విమానంలో వృద్ధురాలిపై ప్రయాణికుడు మూత్రం పోసిన కేసులో ఎయిర్ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా

కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో నిరసనలు చేస్తోన్న భారత రెజ్లర్లు గురువారం రాత్రి సమావేశం అయ్యారు. అయితే, ఈ సమావేశంలోనూ వారికి పరిష్కారం లభించలేదని రెజ్లర్లు చెబుతున్నారు.

లైవ్ కవరేజీ

  1. విపక్షాల పాదయాత్రకు అడ్డంకులు.. దారి మార్చుకుని సుప్రీంకోర్ట్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రతిపక్షాల నాయకులు

  2. సీజేపీ నిరసన ప్రదర్శనల రిపోర్టింగ్‌లో జర్నలిస్టులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?

  3. జ్ఞానేశ్‌ కుమార్‌ను వదిలేది లేదు. వేచి చేస్తున్నాం: రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ, నరేంద్రమోదీ, జ్ఞానేశ్ కుమార్
    ఫొటో క్యాప్షన్, నరేంద్రమోదీ ప్రభుత్వం జ్ఞానేశ్ కుమార్‌ను రక్షించేందుకు మిగతా వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేస్తోందని రాహుల్ అన్నారు.

    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్ అవినీతి గురించి తనకు తెలుసని, ఆయన్ను వదిలేది లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.

    “ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అడిగిన ప్రశ్నలనే మేం కూడా అడుగుతున్నాం. జ్ఞానేశ్ కుమార్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? జ్ఞానేశ్ కుమార్ జీ.. మీ పరిస్థితేంటో మాకు తెలుసు. మీకు నిద్ర పట్టడం లేదు. మేం మిమ్మల్ని వదిలిపెట్టం. మీరు తప్పించుకోలేరు. మీ గతం మీ అవినీతి గురించి మాకు తెలుసు. మేం కేవలం వేచి చేస్తున్నాం” అని రాహుల్ గాంధీ అన్నారు.

    దిల్లీలో నిరసనకారులపై జరుగుతున్న పోలీసు చర్యల గురించి రాహుల్ స్పందిస్తూ, ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తోందని అన్నారు.

    “ఓట్ల చోరీకి వ్యతిరేకంగా దిల్లీలో చాలా రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే దిల్లీని ఎందుకు జైలుగా మార్చారు? నగరంలోకి రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారు. రైళ్లు, బస్సుల్లోనే వారిని నిలిపివేస్తున్నారు. ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తోంది” అన్నారు.

  4. బీజేపీ వ్యతిరేక ఓట్లనే తొలగిస్తున్నారు: రేవంత్ రెడ్డి

    కాంగ్రెస్ తెలంగాణ, రేవంత్ రెడ్డి
    ఫొటో క్యాప్షన్, సోమవారం జరగనున్న ర్యాలీ కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అమలుచేసిన రాష్ట్రాలలోనే ఆ పార్టీ గెలిచిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

    సోమవారం జరగనున్న కాంగ్రెస్ పాదయాత్ర కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    "ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నది ఎవరంటే..దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మైనార్టీలు, యువత. బీజేపీని ఓడించాలనుకున్న ప్రజల ఓటు హక్కును తొలగించడానికి కుట్ర చేశారు. జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కమిషన్ సభ్యులు చెప్పారు. తప్పులు జరుగుతున్నాయని తెలిసినపుడు, ఆ అధికారిని తొలగించడానికి మోదీకి అభ్యంతరం ఏమిటి?, ఆయనకు అండగా ఎందుకు నిలబడుతున్నారు" అని రేవంత్ రెడ్డి అన్నారు.

  5. ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి

    ఒమన్, భారత నౌకలపై డ్రోన్ దాడి
    ఫొటో క్యాప్షన్, ఇద్దరు భారతీయులు గల్లంతైనట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు (ప్రతీకాత్మక చిత్రం).

    ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై ఆదివారం డ్రోన్‌ దాడి జరిగింది. నౌకలో ఉన్న 11 మంది భారతీయ నావికుల్లో తొమ్మిది మందిని రక్షించగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఇద్దరు నావికులు కనిపించకుండా పోయిన విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు.

    "అక్టోబర్ 11న సోహార్ యాంకరేజ్ వద్ద భారతీయ ట్యాంకర్ ఎం.టి. పెట్రో డాల్ఫిన్‌పై డ్రోన్ దాడి జరిగింది. ట్యాంకర్‌పై 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. తొమ్మిది మందిని రక్షించారు, ఇద్దరు గల్లంతయ్యారు" అన్నారు.

    స్థానిక తీర రక్షక దళం గాలింపు, సహాయక చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు.

    గల్లంతైన వారిని గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సహాయక చర్యలకు పూర్తి మద్దతు అందించేందుకు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని సర్బానంద సోనోవాల్‌ పేర్కొన్నారు.

  6. సీజేపీ: బాండ్‌పై సంతకం చేస్తే నిరసనలకు దూరంగా ఉంచగలరా? చట్టం ఏం చెబుతోంది?

  7. మియన్మార్‌లో పెరుగుతున్న బలవంతపు సైనిక నియామకాలు..

  8. విపక్ష ఎంపీలతో భేటీకి సీజేఐ సూర్యకాంత్ నిరాకరణ

    సీజేపీ, ప్రతిపక్షాలు
    ఫొటో క్యాప్షన్, ప్రతిపక్ష పార్టీల ఎంపీలను కలవకపోవడానికి సీజేఐ కొన్ని కారణాలు చెప్పారు (ఫైల్ ఫోటో).

    విపక్ష పార్టీల ఎంపీలతో సమావేశమయ్యేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ నిరాకరించారు. వారిని కలవలేకపోవడానికి కొన్ని కారణాలను సీజేఐ వివరించినప్పటికీ, లేఖ గోప్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని బహిర్గతం చేసేందుకు నిరాకరించారు.

    “విపక్ష నేతల లేఖ నాకు నిన్న అందింది. దానికి నిన్న రాత్రే సమాధానం ఇచ్చాను. కొన్ని కారణాలను వివరిస్తూ వారిని కలవలేనని తెలియజేశాను” అని సీజేఐ సూర్యకాంత్ సోమవారం మీడియాతో చెప్పారు.

    ‘వన్ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌’పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సుప్రీంకోర్టు పర్యటన రద్దు కావడంపై కూడా సీజేఐని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ.. “ఆ విషయంలో కోర్టులో విరుద్ధ ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అందుకే, మేం దీనిపై చర్చించాం. ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలకైనా దూరంగా ఉండాలని నా సీనియర్ న్యాయ సహచరులు, నేను ఒకే అభిప్రాయానికి వచ్చాం” అని తెలిపారు.

    సీజేఐను కలిసేందుకు సమయం కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి లేఖ రాసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం తెలిపారు.

  9. యువత ఆగ్రహం ఎవరి మీద? ఎన్నికల సంఘంపైనా, మోదీ పైనా?

  10. నేహా బోరా గురించి దర్శకుడు దేవా కట్టా ట్వీట్

    దేవా కట్టా, నేహా బోరా
    ఫొటో క్యాప్షన్, దేవా కట్టా

    అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా గురించి టాలీవుడ్ దర్శకుడు దేవా కట్టా 'ఎక్స్' వేదికగా స్పందించారు.

    "ఆమెతో మీరు ఏకీభవించవచ్చు, లేకపోవచ్చు... ఆమె పోరాట స్ఫూర్తితో మీరు మమేకం కావచ్చు, కాకపోవచ్చు... కానీ, మన రాజకీయాలు, రాజకీయ నాయకుల నేరపూరిత, నిరంకుశ పోకడలు సాధారణ విషయంగా మారిపోతుండటంపట్ల ఆమె వ్యక్తం చేస్తున్న ఆక్రోశం, ఆగ్రహాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే... అప్పుడు నిజమైన 'యాంటీ-నేషనల్’ మీరే!!" అంటూ ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

  11. సీజేపీ ఆందోళనలు: పోలీసులు విమానంలోకి వచ్చి అరెస్టు చేయవచ్చా?

  12. దిల్లీలో నిరసనకారులపై దాడులు, హిందుత్వ సంఘాల ప్రస్తావన ఎందుకు వస్తోంది?

  13. సుప్రీంకోర్టు వరకు పాదయాత్ర : రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, దిల్లీ ఆందోళనలు
    ఫొటో క్యాప్షన్, జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు

    సుప్రీంకోర్టుకు సోమవారం పాదయాత్రగా వెళ్లి ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రం సమర్పించనున్నట్టు విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.

    సుప్రీంకోర్టుకు చేరుకున్న తర్వాత ప్రధాన న్యాయమూర్తిని జస్టిస్ సూర్యకాంత్‌ను కలిసి దేశవ్యాప్త విజ్ఞప్తులతో కూడిన ఒక వినతిప్రతం సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.

    సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సమయం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇప్పటికే సీజేఐకి లేఖలు రాశారు.

    ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలనుకునే యువత, విపక్షాలు , పౌర సమాజం కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా తనతో కలిసి రావాలని రాహుల్ గాంధీ కోరారు.

    ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అజిత్ డోభాల్, మోహన్ భాగవత్‌ భారత ప్రజల గొంతును నొక్కలేరని రాహుల్ అన్నారు.

  14. ‘స్మైలింగ్ డిప్రెషన్’: మీ చిరునవ్వు వెనుక డిప్రెషన్ కూడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి

  15. ఎవరీ నేహా బోరా? బీజేపీకి మద్దతు ఇచ్చే కుటుంబం నుంచి వచ్చి ఉద్యమాల ముఖచిత్రంగా ఎలా మారారు?

  16. చీర ధరించి 1600 మీటర్ల పరుగు పందాన్ని 9 నిమిషాల్లో పూర్తి చేసిన కవిత..

  17. భారత టెక్ దిగ్గజాలపై అమెరికా చర్యలు: గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర ఆలస్యం తప్పదా?

  18. అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్‌ రాంకా విడుదల

    సీజేపీ, అభిజిత్ దీప్కే, ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌, దిల్లీ పోలీసులు, దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్
    ఫొటో క్యాప్షన్, శనివారం ముంబయి నుంచి దిల్లీకి వచ్చిన అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విడుదల చేసినట్లు సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్ ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు.

    శనివారం ఉదయం ముంబయి నుంచి దిల్లీకి వచ్చిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సహ కన్వీనర్ సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రాంకాను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు.

    "అభిజిత్, అశుతోష్, సౌరవ్‌లను ఈరోజు ఉదయం 9 గంటలకు దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు" అని రత్నా సింగ్ తెలిపారు.

    "దిల్లీ పోలీసు అధికారి ఒకరు ఈరోజు ఉదయం నాకు ఈ సమాచారం ఇచ్చారు. సీజేపీ లీగల్ హెడ్ హోదాలో, మా తరఫున హాజరయ్యే ఇతర వకీళ్లతో కలిసి నేను పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో ఉంటాను" అని చెప్పారు.

    అంతకుముందు, సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను ముందస్తు నిర్బంధంలో ఉంచామని, వారిని నేడు దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు దిల్లీ పోలీసులు చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

    మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా ముగ్గురు నాయకుల నిర్బంధంపై స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

    "మోదీ, షా ఎంతలా భయపడ్డారంటే నేడు వారు పిల్లలను అపహరిస్తున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది" అని ఎక్స్‌లో పేర్కొన్నారు

  19. దిల్లీలో నేడూ నిరసనలు కొనసాగుతాయి: నేహా బోరా

    నేహా బోరా, దిల్లీ నిరసనలు
    ఫొటో క్యాప్షన్, ఆదివారం వేరే ప్రదేశంలో నిరసన తెలుపుతామని నేహా బోరా చెప్పారు.

    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ దిల్లీలో జరుగుతున్న నిరసనలు ఆదివారం కూడా కొనసాగుతాయని అఖిల భారత విద్యార్థి సంఘం (ఐసా) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ప్రకటించారు.

    సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన నేహా బోరా, శనివారం దిల్లీ హాట్ 'జంతర్-మంతర్'‌గా మారిందని, ఆదివారం వేరే ప్రదేశంలో నిరసన తెలుపుతామని చెప్పారు.

    "సామాన్యులను జైళ్లలో పెడతారా లేక జ్ఞానేశ్ కుమార్‌‌నా అనేది మీరే తేల్చుకోండి. మేం ఆదివారం కూడా వీధుల్లోకి వస్తాం, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఎస్‌ఐఆర్ రద్దు డిమాండ్‌తో నిరసన ప్రదర్శన చేస్తాం" అని అన్నారు.

    మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేత అజింక్య శిందే ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసి ఆదివారం జరగనున్న నిరసన వివరాలు వెల్లడించారు.

    "జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఇళ్లకు తిరిగి వెళ్లం" అని ఆయన పేర్కొన్నారు.

    తాము రేపు ఉదయం 10 గంటలకు మళ్లీ జంతర్-మంతర్ వైపు కవాతు చేస్తామని అజింక్య చెప్పారు. అలాగే భారీ సంఖ్యలో జంతర్-మంతర్‌కు చేరుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

  20. ‘నా కోచ్‌లో మగవాళ్లు మద్యం తాగుతున్నారు’ అంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన అస్సాం యువతి తర్వాతి రోజు శవంగా కనిపించారు..