ఒడిశా: కాల్పులకు గురైన ఆరోగ్య శాఖ మంత్రి నవ్ కిశోర్ దాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

దాడి జరిగిన వెంటనే నవ్ కిశోర్ దాస్‌ను హుటాహుటిన విమానంలో భువనేశ్వర్‌కు తరలించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఆస్పత్రిలో వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

లైవ్ కవరేజీ

  1. భారత టెక్ దిగ్గజాలపై అమెరికా చర్యలు: గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర ఆలస్యం తప్పదా?

  2. అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్‌ రాంకా విడుదల

    సీజేపీ, అభిజిత్ దీప్కే, ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌, దిల్లీ పోలీసులు, దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్
    ఫొటో క్యాప్షన్, శనివారం ముంబయి నుంచి దిల్లీకి వచ్చిన అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విడుదల చేసినట్లు సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్ ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు.

    శనివారం ఉదయం ముంబయి నుంచి దిల్లీకి వచ్చిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సహ కన్వీనర్ సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రాంకాను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు.

    "అభిజిత్, అశుతోష్, సౌరవ్‌లను ఈరోజు ఉదయం 9 గంటలకు దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు" అని రత్నా సింగ్ తెలిపారు.

    "దిల్లీ పోలీసు అధికారి ఒకరు ఈరోజు ఉదయం నాకు ఈ సమాచారం ఇచ్చారు. సీజేపీ లీగల్ హెడ్ హోదాలో, మా తరఫున హాజరయ్యే ఇతర వకీళ్లతో కలిసి నేను పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో ఉంటాను" అని చెప్పారు.

    అంతకుముందు, సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను ముందస్తు నిర్బంధంలో ఉంచామని, వారిని నేడు దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు దిల్లీ పోలీసులు చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

    మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా ముగ్గురు నాయకుల నిర్బంధంపై స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

    "మోదీ, షా ఎంతలా భయపడ్డారంటే నేడు వారు పిల్లలను అపహరిస్తున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది" అని ఎక్స్‌లో పేర్కొన్నారు

  3. దిల్లీలో నేడూ నిరసనలు కొనసాగుతాయి: నేహా బోరా

    నేహా బోరా, దిల్లీ నిరసనలు
    ఫొటో క్యాప్షన్, ఆదివారం వేరే ప్రదేశంలో నిరసన తెలుపుతామని నేహా బోరా చెప్పారు.

    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ దిల్లీలో జరుగుతున్న నిరసనలు ఆదివారం కూడా కొనసాగుతాయని అఖిల భారత విద్యార్థి సంఘం (ఐసా) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ప్రకటించారు.

    సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన నేహా బోరా, శనివారం దిల్లీ హాట్ 'జంతర్-మంతర్'‌గా మారిందని, ఆదివారం వేరే ప్రదేశంలో నిరసన తెలుపుతామని చెప్పారు.

    "సామాన్యులను జైళ్లలో పెడతారా లేక జ్ఞానేశ్ కుమార్‌‌నా అనేది మీరే తేల్చుకోండి. మేం ఆదివారం కూడా వీధుల్లోకి వస్తాం, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఎస్‌ఐఆర్ రద్దు డిమాండ్‌తో నిరసన ప్రదర్శన చేస్తాం" అని అన్నారు.

    మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేత అజింక్య శిందే ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసి ఆదివారం జరగనున్న నిరసన వివరాలు వెల్లడించారు.

    "జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఇళ్లకు తిరిగి వెళ్లం" అని ఆయన పేర్కొన్నారు.

    తాము రేపు ఉదయం 10 గంటలకు మళ్లీ జంతర్-మంతర్ వైపు కవాతు చేస్తామని అజింక్య చెప్పారు. అలాగే భారీ సంఖ్యలో జంతర్-మంతర్‌కు చేరుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

  4. ‘నా కోచ్‌లో మగవాళ్లు మద్యం తాగుతున్నారు’ అంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన అస్సాం యువతి తర్వాతి రోజు శవంగా కనిపించారు..

  5. ‘ఇకపై సీజేపీ ఉద్యమ బాధ్యత అజింక్య శిందే నే చూస్తారు’ అని దీప్కే చెప్పిన శిందే ఎవరు?

  6. కాంగ్రెస్, సీజేపీ: ఎంత దూరం, ఎంత దగ్గర - నిరసనల వేళ రాహుల్ దిల్లీలో ఎందుకు లేరు?

  7. దిల్లీ : 12 ఫోటోలలో సీజేపీ ఆందోళన

  8. తనిఖీలు,నిర్బంధాలు,ఇంటర్‌నెట్ బంద్, ఎక్కడికక్కడ బారికేడ్లు.. దిల్లీలో ఇప్పటిదాకా ఏం జరిగింది, బీజేపీ ఏమంది?

  9. సీజేపీ ప్రతినిధులను విమానంలోనే ఎలా అదుపులోకి తీసుకున్నారంటే...

  10. ముకేశ్ అంబానీని 'ప్రధానమంత్రి' అంటూ కామెంట్ చేసిన ఎలాన్ మస్క్, వీరి మధ్య వివాదం ఏంటి?

  11. జంతర్ మంతర్‌కు వస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

    దిల్లీ, జంతర్ మంతర్ , సీజేపీ నిరసన
    ఫొటో క్యాప్షన్, కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    దిల్లీలోని జంతర్-మంతర్‌కు వస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్నారు.

    సీజేపీ నిరసనను దృష్టిలో ఉంచుకుని దిల్లీ రైల్వే స్టేషన్లు, హోటళ్లు, ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్న ప్రయాణికులను, హోటళ్లలో బస చేస్తున్నవారిని తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా నిరసనలో పాల్గొనడానికి దిల్లీకి చేరుకుంటున్న వారిపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

    జంతర్-మంతర్ వద్ద తలపెట్టిన నిరసనకు ముందే ఫిరోజ్ షా రోడ్డు, మండి హౌస్‌ల వద్ద రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను మోహరించారు. అలాగే దిల్లీ-నోయిడా సరిహద్దులో కూడా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

    నిరసన పిలుపు నేపథ్యంలో దక్షిణ జిల్లాతో పాటు మొత్తం దిల్లీలో సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేశామని దక్షిణ దిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. అనధికార వ్యక్తులు దిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు తనిఖీల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు.

    డీసీపీ అనంత్ మిట్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిరసన సమయంలో శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల ప్రథమ ప్రాధాన్యం. ఇందుకోసం వివిధ సరిహద్దుల్లో దాదాపు 12 పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జిల్లా అంతటా అనేక చోట్ల పోలీసు పికెట్లను ఏర్పాటుచేశారు.

    దిల్లీ, జంతర్ మంతర్ , సీజేపీ నిరసన
    దిల్లీ, జంతర్ మంతర్ , సీజేపీ నిరసన
  12. యూట్యూబర్ ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    యూట్యూబర్ ధ్రువ్ రాఠీ
    ఫొటో క్యాప్షన్, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ

    సీజేపీ నిరసన నేపథ్యంలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీని పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

    బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా తెలిపిన వివరాల ప్రకారం, ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఆయన సన్నిహితుడు, అలాగే గురుగ్రామ్ పోలీసులు ధ్రువీకరించారు. గురుగ్రామ్ సెక్టార్-56 నుంచి ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన సన్నిహితుడు తెలిపారు. పీటీఐ వార్తా సంస్థ కూడా రాఠీ అరెస్టు గురించి సమాచారం ఇచ్చింది.

    అంతకుముందు, ధ్రువ్ రాఠీ శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో ఒక రీల్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఇండియా గేట్ ఎదురుగా తిరుగుతూ కనిపించారు.

    “నేను దిల్లీకి వచ్చాను. ప్రధానమంత్రి 50కి పైగా మెట్రో స్టేషన్లను మూసివేశారని, అనేక రైళ్లు, బస్సులను రద్దు చేశారని విన్నాను. నిరసన కారణంగా దిల్లీని లాక్‌డౌన్‌లో ఉంచుతున్నారు” అని ఆ వీడియోలో ధ్రువ్ రాఠీ అన్నారు.

    “మోదీజీ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మా నిరసనలో జనసంచారం ఉండదని ఒకవైపు మీ ఐటీ సెల్ చెబుతోంది. ఒకవేళ జనం రాకపోతే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీరు భయపడ్డారని భావిస్తున్నాను. నిజానికి ప్రజలందరూ మేల్కొన్నారు” అన్నారు.

    ఈ నిరసనలో పాల్గొనడానికి జంతర్ మంతర్ చేరుకుంటున్న పలువురు ఆందోళనకారులను కూడా దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    మరోవైపు, ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా ఈరోజు మధ్యాహ్నం ముంబయిలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్‌లో నిరసన ప్రదర్శన ఉండటంతో, సామాజిక కార్యకర్తలు తుషార్ గాంధీ, ఫిరోజ్ మిథిబోర్వాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు 'హం భారత్ కే లోగ్' సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

  13. "రైలు ఎక్కి తనిఖీలు చేశారు, పోలీసుల నిర్బంధాలు చూస్తే భయమేస్తోంది"-తెలుగు రాష్ట్రాల యువకులు ఇంకా ఏం చెప్పారు?

  14. దిల్లీ: జంతర్ మంతర్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత, కఠిన ఆంక్షలు

    జంతర్ మంతర్, దిల్లీ పోలీసులు, సీజేపీ ర్యాలీ
    ఫొటో క్యాప్షన్, అనేక చిత్రాలలో బారికేడ్లు, భారీ పోలీసు బలగాలు అలాగే పోలీసు వ్యాన్‌లు కూడా కనిపిస్తున్నాయి

    కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో జంతర్-మంతర్ అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దిల్లీ పోలీసులు భారీగా భద్రతా బలగాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఆంక్షలను కఠినతరం చేశారు.

    పోలీసు బలగాలు, సెక్యూరిటీ ఫోర్సులు, పోలీసు వ్యాన్‌లు కనిపిస్తున్న కొన్ని ఫోటోలను ఏఎన్‌ఐ వార్తా సంస్థ విడుదల చేసింది.

    సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనకు అనుమతి లభించలేదు. అయినా తాము జంతర్-మంతర్‌కు చేరుకుంటామని సీజేపీ నాయకులు చెబుతున్నారు. చరిత్ర సృష్టిస్తామని పార్టీ సహ కన్వీనర్ అశుతోష్ రాంకా శుక్రవారం రాత్రి పేర్కొన్నారు.

    "ప్రియమైన కాక్రోచ్‌లు.. మనం ఇప్పటివరకు ఎంత దూరం ప్రయాణించామో తలచుకుంటే గర్వంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మనం కచ్చితంగా చరిత్ర సృష్టిస్తాం" అని అశుతోష్ రాంకా ఎక్స్ పోస్టులో తెలిపారు.

    అలాగే, "ఒకటే గుర్తుంచుకోండి - చేతిలో రాజ్యాంగం, గుండెల్లో గాంధీ. ఏం జరిగినా మన చేయి ఎత్తరాదు. భారత్ మాతా కీ జై" అని రాశారు.

    ఆయనతో పాటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, సామాజిక రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్, ఐసా అధ్యక్షురాలు నేహా బోరా, ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ కూడా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

    దిల్లీ, జంతర్ మంతర్
    దిల్లీ, జంతర్ మంతర్
    దిల్లీ, జంతర్ మంతర్
    దిల్లీ, జంతర్ మంతర్
  15. జంతర్‌ మంతర్ నిరసన: ముందస్తు అరెస్టులు, భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు

  16. గరివిడి లక్ష్మి ఈవిడే.. ‘ఆమె పాటల క్యాసెట్ లేని ఇల్లు ఉండేది కాదు’

  17. కామ్రేడ్ కళ్యాణ్: లవ్ స్టోరీకి నక్సలిజం టచ్ ఇచ్చి కామెడీ పండించేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందా?

  18. ఎలాన్ మస్క్ విషయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా ఉన్నాయా?

  19. ఉప ఎన్నికలు: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యం, తమిళనాడులో టీవీకే ముందంజ, నందిగ్రామ్ అత్యంత చర్చనీయాంశమైన స్థానాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. అందుకే అందరి దృష్టి ఈ స్థానంపైనే ఉంది.

    తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, భారత ఎన్నికల సంఘం
    ఫొటో క్యాప్షన్, తమిళనాడులో ఒక లెక్కింపు కేంద్రం వద్ద పరిస్థితి

    దేశంలోని ఆరు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఫలితాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో భారతీయ జనతా పార్టీకి చెందిన హసీ రాణి రథ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మిలన్ ప్రధాన్‌పై 41,937 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    హసి రాణి రథ్‌కు ఇప్పటివరకు 55,665 ఓట్లు రాగా, మిలన్ ప్రధాన్‌కు కేవలం 13,728 ఓట్లు మాత్రమే వచ్చాయి.

    నందిగ్రామ్ అత్యంత చర్చనీయాంశమైన స్థానాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. అందుకే అందరి దృష్టి ఈ స్థానంపైనే ఉంది.

    భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని రెజినగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్లా కాఫీపై బీజేపీ అభ్యర్థి శంఖరవ్ చౌదరి ఆధిక్యంలో ఉన్నారు.

    అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవాశిష్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ బద్రుద్దీన్ అజ్మల్ ఆయనకంటే సుమారు 45 వేల ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు.

    తమిళనాడులో రెండు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో మదురాంతకం, ధరాపురం అసెంబ్లీ స్థానాలో టీవీకే అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు.

    పుదుచ్చేరిలోని తట్టంచవాడి నియోజకవర్గంలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ ఆనంద్ విజయం సాధించారు.

    పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజీనగర్, తమిళనాడులోని మదురాంతకం, ధరాపురం, అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

  20. ఇన్ఫోసిస్‌తో సహా ఈ టెక్ కంపెనీలపై తీసుకున్న చర్యలను సమర్థించిన జేడీ వాన్స్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి కంపెనీల తొలగింపు

    జేడీ వాన్స్, అమెరికా, ఇండియా, మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని
    ఫొటో క్యాప్షన్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి కంపెనీల తొలగింపును సమర్థించిన జేడీ వాన్స్

    గ్రీన్ కార్డ్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ఎనిమిది టెక్ కంపెనీలను తొలగించడాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించారు.

    కంపెనీలకు చౌకైన విదేశీ కార్మికుల సరఫరాకు విమర్శకులు సహాయం చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

    ఈ నిర్ణయాన్ని డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ ప్రశ్నించిన తర్వాత, వాన్స్ ' సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో విమర్శలు చేశారు. ‘సోషలిజం' అంటే పెద్ద కంపెనీలకు చౌకగా కార్మికుల సరఫరా ఎప్పటికీ ఆగకుండా ఉండేలా చూడటానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడటమే అనిపిస్తోంది."

    మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని అనే ఎనిమిది కంపెనీలను సస్పెండ్ చేయాలన్న నిర్ణయం చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదానికి ఈ ప్రకటన మరింత ఆజ్యం పోసింది.