవంబర్ 1వ తేదీ 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను గుర్తుచేస్తుందని బీజేపీ నాయకులు విమర్శించారు.
రామ్‌లీలా మైదానం, నేడు ప్రతిపక్షాల ర్యాలీ, కాంగ్రెస్
ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు మిత్రపక్ష పార్టీల కార్యకర్తలు కూడా తరలి వచ్చారు.
రామ్‌లీలా మైదానం, నేడు ప్రతిపక్షాల ర్యాలీ, కాంగ్రెస్
ఫొటో క్యాప్షన్, రామ్‌లీలా మైదానంలో ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చామని దిల్లీ పోలీసులు తెలిపారు. అయితే, మింటో రోడ్‌-కనాట్ ప్లేస్ జంక్షన్ నుంచి ప్రతిపాదించిన మార్చ్ నిర్వహణకు సంబంధించి తమకు ఎలాంటి దరఖాస్తు అందలేదన్నారు
రామ్‌లీలా మైదానం, నేడు ప్రతిపక్షాల ర్యాలీ, కాంగ్రెస్
ఫొటో క్యాప్షన్, కన్నాట్ ప్లేస్ వద్ద పోలీసు బలగాలను మోహరించారు.
రామ్‌లీలా మైదానం, నేడు ప్రతిపక్షాల ర్యాలీ, కాంగ్రెస్
ఫొటో క్యాప్షన్, మింటో రోడ్‌ వద్ద పోలీసులు, బారీకేడ్లు
రామ్‌లీలా మైదానం, నేడు ప్రతిపక్షాల ర్యాలీ, కాంగ్రెస్
రామ్‌లీలా మైదానం, నేడు ప్రతిపక్షాల ర్యాలీ, కాంగ్రెస్
ఫొటో క్యాప్షన్, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, అరాచకాన్ని తరిమికొట్టండి అంటూ బీజేపీ కూడా ఆందోళనను ప్రారంభించింది. రోహ్‌తక్‌లో బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ ఆందోళనను ప్రారంభించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)