న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో గెలుపు.. నెంబర్ 1 ర్యాంకుకు చేరుకున్న భారత్
భారత్, న్యూజిలాండ్‌పై మూడో వన్డే లో గెలిచి 3-0తో సీరీస్ కైవసం చేసుకుంది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది.
లైవ్ కవరేజీ
ఏపీ వైపు ముంచుకొస్తున్న ‘మురసు’ తుపాను
ఫొటో సోర్స్, AP Disaster management
బంగాళాఖాతంలో మురసు
తుపాను గడిచిన ఆరు గంటల్లో గంటకు 23 కిలోమీటర్ల వేగంతో
కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం చెన్నైకి
560 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 660 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 640 కిలోమీటర్లు, నెల్లూరుకు 630 కిలోమీటర్లు, ఒంగోలుకు 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
ఇది రేపు ఉదయానికి
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది.
రేపు అర్ధరాత్రి
నుంచి ఎల్లుండి తెల్లవారుజాము మధ్య నెల్లూరు, నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను
హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పీఎల్ఎన్ మూర్తి తెలిపారు.
తుపాను ప్రభావంతో
రానున్న మూడు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దిల్లీ: రామ్‌లీలా మైదాన్ వద్ద నేడు ప్రతిపక్షాల ర్యాలీ.. దిల్లీలో పరిస్థితిని చూపే 9 ఫోటోలు..
రామ్‌లీలా: కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇక్కడ చేస్తున్న ఆందోళన లక్ష్యం ఏంటి? బీజేపీ ఏం చేస్తోంది?
సంక్షోభాలు వస్తే ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎలా సిద్ధమవుతున్నారు? ఏం చేస్తున్నారు?
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థలకు ప్రారంభమైన పోలింగ్
ఫొటో సోర్స్, UGC
ఫొటో క్యాప్షన్, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
13 నగరపాలక సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు), 79
పురపాలక సంస్థలు/నగర పంచాయతీలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేయగా, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
సీఈసీ రాజీనామా కోరుతూ నేడు దిల్లీలో ప్రతిపక్షాల భారీ ర్యాలీ
ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ పిలుపునిచ్చిన ఈ ర్యాలీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామ్‌లీలా మైదానంలో ప్రారంభం కానుంది (ఫైల్ ఫోటో).
దేశ రాజధాని దిల్లీలో ప్రతిపక్షాలు
ఆదివారం(నేడు) భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జరిగే ఈ ర్యాలీకి వేలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన ఈ ర్యాలీ మధ్యాహ్నం
12 గంటల సమయంలో రామ్‌లీలా మైదానంలో ప్రారంభం కానుంది. దీనికి పది లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి చెందిన పలువురు కీలక నాయకులు ఈ ర్యాలీలో పాల్గొంటామని ప్రకటించారు. 'కాక్రోచ్ జనతా పార్టీ'
(సీజేపీ) కూడా ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి
13 కోట్ల పేర్లను తొలగించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)పై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ర్యాలీ జరగనుంది.
మరణించినవారు,
తమ నమోదిత చిరునామాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినవారి పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను నవీకరించడమే ఈ ప్రక్రియ ఉద్దేశమని భారత ఎన్నికల సంఘం
(ఈసీఐ) చెబుతోంది.
ఫొటో సోర్స్, Ishant Chauhan/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్
అయితే,
ఈ ర్యాలీకి కాంగ్రెస్ ఎంచుకున్న రోజు సరైనది కాదని భారతీయ జనతా పార్టీ
(బీజేపీ) అభిప్రాయపడింది.
"వారు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే,
నవంబర్ 1న ఈ ర్యాలీ నిర్వహించడాన్ని కూటమి నాయకులు కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే
దిల్లీ చరిత్రలో నవంబర్
1 అత్యంత సున్నితమైన రోజు. 1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత నవంబర్ 1న దిల్లీలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. సిక్కు సోదరులపై దాడులు జరిగాయి. రక్తపాతం చోటుచేసుకుంది.అలాంటి రోజునే రాహుల్ గాంధీ ర్యాలీకి ఎంచుకున్నారు" అని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు.
‘భారత్‌లో పేదరికం తగ్గింది, కానీ..’
‘2024 ఎన్నికలు అక్రమం’ - మాక్ పార్లమెంట్లో రాహుల్ గాంధీ
రాప్తాడు: తరగతి గదిలోకి వచ్చి రంపంతో విద్యార్థినిపై దాడి.. అసలేం జరిగింది?
ఫొటో సోర్స్, UGC
ఫొటో క్యాప్షన్, రోదిస్తున్న బాలిక బంధువులు
రాప్తాడులోని జడ్పీ హైస్కూల్లో
తరగతి గదిలో పాఠాలు జరుగుతుండగా ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ రంపంతో ప్రవేశించి ఓ బాలికపై
దాడి చేశాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు అనంతపురం ఎస్పీ జగదీశ్ బీబీసీకి చెప్పారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడ క్లిక్ చేసి పూర్తి కథనం చదవండి
రాప్తాడు: తరగతి గదిలోకి వచ్చి రంపంతో విద్యార్థినిపై దాడి.. అసలేం జరిగింది?
ఫొటో క్యాప్షన్, ప్రజా అభిశంసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇండియా కూటమితో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఆరోపిస్తున్నాయి. ఈ ప్రక్రియ కారణంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇది ప్రజల ప్రజాస్వామిక హక్కులపై నేరుగా జరిగిన దాడిగా ఆరోపిస్తున్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చదవండి
జస్టిస్ ఫర్ జెహన్నే: 15వ శతాబ్దపు లైంగిక దాడి బాధితురాలి న్యాయపోరాటం ఏమైంది?
ఆంధ్రప్రదేశ్‌ను 'బిహార్ ఆఫ్ సౌత్' అంటూ ఉత్తరాది రాష్ట్రంతో ఎందుకు పోలుస్తున్నారు?
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్, బిహార్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది. ''ఏపీని దక్షిణాది బిహార్‌గా మార్చేశారు'' అంటూ ట్రోలింగ్, విమర్శలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హింసాత్మక ఘటనల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఏపీ, బిహార్ మధ్య పోలికలు పెడుతూ కామెంట్లు పెడుతున్నారు.పూర్తి కథనం కోసం ఇక్క క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్‌ను 'బిహార్ ఆఫ్ సౌత్' అంటూ ఉత్తరాది రాష్ట్రంతో ఎందుకు పోలుస్తున్నారు?
'రామాయణ' సినిమాలో సీతగా నటించిన సాయిపల్లవిపై ఆన్లైన్లో విమర్శలేంటి?
యుక్రెయిన్‌కు 500 పేట్రియాట్ క్షిపణుల విక్రయానికి అమెరికా ఆమోదం
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, ఆధునిక పీఏసీ-3 ఇంటర్‌సెప్టర్ క్షిపణుల విలువ సుమారు 2.1 బిలియన్ డాలర్లు ఉంటుందని అమెరికా విదేశీ వ్యహహారాల శాఖ వెల్లడించింది.
రష్యా వైమానిక దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో యుక్రెయిన్‌కు 2.1 బిలియన్ డాలర్ల విలువైన 500 పేట్రియాట్ క్షిపణులను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.
ఇటీవల నెలల్లో ఈ క్షిపణుల సరఫరాలో జాప్యం జరుగుతోందని యుక్రెయిన్ పేర్కొన్న నేపథ్యంలో అమెరికా నిర్ణయం వెలువడింది.
ఆధునిక పీఏసీ-3
ఇంటర్‌సెప్టర్ క్షిపణుల విలువ సుమారు 2.1 బిలియన్ డాలర్లు ఉంటుందని అమెరికా విదేశీ వ్యహహారాల శాఖ వెల్లడించింది. వీటి కొనుగోలు ఖర్చును ఐరోపాలోని యుక్రెయిన్ మిత్రదేశాలు,
కెనడా భరించనున్నాయనితెలిపింది.
పేట్రియాట్ క్షిపణుల సరఫరాను వేగవంతం చేయాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్ స్కీ పలుమార్లు అమెరికాను కోరారు. రష్యా ప్రయోగించే ప్రమాదకర బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి ఇవే సమర్థమైన ఆయుధాలని యుక్రెయిన్ భావిస్తోంది.
అమెరికా విదేశీ
వ్యహహారాల శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ కొనుగోలుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. 'జంప్‌స్టార్ట్' కార్యక్రమం ద్వారా కెనడా, జర్మనీ, నార్వే అందించే విరాళాలు, యూరోపియన్ యూనియన్
'యుక్రెయిన్ సపోర్ట్ లోన్' ద్వారా సమకూరే నిధులతో ఈ కొనుగోలుకు చెల్లింపులు చేయనున్నట్లు తెలిపింది.
ఈ ఒప్పందంలో ప్రధాన కాంట్రాక్టర్‌గా అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ వ్యవహరించనుంది. ఈ విక్రయంలో అమెరికా ప్రభుత్వ నిధులు ఏవీ వినియోగించడం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇమ్మోర్టల్ జెల్లీఫిష్: చంపినా మళ్లీ పుట్టే ఈ జీవిలాగా మనుషులు కూడా మారొచ్చా? పరిశోధకులు ఏం చేస్తున్నారు?
జీఎస్ఎల్వీ ద్వారా కక్ష్యలోకి చేరిన ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహం
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్వీఎస్-03 మూడో ఉపగ్రహం.
శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్18
రాకెట్ ద్వారా ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.
శుక్రవారం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్18
రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.ఈ రాకెట్ ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.
జీఎస్ఎల్వీ-ఎఫ్18/ఎన్వీఎస్-03 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలోనిసతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తలుఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.
తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్వీఎస్-03
మూడో ఉపగ్రహం. ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్ ద్వారా అందించే నావిగేషన్ సేవలను నిరంతరాయంగా కొనసాగించేందుకు దీన్ని రూపొందించారు.
దేశానికి స్థానం,
నావిగేషన్, సమయ నిర్ధరణ సేవలను స్వతంత్రంగా పొందే అవకాశం కల్పించే వ్యూహాత్మక ఉపగ్రహం ఇదని ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ అన్నారు.
నావిగేషన్ ఉపగ్రహాలను సాధారణ ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం కూడా వినియోగిస్తారని ఆయన తెలిపారు. రైళ్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడంతో పాటు వాహనాలు,
సముద్ర నౌకల కదలికలను పర్యవేక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు.
'వన్ నేషన్ వన్ టైమ్' ప్రాజెక్టులోనూ ఈ ఉపగ్రహం కీలక భాగమని వివరించారు.
'గగన్'
వ్యవస్థతో కలిసి నావిగేషన్ సేవలు అందించడం ద్వారా ప్రపంచ నావిగేషన్ వ్యవస్థలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోందని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.
జస్టిస్ కౌల్ రాసిన పుస్తకంలో మాజీ సీజేఐ చంద్రచూడ్ గురించి ఏముంది?
మనీషా భన్వాలా: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళ రికార్డు
ఫొటో సోర్స్, MANDEEP SAINI
ఫొటో క్యాప్షన్, ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా మనీషా నిలిచారు.
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 59 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలిచి,
ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా మనీషా భన్వాలా నిలిచారు.
కజకిస్థాన్ రాజధాని అస్తానాలో శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో అమెరికాకు చెందిన అబిగైల్ నెట్‌ను
8-6 తేడాతో ఓడించారు.
ఒలింపిక్స్‌లో లేని ఈ వెయిట్ కేటగిరీలో మనీషా తన పోరును ప్రీ క్వార్టర్ ఫైనల్‌తో ప్రారంభించారు. ఈ దశలో కెనడాకు చెందిన లారెన్స్ బ్యూత్రెగార్డ్ను విక్టరీ బై ఫాల్ పద్ధతిలో ఓడించారు.
క్వార్టర్ ఫైనల్లో మంగోలియాకు చెందిన బొలోర్‌తుయా ఖురెల్ఖూను
6-0 తేడాతో ఓడించారు. ఆ తర్వాత సెమీఫైనల్లో స్థానిక రెజ్లర్ అల్టిన్ షగయేవాను సాంకేతిక ఆధిక్యంతో ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో హరియాణాకు చెందిన మనీషా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో స్వర్ణ పతకం సాధించారు.
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా మనీషా నిలిచారు. అంతకుముందు
2010లో మాస్కోలో జరిగిన పోటీల్లో సుశీల్ కుమార్ 66 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించారు.
ప్రస్తుత చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో పతకాలు సాధించిన నాలుగో భారత రెజ్లర్ మనీషా. ఆమె కంటే ముందు నీలం సిరోహి
(50 కిలోలు), కాజల్ ధోచక్ (76 కిలోలు) రజత పతకాలు సాధించగా, తనూ శర్మ (72 కిలోలు) కాంస్య పతకం గెలుచుకున్నారు.