మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

రాజా సింగ్‌పై పీడీ యాక్ట్... కోర్టులో హాజరు పరచకుండా నేరుగా జైలుకే తీసుకెళ్లిన పోలీసులు

రాజా సింగ్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు నిమిషాల వ్యవధిలో అరెస్టు పూర్తి చేశారు. ఈసారి ఆయనను పాత కేసులో అరెస్ట్ చేశారు. అది కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సంబంధించినదే. ఆయనను పోలీసులు సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో రిమాండ్ పిటిషన్ వేస్తారు.

లైవ్ కవరేజీ

  1. కోల్‌కతా: దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి

  2. ఎగిరే కారును ప్రదర్శించిన ఎలాన్ మస్క్.. రోడ్డు మీదకు వచ్చే రోజెప్పుడు?

  3. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రానికి ఒంటరిగా ఆడ తాబేలు సుదీర్ఘ యాత్ర.. చివరికి ఆ ఆలివ్ రిడ్లే ఏమైంది?

  4. గరివిడి లక్ష్మి: వెండితెరపై బుర్రకథ ఎలా ఉంది?

  5. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఎల్‌కే అడ్వాణీ

    బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో అపోలో ఆస్పత్రిలో చేరినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది.

    “అడ్వాణీ ప్రస్తుతం ఐసీయూలో న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అపోలో ఆస్పత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది” అని తెలిపింది.

  6. రష్యాపై అమెరికా ఆంక్షలను అడ్డుకున్న ట్రంప్

    యుక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న రష్యాను శిక్షించడానికి అమెరికా కాంగ్రెస్ ఇటీవల ఆమోదించిన రష్యా ఆంక్షల చట్టంలోని పలు ఆంక్షలను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన అధ్యక్ష అధికారంతో అడ్డుకున్నారు.

    ఈ ఆంక్షలలో కొన్నింటిని నిలిపివేయడం అమెరికా జాతీయ ప్రయోజాల దృష్ట్యా అవసరమమని శుక్రవారం రాత్రి జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ పేర్కొన్నారు.

    ఈ ఆంక్షల బిల్లుపై ట్రంప్ సెప్టెంబర్‌లోనే సంతకం చేయడంతో అది చట్టంగా మారి ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా శుక్రవారం రాత్రి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.

    నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నిక కంటే ముందే అమెరికాలో ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా రష్యా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. ఈ నవంబర్ ఎన్నికలే కాంగ్రెస్‌పై ఏ పార్టీ నియంత్రణ కలిగి ఉంటుందో నిర్ణయిస్తాయి.

    ట్రంప్ తాజా నిర్ణయాన్ని అటు రిపబ్లికన్లు, ఇటు డెమెక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

    ఈ ఆంక్షల చట్టానికి దివంగత రిపబ్లికన్ సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు పెట్టారు, ఆయన జూలై 11న మరణించడానికి ముందు అమెరికాలో యుక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు.

    ఈ చట్టం ప్రధానంగా రష్యా ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. అలాగే రష్యా నుంచి చమురు, గ్యాస్‌లను ఎక్కువగా కొనుగోలు చేసే మొదటి ఐదు దేశాలపై ముఖ్యంగా చైనా భారత్‌లపై 100 శాతం వరకు సుంకాలను విధించే విస్తృత అధికారాలను ట్రంప్‌కు కల్పించింది.

    అదనంగా, ఈ చట్టంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలతో పాటు ప్రస్తుత ఆంక్షల నుండి తప్పించుకోవడానికి రష్యా ఉపయోగిస్తున్న రహస్య నౌకాదళంపై కూడా ఆంక్షలు ఉన్నాయి.

    అమెరికాకు చెందిన 20 మంది ప్రజాప్రతినిధుల ఉమ్మడి బృందం అక్టోబర్ 18 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టాన్ని గౌరవించాలని కోరుతూ గురువారం ట్రంప్‌కు ఒక లేఖ రాసింది.

  7. ‘ఎన్నికల సంఘంలో పరిణామాలపై సైబర్ ఫోరెన్సిక్ విచారణ జరపాలి’ - సుప్రీం కోర్టులో ఖమ్మం వాసి పిటిషన్

  8. అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించండి: మోదీకి ఖర్గే లేఖ

    నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

    "2026 ఆగస్టు 13న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాయిదా పడ్డాయి. 64 రోజులు గడిచినా, పార్లమెంటు ఉభయ సభలను ఇంకా అధికారికంగా నిరవధిక వాయిదా వేయలేదు. ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు" అని ఖర్గే ఆ లేఖలో రాశారు.

    "నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయమని కోరుతూ ఏప్రిల్ 11, 2026న మీకు నేను లేఖ రాసిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ మీరు అలా చేయలేదు"

    ‘‘ఆ తర్వాత 2026 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి ఆలస్యంగా ఆ బిల్లులను బహిరంగంగా అందుబాటులోకి తెచ్చి ఏప్రిల్ 16వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ఏప్రిల్ 17వ తేదీన లోక్‌సభలో అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేకపోయింది. దీంతో ఆ బిల్లు భారీ తేడాతో వీగిపోయింది.

    ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న నా అభ్యర్థనను పునరుద్ఘాటిస్తూ జూలై 16, ఆగస్టు 27తేదీల్లో మీకు మళ్ళీ లేఖ రాశాను. ఇప్పుడు నాలుగోసారి ఇదే విజ్ఞప్తి చేస్తున్నా" అని ఖర్గే ఆ లేఖలో రాశారు.

  9. ర‌ణ‌బాలి రివ్యూ: పెళ్లయిన తర్వాత రష్మికతో తొలి చిత్రం.. విజయ్ దేవరకొండ పంట పండిందా?

  10. మేం పోటీకి భయపడం: ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ప్రకటన

    స్టార్ లింక్ వ్యవహారంలో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆ సంస్థ, తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని పేర్కొంది.

    భారతదేశంలో స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఇటీవల ఆరోపించారు.

    పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీని "ప్రధాన మంత్రి అంబానీ" అని సంబోధించిన మస్క్, భారత్‌లో స్టార్‌లింక్‌కు నిష్పాక్షికంగా పోటీపడే అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించారు.

    రిలయన్స్ ప్రకటనలో, "ప్రతి భారతీయ కంపెనీలాగే రిలయన్స్ కూడా దేశీయ విదేశీ పెట్టుబడులతో పాటు సరికొత్త ఆలోచనలకు స్వాగతం పలికే దేశంలో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ప్రజల జీవితాలను మెరుగుపరిచే పనులను ఆహ్వానిస్తుంది"

    స్టార్‌లింక్‌తో సహా ఉపగ్రహ సమాచార రంగంలో పోటీని స్వాగతిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. జియోతో సహా ప్రతి కంపెనీ భారత ప్రజలకు సేవలు అందించాలని, దేశ చట్టాలు, విధానాలను పాటించాలని ఆ ప్రకటనలో పేర్కొంది.

  11. భారత్, చైనాలను ఏకతాటిపైకి తేవాలని నేపాల్ ఎందుకు కోరుకుంటోంది?

  12. అమెరికా: స్కూల్లో 16 ఏళ్ల బాలుడి కాల్పులు, ముగ్గురు పిల్లలు సహా టీచర్ మృతి

    అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన కాల్పులు ఘటనలో టీచర్‌ సహా 5, 8, 11 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

    బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది.

    కాల్పులు జరిపిన వ్యక్తిని బెండ్ నగరానికి చెందిన 16 ఏళ్ల బాలుడిగా గుర్తించారు.

    తాళం వేసి ఉన్న తలుపులపై కాల్పులు జరుపుతూ బాలుడు పాఠశాలలోకి ప్రవేశించారు. పాఠశాలలోకి వెళుతున్న అనుమానితుడిని కమ్యూనిటీలోని ఓ గన్ మెన్ వెంబడించారని, ఆయన చేతిలోనే బాలుడు హతమయ్యాడని పోలీసులు తెలిపారు.

    ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెంది ఉన్నట్లు బెండ్ పోలీస్ చీఫ్ మైక్ క్రాంజ్ తెలిపారు.

    ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు, మరో ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

  13. క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ: పెళ్లి చుట్టూ తిరిగిన డ్రామా మెప్పించిందా?

  14. దేశం విడిచి వెళ్లాలని నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు

    ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 28 నాటికి భారత్‌ను విడిచి పెట్టాలని అందులో సూచించింది.

    ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొని విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు ఉన్నాయి.

    అక్టోబర్ 10న ఆగస్టు రివల్యూషన్ గ్రౌండ్స్‌లో జరిగిన నిరసనల్లో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న ఆయన్ని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు.

    ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని, నిరసనల్లో పాల్గొని విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించారని బీజేపీ నేత కృతి సౌమ్య ఆరోపించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    "విదేశీయుల చట్టాన్ని ఖాన్ ఉల్లంఘించారని గామ్దేవీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత ఆ ఫిర్యాదును ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు పంపించాం" అని పోలీసులు తెలిపారు.

    ఖాన్‌ను అమెరికా పౌరుడిగా గుర్తించి, ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంలోని 7, 29 సెక్షన్లు ఉల్లంఘించినట్టు నోటిసుల్లో పేర్కొన్నారు. దీని ఆధారంగానే నిర్దేశించిన గడువులోపు దేశం విడిచి వెళ్లాలని సూచించినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి వివరించారు.

  15. అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని ఖండించిన రాహుల్ గాంధీ

    అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఖండించారు.

    బాధితుల గొంతును ఈ ప్రభుత్వం నొక్కేస్తోందని, ప్రశ్నించేవారిని తప్పిస్తోందని ఆయన ఆరోపించారు.

    "ఉదయం 4 గంటలు, ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అంకితా భండారీ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. వారు చేసిన తప్పు ఏంటి?, ఇండియా గేట్ వద్ద ఎలాంటి హాంగామా లేకుండా, బాధతో నిశ్శబ్ధంగా కూర్చొని, సీబీఐ విచారణ పూర్తి అయ్యే వరకు దుష్యంత్ గౌతమ్‌ను గవర్నర్‌గా నియమించొద్దని కోరారు" అని ఎక్స్‌లో రాహుల్ గాంధీ పోస్టు చేశారు.

    "నేను, ప్రియాంక నిన్న వారిని కలిశాం. సీబీఐ దర్యాప్తు ఫలితాలు రాకముందే హడావుడిగా నియమాకాలు పూర్తి చేశారు. ప్రశ్నించిన తల్లిదండ్రులను చీకటిలో అదుపులోకి తీసుకున్నారు. బాధితుల గొంతును అణిచివేయడం, ప్రశ్నించే వారిని పక్కన పెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.

    "న్యాయం కోసం జరుగుతున్న పోరాటాన్ని ఎవరూ అణచివేయలేరు, ఆపలేరు. అంకితా భండారీ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు మద్దతు ఇస్తుంది" అని తెలిపారు.

    ఇండియా గేట్ దగ్గర నిరసన చేస్తున్న అంకితా భండారీ తల్లిదండ్రులతోపాటు పలువురిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    కొంత సమయం వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఉదయం ఐదు గంటలకు విడుదల చేసినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

  16. టీవీకే ఎమ్మెల్యే పల్లవి: ‘‘చంటి పిల్లాడిని సభలు సమావేశాలకు తిప్పుతూ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు’’ అంటూ ఆమెపై విమర్శలేంటి?

  17. జైలర్ 2-మూవీ రివ్యూ: సూపర్ హిట్ సినిమాల ఫార్ములానే మళ్లీ ఫాలో అయ్యారా? రజినీ సీక్వెల్ ఎలా ఉంది?

  18. ప్రధాని మోదీ ముందున్న 10 సవాళ్లు ఏంటి?

  19. ‘‘5 నెలల్లోనే బియ్యం బస్తా రూ.700 పెరిగింది’’ - తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

  20. భర్తను హత్య చేసి బ్లూ డ్రమ్‌లో దాచిన మహిళకు, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష