మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో గెలుపు.. నెంబర్ 1 ర్యాంకుకు చేరుకున్న భారత్

భారత్, న్యూజిలాండ్‌పై మూడో వన్డే లో గెలిచి 3-0తో సీరీస్ కైవసం చేసుకుంది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది.

లైవ్ కవరేజీ

  1. రాజీనామా లేఖను ప్రధానికి సమర్పించా : ధర్మేంద్ర ప్రధాన్

    కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సోషల్ మీడియా వేదికగా ధర్మేంద్ర ప్రదాన్ తన రాజీనామాను ప్రకటించారు. రాజీనామా లేఖను గౌరవ ప్రధాన మంత్రికి సమర్పించినట్లు తెలిపారు.

    నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆయన రాజీనామా డిమాండ్ చేస్తూ దాదాపు నెల రోజులుగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరుగుతున్నాయి.

    ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. "జంతర్ మంతర్‌తో పాటు దేశంలో నెలకొన్న పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు. దేశ సమగ్రతను కాపాడుకోవాలి. విద్యార్థులు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. మన పిల్లలు తమ సమయాన్ని చదువుకు, కెరీర్ నిర్మాణానికి కేటాయించాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, నా రాజీనామా లేఖను గౌరవ ప్రధాన మంత్రికి సమర్పించాను" అని ఆయన అందులో రాశారు.

  2. సోనమ్ వాంగ్‌చుక్: ‘బాధ, ఆవేదన, కోపంతో ఈ మాటలు మాట్లాడుతున్నా’

  3. ‘ఈ శతాబ్దపు విడాకులు’: ఈ కేసులో ఆ బిజినెస్ దిగ్గజం తన మాజీ భార్యకు ఎన్ని వేల కోట్లు చెల్లించాలంటే...

  4. 'పుట్టబోయే బిడ్డ ప్రాణాలతో ఉండకూడదనుకున్న తల్లి', కానీ ప్రసవం తర్వాత ఏం జరిగింది?

  5. కొత్త తరం ప్రశ్నలు అడుగుతోంది, వారికి తార్కికంగా సమాధానం చెప్పాలి - మోహన్ భగవత్

    కొత్త తరం ప్రశ్నలు అడుగుతోందని, వాటికి తార్కికంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

    దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర, దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్న తరుణంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    "మేం చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పిన విషయాలతో వాదించేవాళ్ళం కాదు. మాట్లాడొద్దు అంటే మాట్లాడే వాళ్లం కాదు" అని అన్నారు.

    ‘‘కానీ ఇప్పుడు అలా లేదు, కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది, వారికి సమాధానాలు చెప్పాలి. నేటి తరానికి మరింత ఆప్యాయత అవసరం. మనం వారితో సమయం గడపాలి. మనం వారితో మాట్లాడాలి. ఈ రోజుల్లో కుటుంబాల మధ్య సంభాషణలు తగ్గిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లతో బిజీగా ఉన్నారు" అని ఆయన అన్నారు.

    శుక్రవారం దిల్లీలో జరిగిన 'విశ్వ మాంగళ్య సభ' కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  6. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులో ఆత్మాహుతి దాడి, 15 మంది మృతి

    పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులోని టాంక్ జిల్లాలో ఉన్న సైన్యం, పోలీసుల సంయుక్త చెక్ పోస్టు మాంఝీ ఖేల్‌పై గురువారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది సైనికులతో సహా మొత్తం 15 మంది మరణించారు.

    మృతుల్లో ఇద్దరు పోలీసులు, ఒక అటవీ శాఖ అధికారి ఉన్నారు. ఈ దాడి అనంతరం భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో పన్నెండు మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

    ‘‘ఉగ్రవాదులు మొదట చెక్‌పోస్ట్ భద్రతను ఛేదించుకుని లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ భద్రతా దళాలు వారి ప్రయత్నాన్ని విఫలం చేశాయి. ఆ తర్వాత పారిపోతున్న మిలిటెంట్లను వెంబడించి కాల్పులు జరపడంతో 12 మంది మరణించారు’’ అని పాకిస్తానీ సైన్యానికి చెందిన మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) తెలిపింది.

    ‘‘తొలి ప్రయత్నం విఫలమైన తర్వాత ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో చెక్‌పోస్ట్ గోడను ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించింది. 15 మంది చనిపోయారు. చెక్‌పాయింట్‌ పూర్తిగా ధ్వంసమైంది’’ అని ఐఎస్‌పీఆర్ తెలిపింది.

  7. దిల్లీ నిరసనలు: పెల్లెట్ గన్ అంటే ఏంటి, ఎందుకు వివాదాస్పదంగా మారింది?

  8. రద్దీగా ఉన్న రోడ్డులో 'స్పైడర్‌మ్యాన్'..

  9. 92 ఏళ్ల వయసులోనూ సర్జరీలు చేస్తున్న లేడీ డాక్టర్

  10. సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ వైఖరుల్లో ఈ వ్యత్యాసం ఎందుకు, నడ్డా చేతులమీదుగా దీక్ష విరమణపై వస్తున్న ప్రశ్నలేంటి?

  11. 'జంతర్ మంతర్‌కు వెళ్తే చర్యలు తప్పవు': విద్యార్థులకు జేఎన్‌యూ, దిల్లీ యూనివర్సిటీ ఆదేశాలు

    దిల్లీ యూనివర్సిటీ తర్వాత, ఇప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలకు సంబంధించి తమ విద్యార్థులకు పలు సూచనలు చేసింది.

    దిల్లీలోని జంతర్ మంతర్ లేదా పరిసర ప్రాంతాల్లో నిర్వహించే ఎలాంటి సమావేశాలకు హాజరుకావద్దని తమ విద్యార్థులకు సూచించింది.

    దీనికిముందు దిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) కూడా తమ విద్యార్థులకు ఇదే తరహా సూచనలు చేసింది.

    "జేఎన్‌యూ స్టూడెంట్ కమ్యూనిటీలోని సభ్యులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ తమ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నాం. బహిరంగ ప్రదర్శనలకు సంబంధించి భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా, జంతర్ మంతర్ వద్ద లేదా పరిసర ప్రాంతాల్లో జరిగే సమావేశాలు, ప్రదర్శనలకు దూరంగా ఉండాలని కోరుతున్నాం" అని జేఎన్‌యూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

    "సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించండి. సోషల్ మీడియా నిబంధనల ఉల్లంఘలనకు పాల్పడితే ఆయా చట్టాలతో పాటు యూనివర్సిటీ నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది."

    ఇంతకుముందు దిల్లీ విశ్వవిద్యాలయం కూడా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో పాల్గొనవద్దని తమ విద్యార్థులకు సూచించింది.

    అయితే, ఈ ఆదేశాలపై లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, విద్యార్థులను విశ్వవిద్యాలయం బెదిరించలేదని అన్నారు.

  12. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడాన్ని ఎలా చూడాలి?

  13. సెక్స్ తర్వాత ఎంతసేపటిలో పిల్స్ వేసుకుంటే గర్భం రాదు?

  14. మూవీ రివ్యూ: ఇది ‘లేడీ దేవదాస్’ కథా?

  15. దోమలపై యుద్ధానికి రంగంలోకి సైన్యం, మిలటరీ డ్రోన్లు.. శ్రీలంకలో ఏం జరుగుతోంది?

  16. ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడం మోదీ ప్రభుత్వానికి కష్టతరమా?

  17. జంతర్ మంతర్: వాష్‌రూమ్స్, ఫుడ్, మెడిసిన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నామంటే..

  18. ప్రభుత్వంతో సీజేపీ చర్చలు జరగకపోవడానికి కారణమదేనా?

    కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను గురువారం చర్చలకు ఆహ్వానించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివాసం లేదా కార్యాలయంలో చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

    అయితే, చర్చల వేదికపై సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా అభ్యంతరం వ్యక్తం చేశారు. "చర్చలు తటస్థ ప్రదేశంలో జరగాలి" అని అన్నారు.

    జంతర్ మంతర్ వద్ద ఉన్న మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, "జంతర్ మంతర్‌కు రావడానికి వాళ్లు భయపడుతున్నారు. అందుకే, మీ నివాసం లేదా జంతర్ మంతర్ కాకుండా మరోచోట చర్చలు జరగాలని వారికి సూచించాం" అని ఆయన అన్నారు.

    "కానీ, జితేంద్ర సింగ్ మాత్రం జేపీ నడ్డా నివాసం లేదా ఆయన కార్యాలయంలో చర్చలు జరుపుదామని అంటున్నారు."

    చర్చావేదిక విషయంలో సీజేపీ, ప్రభుత్వానికి మధ్య సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు పట్టుబడుతున్నారు.

  19. ప్రీటర్మ్ డెలివరీ: నెలలు నిండకముందే పుట్టిన పిల్లలకు జీవితాంతం సమస్యలు తప్పవా? అపోహలు - సమాధానాలు

  20. జన నాయకుడు మూవీ రివ్యూ: విజయ్ 'చివరి సినిమా' ఎలా ఉంది?