యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపించడం ఆమోదనీయం కాదంటూ అమెరికాకు రష్యా హెచ్చరిక

‘యుక్రెయిన్‌కు ఆయుధాలను పంపించడం ఆమోదయోగ్యం కాదని మేం అమెరికాకు గట్టిగా చెప్పాం. ఈ తీరును మార్చుకోవాలని డిమాండ్ చేశాం’’ అని రోసియా 24 టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాషింగ్టన్‌లోని రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్ చెప్పారు.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి

  1. మేం పోటీకి భయపడం: ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ప్రకటన

    రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టార్ లింక్
    ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

    స్టార్ లింక్ వ్యవహారంలో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆ సంస్థ, తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని పేర్కొంది.

    భారతదేశంలో స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఇటీవల ఆరోపించారు.

    పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీని "ప్రధాన మంత్రి అంబానీ" అని సంబోధించిన మస్క్, భారత్‌లో స్టార్‌లింక్‌కు నిష్పాక్షికంగా పోటీపడే అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించారు.

    రిలయన్స్ ప్రకటనలో, "ప్రతి భారతీయ కంపెనీలాగే రిలయన్స్ కూడా దేశీయ విదేశీ పెట్టుబడులతో పాటు సరికొత్త ఆలోచనలకు స్వాగతం పలికే దేశంలో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ప్రజల జీవితాలను మెరుగుపరిచే పనులను ఆహ్వానిస్తుంది"

    స్టార్‌లింక్‌తో సహా ఉపగ్రహ సమాచార రంగంలో పోటీని స్వాగతిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. జియోతో సహా ప్రతి కంపెనీ భారత ప్రజలకు సేవలు అందించాలని, దేశ చట్టాలు, విధానాలను పాటించాలని ఆ ప్రకటనలో పేర్కొంది.

  2. భారత్, చైనాలను ఏకతాటిపైకి తేవాలని నేపాల్ ఎందుకు కోరుకుంటోంది?

  3. ప్రధాని మోదీ ముందున్న 10 సవాళ్లు ఏంటి?

  4. ‘‘5 నెలల్లోనే బియ్యం బస్తా రూ.700 పెరిగింది’’ - తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

  5. సౌదీ అరేబియా: వేలకోట్ల డాలర్లు పెట్టి క్షిపణులు కొని కూడా హూతీ దాడులను ఎందుకు అడ్డుకోలేకపోతోంది?

  6. ఇంద్రకీలాద్రి: అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో రాష్ట్రపతికి ఘన స్వాగతం

    విజయవాడ, ఇంద్రకీలాద్రి, రాష్ట్రపతి
    ఫొటో క్యాప్షన్, ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

    విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతి ఇంద్రకీలాద్రికి చేరుకున్న సందర్భంగా ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.

    విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రపతికి వేద మంత్రోచ్ఛారణల నడుమ వేద ఆశీర్వచనం అందజేశారు.

    అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కనకదుర్గ అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి చిత్రపటాన్ని అందించి గౌరవపూర్వకంగా సత్కరించారు.

  7. భర్తను హత్య చేసి బ్లూ డ్రమ్‌లో దాచిన మహిళకు, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష

  8. జనసేనలో చేరిన వంగవీటి రాధ

    వంగవీటి రాధాకృష్ణ
    ఫొటో క్యాప్షన్, జనసేనలో చేరిన వంగవీటి రాధ

    టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి వంగవీటి రాధను పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.

    పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన వంగవీటి రాధాకృష్ణను పవన్ కల్యాణ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.

    అనంతరం వంగవీటి రాధ తన అనుచరులను పవన్ కల్యాణ్‌కు పరిచయం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు వెళ్దామని పవన్ వారితో అన్నారు.

  9. ఫ్రాన్స్‌: సూపర్ మార్కెట్లలోని ఫ్రిజ్‌లపై సైబర్ దాడులు, ఉష్ణోగ్రతలు పెంచి లక్షల యూరోల నష్టం కలిగించిన దుండగులు

  10. ఒక ఫేస్‌బుక్ పోస్టుకు వేసిన మరణ శిక్షను రద్దు చేసిన సౌదీ అరేబియా

  11. వద్దన్నా కుప్పలు తెప్పలుగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పార్సిళ్లు, తట్టుకోలేక విదేశాలకు వెళ్లిపోయిన ఇన్‌ఫ్లూయెన్సర్

  12. మనం మాట్లాడుకోవడం తగ్గిస్తున్నామా? దారి తెలియకపోతే అడగడం కూడా మానేశామా?

  13. నీటిలో మునిగిపోయిన ఈ గ్రామానికి కోహినూరు వజ్రానికి లింకేంటి, జనం ఇంకా అక్కడ ఎందుకు తవ్వుతున్నారు?

  14. గుడ్ మార్నింగ్, బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం,

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేశ్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  15. కాంగ్రెస్‌లో నేహా బోరా వంటి నాయకులు ఎందుకు రాలేకపోతున్నారు?

  16. నంబర్ ప్లేటే కదా అనుకోవద్దు.. ఇవన్నీ తెలుసుకోండి

  17. యెమెన్ ఎడారుల్లో సాగుతున్న యుద్ధం మరోసారి ప్రపంచాన్ని కుదిపేసే పరిణామాలకు దారి తీస్తుందా?

  18. నేడు చంద్రబాబుతో విజయ్ సమావేశం-నదీ జలాలపై చర్చలు, నదుల అనుసంధానంపై నేడు ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రుల భేటీ

    నదీ జలాల పంపిణీ, అనుసంధానంపై నేడు ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రుల భేటీ
    ఫొటో క్యాప్షన్, నేడు చంద్రబాబుతో విజయ్ సమావేశం

    మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2.30 గం.లకు విజయ్ తన క్యాంప్ ఆఫీస్ నుంచి బయల్దేరుతారు. సుమారు 4 గంటల సమయానికి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4.10 గంటలకు విజయవాడ కనక దుర్గ ఆలయాన్ని సందర్శిస్తారు. దర్శనం తర్వాత 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు.

    గోదావరి-కావేరీ నదుల అనుసంధానం, కృష్ణా జలాల విడుదలపై చంద్రబాబుతో చర్చిస్తారు. అనంతరం ఇద్దరూ కలిసి విజయవాడలో జరుగుతున్న ఉత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో విజయవాడ నుంచి తిరిగి తమిళనాడుకు బయల్దేరి వెళ్తారు విజయ్.

  19. అందరినీ వద్దని బెదిరించిన ట్రంప్.. తాను మాత్రం రష్యా నుంచి డీజిల్ కొనే ఒప్పందం ఎందుకు చేసుకున్నారు?

  20. రియాద్‌లో దాడులు: హైదరాబాదీ మృతి