విమానంలో వృద్ధురాలిపై ప్రయాణికుడు మూత్రం పోసిన కేసులో ఎయిర్ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా
కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో నిరసనలు చేస్తోన్న భారత రెజ్లర్లు గురువారం రాత్రి సమావేశం అయ్యారు. అయితే, ఈ సమావేశంలోనూ వారికి పరిష్కారం లభించలేదని రెజ్లర్లు చెబుతున్నారు.
లైవ్ కవరేజీ
కొత్త తరం ప్రశ్నలు అడుగుతోంది, వారికి తార్కికంగా సమాధానం చెప్పాలి - మోహన్ భగవత్

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, మోహన్ భగవత్(ఫైల్ ఫోటో) కొత్త తరం ప్రశ్నలు అడుగుతోందని, వాటికి తార్కికంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర, దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్న తరుణంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"మేం చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పిన విషయాలతో వాదించేవాళ్ళం కాదు. మాట్లాడొద్దు అంటే మాట్లాడే వాళ్లం కాదు" అని అన్నారు.
‘‘కానీ ఇప్పుడు అలా లేదు, కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది, వారికి సమాధానాలు చెప్పాలి. నేటి తరానికి మరింత ఆప్యాయత అవసరం. మనం వారితో సమయం గడపాలి. మనం వారితో మాట్లాడాలి. ఈ రోజుల్లో కుటుంబాల మధ్య సంభాషణలు తగ్గిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లతో బిజీగా ఉన్నారు" అని ఆయన అన్నారు.
శుక్రవారం దిల్లీలో జరిగిన 'విశ్వ మాంగళ్య సభ' కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సులో ఆత్మాహుతి దాడి, 15 మంది మృతి

ఫొటో సోర్స్, Abdul BASIT / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్లో 15మంది మృతి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సులోని టాంక్ జిల్లాలో ఉన్న సైన్యం, పోలీసుల సంయుక్త చెక్ పోస్టు మాంఝీ ఖేల్‌పై గురువారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది సైనికులతో సహా మొత్తం 15 మంది మరణించారు.
మృతుల్లో ఇద్దరు పోలీసులు, ఒక అటవీ శాఖ అధికారి ఉన్నారు. ఈ దాడి అనంతరం భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో పన్నెండు మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
‘‘ఉగ్రవాదులు మొదట చెక్‌పోస్ట్ భద్రతను ఛేదించుకుని లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ భద్రతా దళాలు వారి ప్రయత్నాన్ని విఫలం చేశాయి. ఆ తర్వాత పారిపోతున్న మిలిటెంట్లను వెంబడించి కాల్పులు జరపడంతో 12 మంది మరణించారు’’ అని పాకిస్తానీ సైన్యానికి చెందిన మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) తెలిపింది.
‘‘తొలి ప్రయత్నం విఫలమైన తర్వాత ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో చెక్‌పోస్ట్ గోడను ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించింది. 15 మంది చనిపోయారు. చెక్‌పాయింట్ పూర్తిగా ధ్వంసమైంది’’ అని ఐఎస్పీఆర్ తెలిపింది.
దిల్లీ నిరసనలు: పెల్లెట్ గన్ అంటే ఏంటి, ఎందుకు వివాదాస్పదంగా మారింది?
92 ఏళ్ల వయసులోనూ సర్జరీలు చేస్తున్న లేడీ డాక్టర్
సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ వైఖరుల్లో ఈ వ్యత్యాసం ఎందుకు, నడ్డా చేతులమీదుగా దీక్ష విరమణపై వస్తున్న ప్రశ్నలేంటి?
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడాన్ని ఎలా చూడాలి?
సెక్స్ తర్వాత ఎంతసేపటిలో పిల్స్ వేసుకుంటే గర్భం రాదు?
మూవీ రివ్యూ: ఇది ‘లేడీ దేవదాస్’ కథా?
దోమలపై యుద్ధానికి రంగంలోకి సైన్యం, మిలటరీ డ్రోన్లు.. శ్రీలంకలో ఏం జరుగుతోంది?
కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రభుత్వంతో చర్చలు - సౌరవ్ దాస్

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, సౌరవ్ దాస్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా తమ డిమాండ్లన్నీ యథాతథంగానే ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు. వాటిపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు.
"తటస్థ వేదికపై చర్చలు జరపాలన్న మా డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. మాకు సంతోషంగా ఉంది. చర్చల కోసం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాను ఎంపిక చేశారు. ప్రభుత్వం విశాల దృక్పథంతో మా ముందుకు వచ్చినందుకు, వీధుల్లోకి వచ్చిన ప్రజల మాట వినడానికి సుముఖంగా ఉన్నందుకు మాకు ఆనందంగా ఉంది" అని సౌరవ్ దాస్ చెప్పారు.
"వారు జంతర్ మంతర్‌కూ వచ్చుండొచ్చు. కానీ మేమే ప్రత్యామ్నాయంగా తటస్థ వేదికను సూచించాం. వారు జంతర్ మంతర్‌కు రావడానికి సంకోచించవచ్చని మాకు అర్థమైంది. మేము చదువుకున్న, తెలివైన వ్యక్తులం. అందుకే ఈ తటస్థ వేదికను ప్రతిపాదించాం" అని ఆయన తెలిపారు.
నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిన తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు మరికొన్ని డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు నెల రోజులకు పైగా దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్నారు.
అయితే ఈ డిమాండ్లకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను విరమించారు.
సోనమ్ సర్ దీక్షను విరమించడం సంతోషంగా ఉంది - అభిజిత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, అభిజిత్ దీప్కే సోనమ్ వాంగ్‌చుక్ గురువారం అర్ధరాత్రి తర్వాత తన నిరాహార దీక్షను విరమించడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే సంతోషం వ్యక్తంచేశారు.
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణపై అభిజిత్ దీప్కే ‘ఎక్స్’లో ఓవీడియో విడుదల చేశారు.
"సోనమ్ సర్ 26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను విరమించడం మాకు ఉపశమనం, సంతోషాన్ని కలిగించింది. సర్.. మీ అసాధారణ ధైర్యానికి, త్యాగానికి ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి, యావత్ దేశ మనస్సాక్షిని కదిలించారు. మీ జీవితం ఈ దేశానికి చాలా విలువైనది" అని అందులో రాశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసన కొనసాగుతుందని తెలిపారు.
నీట్-యూజీ పేపర్ లీక్‌కు నిరసనగా విద్యార్థులు గత నెల రోజులుగా జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిమాండ్‌కు మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.
మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది : రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, PTI
ఫొటో క్యాప్షన్, ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ బస్సులో మహాత్మా గాంధీ స్మృతి వనానికి వెళ్లారు. కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలకు చెందిన సుమారు 100 మంది ఎంపీలు గురువారం సాయంత్రం ఎట్టకేలకు తీస్ జనవరి మార్గ్‌లోని గాంధీ స్మృతివనానికి చేరుకున్నారు.
అక్కడ, నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పించారు.
"మహాత్మా గాంధీ ఇక్కడే హత్యకు గురయ్యారు. ఈరోజు మోదీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. దీనిని ప్రతిపక్షం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోదు" అని రాహుల్ గాంధీ అన్నారు.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను క్యాబినెట్ నుంచి ప్రధాని మోదీ బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడం మోదీ ప్రభుత్వానికి కష్టతరమా?
జంతర్ మంతర్: వాష్‌రూమ్స్, ఫుడ్, మెడిసిన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నామంటే..
ప్రభుత్వంతో సీజేపీ చర్చలు జరగకపోవడానికి కారణమదేనా?

ఫొటో సోర్స్, ANI
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను గురువారం చర్చలకు ఆహ్వానించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివాసం లేదా కార్యాలయంలో చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
అయితే, చర్చల వేదికపై సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా అభ్యంతరం వ్యక్తం చేశారు. "చర్చలు తటస్థ ప్రదేశంలో జరగాలి" అని అన్నారు.
జంతర్ మంతర్ వద్ద ఉన్న మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, "జంతర్ మంతర్‌కు రావడానికి వాళ్లు భయపడుతున్నారు. అందుకే, మీ నివాసం లేదా జంతర్ మంతర్ కాకుండా మరోచోట చర్చలు జరగాలని వారికి సూచించాం" అని ఆయన అన్నారు.
"కానీ, జితేంద్ర సింగ్ మాత్రం జేపీ నడ్డా నివాసం లేదా ఆయన కార్యాలయంలో చర్చలు జరుపుదామని అంటున్నారు."
చర్చావేదిక విషయంలో సీజేపీ, ప్రభుత్వానికి మధ్య సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు పట్టుబడుతున్నారు.
ప్రీటర్మ్ డెలివరీ: నెలలు నిండకముందే పుట్టిన పిల్లలకు జీవితాంతం సమస్యలు తప్పవా? అపోహలు - సమాధానాలు
జన నాయకుడు మూవీ రివ్యూ: విజయ్ 'చివరి సినిమా' ఎలా ఉంది?
ఎన్ఎస్ఏ కింద దిల్లీ పోలీసు కమిషనర్‌కు ఇచ్చిన అధికారం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ), 1980 కింద ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులను జారీ చేసే అధికారాన్ని దిల్లీ పోలీస్ కమిషనర్‌కు కల్పించారు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.
ఈ అధికారాన్ని 2026 జూలై 19 నుంచి 2026 అక్టోబర్ 18 వరకు మూడు నెలల కాలానికి మంజూరు చేసినప్పటికీ, ఈ విషయం ఇప్పుడే బహిరంగంగా తెలిసింది.
దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం జరుగుతున్న నిరసనల దృష్ట్యా దీన్ని అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తున్నారు.
జూలై 20న జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంట్‌కు మార్చ్ నిర్వహించాలని సీజేపీ పిలుపునిచ్చింది.
దీని తర్వాత, నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో చాలా మంది గాయపడ్డారు.
జంతర్ మంతర్ వద్ద సీజేపీ, దాని కార్యకర్తల నిరసన ఇంకా కొనసాగుతోంది.
సీదిరి అప్పలరాజు అరెస్ట్: యాక్సిడెంట్ కేసు నుంచి కొడుకును తప్పించేందుకు ప్రయత్నించారా?
