విమానంలో వృద్ధురాలిపై ప్రయాణికుడు మూత్రం పోసిన కేసులో ఎయిర్ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా

కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో నిరసనలు చేస్తోన్న భారత రెజ్లర్లు గురువారం రాత్రి సమావేశం అయ్యారు. అయితే, ఈ సమావేశంలోనూ వారికి పరిష్కారం లభించలేదని రెజ్లర్లు చెబుతున్నారు.

లైవ్ కవరేజీ

  1. దిల్లీ: రామ్‌లీలా మైదానంలో నేడు ప్రతిపక్షాల ర్యాలీ.. దిల్లీలో పరిస్థితిని చూపే 9 ఫోటోలు..

  2. ‘‘రామ్‌లీలాకు పది లక్షలమంది వస్తారు’’ అంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు చెబుతున్న ఈ ఆందోళన లక్ష్యం ఏంటి? బీజేపీ ఏం చేస్తోంది?

  3. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థలకు ప్రారంభమైన పోలింగ్

    92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్
    ఫొటో క్యాప్షన్, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది.

    ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

    13 నగరపాలక సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు), 79 పురపాలక సంస్థలు/నగర పంచాయతీలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.

    ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేయగా, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

    ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

  4. సీఈసీ రాజీనామా కోరుతూ నేడు దిల్లీలో ప్రతిపక్షాల భారీ ర్యాలీ

    కాంగ్రెస్, దిల్లీలో ప్రతిపక్షాల భారీ ర్యాలీ
    ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ పిలుపునిచ్చిన ఈ ర్యాలీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామ్‌లీలా మైదానంలో ప్రారంభం కానుంది (ఫైల్ ఫోటో).

    దేశ రాజధాని దిల్లీలో ప్రతిపక్షాలు ఆదివారం(నేడు) భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జరిగే ఈ ర్యాలీకి వేలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

    ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన ఈ ర్యాలీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామ్‌లీలా మైదానంలో ప్రారంభం కానుంది. దీనికి పది లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

    కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి చెందిన పలువురు కీలక నాయకులు ఈ ర్యాలీలో పాల్గొంటామని ప్రకటించారు. 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) కూడా ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించింది.

    దేశవ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల పేర్లను తొలగించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)పై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ర్యాలీ జరగనుంది.

    మరణించినవారు, తమ నమోదిత చిరునామాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినవారి పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను నవీకరించడమే ఈ ప్రక్రియ ఉద్దేశమని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చెబుతోంది.

    నవంబర్ 1న ఈ ర్యాలీ , కాంగ్రెస్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్
    ఫొటో క్యాప్షన్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్

    అయితే, ఈ ర్యాలీకి కాంగ్రెస్ ఎంచుకున్న రోజు సరైనది కాదని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభిప్రాయపడింది.

    "వారు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే, నవంబర్ 1న ఈ ర్యాలీ నిర్వహించడాన్ని కూటమి నాయకులు కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే దిల్లీ చరిత్రలో నవంబర్ 1 అత్యంత సున్నితమైన రోజు. 1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత నవంబర్ 1న దిల్లీలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. సిక్కు సోదరులపై దాడులు జరిగాయి. రక్తపాతం చోటుచేసుకుంది.అలాంటి రోజునే రాహుల్ గాంధీ ర్యాలీకి ఎంచుకున్నారు" అని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు.

  5. ‘భారత్‌లో పేదరికం తగ్గింది, కానీ..’

  6. ‘2024 ఎన్నికలు అక్రమం’ - మాక్ పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ

  7. రాప్తాడు: తరగతి గదిలోకి వచ్చి రంపంతో విద్యార్థినిపై దాడి.. అసలేం జరిగింది?

    రోదిస్తున్న బాలిక బంధువులు
    ఫొటో క్యాప్షన్, రోదిస్తున్న బాలిక బంధువులు

    రాప్తాడులోని జడ్పీ హైస్కూల్లో తరగతి గదిలో పాఠాలు జరుగుతుండగా ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ రంపంతో ప్రవేశించి ఓ బాలికపై దాడి చేశాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు అనంతపురం ఎస్పీ జగదీశ్ బీబీసీకి చెప్పారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడ క్లిక్ చేసి పూర్తి కథనం చదవండి

  8. రాప్తాడు: తరగతి గదిలోకి వచ్చి రంపంతో విద్యార్థినిపై దాడి.. అసలేం జరిగింది?

  9. ఖర్గే నివాసంలో ‘మాక్ పార్లమెంట్’, జ్ఞానేశ్ కుమార్‌పై ‘ప్రజా అభిశంసన’

    ప్రజా అభిశంసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, ప్రజా అభిశంసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

    ఇండియా కూటమితో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఆరోపిస్తున్నాయి. ఈ ప్రక్రియ కారణంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇది ప్రజల ప్రజాస్వామిక హక్కులపై నేరుగా జరిగిన దాడిగా ఆరోపిస్తున్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చదవండి

  10. జస్టిస్ ఫర్ జెహన్నే: 15వ శతాబ్దపు లైంగిక దాడి బాధితురాలి న్యాయపోరాటం ఏమైంది?

  11. ఆంధ్రప్రదేశ్‌ను 'బిహార్ ఆఫ్ సౌత్' అంటూ ఉత్తరాది రాష్ట్రంతో ఎందుకు పోలుస్తున్నారు?

    ఆంధ్రప్రదేశ్, బిహార్
    ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్, బిహార్

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది. ''ఏపీని దక్షిణాది బిహార్‌గా మార్చేశారు'' అంటూ ట్రోలింగ్, విమర్శలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.‌ హింసాత్మక ఘటనల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఏపీ, బిహార్ మధ్య పోలికలు పెడుతూ కామెంట్లు పెడుతున్నారు.పూర్తి కథనం కోసం ఇక్క క్లిక్ చేయండి.

  12. ఆంధ్రప్రదేశ్‌ను 'బిహార్ ఆఫ్ సౌత్' అంటూ ఉత్తరాది రాష్ట్రంతో ఎందుకు పోలుస్తున్నారు?

  13. 'రామాయణ' సినిమాలో సీతగా నటించిన సాయిపల్లవిపై ఆన్‌లైన్‌లో విమర్శలేంటి?

  14. ఇమ్మోర్టల్ జెల్లీఫిష్: చంపినా మళ్లీ పుట్టే ఈ జీవిలాగా మనుషులు కూడా మారొచ్చా? పరిశోధకులు ఏం చేస్తున్నారు?

  15. జీఎస్‌ఎల్‌వీ ద్వారా కక్ష్యలోకి చేరిన ఎన్‌వీఎస్‌-03 నావిగేషన్ ఉపగ్రహం

    శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్
    ఫొటో క్యాప్షన్, తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్‌వీఎస్-03 మూడో ఉపగ్రహం.

    శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.

    శుక్రవారం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.ఈ రాకెట్ ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.

    జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18/ఎన్‌వీఎస్-03 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలోనిసతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తలుఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

    తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్‌వీఎస్-03 మూడో ఉపగ్రహం. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్ ద్వారా అందించే నావిగేషన్ సేవలను నిరంతరాయంగా కొనసాగించేందుకు దీన్ని రూపొందించారు.

    దేశానికి స్థానం, నావిగేషన్, సమయ నిర్ధరణ సేవలను స్వతంత్రంగా పొందే అవకాశం కల్పించే వ్యూహాత్మక ఉపగ్రహం ఇదని ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ అన్నారు.

    నావిగేషన్ ఉపగ్రహాలను సాధారణ ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం కూడా వినియోగిస్తారని ఆయన తెలిపారు. రైళ్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడంతో పాటు వాహనాలు, సముద్ర నౌకల కదలికలను పర్యవేక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. 'వన్ నేషన్ వన్ టైమ్' ప్రాజెక్టులోనూ ఈ ఉపగ్రహం కీలక భాగమని వివరించారు.

    'గగన్' వ్యవస్థతో కలిసి నావిగేషన్ సేవలు అందించడం ద్వారా ప్రపంచ నావిగేషన్ వ్యవస్థలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోందని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.

  16. జస్టిస్ కౌల్ రాసిన పుస్తకంలో మాజీ సీజేఐ చంద్రచూడ్‌ గురించి ఏముంది?

  17. మనీషా భన్వాలా: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళ రికార్డు

    మనీషా భన్వాలా
    ఫొటో క్యాప్షన్, ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా మనీషా నిలిచారు.

    ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 59 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా మనీషా భన్వాలా నిలిచారు.

    కజకిస్థాన్ రాజధాని అస్తానాలో శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో అమెరికాకు చెందిన అబిగైల్ నెట్‌ను 8-6 తేడాతో ఓడించారు.

    ఒలింపిక్స్‌లో లేని ఈ వెయిట్ కేటగిరీలో మనీషా తన పోరును ప్రీ క్వార్టర్ ఫైనల్‌తో ప్రారంభించారు. ఈ దశలో కెనడాకు చెందిన లారెన్స్ బ్యూత్రెగార్డ్‌ను విక్టరీ బై ఫాల్ పద్ధతిలో ఓడించారు.

    క్వార్టర్ ఫైనల్‌లో మంగోలియాకు చెందిన బొలోర్తుయా ఖురెల్ఖూను 6-0 తేడాతో ఓడించారు. ఆ తర్వాత సెమీఫైనల్‌లో స్థానిక రెజ్లర్ అల్టిన్ షగయేవాను సాంకేతిక ఆధిక్యంతో ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో హరియాణాకు చెందిన మనీషా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో స్వర్ణ పతకం సాధించారు.

    ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా మనీషా నిలిచారు. అంతకుముందు 2010లో మాస్కోలో జరిగిన పోటీల్లో సుశీల్ కుమార్ 66 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించారు.

    ప్రస్తుత చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో పతకాలు సాధించిన నాలుగో భారత రెజ్లర్ మనీషా. ఆమె కంటే ముందు నీలం సిరోహి (50 కిలోలు), కాజల్ ధోచక్ (76 కిలోలు) రజత పతకాలు సాధించగా, తనూ శర్మ (72 కిలోలు) కాంస్య పతకం గెలుచుకున్నారు.

  18. పాకిస్తాన్: మానవ హక్కుల న్యాయవాద దంపతులకు 10 ఏళ్ల జైలు శిక్ష.. వీళ్లు చేసిన తప్పేంటి?

  19. ‘ఐడీబీఐను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే, ప్రభుత్వం మాట్లాడలేదు’ - రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ, ఐడీబీఐ బ్యాంక్, పారిశ్రామికీకరణ
    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ

    ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత, రాహుల్ గాంధీ ఐడిబీఐ ఉద్యోగులకు బహిరంగ లేఖ రాశారు.

    “గతేడాది మార్చిలో మీలో కొందరు పార్లమెంట్ భవనంలో నన్ను కలవడానికి వచ్చారు. మీరు లాభదాయకంగా మార్చిన బ్యాంకును ప్రభుత్వం ఎందుకు అమ్ముతోంది అని నన్ను ఒక సాధారణ ప్రశ్న అడిగారు” అని రాహుల్ తన లేఖలో తెలిపారు.

    “నేను ఈ ప్రశ్నను లోక్‌సభలో లేవనెత్తాను. లాభదాయకమైన ప్రభుత్వ రంగ బ్యాంకును ఎందుకు అమ్ముతున్నారని అడిగాను. దీనికి ప్రభుత్వం ఎలాంటి కారణం చెప్పలేదు. ఇప్పుడు ఐడీబీఐ బ్యాంకును కెనడా కంపెనీ ఫెయిర్‌ఫాక్స్‌కు అమ్మాలని నిర్ణయించింది” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

    బ్యాంకులో ప్రస్తుతం ప్రభుత్వానికి, ఎల్ఐసీకి 95 శాతం వాటా ఉందని, అమ్మకం తర్వాత ఈ వాటా 34 శాతానికి తగ్గుతుందని ఆయన తన లేఖలో రాశారు. “ఐడీబీఐ ప్రైవేట్ చేతుల్లోకి వెళితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభ్యర్థులకు ఉన్న రిజర్వేషన్ వ్యవస్థ అంతమైపోతుంది. మీ హక్కులు ఇప్పటికే బలహీనమయ్యాయి. ఇప్పుడు వాటి చివరి రక్షణ కూడా అంతమైపోతుంది” అని రాహుల్ తెలిపారు.

    రాహుల్ గాంధీ లేఖపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్‌లో స్పందించారు.

    “బ్యాంకులు, ఆర్థిక సంస్థలను తన సొంత ప్రైవేట్ సంస్థల్లా కాంగ్రెస్ ఉపయోగించుకుందని మనందరికీ తెలుసు. తమ ఇష్టానుసారం రుణాలు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో రుణాలు ఇవ్వడానికి సంబంధించిన ముఖ్యమైన నియమ నిబంధనలను కూడా విస్మరించారు” అని ఆమె ఆరోపించారు.

    ఐడీబీఐ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపింది.

    “భారత పారిశ్రామికీకరణకు ఆర్థిక సహాయం అందించడానికి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నెహ్రూ స్థాపించారు. ఇప్పుడు అదే సంస్థను మోసపూరితంగా అమ్ముతున్నారు” అని ఆ సంస్థ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. “మీ మద్దతుతో మా పోరాట పటిమ రెట్టింపు అయింది. దేశ చారిత్రక సంస్థ అయిన ఐడీబిఐని కాపాడటానికి మా చివరి శ్వాస వరకు పోరాడతాము” అని ఐడీబీఐ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాహుల్ గాంధీని ఉద్దేశించి పోస్ట్ చేసింది.

  20. ‘వన్డేల్లో వారికి చోటు ఇవ్వకపోవడం అన్యాయమే’: యువరాజ్ సింగ్

    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డేల్లో రెగ్యులర్‌గా చోటు కల్పించాలంటున్నారు యువరాజ్ సింగ్
    ఫొటో క్యాప్షన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డేల్లో రెగ్యులర్‌గా చోటు కల్పించాలంటున్నారు యువరాజ్ సింగ్

    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డే జట్టులో రెగ్యులర్ స్థానం ఇవ్వకపోవడం వారి ప్రతిభకు అన్యాయం చేయడమేనని భారత మాజీ ఆల్-రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

    ముంబయిలో ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ , "నిజం చెప్పాలంటే, అభిషేక్ శర్మ వన్డేలు ఆడటం చూడాలని కోరుకుంటున్నా. ఇషాన్ కిషన్, అభిషేక్ వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లను 50 ఓవర్ల క్రికెట్‌లో ఎంపిక చేయకపోతే, ఎక్కడో ఒకచోట మనం వారి ప్రతిభకు న్యాయం చేయడం లేదని అర్థం అని నేను గతంలోనే చెప్పా’’ అన్నారు.

    "మన దగ్గర కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. , వారికి జట్టులో స్థానం సంపాదించడం కష్టమని నాకు తెలుసు. కానీ ఈ ఆటగాళ్లు రాణిస్తున్న తీరు చూస్తుంటే, వారికి త్వరలోనే జట్టులో స్థానం లభిస్తుందని ఆశిస్తున్నా" అన్నారు.

    ఈ ఆటగాళ్లు సాధించినదంతా వారి కఠోర శ్రమతోనే సాధ్యమైందని, ఆ ఘనత వారికే దక్కుతుందని యువరాజ్ అన్నారు.