రేషన్ బియ్యానికి నగదు బదిలీ తప్పనిసరి కాదు – ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

ఏపీలో రేషన్ పంపిణీలో నగదు బదిలీకి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ప్రాధమికంగా కొన్ని జిల్లాల్లో సర్వే చేశారు. ప్రజాభిప్రాయాలను తీసుకున్నారు. అయితే నగదు బదిలీ పథకాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

లైవ్ కవరేజీ

అరుణ్ శాండిల్య

  1. భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై ఐటీబీపీ డీజీ ఏమన్నారు? విపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి

  2. చెమ్మణి సామూహిక సమాధి: ఒకే చోట దొరికిన 583 అస్థిపంజరాలు ఎవరివి? ‘నరమేధానికి గురైన’ తమిళులవా.. అంటువ్యాధితో మరణించినవారివా?

  3. 'బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వారందరికీ రొమ్ము తొలగించాల్సిన అవసరం లేదు'

  4. చదవడం, రాయడం మర్చిపోయిన ఈ బాలికకు ఏమైంది?

  5. Ind vs Nz: భారత్ టార్గెట్ 226, పది ఓవర్లకు 119/3

    హాగ్లీ ఓవల్
    ఫొటో క్యాప్షన్, 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది.

    క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పది ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.

    భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి ఐదు ఓవర్లలో 16 రన్ రేట్‌తో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సంజూ శామ్సన్ 33 బంతుల్లో 67 పరుగులు, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యారు. తిలక్ వర్మ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. క్రీజులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఉన్నారు.

    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజీలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అలెన్ 24 బంతుల్లో 45 పరుగులు చేయగా, సీఫర్ట్ 24 పరుగులు సాధించాడు. డారిల్ మిచెల్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

    నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫిలిప్స్, నాలుగో వికెట్‌కు బెవన్ జాకబ్స్‌తో కలిసి 32 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫిలిప్స్ 40 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు.

    జాకబ్స్ 16 బంతుల్లో మూడు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

    ఈ మ్యాచ్‌తో పేసర్ భువనేశ్వర్ కుమార్ 2022 తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.

  6. దసరా పండుగను అక్కడ 76 రోజుల పాటు జరుపుకుంటారు, కానీ రావణ దహనం మాత్రం ఉండదు

  7. '2022లో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా’ : సౌదీ కఠిన చట్టాలు తెలుసుకోకపోతే ప్రమాదమే

  8. పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ

  9. హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

  10. పంజాబ్‌లో కుటుంబాన్ని తుపాకీతో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్న పోలీస్

    పంజాబ్, మాన్సా
    ఫొటో క్యాప్షన్, పంజాబ్‌లో కుటుంబాన్ని తుపాకీతో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్న పోలీస్

    పంజాబ్‌లోని మాన్సాలో పోలీసు కానిస్టేబుల్ కుటుంబంపై కాల్పులు జరిపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

    ఈ కాల్పుల్లో ఒక కుమారుడు చనిపోగా, భార్య, మరో కుమారుడు గాయపడినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

    గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

    ఈ ఘటన ఉదయం 7గంటల ప్రాంతంలో జరిగిందని మాన్సా ఎస్ఎస్సీ చెప్పారు.

    కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు ఆయన పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలిస్తాయని వెల్లడించారు.

    సర్వీస్ తుపాకీతోనే కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు.

    మన్సా డిప్యూటీ కమిషనర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా ఆయన పని చేస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.

    (ఆత్మహత్య అనేది ఒక తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే, భారత ప్రభుత్వానికి చెందిన 'జీవన్ ఆస్థా' (Jeevan Aastha) హెల్ప్‌లైన్ నంబర్ 18002333330 ద్వారా సహాయం పొందవచ్చు. అలాగే, మీ స్నేహితులు, బంధువులతో కూడా మాట్లాడండి.)

  11. ‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్

  12. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. ఫోటోల్లో

  13. ‘‘నన్ను బలవంతంగా టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లాడు, నేను కళ్లు మూసుకుని అక్కడ లేననుకున్నా’’

  14. దసరా: మీకు పాలపిట్ట కనిపించిందా?

  15. ఆస్ట్రేలియా: ఎంపీని కారుతో గుద్ది హత్యాయత్నం

    ఆస్ట్రేలియా, ఎంపీ హెలెన్ హెయిన్స్‌, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి, ఆంథోనీ అల్బనీస్
    ఫొటో క్యాప్షన్, కారుతో ఢీకొట్టి ఆస్ట్రేలియా ఎంపీపై హత్యాయత్నం

    ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హెయిన్స్‌ను కారు ఢీకొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించారు.

    విక్టోరియాలోని వాంగరట్టాలో తన కార్యాలయం బయట పార్కింగ్‌లో ఉండగా, సోమవారం మధ్యాహ్నం కారు ఢీకొనడంతో హెలెన్ హెయిన్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. అయితే దాడి వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

    హెయిన్స్‌ను ఢీకొట్టడానికి కారు డ్రైవర్ యూ టర్న్ తీసుకు వచ్చినట్టు కనిపిస్తోందని అల్బనీస్ అన్నారు. కారు నడుపుతున్న 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

    హెలెన్ హెయిన్స్ ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో గల ఇండి డివిజన్‌కు చెందిన 65 ఏళ్ల స్వతంత్ర ఎంపీ.

    ఆమె 2019లో తొలిసారిగా ఆస్ట్రేలియన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికయ్యారు. 2022, 2025లలో తిరిగి ఎన్నికయ్యారు.

    రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు ఆమె నర్సుగా, ప్రజారోగ్య పరిశోధకురాలిగా పనిచేశారు.

  16. బంగ్లాదేశ్‌కు చెప్పకుండానే ఆ దేశ జంటకు సౌదీ మరణ శిక్ష అమలు చేసిందా?

  17. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు: ముగ్గురు అరెస్ట్

    టైగర్ ష్రాఫ్, ముంబై, బాలీవుడ్, రాజస్థాన్
    ఫొటో క్యాప్షన్, టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఏఎన్‌ఐ పేర్కొంది.

    ముంబైలో ఆదివారం సాయంత్రం టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఏఎన్‌ఐ రిపోర్టు చేసింది. వీరిని రాజస్థాన్ పోలీసులు పట్టుకున్నారని తెలిపింది.

    బాలీవుడ్ నటుడు టైగర్ ‌ష్రాఫ్ కాల్పుల కేసులో ముగ్గురు నిందితులను రాజస్థాన్‌లోని కోటా పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు హరియాణాకు చెందిన వారు కాగా, ఒకరు బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

    వారంతా రైలులో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నట్టు కోటా ఎస్పీ తేజస్వినీ గౌతమ్ ఏఎన్‌ఐతో చెప్పారు.

  18. సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన

  19. పంజాబ్‌: ఉపాధి హామీ పథకం కూలీలపైకి దూసుకెళ్లిన కారు-8 మంది మృతి

    పంజాబ్, ఉపాధి హామీ పథకం,
    ఫొటో క్యాప్షన్, ఘటనా స్థలంలో ఏడుస్తూ కనిపించిన మహిళ

    పంజాబ్‌లోని సంగ్రూర్‌లో రోడ్డుపై పని చేస్తున్న ఉపాధి హామీ పథకం కూలీలపైకి ఒక కారు దూసుకెళ్లింది. అక్కడ పని చేస్తున్న వారిలో 8 మంది మృతి చెందారు. మరికొందరు కూలీలు గాయపడ్డారు.

    సంగ్రూర్ జిల్లాలోని లెహ్రాగాగా-జఖల్ రోడ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆ రోడ్డుపై పని చేస్తున్న కూలీలను వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టిందని సంగ్రూర్ ఎస్పీ పల్విందర్ సింగ్ చీమా చెప్పారు. మృతి చెందిన 8 మందిలో ఆరుగురు మహిళలు ఉన్నారు.

    ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ దాదాపు 25 మంది వరకు కూలీలు పని చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒక మోటార్ సైకిల్ కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

    ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఆయన కోసం గాలిస్తున్నారు.

  20. ముంబయి: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. పోలీసులు ఏమంటున్నారు?