మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

జాతీయ ఉత్తమ నటులుగా సూర్య, అజయ్ దేవ్‌గణ్ ... ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి

నేడు 2020 సంవత్సరానికి సంబంధించి 68వ జాతీయ సినిమా అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటులుగా తమిళ నటుడు సూర్య, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఎంపికయ్యారు. ఉత్తమ నటి అవార్డ్ అపర్ణ బాలమురళికి దక్కింది.

లైవ్ కవరేజీ

  1. వీసా మోసాలు: ఇన్ఫోసిస్, టీసీఎస్ సహా పలు భారతీయ ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు, మైక్రోసాఫ్ట్, అడోబ్‌లకు మినహాయింపు

    ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమిని సహా పలు ప్రధాన టెక్నాలజీ, ఐటీ కంపెనీలను యూఎస్ కార్మిక శాఖ యూఎస్ పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి తప్పించింది.

    అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ ఒక ప్రకటనలో తెలిపిన ప్రకారం, ఈ ప్రోగ్రామ్ నుంచి మైక్రోసాఫ్ట్, అడోబ్‌లను కూడా తొలగించామని చెప్పారు. ఈ రెండు కంపెనీలపై పలు ఫెడరల్ దర్యాప్తులు కొనసాగుతుండటమే దీనికి కారణమని పేర్కొన్నారు.

    "ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీలైన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినిలను పర్మినెంట్ వర్కర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. పలు ఫెడరల్ దర్యాప్తుల కారణంగా యూఎస్ కార్మిక శాఖ కూడా మైక్రోసాఫ్ట్, అడోబ్‌లను ఈ ప్రోగ్రామ్ నుంచి తప్పించింది" అని సోండర్లింగ్ అన్నారు.

    ఆయన ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్‌ను కూడా ప్రస్తావించారు.

    బహుశా మైక్రోసాఫ్ట్ కంటే మరే ఇతర అమెరికన్ కంపెనీ కూడా ఈ వ్యవస్థను ఇంతగా దుర్వినియోగం చేసి ఉండదని సోండర్లింగ్ ఆరోపించారు.

    2025లో మైక్రోసాఫ్ట్ సుమారు 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించిందని సోండర్లింగ్ ఆరోపించారు.

    కొన్ని పదవులకు అర్హతగల అమెరికన్ ఉద్యోగులను కనుగొనలేకపోతున్నామని ఆ సంస్థ ఇంతకుముందు చెప్పింది.

    "వీసా ప్రక్రియ దుర్వినియోగాన్ని అరికట్టడం, అమెరికన్ కార్మికులను పరిరక్షించడానికి, ఈ రోజు తీసుకుంటున్న ఈ చరిత్రాత్మక చర్య ఒక ముఖ్యమైన మొదటి అడుగు" అని సోండర్లింగ్ X లోని ఒక పోస్ట్‌లో రాశారు.

  2. బస్సులపై రష్యా దాడిలో కనీసం 30 మంది మృతి చెందారని యుక్రెయిన్ తెలిపింది, బస్సులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు

    "బస్సులను లక్ష్యంగా చేసుకుని రష్యా జరిపిన దాడుల్లో" కనీసం 30 మంది మరణించారని యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.

    సరిహద్దు నగరమైన క్రమటోర్స్క్‌లో పౌరులతో ప్రయాణిస్తున్న రెండు బస్సులపై రష్యా గ్లైడ్ బాంబులు దాడి చేశాయని అధికారులు తెలిపారు.

    ఈ దాడిలో మరో 18 మంది గాయపడ్డారని డొనెట్స్క్ ప్రాంత అధిపతి వాడిమ్ ఫిల్యాష్కిన్ తెలిపారు.

    సాధ్యమైనంత ఎక్కువ మంది పౌరులను చంపేందుకు, ప్రయాణికులతో వెళ్తున్న బస్సులను రష్యా లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.

    స్థానిక అధికారులు పోస్ట్ చేసిన చిత్రాలలో రోడ్డుపై శిథిలాలు, మండుతున్న బస్సు కనిపించాయి.

    రష్యా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న కోట ప్రాంతంలో క్రామటోర్స్క్, దాని పొరుగు నగరమైన స్లోవియాన్స్క్ ఉన్నాయి. యుక్రెయిన్లోని డాన్‌బాస్ పారిశ్రామిక ప్రాంతం మొత్తం తమదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వాదిస్తున్నారు.

    దేశవ్యాప్తంగా రష్యా దాడులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో జరిగిన ఈ తాజా దాడిపై రష్యా ఇంకా స్పందించలేదు.

    ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు నాటికి యుక్రెయిన్‌లో మరణించిన పౌరుల సంఖ్య, 2025 సంవత్సరం మొత్తం మీద మరణించిన పౌరుల సంఖ్యను మించిపోయింది.

  3. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను, బీబీసీ కరస్పాండెంట్ ఖగేష్, ఇప్పటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీకు ముఖ్యమైన వార్తలను అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  4. రొమ్ము క్యాన్సర్: లక్షణాలు లేకపోయినా టెస్ట్‌లు ఎందుకు చేయించుకోవాలి?

  5. భారత్ రక్షణ సమాచారం పాకిస్తాన్ నిఘా సంస్థలకు అందుతోందా?

  6. పిడుగు పడిందా, వడగళ్ల వర్షమా? 104 మందితో వెళ్తున్న ఆ విమానం ఎందుకు దెబ్బతింది?

  7. ‘‘సుమారు 150 ఏళ్లు ప్రపంచానికి దూరంగా ఒక ద్వీపంలో బతికారు, వాళ్లకు షాపులు, డబ్బులు, టీవీలు, సినిమాలు అంటే ఏంటో తెలియదు’’

  8. ‘సర్’ వివాదం: హైదరాబాద్‌లో ‘చలో లోక్ భవన్’ నిర్వహించిన ‘ఇండియా’ కూటమి

    ఓట్ల సవరణ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఇచ్చిన ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో లోక్‌భవన్ (రాజ్‌భవన్)’ ర్యాలీ జరిగింది.

    నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

    అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.

    ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కును కాపాడాలనే ప్రధాన డిమాండ్‌తో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. ఈ ర్యాలీలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, తెలంగాణ జన సమితి (టీజేఎస్), ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

    ర్యాలీలో పాల్గొన్న మంత్రులందర్నీ అరెస్టు చేసి పంజాగుట్ట స్టేషన్‌కు , ఇతర నాయకులను వేర్వేరు పోలీసుస్టేషన్లకు తరలించారు.

  9. జెన్ జెడ్, విపక్షాల ఉద్యమం: భారత్‌లో ప్రతిపక్షాల భాష ఎంత వేగంగా మారిందంటే..

  10. మోనాల్.. అందమైన ఈ పక్షి తన కూత స్థాయిని ఎందుకు పెంచింది?

  11. పంతానికి పోయి 40 ఏళ్ల నుంచి అన్నం తినడమే మానేసిన అవ్వ... మరి ఆమె భోజనం ఏమిటి?

  12. క్రిస్టాపైక్‌: రెండు విషపు ఇంజెక్షన్లను తట్టుకున్న నిందితురాలు ఇప్పుడు కోలుకుని మాట్లాడుతున్నారు, ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదంటున్న జర్నలిస్ట్

  13. ‘‘స్నైపర్ల దాడులు, బాంబు మోతల మధ్య రోజూ స్కూలుకు వెళతా.. ’’

  14. హైదరాబాద్: కాంగ్రెస్ బీఎల్ఏ ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించారంటూ బీజేపీ బీఎల్ఏ పై కేసు నమోదు

  15. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ‘అన్నీ గుర్తుంచుకుంటాం’ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్ట్

  16. ఫ్రాన్సిస్ హాల్జెన్‌: ‘ఘోస్ట్ పార్టికల్స్’ను గుర్తించిన టెలిస్కోప్‌ రూపకర్తకు నోబెల్

  17. కాలిఫోర్నియాలో బాల్య వివాహాలపై నిషేధం.. అమెరికాలోని 32 రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇవి చట్టబద్ధమే

  18. రష్యాలో ప్లేగుపై పరిశోధన చేస్తున్న మహిళ మృతి.. 14వ శతాబ్దంలో యూరప్‌లో సగం జనాభా చనిపోవడానికి కారణమైన ఈ వ్యాధి ఎలా సోకుతుంది?

  19. కెప్టెన్సీ నుంచి వైదొలగిన హర్మన్‌ప్రీత్ కౌర్: ఫాస్ట్ బౌలర్‌ నుంచి కెప్టెన్‌ వరకు ఆమె ప్రయాణం ఎలా సాగిందంటే..

  20. సర్ వివాదం: ఫామ్ 7 దరఖాస్తులు ఎందుకు, దీనిపై వివాదం ఏమిటి, ఫామ్ 6పై సుప్రీం కోర్టు ఏం చెప్పింది?