మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

రాజా సింగ్‌పై పీడీ యాక్ట్... కోర్టులో హాజరు పరచకుండా నేరుగా జైలుకే తీసుకెళ్లిన పోలీసులు

రాజా సింగ్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు నిమిషాల వ్యవధిలో అరెస్టు పూర్తి చేశారు. ఈసారి ఆయనను పాత కేసులో అరెస్ట్ చేశారు. అది కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సంబంధించినదే. ఆయనను పోలీసులు సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో రిమాండ్ పిటిషన్ వేస్తారు.

లైవ్ కవరేజీ

  1. టీవీకే ఎమ్మెల్యే పల్లవి: ‘‘చంటి పిల్లాడిని సభలు సమావేశాలకు తిప్పుతూ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు’’ అంటూ ఆమెపై విమర్శలేంటి?

  2. జైలర్ 2-మూవీ రివ్యూ: సూపర్ హిట్ సినిమాల ఫార్ములానే మళ్లీ ఫాలో అయ్యారా? రజినీ సీక్వెల్ ఎలా ఉంది?

  3. ప్రధాని మోదీ ముందున్న 10 సవాళ్లు ఏంటి?

  4. ‘‘5 నెలల్లోనే బియ్యం బస్తా రూ.700 పెరిగింది’’ - తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

  5. భర్తను హత్య చేసి బ్లూ డ్రమ్‌లో దాచిన మహిళకు, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష

  6. వద్దన్నా కుప్పలు తెప్పలుగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పార్సిళ్లు, తట్టుకోలేక విదేశాలకు వెళ్లిపోయిన ఇన్‌ఫ్లూయెన్సర్

  7. జాతీయ జెండా ఎగురవేసినవారిని జైల్లో పెట్టడం పిరికితనం -రాహుల్

    జంతర్ మంతర్‌లో జాతీయ జెండా ఎగరేయడం నేరం కాదు, కానీ ఆ పనిచేసిన కొందరిని జైల్లో పెట్టడం పిరికితనమే అన్నారు లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ.

    సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి పంపడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్‌ ఖాతాలో స్పందించారు.

    “జంతర్ మంతర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి శాంతియుతంగా నిరసన తెలపడం నేరం కాదు. యువకులను జైల్లో వేయడం పిరికితనం” అని రాహుల్ గాంధీ విమర్శించారు.

    "విద్యార్థులు, యువతరం, జర్నలిస్టులు, ‘ఇండియా’ బ్లాక్ పార్టీల బ్యానర్లు వేర్వేరు కావచ్చు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. ఒకే విషయం గురించి నిరసనలు జరుగుతున్నాయి. పౌరులు తమ రాజ్యాంగబద్ధమైన హక్కులను కోరుతున్నారు. జంతర్ మంతర్ దేశ ప్రజలది. దాన్ని తిరిగి సాధించుకుంటాం’’ అని రాహుల్ స్పష్టం చేశారు.

    ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో విమర్శించారు.

    "త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి, భారత్ మాతాకి జై అని నినాదాలు చేసిన సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను మీరు జైలుకు పంపించారు. యువతతో పెట్టుకోవద్దు మోదీజీ, త్వరలోనే మీ నియంతృత్వానికి ముగింపు పలుకుతారు" అని సంజయ్ సింగ్ రాసుకొచ్చారు.

    మంగళవారం జంతర్ మంతర్‌లోకి అక్రమంగా చొరబడ్డారని సీజేపీ నాయకులపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

  8. పాకిస్తాన్‌: ఇమ్రాన్ ఖాన్ కంచుకోటలో ఎమర్జెన్సీ, ప్రభుత్వం తప్పు చేస్తోందంటున్న నిపుణులు

  9. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్‌కు 5 రోజుల కస్టడీ

    జంతర్ మంతర్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలపై సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను మందిర్ మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం వారిని 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

    అంతకు ముందు సీజేపీ నేతల అరెస్టుపై కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన న్యాయ వ్యవహారాల చీఫ్ రత్న సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    "న్యాయవాదులను కలిసేందుకు కూడా వారిని అనుమతించలేదు. తెల్లవారుజామున 3 గంటలకు ఒక ప్రైవేట్ వాహనంలో వారిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారి మనోధైర్యం ఏమాత్రం తగ్గలేదు." అని పేర్కొన్నారు.

    "అనుమతి లేకుండా ప్రవేశించడం, బాండ్ షరతులు ఉల్లంఘించడం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు సీజేపీ నేతలపై మోపారు" అని రత్న సింగ్ 'ఎక్స్'లో పోస్ట్‌ చేశారు.

  10. నీటిలో మునిగిపోయిన ఈ గ్రామానికి కోహినూరు వజ్రానికి లింకేంటి, జనం ఇంకా అక్కడ ఎందుకు తవ్వుతున్నారు?

  11. గుడ్ మార్నింగ్, బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం,

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేశ్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  12. మాజీ సీఎం మమతపై దాడికి యత్నం - పోలీసులు ఏం చెప్పారు?

    పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఒక మహిళా దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

    మమతా బెనర్జీ ఒక పూజను ప్రారంభించడానికి వెళ్తుండగా, కాళీఘాట్‌లోని ఆమె నివాసం సమీపంలో తనిష్ఠా సాహా (38) అనే మహిళ దాడి చేసినట్టు టీఎంసీకి చెందిన డోలా సేన్ ఆరోపించారు.

    టీఎంసీ కార్యకర్తలు ఆ మహిళను పోలీసులకు అప్పగించి, కాళీఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    మమతా బెనర్జీని దూషించి, కత్తితో దాడి చేయడానికి సాహా ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఆ మహిళ మద్యం మత్తులో ఉన్నట్టు కూడా ఆరోపించారు.

    మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ నేతలు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు కూడా అంగీకరించారు. కానీ మహిళ వద్ద ఎలాంటి ఆయుధం లభించలేదని తెలిపారు. ఘటనా స్థలంలో పౌర స్వచ్ఛంద కార్యకర్తలు, టీఎంసీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు వెల్లడించారు.

    అయితే మమతా బెనర్జీకి ఉన్న జెడ్-ప్లస్ భద్రతను ఉల్లంఘించారని ఆ పార్టీ ఆరోపించింది.

    దాడికి యత్నించిన మహిళ పేరును తనిష్ఠ సాహాగా టీఎంసీ పేర్కొంటే, ఆమె పేరును అనూష సాహాగా పోలీసులు తెలిపారు.

    "ఘటనా స్థలంలో ఒక మహిళను అదుపులోకి తీసుకున్నాం. ప్రాథమిక నివేదికల ప్రకారం ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని తెలుస్తోంది. ఆమె ఎందుకు ఎలా చేసిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం" అని కోల్‌కతా పోలీస్ కమిషనర్ అజయ్ నందా వెల్లడించారు.

  13. కాంగ్రెస్‌లో నేహా బోరా వంటి నాయకులు ఎందుకు రాలేకపోతున్నారు?

  14. ‘మేం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను చాలా గౌరవిస్తాం, ఆయన తన బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం’.. రాహుల్ గాంధీ

    ఇండియా కూటమి నేతలతో తేనీటీ విందు అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు వ్యతిరేకంగా తమ నిరసన కొనసాగుతుందని రాహుల్ గాంధీ తెలిపారు.

    “భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, భారత న్యాయవ్యవస్థపై మాకు అపారమైన గౌరవం ఉంది. వారు తమ పాత్రను పోషించాల్సి ఉంది. వారు ఆ పాత్రను పోషిస్తారని ఆశిస్తున్నాం. అయితే, మేం రాజకీయాల్లో ఉన్నవాళ్లం. ఏం జరిగినా రాజకీయంగా మా ప్రతిఘటన కొనసాగుతుంది. ప్రజల నిరసన కూడా కొనసాగుతుంది. అంతిమంగా ఈ నిరసన విజయం సాధిస్తుంది” అని ఆయన అన్నారు.

    కాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

    స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌‌లో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ఎన్నికల కమిషనర్లకు సమాచారం ఇవ్వలేదని, ఈ నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొంటూ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనం నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

  15. నంబర్ ప్లేటే కదా అనుకోవద్దు.. ఇవన్నీ తెలుసుకోండి

  16. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి, ఇక్కడ సమస్యలపై బహిరంగంగా చర్చ జరుగుతుందన్న మోదీ, బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ

    ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి భారత్‌లో వివిధ అంశాలపై బహిరంగంగా చర్చ జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.

    మంగళవారం దిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు.

    "ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లి. ఈ దేశంలో 100కు పైగా భాషలు ఉన్నాయి. సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, పబ్లిషర్స్ ఉన్నారు. 1,000కి పైగా శాటిలైట్ టీవీ చానెళ్లు ఉన్నాయి. అంతేకాకుండా, సోషల్ మీడియా యుగంలో, దేశంలో 50 కోట్లకుపైగా యూట్యూబ్ వినియోగదారులు ఉన్నారు. 50 కోట్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. వివిధ అంశాలపై బహిరంగ చర్చలు జరుగుతాయి, వివిధ విషయాలపై చర్చిస్తారు. ఇందులో డిజిటల్ పవర్ కీలకం" అని ఆయన అన్నారు.

    భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ కార్యక్రమం అక్టోబర్ 15వ తేదీన ముగుస్తుంది.

  17. రాజస్థాన్: మాజీ ఎమ్మెల్యేను గ్రామ ప్రజలే కొట్టి చంపారని కేసు, క్రషర్ వివాదంలో రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేను గ్రామస్తులు కొట్టిచంపినట్టు కేసు నమోదు

    రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో బయానా మాజీ ఎమ్మెల్యే అత్తర్ సింగ్ భదానా ఆదివారం నాడు హత్యకు గురయ్యారు.

    "కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, సోమవారం 33 మంది వ్యక్తులపై, మరో 70 నుంచి 80 మందిపై కేసు నమోదు చేశాం" అని భరత్‌పూర్ జిల్లా ఎస్పీ రాజేశ్ మీనా బీబీసీ న్యూస్ హిందీతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు.

    "గత రెండేళ్లుగా వేయిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోండా గ్రామంలో ఉన్న క్రషర్‌కు వెళ్లే దారి విషయంలో గ్రామస్థులకు, క్రషర్ యజమానికి (మరణించిన అత్తర్ సింగ్ భదానా) మధ్య వివాదం నడుస్తోంది. ఆ క్రషర్‌ను గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది" అని రాజేశ్ మీణా తెలిపారు.

    ఈ హత్య జరిగినప్పటి నుంచి గ్రామంలోని చాలా మంది పరారీలో ఉన్నారు, చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. "పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నాం. ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను గ్రామంలో మోహరించాం" అని వేయిర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ధీరేంద్ర బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు.

    మరణించిన అత్తర్ సింగ్ భదానా ఫరీదాబాద్‌లోని పాలి గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన బయానా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో క్రషర్ వద్దకు వెళ్లారు. అప్పుడే పెద్ద సంఖ్యలో గ్రామస్థులు వచ్చి కర్రలతో అత్తర్ సింగ్‌పై దాడి చేశారని చెబుతున్నారు.

  18. రాహుల్ తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరం: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శ, ఇంకా కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోలేదు అన్న సింధియా

    దిల్లీలో రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేతలు చేపట్టిన నిరసన ప్రజాస్వామ్యానికే అవమానమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు.

    " లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచి జిల్లా పంచాయతీలు, సర్పంచుల వంటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు నిరంతరం ఎన్నికలు జరిగే దేశంలో, ఆ వ్యవస్థపైనే అనుమానాలు వ్యక్తం చేయడం లేదా మచ్చ తీసుకురావడానికి ప్రయత్నించడం కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది, కానీ ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగ వ్యవస్థలోని ప్రతి అంశాన్ని తక్కువ చేసి చూపడానికి లేదా అప్రతిష్టపాలు చేయడానికి వెనుకాడటం లేదు. అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధించి రాజ్యాంగాన్ని కాలరాసిన అదే కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తోంది. న్యాయవ్యవస్థ, ప్రధాన న్యాయమూర్తి, భారత సైన్యం, ఎన్నికల సంఘంపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన పార్టీ ఇదే. కాంగ్రెస్ పార్టీ బలహీనపరచడానికి ప్రయత్నించని రాజ్యాంగ సంస్థ అంటూ ఏదీ లేదు" అని ఆయన విమర్శించారు.

  19. బెదిరించినా, భయపెట్టినా వెనక్కి తగ్గబోము: రాహుల్ గాంధీ, సోమవారం ఆందోళనలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు చెప్పిన రాహుల్

    రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా సాగుతున్నారని రాహుల్ అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు చెప్పిన రాహుల్, మొన్న యువకులపై దాడి చేసిన వారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

    ప్రధాన మంత్రి మాదిరిగానే వారికి కూడా నిలబడి పోరాడే ధైర్యం లేదన్నారు. కేవలం అధికారం, బలాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే పోరాడుతున్నారని విమర్శించారు./

    అందరూ కలిసి ఒక జట్టుగా పని చేస్తున్నారని, జరుగుతున్నవి వేర్వేరు నిరసనలు కావని, ఇదొక ఉద్యమమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని హరించేవారికి, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేవారికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నిలబడతారని, ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గబోరని పేర్కొన్నారు. భారత ప్రజలు భయపడబోరని ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. కొట్టవచ్చు, బెదిరించవచ్చు, భయపెట్టేందుకు ప్రయత్నించవచ్చు అయినా తగ్గబోమని స్పష్టం చేశారు.

  20. అందరినీ వద్దని బెదిరించిన ట్రంప్.. తాను మాత్రం రష్యా నుంచి డీజిల్ కొనే ఒప్పందం ఎందుకు చేసుకున్నారు?