యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపించడం ఆమోదనీయం కాదంటూ అమెరికాకు రష్యా హెచ్చరిక
‘యుక్రెయిన్‌కు ఆయుధాలను పంపించడం ఆమోదయోగ్యం కాదని మేం అమెరికాకు గట్టిగా చెప్పాం. ఈ తీరును మార్చుకోవాలని డిమాండ్ చేశాం’’ అని రోసియా 24 టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాషింగ్టన్‌లోని రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్ చెప్పారు.
లైవ్ కవరేజీ
రాజేశ్ పెదగాడి
ఇరాన్ కొత్త రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖీ కెతాబ్చీ

ఫొటో సోర్స్, news online
ఫొటో క్యాప్షన్, తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఇరాన్ కొత్త రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖీ కెతాబ్చీ ఇరాన్ రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖీ కెతాబ్చీ నియమితులైనట్టు బీబీసీ పర్షియన్ తెలిపింది. పార్లమెంట్ విశ్వాస పరీక్షలో 237 ఓట్లు పొంది రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఇటీవa యుద్ధంలో మరణించిన అజీజ్ నాసిర్జాదే స్థానంలో ఆయన నియామకం జరిగింది.
ఇరాన్ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో అఖ్లాఖీకి నాలుగు దశాబ్దాలకుపైగా అనుభవం ఉందని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పార్లమెంటుకు తెలిపారు. ఇరాన్ క్షిపణి, రక్షణ కార్యక్రమాలలో పాలుపంచుకున్న అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, సైనిక అధికారులతో అఖ్లాఖీ కలిసి పనిచేశారని పేర్కొన్నారు.
ఇటీవలి యుద్ధం తర్వాత ఇరాన్ తన రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుందని, ఇది ప్రత్యర్థుల సైనిక అంచనాలు మారాయని పార్లమెంటులో చేసిన తొలి ప్రసంగంలో అఖ్లాఖీ అన్నారు.
క్షిపణి సామర్థ్యాల అభివృద్ధికి, ముఖ్యంగా ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులకు ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ నియామకం కీలకంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
శాంతించండి: ప్రజలకు ఫ్రాన్స్ అధ్యక్షుడి పిలుపు

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లో జరుగుతున్న అల్లర్లపై స్పందించిన అధ్యక్షుడు ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఆందోళనలు, దోపిడీలు దాడులకు దారితీయడంతో ప్రజలు సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉండాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ పిలుపునిచ్చారు.
ఎల్సీ పాలెస్నుంచి జాతినుద్దేశంచి ప్రసంగించిన ఆయన "పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవద్దని" హెచ్చరించారు.
నిరసనకారుల "న్యాయబద్ధమైన డిమాండ్లకు" "విధ్వంసం, లూటీ చేసే వారికి" మధ్య తేడాను గుర్తించాలని మేక్రాన్ సూచించారు. హింసను ఎవరూ, ఎప్పుడూ సమర్థించబోరని దీనికి ఖచ్చితంగా శిక్షలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
పెరుగుతున్న ఇంధన ధరలు, జీవన వ్యయం సహా ప్రభుత్వ సేవలు సరిగా అందడం లేదని సుమారు 5,50,000 మంది ప్రదర్శనకారులు చాలావరకు శాంతియుతంగా వీధుల్లోకి వచ్చారు. ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, పోలీసులు సుమారు 2,400 మందిని అరెస్టు చేశారు.
పారిస్, మార్సెయిల్, ఇతర పట్టణాలు, నగరాల్లో కూడా అల్లరిమూకలు బయటకు వచ్చాయి. వారిలో కొందరు నల్లటి దుస్తులు ధరించి, ముసుగులు ధరించి కార్లకు, భవనాలకు నిప్పు పెట్టారు.
రగులుతున్న ఫ్రాన్స్.. ‘దుకాణాలు దోచుకున్నారు, కార్లు, భవనాలు తగలబెట్టారు’
ఫ్రాన్స్: తీవ్రస్థాయికి చేరిన నిరసనలు

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, పారిస్‌లోని రిపబ్లిక్ స్క్వేర్‌లో ఉన్న మరియాన్ విగ్రహానికి నిరసనకారులు పసుపు రంగు జాకెట్‌ను వేలాడదీశారు. దానిపై పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా మెసేజ్ ఉంది. 
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, రిపబ్లిక్ స్క్వేర్‌లో నిరసనల సందర్భంగా కొందరు ఆందోళనకారులు విగ్రహంపైకి ఎక్కారు. 
ఫొటో సోర్స్, PA
ఫొటో క్యాప్షన్, పెరుగుతున్న ధరలు, పాఠశాల్లో అధ్వాన్న పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో నిరసనకారులు పాల్గొన్నారు. 
ఫొటో సోర్స్, PA
ఫొటో క్యాప్షన్, రిపబ్లిక్ స్క్వేర్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో నిరసనకారులు గుమిగూడి నినాదాలు చేశారు. కొందరు వాహనాలకు నిప్పంటించి ఆందోళనకు దిగారు. 
ఫొటో సోర్స్, EPA/Shutterstock
ఫొటో క్యాప్షన్, నిరసనల సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. అద్దెకు గర్బా పార్టనర్: ‘నుదుటిపై ముద్దు’, ‘ఆఫ్టర్ పార్టీ’ ఆఫర్ల వెనుక అసలు నిజమేంటి?
వెస్ట్ బ్యాంక్‌లో యూరోపియన్ దౌత్యవేత్తల బృందంపై దాడి

ఫొటో సోర్స్, NATHAN HOWARD/POOL/AFP via Getty Image
ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ ఘటనపై సందేహం వ్యక్తం చేసింది (ఫైల్ ఫోటో). పశ్చిమాసియాలోని వెస్ట్ బ్యాంక్‌లో యూరోపియన్ దౌత్యవేత్తల బృందంపై ముసుగులు ధరించిన కొందరు ఇజ్రాయెలీ సెటిలర్లు దాడి చేశారు.
బెల్జియం తమ కాన్సుల్ జనరల్‌తో పాటు ఇతర దౌత్యవేత్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరింది.
ఇజ్రాయెల్ సైన్యం కూడా దీన్ని ‘తీవ్రమైన హింసాత్మక చర్య’గా అభివర్ణిస్తూ, దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం అనుమానాలు వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరుగుతున్న ‘ప్రచారంలో’ భాగమై ఉండొచ్చని అభిప్రాయపడింది.
దీనికి ఒక రోజు ముందు వెస్ట్ బ్యాంక్‌లోని మరో గ్రామంలో పాలస్తీనీయులతో పాటు వాషింగ్టన్ పోస్ట్ ఫొటో జర్నలిస్ట్ హెడీ లెవిన్పై దాడి జరిగింది. ఈ ఘటనలో లెవిన్‌తో పాటు పలువురు పాలస్తీనా పౌరులు గాయపడ్డారు.
ఈ దాడి ఆందోళనకరమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఇజ్రాయెల్ ప్రతిష్ఠకు కూడా మంచివి కావని ఆయన అన్నారు.
ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు భారీ ఊరట, అమెరికాలో వ్యతిరేకత పెరగనుందా?
మార్కో రూబియో భారత పర్యటనలో దిల్లీ ఎందుకు లేదు, జై శంకర్ ఆయనను కలవడానికి ముంబయి వెళ్లడంపై విమర్శలు ఏంటి?
ఫ్రాన్స్‌లో నిరసనలు హింసాత్మకం, భవనాలకు నిప్పు, లూటీలు

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, పారిస్‌లోని లా బారిక్ బార్‌కు నిప్పు పెట్టారు. పాఠశాలల్లో సమస్యలు, పెరుగుతున్న జీవన వ్యయాలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో శనివారం జరిగిన తాజా నిరసనలు హింసాత్మకంగా మారాయి.
సుమారు 5.5 లక్షల మంది వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగగా, హింస తీవ్రతరం కావడంతో కనీసం 1,200 మందిని అరెస్టు చేసినట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపింది. ఈ అల్లర్లలో 150 మంది పోలీసు సిబ్బంది గాయపడినట్లు ఫ్రాన్స్ ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకోర్ను తెలిపారు.
రాజధానితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ నిరసనకారులు భవనాలకు నిప్పు పెట్టారు. లిమోజెస్ పట్టణంలోని మున్సిపల్ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పైకప్పులో కొంత భాగం కూలిపోయింది.
మరోవైపు, పలు నగరాల్లో దోపిడీలు చోటుచేసుకున్నాయి. నగర పాలక సంస్థల కార్యాలయాలు, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు. పారిస్‌లో దుస్తులు, ఆహార పదార్థాల దుకాణాలపై దాడులు చేసి దోపిడీకి పాల్పడ్డారు. లిల్లే నగరంలో యాపిల్ స్టోర్‌లోకి చొరబడిన ఆందోళనకారులు..అక్కడి వస్తువులన్నింటినీ పూర్తిగా పట్టుకుపోయారు.
కోల్‌కతా: దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి
బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రానికి ఒంటరిగా ఆడ తాబేలు సుదీర్ఘ యాత్ర.. చివరికి ఆ ఆలివ్ రిడ్లే ఏమైంది?
గరివిడి లక్ష్మి: వెండితెరపై బుర్రకథ ఎలా ఉంది?
టైటానిక్‌లో ప్రయాణించిన ఏకైక నల్లజాతి ప్రయాణికుడి గురించి ఎలా తెలిసింది?
రష్యాపై అమెరికా ఆంక్షలను అడ్డుకున్న ట్రంప్

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, రష్యాపై ఆంక్షల బిల్లుపై సెప్టెంబరులోనే డోనల్డ్ ట్రంప్ సంతకం చేశారు, ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. యుక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న రష్యాను శిక్షించడానికి అమెరికా కాంగ్రెస్ ఇటీవల ఆమోదించిన రష్యా ఆంక్షల చట్టంలోని పలు ఆంక్షలను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన అధ్యక్ష అధికారంతో అడ్డుకున్నారు.
ఈ ఆంక్షలలో కొన్నింటిని నిలిపివేయడం అమెరికా జాతీయ ప్రయోజాల దృష్ట్యా అవసరమమని శుక్రవారం రాత్రి జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ పేర్కొన్నారు.
ఈ ఆంక్షల బిల్లుపై ట్రంప్ సెప్టెంబర్‌లోనే సంతకం చేయడంతో అది చట్టంగా మారి ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా శుక్రవారం రాత్రి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.
నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నిక కంటే ముందే అమెరికాలో ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా రష్యా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. ఈ నవంబర్ ఎన్నికలే కాంగ్రెస్‌పై ఏ పార్టీ నియంత్రణ కలిగి ఉంటుందో నిర్ణయిస్తాయి.
ట్రంప్ తాజా నిర్ణయాన్ని అటు రిపబ్లికన్లు, ఇటు డెమెక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ ఆంక్షల చట్టానికి దివంగత రిపబ్లికన్ సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు పెట్టారు, ఆయన జూలై 11న మరణించడానికి ముందు అమెరికాలో యుక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు.
ఈ చట్టం ప్రధానంగా రష్యా ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. అలాగే రష్యా నుంచి చమురు, గ్యాస్‌లను ఎక్కువగా కొనుగోలు చేసే మొదటి ఐదు దేశాలపై ముఖ్యంగా చైనా భారత్‌లపై 100 శాతం వరకు సుంకాలను విధించే విస్తృత అధికారాలను ట్రంప్‌కు కల్పించింది.
అదనంగా, ఈ చట్టంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలతో పాటు ప్రస్తుత ఆంక్షల నుండి తప్పించుకోవడానికి రష్యా ఉపయోగిస్తున్న రహస్య నౌకాదళంపై కూడా ఆంక్షలు ఉన్నాయి.
అమెరికాకు చెందిన 20 మంది ప్రజాప్రతినిధుల ఉమ్మడి బృందం అక్టోబర్ 18 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టాన్ని గౌరవించాలని కోరుతూ గురువారం ట్రంప్‌కు ఒక లేఖ రాసింది.
‘ఎన్నికల సంఘంలో పరిణామాలపై సైబర్ ఫోరెన్సిక్ విచారణ జరపాలి’ - సుప్రీం కోర్టులో ఖమ్మం వాసి పిటిషన్
బంగ్లాదేశ్ జంటకు సౌదీ అరేబియాలో మరణశిక్ష.. మక్కాలో ‘అశ్లీల చర్యల’కు పాల్పడ్డారన్న అభియోగంపై శిక్ష
రణబాలి రివ్యూ: పెళ్లయిన తర్వాత రష్మికతో తొలి చిత్రం.. విజయ్ దేవరకొండ పంట పండిందా?
అక్టోబర్ 20 వరకు సౌదీకి ఎయిర్ ఇండియా విమానాలు రద్దు

ఫొటో సోర్స్, Mike Campbell/NurPhoto via Getty Images
ఫొటో క్యాప్షన్, విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. సౌదీ అరేబియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా రియాద్, దమ్మామ్, జెడ్డాకు ఈనెల 20వ తేదీవరకు విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని , విమానాల రాకపోకల పునరుద్ధరణకు తగిన పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఒక అంచనాకు వస్తున్నామని ఎయిర్ లైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమ అత్యుత్తమ ప్రాధాన్యత అని పేర్కొంది.
అంతకుముందు, సౌదీలోని స్థానిక అధికారుల సూచనలను పాటించాలని, వైమానిక దాడి జరిగితే ఇంట్లోనే ఉండాలని పౌరులను కోరుతూ భారత రాయబార కార్యాలయం తన అడ్వైజరీలో సూచించింది.
సౌదీ అరేబియా నుంచి తక్షణమే వెళ్లాల్సిన అవసరం ఉన్న భారతీయ పౌరులు బహ్రెయిన్, కువైట్, ఖతార్ నుంచి ప్రయాణించడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చని తెలిపింది.
ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు ఇటీవల సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిపిన దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించగా, 10 మంది గాయపడ్డారు.
మేం పోటీకి భయపడం: ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ప్రకటన

ఫొటో సోర్స్, Prakash Singh/Bloomberg via Getty Images
ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. స్టార్ లింక్ వ్యవహారంలో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆ సంస్థ, తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని పేర్కొంది.
భారతదేశంలో స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఇటీవల ఆరోపించారు.
పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీని "ప్రధాన మంత్రి అంబానీ" అని సంబోధించిన మస్క్, భారత్‌లో స్టార్‌లింక్‌కు నిష్పాక్షికంగా పోటీపడే అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించారు.
రిలయన్స్ ప్రకటనలో, "ప్రతి భారతీయ కంపెనీలాగే రిలయన్స్ కూడా దేశీయ విదేశీ పెట్టుబడులతో పాటు సరికొత్త ఆలోచనలకు స్వాగతం పలికే దేశంలో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ప్రజల జీవితాలను మెరుగుపరిచే పనులను ఆహ్వానిస్తుంది"
స్టార్‌లింక్‌తో సహా ఉపగ్రహ సమాచార రంగంలో పోటీని స్వాగతిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. జియోతో సహా ప్రతి కంపెనీ భారత ప్రజలకు సేవలు అందించాలని, దేశ చట్టాలు, విధానాలను పాటించాలని ఆ ప్రకటనలో పేర్కొంది.
