మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

లైవ్ , స్టాక్ మార్కెట్ పతనానికి డెమొక్రాట్లే కారణం: డోనల్డ్ ట్రంప్

చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుల్లో ఒకటిని స్టాక్ మార్కెట్ చవిచూసిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. మార్కెట్ పతనంతో రిటైర్మెంట్ ఖాతాల్లోని నిధుల విలువ కూడా తగ్గిందని ఆయన తెలిపారు.

సారాంశం

  • ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుల్లో ఒకటిని చవిచూసిందని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
  • మార్కెట్ పతనంతో రిటైర్మెంట్ ఖాతాల్లోని నిధుల విలువ కూడా తగ్గిందని ఆయన తెలిపారు.
  • యూరప్‌లో కనీసం 21 విమానాలు, పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వారంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండవసారి. అయితే ఇవన్నీ కేవలం తప్పుడు బెదిరింపులేనని బ్రిటన్ పేర్కొంది.
  • అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం కనిపించింది. అమెరికా, ఆసియాలోని ప్రముఖ టెక్ కంపెనీల మార్కెట్ విలువ నుంచి వందల బిలియన్ల డాలర్లు ఆవిరయ్యాయి.
  • ఏఐ అభివృద్ధిని నెమ్మదింపజేయాలనే అంశంతో ఎన్నికల బరిలోకి దిగిన డెమొక్రటిక్ అభ్యర్థులు విజయం సాధించడంతో టెక్నాలజీ, ఏఐ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి.

లైవ్ కవరేజీ

  1. యూరప్‌లో విమానాలకు బాంబు బెదిరింపులు

    యూరప్‌లో కనీసం 21 విమానాలు, పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

    ఈ వారంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండవసారి.

    అయితే ఇవన్నీ కేవలం తప్పుడు బెదిరింపులేనని బ్రిటన్ పేర్కొంది.

    ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, ఇటలీ, పోలాండ్, రొమేనియా దేశాలకు వెళ్లే విమానాలపై ఈ బెదిరింపుల ప్రభావం పడింది.

    డబ్లిన్ నుంచి రోమ్‌కు వెళ్తున్న ఏర్ లింగస్ విమానాన్ని ఫ్రాన్స్‌లోని ఓ వైమానిక స్థావరానికి మళ్లించారు.

    హెల్సింకి నుంచి రోమ్‌కు వెళ్తున్న ఫిన్నైర్ విమానానికి ఇటలీ యుద్ధ విమానాలు రక్షణగా వెళ్లాయి.

    ఇటలీ రాజధాని రోమ్‌కు వస్తున్న రెండు విమానాలను లక్ష్యంగా చేసుకుని గురువారం తప్పుడు బాంబు బెదిరింపులు వచ్చాయి.

    ఈ బెదిరింపులు ఈమెయిల్ ద్వారా అందినట్లు అక్కడి విమానాశ్రయ అధికారులు తెలిపారు.

    ‘ఫైటర్స్ ఆఫ్ ది మేల్ స్టేట్’ పేరుతో ఓ సంస్థ లేదా వ్యక్తి ఈ హెచ్చరికలు పంపినట్లు వెల్లడించారు.

    తాము ‘ఫెమినిస్ట్ పాలన’ను లక్ష్యంగా చేసుకుంటున్నామని, చరిత్రలో తమదైన ముద్ర వేయాలనుకుంటున్నామని అందులో పేర్కొన్నారు.

  2. అమెరికా ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్: టెక్ కంపెనీల షేర్లలో భారీ పతనం

    అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం కనిపించింది. అమెరికా, ఆసియాలోని ప్రముఖ టెక్ కంపెనీల మార్కెట్ విలువ నుంచి వందల బిలియన్ల డాలర్లు ఆవిరయ్యాయి.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అభివృద్ధి వేగం తగ్గుతుందనే ఆందోళనలే ఇందుకు కారణం. ఏఐ అభివృద్ధిని నెమ్మదింపజేయాలనే అంశంతో ఎన్నికల బరిలోకి దిగిన డెమొక్రటిక్ అభ్యర్థులు విజయం సాధించడంతో టెక్నాలజీ, ఏఐ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి.

    టెక్ కంపెనీల వాటా ఎక్కువగా ఉన్న నాస్‌డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 5.5 శాతానికి పైగా పడిపోయింది. దీంతో కంపెనీల మార్కెట్ విలువ సుమారు 2.5 ట్రిలియన్ డాలర్లు తగ్గినట్లు డౌ జోన్స్ గణాంకాలు వెల్లడించాయి.

    అమెరికాలోని ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీలు కూడా భారీగా నష్టపోయాయి. 2025 తర్వాత ఆయా సూచీలకు ఇదే ‘అత్యంత చెత్త ట్రేడింగ్ రోజు’గా నిలిచింది.

    ఏఐ కోసం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, దాని వల్ల ఆశించిన ప్రయోజనాలు అందుతాయా లేదా అన్న ఆందోళనలు ఇప్పటికే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా షేర్ల విక్రయాలు వెల్లువెత్తాయి.

    ఆసియాలోనూ శుక్రవారం ఉదయం టెక్ కంపెనీల వాటా అధికంగా ఉన్న స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి.

    జపాన్‌కు చెందిన నిక్కీ 225 సూచీ ప్రారంభ ట్రేడింగ్‌లోనే 5 శాతం పడిపోయింది. ఈ క్రమంలో పానాసోనిక్ షేర్లు 10 శాతానికి పైగా నష్టపోగా, హిటాచీ షేర్లు దాదాపు 8 శాతం పడిపోయాయి.

    దక్షిణ కొరియాలోని ప్రముఖ టెక్ కంపెనీల షేర్లు పడిపోవడంతో కోస్పీ సూచీ కూడా 8.5 శాతానికి పైగా క్షీణించింది. చిప్‌ల తయారీ సంస్థ ఎస్‌కే హైనిక్స్ షేర్లు 11.5 శాతానికి పైగా నష్టపోగా, శాంసంగ్ షేర్లు దాదాపు 10 శాతం పడిపోయాయి.

    అమెరికాలోని పలు ఎన్నికల నియోజకవర్గాల్లో డెమొక్రటిక్ అభ్యర్థులు డేటా సెంటర్ల నిర్మాణం, ఏఐ వేగవంతమైన విస్తరణను అడ్డుకోవాలనే అంశాలతో ప్రచారం చేశారు. ఈ సాంకేతికతకు అత్యంత అవసరమైన డేటా సెంటర్ల నిర్మాణం, విస్తరణపై ఆంక్షలు విధించడమే వీటి లక్ష్యం.

  3. స్టాక్ మార్కెట్ పతనానికి డెమొక్రాట్లే కారణం: డోనల్డ్ ట్రంప్

    ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుల్లో ఒకటి నమోదైందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

    ‘‘ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుల్లో ఒకటిని చవిచూసింది. ఇది చూడటం చాలా బాధాకరం. ఇంతకుముందెన్నడూ చూడని స్థాయికి మార్కెట్‌ను తీసుకెళ్లేందుకు ఎంతో కష్టపడ్డాం. కానీ ఇప్పుడు ఇలా జరిగింది. దీంతో మీ 401(k) రిటైర్మెంట్ పొదుపు ఖాతాల్లోని నిధుల విలువ కూడా తగ్గిపోయింది. గుర్తుంచుకోండి.. దీనికి కారణం రిపబ్లికన్లు కాదు.. డెమొక్రాట్లు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. అతి త్వరలో, ఎలాగోలా మనం గతంలో ఎన్నడూ లేనంత పెద్ద శక్తిగా, మరింత బలంగా ఎదుగుతాం. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా తీర్చిదిద్దుతాం” అని రాశారు.

  4. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన అప్‌డేట్స్ మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి