రేషన్ బియ్యానికి నగదు బదిలీ తప్పనిసరి కాదు – ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

ఏపీలో రేషన్ పంపిణీలో నగదు బదిలీకి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ప్రాధమికంగా కొన్ని జిల్లాల్లో సర్వే చేశారు. ప్రజాభిప్రాయాలను తీసుకున్నారు. అయితే నగదు బదిలీ పథకాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

లైవ్ కవరేజీ

అరుణ్ శాండిల్య

  1. విద్యార్థుల బర్త్ డే పార్టీ : 'పోలీసు సైరన్ విని భయంతో పరుగులు, ఇద్దరు విద్యార్థుల మృతి’ - అసలేం జరిగింది?

  2. దిల్లీ: రామ్‌లీలా మైదాన్ వద్ద నేడు ప్రతిపక్షాల ర్యాలీ.. దిల్లీలో పరిస్థితిని చూపే 9 ఫోటోలు..

  3. రామ్‌లీలా: కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇక్కడ చేస్తున్న ఆందోళన లక్ష్యం ఏంటి? బీజేపీ ఏం చేస్తోంది?

  4. ‘భారత్‌లో పేదరికం తగ్గింది, కానీ..’

  5. ‘2024 ఎన్నికలు అక్రమం’ - మాక్ పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ

  6. రాప్తాడు: తరగతి గదిలోకి వచ్చి రంపంతో విద్యార్థినిపై దాడి.. అసలేం జరిగింది?

    రోదిస్తున్న బాలిక బంధువులు
    ఫొటో క్యాప్షన్, రోదిస్తున్న బాలిక బంధువులు

    రాప్తాడులోని జడ్పీ హైస్కూల్లో తరగతి గదిలో పాఠాలు జరుగుతుండగా ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ రంపంతో ప్రవేశించి ఓ బాలికపై దాడి చేశాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు అనంతపురం ఎస్పీ జగదీశ్ బీబీసీకి చెప్పారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడ క్లిక్ చేసి పూర్తి కథనం చదవండి

  7. రాప్తాడు: తరగతి గదిలోకి వచ్చి రంపంతో విద్యార్థినిపై దాడి.. అసలేం జరిగింది?

  8. ఖర్గే నివాసంలో ‘మాక్ పార్లమెంట్’, జ్ఞానేశ్ కుమార్‌పై ‘ప్రజా అభిశంసన’

    ప్రజా అభిశంసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, ప్రజా అభిశంసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

    ఇండియా కూటమితో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఆరోపిస్తున్నాయి. ఈ ప్రక్రియ కారణంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇది ప్రజల ప్రజాస్వామిక హక్కులపై నేరుగా జరిగిన దాడిగా ఆరోపిస్తున్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చదవండి

  9. యుక్రెయిన్‌కు 500 పేట్రియాట్ క్షిపణుల విక్రయానికి అమెరికా ఆమోదం

    యుక్రెయిన్, అమెరికా, ఆయుధాల కొనుగోలు
    ఫొటో క్యాప్షన్, ఆధునిక పీఏసీ-3 ఇంటర్‌సెప్టర్ క్షిపణుల విలువ సుమారు 2.1 బిలియన్ డాలర్లు ఉంటుందని అమెరికా విదేశీ వ్యహహారాల శాఖ వెల్లడించింది.

    రష్యా వైమానిక దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో యుక్రెయిన్‌‌‌కు 2.1 బిలియన్ డాలర్ల విలువైన 500 పేట్రియాట్ క్షిపణులను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.

    ఇటీవల నెలల్లో ఈ క్షిపణుల సరఫరాలో జాప్యం జరుగుతోందని యుక్రెయిన్ పేర్కొన్న నేపథ్యంలో అమెరికా నిర్ణయం వెలువడింది.

    ఆధునిక పీఏసీ-3 ఇంటర్‌సెప్టర్ క్షిపణుల విలువ సుమారు 2.1 బిలియన్ డాలర్లు ఉంటుందని అమెరికా విదేశీ వ్యహహారాల శాఖ వెల్లడించింది. వీటి కొనుగోలు ఖర్చును ఐరోపాలోని యుక్రెయిన్ మిత్రదేశాలు, కెనడా భరించనున్నాయనితెలిపింది.

    పేట్రియాట్ క్షిపణుల సరఫరాను వేగవంతం చేయాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్ స్కీ పలుమార్లు అమెరికాను కోరారు. రష్యా ప్రయోగించే ప్రమాదకర బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి ఇవే సమర్థమైన ఆయుధాలని యుక్రెయిన్ భావిస్తోంది.

    అమెరికా విదేశీ వ్యహహారాల శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ కొనుగోలుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. 'జంప్‌స్టార్ట్' కార్యక్రమం ద్వారా కెనడా, జర్మనీ, నార్వే అందించే విరాళాలు, యూరోపియన్ యూనియన్ 'యుక్రెయిన్ సపోర్ట్ లోన్' ద్వారా సమకూరే నిధులతో ఈ కొనుగోలుకు చెల్లింపులు చేయనున్నట్లు తెలిపింది.

    ఈ ఒప్పందంలో ప్రధాన కాంట్రాక్టర్‌గా అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ వ్యవహరించనుంది. ఈ విక్రయంలో అమెరికా ప్రభుత్వ నిధులు ఏవీ వినియోగించడం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

  10. జీఎస్‌ఎల్‌వీ ద్వారా కక్ష్యలోకి చేరిన ఎన్‌వీఎస్‌-03 నావిగేషన్ ఉపగ్రహం

    శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్
    ఫొటో క్యాప్షన్, తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్‌వీఎస్-03 మూడో ఉపగ్రహం.

    శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.

    శుక్రవారం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.ఈ రాకెట్ ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.

    జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18/ఎన్‌వీఎస్-03 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలోనిసతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తలుఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

    తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్‌వీఎస్-03 మూడో ఉపగ్రహం. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్ ద్వారా అందించే నావిగేషన్ సేవలను నిరంతరాయంగా కొనసాగించేందుకు దీన్ని రూపొందించారు.

    దేశానికి స్థానం, నావిగేషన్, సమయ నిర్ధరణ సేవలను స్వతంత్రంగా పొందే అవకాశం కల్పించే వ్యూహాత్మక ఉపగ్రహం ఇదని ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ అన్నారు.

    నావిగేషన్ ఉపగ్రహాలను సాధారణ ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం కూడా వినియోగిస్తారని ఆయన తెలిపారు. రైళ్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడంతో పాటు వాహనాలు, సముద్ర నౌకల కదలికలను పర్యవేక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. 'వన్ నేషన్ వన్ టైమ్' ప్రాజెక్టులోనూ ఈ ఉపగ్రహం కీలక భాగమని వివరించారు.

    'గగన్' వ్యవస్థతో కలిసి నావిగేషన్ సేవలు అందించడం ద్వారా ప్రపంచ నావిగేషన్ వ్యవస్థలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోందని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.

  11. జస్టిస్ కౌల్ రాసిన పుస్తకంలో మాజీ సీజేఐ చంద్రచూడ్‌ గురించి ఏముంది?

  12. మనీషా భన్వాలా: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళ రికార్డు

    మనీషా భన్వాలా
    ఫొటో క్యాప్షన్, ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా మనీషా నిలిచారు.

    ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 59 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా మనీషా భన్వాలా నిలిచారు.

    కజకిస్థాన్ రాజధాని అస్తానాలో శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో అమెరికాకు చెందిన అబిగైల్ నెట్‌ను 8-6 తేడాతో ఓడించారు.

    ఒలింపిక్స్‌లో లేని ఈ వెయిట్ కేటగిరీలో మనీషా తన పోరును ప్రీ క్వార్టర్ ఫైనల్‌తో ప్రారంభించారు. ఈ దశలో కెనడాకు చెందిన లారెన్స్ బ్యూత్రెగార్డ్‌ను విక్టరీ బై ఫాల్ పద్ధతిలో ఓడించారు.

    క్వార్టర్ ఫైనల్‌లో మంగోలియాకు చెందిన బొలోర్తుయా ఖురెల్ఖూను 6-0 తేడాతో ఓడించారు. ఆ తర్వాత సెమీఫైనల్‌లో స్థానిక రెజ్లర్ అల్టిన్ షగయేవాను సాంకేతిక ఆధిక్యంతో ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో హరియాణాకు చెందిన మనీషా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో స్వర్ణ పతకం సాధించారు.

    ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా మనీషా నిలిచారు. అంతకుముందు 2010లో మాస్కోలో జరిగిన పోటీల్లో సుశీల్ కుమార్ 66 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించారు.

    ప్రస్తుత చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో పతకాలు సాధించిన నాలుగో భారత రెజ్లర్ మనీషా. ఆమె కంటే ముందు నీలం సిరోహి (50 కిలోలు), కాజల్ ధోచక్ (76 కిలోలు) రజత పతకాలు సాధించగా, తనూ శర్మ (72 కిలోలు) కాంస్య పతకం గెలుచుకున్నారు.

  13. ‘వన్డేల్లో వారికి చోటు ఇవ్వకపోవడం అన్యాయమే’: యువరాజ్ సింగ్

    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డేల్లో రెగ్యులర్‌గా చోటు కల్పించాలంటున్నారు యువరాజ్ సింగ్
    ఫొటో క్యాప్షన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డేల్లో రెగ్యులర్‌గా చోటు కల్పించాలంటున్నారు యువరాజ్ సింగ్

    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డే జట్టులో రెగ్యులర్ స్థానం ఇవ్వకపోవడం వారి ప్రతిభకు అన్యాయం చేయడమేనని భారత మాజీ ఆల్-రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

    ముంబయిలో ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ , "నిజం చెప్పాలంటే, అభిషేక్ శర్మ వన్డేలు ఆడటం చూడాలని కోరుకుంటున్నా. ఇషాన్ కిషన్, అభిషేక్ వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లను 50 ఓవర్ల క్రికెట్‌లో ఎంపిక చేయకపోతే, ఎక్కడో ఒకచోట మనం వారి ప్రతిభకు న్యాయం చేయడం లేదని అర్థం అని నేను గతంలోనే చెప్పా’’ అన్నారు.

    "మన దగ్గర కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. , వారికి జట్టులో స్థానం సంపాదించడం కష్టమని నాకు తెలుసు. కానీ ఈ ఆటగాళ్లు రాణిస్తున్న తీరు చూస్తుంటే, వారికి త్వరలోనే జట్టులో స్థానం లభిస్తుందని ఆశిస్తున్నా" అన్నారు.

    ఈ ఆటగాళ్లు సాధించినదంతా వారి కఠోర శ్రమతోనే సాధ్యమైందని, ఆ ఘనత వారికే దక్కుతుందని యువరాజ్ అన్నారు.

  14. ‘పిల్లలకు చదువు చెప్పడంలో న్యాయం చేయలేకపోతున్నాం’.. దేశంలో లక్షకుపైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు

  15. అంతర్వేది తీరానికి చేరిన భారీ ఓడకు ఏమైంది? ఒడ్డుకు సమీపంలో ఎలా చిక్కుకుంది? అందులో ఏం ఉంది

  16. ‘పాతికేళ్ల కుర్రాళ్లకూ పక్షవాతం రావొచ్చు’.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

  17. తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్

    తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్ ఇదే.
    ఫొటో క్యాప్షన్, తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్ ఇదే.

    ఇవాళ వర్షం కురిసే జిల్లాలు: సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం,

    రేపు(31 అక్టోబర్ 2026)వర్షం కురిసే జిల్లాలు: సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి,

    ఎల్లుండి(1 నవంబర్ 2026)వర్షం కురిసే జిల్లాలు: తెలంగాణ వ్యాప్తంగా చెదురుమదురు వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది

    సోమవారం(2 నవంబర్ 2026 )వర్షం కురిసే జిల్లాలు: కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల్లో వానలు పడతాయని మిగతా జిల్లాల్లో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

  18. చంటిబిడ్డను ఎత్తుకొని హాఫ్ మారథాన్‌ పూర్తి చేసిన కశ్మీరీ మహిళ.. ‘సైనికుడి భార్య జీవితం పోరాటమే’ అని ఆమె ఎందుకన్నారు

  19. ‘ప్రతి పెట్టుబడికి నాదీ భరోసా’ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్‌రెడ్డి

    తెలంగాణ‌ రైజింగ్‌లో భాగ‌స్వాములు కావాల‌ని అంత‌ర్జాతీయ‌ పారిశ్రామిక‌వేత్త‌లను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

    హైద‌రాబాద్ భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 స‌న్నాహ‌క కార్య‌క్ర‌మాన్ని దిల్లీలో నిర్వ‌హించారు.

    కార్య‌క్ర‌మానికి కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ముఖ్య‌మంత్రిరేవంత్ రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి అవ‌స‌ర‌మైన విధాన నిర్ణయాలు, ప్రభుత్వ సహకారం అందించేందుకు వ్యక్తిగతంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అంత‌ర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

    పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ‌ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏం కావాలో చెప్పాలని, విధానపరమైన మార్పుల నుంచి అవసరమైన సహకారం వరకు అన్నింటినీ అందించేందుకు వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

    "2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని సాధించేందుకు భారతీయులందరూ కలిసి కృషి చేయాలి. ప్రస్తుతం మనం దసరా, కర్వా చౌత్, దీపావళి వంటి పండుగల సీజన్‌లో ఉన్నాం. ఈ సమ్మిట్ మనకు మరో పండుగ వంటిది. 700 ఏళ్లకు పైగా క్రితమే, కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు సముద్ర వాణిజ్యానికి సంబంధించి 'మోటుపల్లి శాసనం'ను జారీ చేశారు" అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

    ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హామీ
    ఫొటో క్యాప్షన్, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హామీ
  20. పాదాలలో తిమ్మిరి, సూదులతో గుచ్చినట్టు మంట.. ఇవి డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి లక్షణాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?