ఒడిశా: కాల్పులకు గురైన ఆరోగ్య శాఖ మంత్రి నవ్ కిశోర్ దాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

దాడి జరిగిన వెంటనే నవ్ కిశోర్ దాస్‌ను హుటాహుటిన విమానంలో భువనేశ్వర్‌కు తరలించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఆస్పత్రిలో వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

లైవ్ కవరేజీ

  1. ఎన్నికల సంఘానికి మద్దతుగా 42 మంది మాజీ న్యాయమూర్తులు లేఖలు, 42 మంది మాజీలు రాసిన లేఖలో ఏం ఉంది

    జ్ఞానేశ్ కుమార్, భారత ఎన్నికల సంఘం, రాహుల్ గాంధీ, కాంగ్రెస్,
    ఫొటో క్యాప్షన్, ఎన్నికల కమిషన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మాజీ న్యాయమూర్తుల ఆరోపణ

    'ఎన్నికల కమిషన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి' ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మాజీ న్యాయమూర్తులు ఆరోపించారు.

    'ఎన్నికల సంఘాన్ని బలహీనపరిచే ప్రయత్నాలకు' వ్యతిరేకంగా 42 మంది మాజీ న్యాయమూర్తులు ఒక బహిరంగ లేఖ రాశారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ లేఖలో, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, ఇతర రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై మాజీ న్యాయమూర్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

    పీటీఐ వార్తా సంస్థ ప్రకారం, ఆ లేఖపై సంతకం చేసిన మాజీ న్యాయమూర్తులు, ఎటువంటి నిర్దిష్ట ఆధారాలు లేకుండా 'ఓట్ల దొంగతనం' ఆరోపణలు చేయడాన్ని ప్రశ్నించారు.

    రాజ్యాంగ సంస్థలను పదేపదే 'దొంగలు', 'కుట్రదారులు' అని ముద్ర వేయడం ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

    "సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు, కానీ వాటిని అపఖ్యాతి పాలు చేయడం కాదు" అని ఆ లేఖలో పేర్కొన్నారు.

    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన నిరసన అక్టోబర్ 8న మూడో రోజుకు కొనసాగింది.

  2. వీసా మోసాలు: ఇన్ఫోసిస్, టీసీఎస్ సహా పలు భారతీయ ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు, మైక్రోసాఫ్ట్, అడోబ్‌లకు మినహాయింపు

    ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమిని, అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్
    ఫొటో క్యాప్షన్, అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ ప్రకారం, శాశ్వత వీసా కార్యక్రమం నుంచి కంపెనీలను నిలిపివేయడం అనేది అమెరికన్లకు ఒక పెద్ద విజయం

    ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమిని సహా పలు ప్రధాన టెక్నాలజీ, ఐటీ కంపెనీలను యూఎస్ కార్మిక శాఖ యూఎస్ పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి తప్పించింది.

    అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ ఒక ప్రకటనలో తెలిపిన ప్రకారం, ఈ ప్రోగ్రామ్ నుంచి మైక్రోసాఫ్ట్, అడోబ్‌లను కూడా తొలగించామని చెప్పారు. ఈ రెండు కంపెనీలపై పలు ఫెడరల్ దర్యాప్తులు కొనసాగుతుండటమే దీనికి కారణమని పేర్కొన్నారు.

    "ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీలైన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినిలను పర్మినెంట్ వర్కర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. పలు ఫెడరల్ దర్యాప్తుల కారణంగా యూఎస్ కార్మిక శాఖ కూడా మైక్రోసాఫ్ట్, అడోబ్‌లను ఈ ప్రోగ్రామ్ నుంచి తప్పించింది" అని సోండర్లింగ్ అన్నారు.

    ఆయన ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్‌ను కూడా ప్రస్తావించారు.

    బహుశా మైక్రోసాఫ్ట్ కంటే మరే ఇతర అమెరికన్ కంపెనీ కూడా ఈ వ్యవస్థను ఇంతగా దుర్వినియోగం చేసి ఉండదని సోండర్లింగ్ ఆరోపించారు.

    2025లో మైక్రోసాఫ్ట్ సుమారు 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించిందని సోండర్లింగ్ ఆరోపించారు.

    కొన్ని పదవులకు అర్హతగల అమెరికన్ ఉద్యోగులను కనుగొనలేకపోతున్నామని ఆ సంస్థ ఇంతకుముందు చెప్పింది.

    "వీసా ప్రక్రియ దుర్వినియోగాన్ని అరికట్టడం, అమెరికన్ కార్మికులను పరిరక్షించడానికి, ఈ రోజు తీసుకుంటున్న ఈ చరిత్రాత్మక చర్య ఒక ముఖ్యమైన మొదటి అడుగు" అని సోండర్లింగ్ X లోని ఒక పోస్ట్‌లో రాశారు.

  3. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను, బీబీసీ కరస్పాండెంట్ ఖగేష్, ఇప్పటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీకు ముఖ్యమైన వార్తలను అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  4. ఏడెనిమిదేళ్లుగా ఇదే పరిస్థితి: ప్రశాంత్ కిశోర్

    ప్రశాంత్ కిశోర్
    ఫొటో క్యాప్షన్, ప్రశాంత్ కిశోర్

    ఎలక్షన్ కమిషన్‌పై జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

    మీడియాతో మాట్లాడిన ఆయన.. “జ్ఞానేశ్ కుమార్‌కి ముందు రాజీవ్ కుమార్ ఆ పదవిలో ఉన్నారు. ఆయన కూడా ఈసీని ఇలాగే నడిపించారు. రిటైరైన తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీకి రాజీవ్‌ని ఛైర్మన్‌ను చేశారు” అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

    ‘ఎలక్షన్ కమిషన్ ప్రతిష్ఠ, విశ్వసనీయతే ప్రశ్నార్థకంగా మారింది. అది కేవలం ఒక వ్యక్తి వల్లనో లేదా ఒక సంఘటన వల్లనో కాదు. గత ఏడెనిమిది ఏళ్లుగా ఓటరు జాబితా తయారీ, ఎన్నికల షెడ్యూల్, మోడల్ కోడ్, ఓటుకు రూ.10వేల చొప్పున బిహార్ ప్రభుత్వం కొనుగోలు చేయడం, ఓట్ల లెక్కింపు సహా ప్రతి దశలో ఎన్నికల సంఘం బహిరంగంగానే అధికార పార్టీకి మేలు చేస్తోంది” అని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు.

  5. ‘దేశాన్ని నలుగురు హైజాక్ చేశారు.. శిక్షపడేలా చేస్తాం’.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో దిల్లీలో మూడో రోజూ ప్రతిపక్షాల నిరసనలు

  6. రొమ్ము క్యాన్సర్: లక్షణాలు లేకపోయినా టెస్ట్‌లు ఎందుకు చేయించుకోవాలి?

  7. భారత్ రక్షణ సమాచారం పాకిస్తాన్ నిఘా సంస్థలకు అందుతోందా?

  8. ‘గంటకు పైగా సీపీఆర్ చేసినా బతకలేదు’ నానా పాటేకర్ చివరిక్షణాలపై వైద్యులు ఏం చెప్పారు?

  9. పిడుగు పడిందా, వడగళ్ల వర్షమా? 104 మందితో వెళ్తున్న ఆ విమానం ఎందుకు దెబ్బతింది?

  10. ‘సర్’ వివాదం: హైదరాబాద్‌లో ‘చలో లోక్ భవన్’ నిర్వహించిన ‘ఇండియా’ కూటమి

    చలో లోక్ భవన్
    ఫొటో క్యాప్షన్, ఇండియా కూటమి నిరసన

    ఓట్ల సవరణ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఇచ్చిన ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో లోక్‌భవన్ (రాజ్‌భవన్)’ ర్యాలీ జరిగింది.

    నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

    అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.

    ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కును కాపాడాలనే ప్రధాన డిమాండ్‌తో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. ఈ ర్యాలీలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, తెలంగాణ జన సమితి (టీజేఎస్), ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

    ర్యాలీలో పాల్గొన్న మంత్రులందర్నీ అరెస్టు చేసి పంజాగుట్ట స్టేషన్‌కు , ఇతర నాయకులను వేర్వేరు పోలీసుస్టేషన్లకు తరలించారు.

  11. ఇవాళ బ్లాక్ డేగా పాటిస్తాం: కాంగ్రెస్

    రాహుల్ గాంధీ, కాంగ్రెస్, ప్రియాంక గాంధీ, జంతర్ మంతర్, దిల్లీ, నిరసన
    ఫొటో క్యాప్షన్, ప్రియాంక గాంధీ

    ప్రధాన ఎన్నికల కమిషర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్బంగా రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్షనేతలపై పోలీసుల చర్యలను కాంగ్రెస్ ఖండించింది. ఇవాళ(గురువారం) దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు ప్రకటించింది.

    భారత ప్రజాస్వామ్యం కోసం బ్లాక్ డే పాటిస్తామని కాంగ్రెస్ తెలిపింది.

    జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా రెండు రోజులుగా దిల్లీలో కాంగ్రెస్ నిరసనలు చేస్తోంది. నిరసనల సమయంలో మంగళవారం(అక్టోబర్ 6), బుధవారం(అక్టోబర్ 7)రాహుల్ గాంధీని, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత విడుదల చేశారు.

    జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఈ నెల 10న కాక్రోచ్ జనతాపార్టీ నిరసన చేపట్టనుంది.

  12. జెన్ జెడ్, విపక్షాల ఉద్యమం: భారత్‌లో ప్రతిపక్షాల భాష ఎంత వేగంగా మారిందంటే..

  13. మోనాల్.. అందమైన ఈ పక్షి తన కూత స్థాయిని ఎందుకు పెంచింది?

  14. పంతానికి పోయి 40 ఏళ్ల నుంచి అన్నం తినడమే మానేసిన అవ్వ... మరి ఆమె భోజనం ఏమిటి?

  15. మన్యం పల్లెల్లో మెడికల్ డ్రోన్స్ సేవలు..

  16. సోదరుడి ఆటతో స్ఫూర్తి, అత్యధిక సెంచరీల కీర్తి... భారత మహిళా క్రికెట్ కొత్త కెప్టెన్ స్మృతి మంధాన జీవితంలో కొన్ని ఆసక్తికర సంగతులు

  17. ‘‘స్నైపర్ల దాడులు, బాంబు మోతల మధ్య రోజూ స్కూలుకు వెళతా.. ’’

  18. హైదరాబాద్: కాంగ్రెస్ బీఎల్ఏ ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించారంటూ బీజేపీ బీఎల్ఏ పై కేసు నమోదు

  19. రోజంతా హైడ్రామా తర్వాత రాహుల్ గాంధీ విడుదల, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై బీజేపీ ఏమన్నది?

  20. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ‘అన్నీ గుర్తుంచుకుంటాం’ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్ట్